ఆగస్టు నెలలో జీఎస్టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 11 శాతం వృద్ధితో రూ.1.59 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టులో మొత్తం రూ.1,59,069 కోట్ల జీఎస్టీ వసూలైంది.
అందులో సెంట్రల్ జీఎస్టీ రూ.28,328 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.35,794 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.83,251 కోట్లుగా (దిగుమతి వస్తువుల నుంచి వసూలైన రూ.43,550 కోట్లు సహా) నమోదైంది. సెస్ రూ.11,695 కోట్లు (దిగుమతి వస్తువుల ద్వారా సమకూరిన రూ.1,016 కోట్లు సహా) వసూలయ్యాయి.
‘ఆగస్టు 2023 నెల ఆదాయాలు గత సంవత్సరం ఇదే నెలలో జీఎస్టీ రాబడి కంటే 11 శాతం ఎక్కువ. ఈ నెలలో, వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 3 శాతం (దిగుమతి, సేవలు) కంటే ఎక్కువ. గత ఏడాది ఇదే నెలలో ఈ వనరుల నుంచి వచ్చిన ఆదాయాల కంటే 14 శాతం ఎక్కువ’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, గత ఏడాది ఆగస్టు నెలలో వసూలైన మొత్తం జీఎస్టీ రూ.1.43 లక్షలు కోట్లు
Comments
Please login to add a commentAdd a comment