డిసెంబర్ 17న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ నిర్ణయాలే జనవరి 1 (నేటి నుంచి) అమలు చేస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) విభాగం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
జీఎస్టీ చెల్లింపు దారులు వారు అద్దెకు ఇచ్చే ఇంటిపై జీఎస్టీ చెల్లించాల్సి అవసరం లేదని తెలిపింది. దీంతో పాటు స్పిరిట్ (పెట్రోల్)లో కలిపేందుకు రిఫైనరీలకు సరఫరా చేసే ఇథైల్ ఆల్కహాల్ 5శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నట్లు వెల్లడించింది. చిల్కా, సహా పప్పుధాన్యాల పొట్టుపై విధించిన 5శాతం జీఎస్టీని తొలగించింది.
డిసెంబర్ 17న జరిగిన చివరి కౌన్సిల్ సమావేశంలో.. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలపై జీఎస్టీ వర్తింపుపై కేంద్రం, రాష్ట్రాలు స్పష్టత ఇచ్చాయి. చట్టంలోని కొన్ని నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించాయి.
Comments
Please login to add a commentAdd a comment