Goods and Service Tax (GST)
-
కేంద్రం సంచలన నిర్ణయం.. మనీలాండరింగ్ పరిధిలోకి జీఎస్టీ
కేంద్ర మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జీఎస్టీ సంబంధిత విషయాల్లో జోక్యం చేసుకునేలా వీలు కల్పించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పరిధిలోకి గూడ్స్ అండ్ సర్వీస్ నెట్వర్క్ (gstn)ను తెస్తున్నట్లు తెలిపింది. దానికి సంబంధించి నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. తాజా నిర్ణయంతో జీఎస్టీ చెల్లింపుల్లోని అక్రమాలు, ఇతర అనుమానాస్పద ఆర్ధిక లావాదేవీల్ని అరికట్టవచ్చు. అండర్ సెక్షన్ 66 (pmla) కింద పన్ను చెల్లింపుదారుల వివరాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌తో తప్పని సరిగా షేర్ చేయాలనే నిబంధనలు ఉన్నాయి. Government-issued a notification to bring the Goods & Services Tax Network (GSTN) under the Prevention of Money Laundering Act (PMLA). Information stored on GSTN can be now shared under PMLA Act. pic.twitter.com/VrhUq3vuCY — ANI (@ANI) July 8, 2023 కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్లో.. జీఎస్టీ చెల్లింపు దారులు అనుమానాస్పదంగా ఫారెక్స్ ట్రాన్సాక్షన్ జరిపారని నిర్ధారిస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్,ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అధికారులు సంబంధిత సమాచారాన్ని జీఎస్టీఎన్కు చేరవేస్తారు. వీటితో పాటు నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లు, నకిలీ ఇన్వాయిస్లు వంటి జీఎస్టీ మోసాలు మనీలాండరింగ్ నిరోధక చట్టం కిందకు వస్తాయి. చదవండి : జాక్ మాకు మరో భారీ షాక్..మంచులా కరిగిపోతున్న ఆస్తులు! -
జనవరి 1 నుంచే.. అమల్లోకి జీఎస్టీ కౌన్సిల్ కొత్త నిర్ణయాలు
డిసెంబర్ 17న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ నిర్ణయాలే జనవరి 1 (నేటి నుంచి) అమలు చేస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) విభాగం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్టీ చెల్లింపు దారులు వారు అద్దెకు ఇచ్చే ఇంటిపై జీఎస్టీ చెల్లించాల్సి అవసరం లేదని తెలిపింది. దీంతో పాటు స్పిరిట్ (పెట్రోల్)లో కలిపేందుకు రిఫైనరీలకు సరఫరా చేసే ఇథైల్ ఆల్కహాల్ 5శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నట్లు వెల్లడించింది. చిల్కా, సహా పప్పుధాన్యాల పొట్టుపై విధించిన 5శాతం జీఎస్టీని తొలగించింది. డిసెంబర్ 17న జరిగిన చివరి కౌన్సిల్ సమావేశంలో.. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలపై జీఎస్టీ వర్తింపుపై కేంద్రం, రాష్ట్రాలు స్పష్టత ఇచ్చాయి. చట్టంలోని కొన్ని నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించాయి. -
జీఎస్టీ: బాదుడే బాదుడు..రేపటి నుంచే సామాన్యుడిపై ధరల దరువు!
ఉప్పు నుంచి పప్పు దాకా.. కూరగాయల నుంచి పాల పాకెట్ దాకా పెరిగిపోతున్న వస్తువుల ధరల దరువుకు సామాన్యులు అల్లాడిపోతున్నారు. అది చాలదన్నట్లు రేపటి నుంచి నిత్యావసర సరుకులపై గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విధింపు అనివార్యంమైంది. దీంతో నోట్లోకి ముద్ద దిగాలన్నా నోట్ల ఖర్చు పెట్టాల్సి పరిస్థితి నెలకొనడంతో కొనుగోలు దారులు లబోదిబోమంటున్నారు. గత నెలలో జరిగిన జీఎస్టీ 47వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు రకాల నిత్యావసర ఉత్పత్తులపై జీఎస్టీ పెంపు విధింపు నిర్ణయం తీసుకుంది. దీంతో పెరిగిన కొత్త జీఎస్టే రేట్లు రేపటి నుంచి (జులై18) అమల్లోకి రానున్నాయి. ఆర్ధిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్ అధ్యక్షతన జూన్‌లో రెండు రోజుల పాటు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మండలి సమావేశంలో కొత్త జీఎస్టీని పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారం..జులై 18 నుంచి ప్రీ ప్యాక్డ్ అండ్ ప్రీ లేబుల్డ్ రీటైల్ ప్యాకెట్ ఉత్పత్తులపై ఉదాహరణకు పెరుగు,లస్సీ, బటర్ మిల్క్ ప్యాకెట్లపై 5శాతం జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు చెక్కులు (లూజ్ లేదా బుక్ రూపంలో) జారీ చేయడానికి బ్యాంకులు వసూలు చేసే రుసుముపై 18 శాతం జీఎస్టీ, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌లో 12 శాతం నుంచి 18 శాతానికి సవరించాలని జీఎస్టీ కౌన్సిల్ సిఫారసుతో ఎల్ఈడీ లైట్లు, మ్యానిఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉపయోగించే ఫిక్సర్లు(టూల్స్), ఎల్ఈడీ ల్యాంప్స్ ధరలు పెంపునకు సిద్ధంగా ఉన్నాయి. కాస్ట్లీగా ఆసుపత్రి గదులు, హోటల్స్ రూమ్స్ ప్రతి రోగికి రోజుకు రూ.5000 కంటే ఎక్కువ ఉన్న ఆసుపత్రి గది అద్దె (ఐసీయూ మినహాయించి) ఐటిసి లేకుండా గదికి 5 శాతం వసూలు చేయనున్నారు. గతంలో దీనికి గూడ్స్ యాడ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) నుంచి మినహాయింపు ఉండేది. కాగా, ప్రస్తుతం పన్ను మినహాయింపు కేటగిరీకి భిన్నంగా హోటల్ గదులను రోజుకు రూ.1,000 లోపు 12 శాతం జీఎస్టి శ్లాబ్ పరిధిలోకి తీసుకురావాలని జీఎస్టి కౌన్సిల్ నిర్ణయించింది. చదవండి: జీఎస్టీ బాదుడు, మరింత ఖరీదుగా నిత్యావసర వస్తువులు! -
GST: ఐదేళ్లుగా దేశమంతా ఒకే మార్కెట్
దాదాపు రెండు దశాబ్దాల క్రితం తొలిసారి ‘జీఎస్టీ’ గురించి చర్చ జరిగింది. కానీ 2017లో మాత్రమే అది అమలులోకి రాగలిగింది. తొలుత కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా, ఐదేళ్ల తర్వాత అది శక్తిమంతమైంది. వచ్చిన ఏడాదే 63.9 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఇందులోకి మళ్లారు. 2022 నాటికి ఈ సంఖ్య రెట్టింపయింది. కీలక అంశాలపై దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయ సాధనలో జీఎస్టీ మండలి కీలక పాత్ర పోషించింది. గతంలో రాష్ట్రాల మధ్య ఉనికిలో ఉంటూ వచ్చిన పన్ను మధ్యవర్తిత్వాల సమస్యను జీఎస్టీ పూర్తిగా తొలగించివేసింది. నిజంగానే జీఎస్టీ, భారతదేశాన్ని సింగిల్ మార్కెట్‌ను చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ మనదని చెప్పడంలో ఏ సందేహమూ లేదు. భారతదేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశపెట్టి జూలై 1తో అయిదేళ్లు పూర్తయింది. 2003 సంవత్సరంలో పరోక్ష పన్నులపై కేల్కర్ టాస్క్‌ఫోర్స్ నివేదికలో జీఎస్టీ గురించి తొలిసారిగా చర్చించారు. కానీ దానికి తుదిరూపు ఇవ్వడానికి చాలా కాలం పట్టింది. ప్రవేశపెట్టింది మొదలుకొని జీఎస్టీ సహజంగానే పెను సమస్యలను ఎదుర్కొంది. అయితే కోవిడ్–19 కల్లోలాన్ని ఎదుర్కొని, దాని ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత, జీఎస్టీ శక్తిమంతంగా ఆవిర్భవించింది. సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో సరిపెట్టుకోకుండా, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణ మార్గంలోకి నడిపిం చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకున్నా యంటే ఆ ఘనత జీఎస్టీ కౌన్సిల్‌కే దక్కుతుంది. ఈ రకమైన పరస్పర కృషి వల్లే భారత్ ప్రపంచంలోనే అత్యంతవేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇప్పుడు ఆవిర్భవించింది. భారత్‌లో జీఎస్టీ 2017లో అమల్లోకి వచ్చింది కానీ, చాలా దేశాలు అంతకుముందే జీఎస్టీ విధానం వైపు మళ్లాయి. కేంద్రమూ, రాష్ట్రాలూ పన్నుల మీద స్వతంత్రతను అనుభవించిన అర్ధ–సమాఖ్య వ్యవస్థ చాలాకాలంగా ఏకీకృత పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ వచ్చింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన జీఎస్టీ మండలి, భారత్‌కే ప్రత్యేకమైన జీఎస్టీ సొల్యూషన్ (ద్వంద్వ జీఎస్టీ) దీనికి సమాధానాలుగా నిలి చాయి. దేశంలో విభిన్న పరిమాణాలతో, విభిన్న అభివృద్ధి దశలతో కూడిన రాష్ట్రాలు, వాటి వారసత్వ పన్నుల వ్యవస్థను మిళితం చేసి జీఎస్టీ పరిధిలోకి తేవలసి వచ్చింది. కొన్ని మినహాయింపులతో కేంద్ర, రాష్ట్రాలకు చెందిన పన్నులను జీఎస్టీలో కలపడం జరిగింది. ఈ క్రమంలో 17 రకాల పన్ను చట్టాలను మేళవించి జీఎస్టీ ద్వారా ఏకీకృత పన్నుల వ్యవస్థను అమల్లోకి తేవడం జరిగింది. పన్ను రేట్లు, మినహాయింపులు, వాణిజ్య ప్రక్రియ, ఐటీసీ చలనం వంటి కీలక అంశాలపై జాతీయ ఏకాభిప్రాయ సాధనలో జీఎస్టీ మండలి కీలక పాత్ర పోషించింది. దేశంలోని 63.9 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులు 2017 జూలైలో జీఎస్టీలోకి మళ్లారు. 2022 జూన్ నాటికి ఈ సంఖ్య రెట్టింపై 1.38 కోట్లకు చేరుకుంది. 41.53 లక్షలమంది పన్ను చెల్లింపుదారులు, 67 వేల మంది ట్రాన్స్ పోర్టర్లు ఈ–వే పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. నెలకు సగటున 7.81 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్ చేస్తున్నారు. ఈ వ్యవస్థ ప్రారం భమైంది మొదలు 292 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్ అయ్యాయి. ఇందులో 42 శాతం అంతర్రాష్ట్ర సరకుల రవాణాకు సంబంధించినవి. ఈ సంవత్సరం మే 31న ఒకేరోజు అత్యధికంగా 31,56,013 ఈ–వే బిల్స్ జనరేట్ కావడం ఒక రికార్డు. నెలవారీ సగటు వసూళ్లు కూడా 2020–21లో రూ. 1.04 లక్షల కోట్ల నుంచి, 2021–22లో రూ. 1.24 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ సంవత్సరం తొలి రెండు నెలల్లో సగటు వసూళ్లు రూ. 1.55 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ ధోరణి పెరుగుతుందని చెప్పడం హేతు పూర్వకమైన, న్యాయమైన అంచనా అవుతుంది. సీఎస్టీ, వీఎటీ వ్యవస్థలో రాష్ట్రాల మధ్య ఉనికిలో ఉంటూ వచ్చిన పన్ను మధ్యవర్తిత్వాల సమస్యను జీఎస్టీ పూర్తిగా తొలగించివేసింది. బోర్డర్ చెక్‌పోస్టులు, సరుకులు లోడ్ చేసిన ట్రక్కులను నిలబెట్టి మరీ తనిఖీ చేయడంతో కూడిన గతంలోని నియంత్రణ వ్యవస్థ కల్లోలం సృష్టించి కాలాన్నీ, ఇంధనాన్నీ వృథా చేసేది. దీంతో లాజిస్టిక్స్ వ్యవస్థ సామర్థ్యం తగ్గిపోయింది. సరుకుల ధరలో 15 శాతం వరకూ దీని ఖర్చులే ఉండేవని అంచనా. జీఎస్టీకి మునుపటి వ్యవస్థలో అనేక సరుకులపై కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి రేట్లు 31 శాతం కంటే ఎక్కువగానే ఉండేవి. కానీ ప్రస్తుత జీఎస్టీ వ్యవస్థ కింద 400 సరకులు, 80 సేవలపై పన్నులను బాగా తగ్గించడమైనది. అత్యధికంగా 28 శాతం రేటు ఇప్పుడు విలాస వస్తువులపై మాత్రమే ఉంది. గతంలో 28 శాతం పన్ను రేటు ఉన్న 230 సరుకుల్లో సుమారు 200 సరుకులను పన్ను తక్కువగా ఉండే శ్లాబ్‌లకు మార్చడమైనది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అవసరాలను తీర్చడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రధ్ద తీసుకుంది. వీటిపై పన్ను రేట్లు బాగా కుదించింది. పైగా ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ప్రయోజనం కోసం ఈ సంస్థలను సప్లయ్ చైన్స్‌తో అనుసంధానించడం జరిగింది. ఈ క్రమంలో రెండు కీలకమైన చర్యలను కేంద్రం తీసుకుంది. చిన్న తరహా పరిశ్రమలకు ఇస్తున్న పన్ను మినహాయింపు 20 లక్షల నుంచి 40 లక్షల రూపాయలకు పెరిగింది. కాగా, త్రైమాసిక రిటర్న్‌లు, నెల వారీ చెల్లింపుల పథకం ప్రవేశపెట్టడంతో 89 శాతం పన్ను చెల్లింపు దారులకు ప్రయోజనం కలిగింది. జీఎస్టీని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇది ఐటీ ఆధారితంగా, పూర్తి ఆటోమేటిక్ పద్ధతిలో కొనసాగుతోంది. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సామర్థ్యా లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నవీకరిస్తూండటం వల్ల మొత్తం వ్యవస్థను క్రియాశీలంగా ఉంచడం సాధ్యమైంది. జీఎస్టీ వ్యవహారాలపై అనేక వ్యాజ్యాలు... సమన్లు జారీ చేయడం, వ్యక్తులను అరెస్టు చేయడం, రికవరీల కోసం ఆస్తులను జప్తు చేయడంతో సహా ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ వంటి అంశాల పైనే వస్తున్నాయి. మోహిత్ మినరల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు కూడా చాలా ప్రాచుర్యం పొందింది. కానీ జీఎస్టీలోని ప్రాథమిక అంశాలను కోర్టు పక్కన పెట్టలేదని గుర్తించాలి. దాదాపు 24 సంవత్సరాల పాటు పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రిగా పనిచేసిన అసీమ్ దాస్‌గుప్తా 2000 నుంచి 2011 సంవ త్సరం దాకా రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికారిక గ్రూప్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. మొట్టమొదటి జీఎస్టీ చట్టాల రూపకల్పన 2009లో జరిగింది. 2017 జూలై 2న ఒక వాణిజ్య పత్రికకు అసీమ్ దాస్‌గుప్తా ఇచ్చిన ఇంటర్వ్యూలో జీఎస్టీలోని ముఖ్యమైన అంశాలను వక్కా ణించారు. ఆయన చెప్పిన అంశాలు ఇప్పటికీ మార్పు లేకుండా కొనసాగుతున్నాయి: ‘సర్వీస్ టాక్స్‌ని విధించే అధికారం రాష్ట్రాలకు అసలు ఉండేది కాదు. అందులో కేవలం భాగం పొందడమే కాదు, పన్ను విధించే అధికారం కోసం అడుగుతూనే ఉండేవి. జీఎస్టీ దానికి అవకాశం కల్పించింది.’ ఆయన ఇంకా ఇలా చెప్పారు: ‘రాష్ట్రాల స్వయంప్రతిపత్తిపై సాధికారిక కమిటీ దృఢమైన వైఖరి తీసుకుంది. సెంట్రల్ జీఎస్టీపై పార్లమెంట్‌కూ, రాష్ట్ర జీఎస్టీపై అసెంబ్లీలకూ సిఫార్సు చేసే విభాగమే జీఎస్టీ కౌన్సిల్. సాంకేతికంగా శాసనసభ దాన్ని ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. కాబట్టి శాసనసభల అధికారాన్ని ఇది తీసేసు కోవడం లేదు.’ ఇంకా ముఖ్యంగా ఆయన ఇలా అన్నారు: ‘ఇక రేట్లకు సంబంధించి చూస్తే, రాష్ట్రాలు, కేంద్రం కలిసి రెండింటికీ ఒక రకమైన ఏక పన్నును ఆమోదించాయి. కాబట్టి సహకారాత్మక సమాఖ్య ప్రయోజనం కోసం రాష్ట్రాలు, కేంద్రం పాక్షికంగా త్యాగం చేశాయని దీనర్థం. అదే సమయంలో సర్వీస్ టాక్స్ విషయంలో రాష్ట్రాలకు జీఎస్టీ అదనపు అధికారాలను ఇచ్చింది. రాష్ట్ర ప్రాంతీయ ఉత్పత్తుల్లో సగం సేవల కిందికే వస్తాయి.’ జీఎస్టీ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బ్లాగులో ఇలా రాశారు: ‘అటు వినియోగ దారు, ఇటు మదింపుదారు (అసెస్సీ) ఇద్దరికీ అనుకూలంగా జీఎస్టీ ఉంటుందని రుజువైంది. పన్ను చెల్లింపుదారులు, టెక్నాలజీని అంది పుచ్చుకున్న మదింపుదారులు ఇద్దరూ చూపించిన సానుకూలతకు ధన్య వాదాలు. నిజంగానే జీఎస్టీ, భారత్‌ను సింగిల్ మార్కెట్‌ని చేసింది.’ నిర్మలా సీతారామన్ (జూలై 1 నాటికి జీఎస్టీ వచ్చి ఐదేళ్లు) వ్యాసకర్త కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
Sakshi Cartoon: మజ్జిగ పాకెట్ తాగి సడెన్‌గా అలా వేడెక్కి పోయారేంటి సార్!
మజ్జిగ పాకెట్ తాగి సడెన్‌గా అలా వేడెక్కి పోయారేంటి సార్! -
రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం..కీలక నిర్ణయం వాయిదా!
చండీగఢ్: వస్తు విలువ నిర్ణయానికి సంబంధించిన పక్రియలో (వ్యాలూ చైన్) అసమర్థతలను తొలగించడం, ద్రవ్యోల్బణం కట్టడి ప్రధాన లక్ష్యంగానే రేట్ల హేతుబద్దీకరణ, పెంపుదల నిర్ణయాలను తీసుకోవడం జరిగిందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణంపై రేట్ల హేతుబద్ధీకరణ ప్రభావం గురించి అన్ని రాష్ట్రాలకు తెలుసని ఆమె అన్నారు. పన్ను రేట్లలో పెరుగుదల ఇందుకు సంబంధించిన భారాన్ని కూడా భర్తీ చేసే విధంగా ఉందని, వ్యాల్యూ చైన్‌లోని కొన్ని ఇతర కార్యకలాపాల ద్వారా ఈ మేరకు ఫలితాలు ఒనగూరుతాయని ఆమె భరోసాను ఇచ్చారు. సాంకేతికత ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తుందని కూడా పేర్కొన్నారు. పెరిగిన రేట్లు జూలై 18వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఆగస్టు మొదటివారంలో మండటి తదుపరి సమావేశం నిర్వహించనుంది. జూలై 15లోపు మంత్రుల బృందం నివేదిక ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన చండీగఢ్‌లో రెండు రోజుల పాటు జరిగిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అత్యున్నత స్థాయి నిర్ణయక మండలి 47వ సమావేశం బుధవారం ముగిసింది. మాంసం, చేపలు, పెరుగు, పనీర్, తేనె వంటి ఆహార పదార్థాల విషయంలో ముందే ప్యాక్ లేదా లేబుల్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధింపుసహా తొలి రోజు పలు నిర్ణయాలను తీసుకున్న మండలి సమావేశం రెండరోజు కీలక అంశాలపై తుది నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. జీఎస్టీ స్లాబ్స్‌లో మార్పులు, రెవెన్యూ నష్టానికి సంబంధించి రాష్ట్రాలకు పరిహారం (జూన్‌లో ముగిసే ఐదేళ్ల కాలం తరువాత)సహా ఆన్లైన్ గేమింగ్, రేసింగ్‌లు, క్యాసినో, లాటరీలపై 28 శాతం పన్ను విధింపు వంటి కీలక అంశాలపై సమావేశం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. కీలక అంశాలపై సంబంధిత వర్గాలతో సంప్రదింపులకోసం ఆయా అంశాలను వాయిదా వేసినట్లు ఆర్థికమంత్రి తెలిపారు. ‘ఈరోజు జరిగిన సమావేశంలో 16 రాష్ట్రాలు జీఎస్టీ పరిహారంపై మాట్లాడాయి. ఇందులో 3-4 రాష్ట్రాలు పరిహారంపై ఆధారపడకుండా తమంతట తాముగా నిలబడతామని అన్నాయి’’ అని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. దాదాపు 12 రాష్ట్రాలు జూన్ తర్వాత పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇక వాల్యుయేషన్ యంత్రాంగం (వ్యాల్యూ చైన్), కీలక విభాగాలపై పన్నుల విధింపుపై మళ్లీ సంబంధిత వర్గాలతో చర్చించి, జూలై 15వ తేదీలోపు నివేదిక సమర్పించాలని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని మంత్రుల బృందాన్ని కోరినట్లు ఆర్థికమంత్రి తెలిపారు. కీలక పన్ను సంస్కరణకు ఐదేళ్లు... పరోక్ష పన్నులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ, 2017 జూలై 1వ తేదీ నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అడ్డంకులను తగ్గించడం ద్వారా జీఎస్టీ విధానం వ్యాపారాన్ని సులభతరం చేసిందని 90 శాతం మంది భారత్ పారిశ్రామిక ప్రతినిధులు భావిస్తున్నారని డెలాయిట్ సర్వే ఇటీవల తెలిపింది. జీఎస్టీ విధానం అంతిమ వినియోగదారులకు సంబంధించి వస్తువులు, సేవల ధరల ప్రక్రియను సానుకూలం చేసిందని తెలిపింది. తమ సరఫరా చైన్లను పటిష్టం చేసుకోవడంలో కంపెనీలకు సైతం పరోక్ష పన్నుల విధానం దోహదపడుతోందని ‘జీఎస్టీ : 5 సర్వే 2022’ పేరుతో తాము జరిపిన ఈ సర్వేలో వెల్లడైనట్లు వివరించింది. ప్రస్తుతం జీఎస్టీ కింద నాలుగు శ్లాబ్‌లు అమలు జరుగుతున్నాయి. నిత్యావసరాలపై 5 శాతం పన్ను రేటు మొదటిది. కార్లు, డీమెరిట్, లగ్జరీ, సిన్ గూడ్స్‌పై 28 శాతం అత్యధిక రేటు అమలవుతోంది. మధ్యస్థంగా 12, 18 శాతం రేట్లు అమలవుతున్నాయి. -
జీఎస్టీ శ్లాబులో మార్పులు, చేర్పులు... దానిని తొలగించే అవకాశం...!
వచ్చే నెలలో జరిగే జీఎస్టీ సమావేశంలో కౌన్సిల్ పలు కీలకమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జీఎస్టీలోని 5 శాతం శ్లాబ్‌ను తొలగించే ప్రతిపాదనను పరిశీలించే అవకాశం ఉంది. ఈ శ్లాబ్స్ లోని కొన్ని వస్తువులను 3 శాతానికి, మిగిలినవి 8 శాతం గా నిర్ణయించే అవకాశం ఉంది. ప్రస్తుతం జీఎస్టీ అనేది 5, 12, 18, 28 శాతం నాలుగు అంచెల నిర్మాణంగా ఉంది. అంతేకాకుండా బంగారం, బంగారు ఆభరణాలపై 3 శాతం పన్ను విధిస్తారు. అదనంగా, లెవీని ఆకర్షించని బ్రాండెడ్, ప్యాక్ చేయని ఆహార పదార్థాలు వంటి వస్తువులపై కూడా మినహాయింపు ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొన్ని ఆహారేతర వస్తువులను 3 శాతం శ్లాబ్‌కు తరలించడం ద్వారా మినహాయింపు వస్తువుల జాబితాను తగ్గించే నిర్ణయం కౌన్సిల్ తీసుకోవచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక 5 శాతం శ్లాబ్‌ను 7 లేదా 8 లేదా 9 శాతానికి పెంచడంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జిఎస్టి కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనుంది. లెక్కల ప్రకారం, ప్రధానంగా ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్‌తో కూడిన 5 శాతం శ్లాబ్‌లో ప్రతి 1 శాతం పెరుగుదల సుమారుగా ఏటా రూ. 50,000 కోట్ల అదనపు ఆదాయాన్ని పొందుతుంది. దీంతో ఆయా ప్యాకేజ్డ్ ఫుడ్ ధర పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రుల బృందం వచ్చే నెల ప్రారంభంలో మార్పులకు సంబందించిన సిఫార్సులను ఖరారు చేసే అవకాశం ఉంది, ఇక తుది నిర్ణయం కోసం మే మధ్యలో జరిగే తదుపరి సమావేశంలో కౌన్సిల్ ముందు ఉంచబడుతుంది. -
సామాన్యులకు కేంద్రం షాక్..! భారీగా పెరగనున్న దుస్తులు, చెప్పుల ధరలు
Central Government Increased GST on Apparel and Textiles & Footwear: సామాన్యులకు కేంద్రం మరో షాకిచ్చింది. గార్మెంట్స్, ఫుట్‌వేర్, టెక్స్టైల్స్ ప్రొడక్ట్‌లపై 5శాతం నుండి 12శాతం వరకు జీఎస్స్టీ(వస్తువులు మరియు సేవల పన్ను)ని వసూలు చేయనుంది. కొత్తగా వసూలు చేయనున్న జీఎస్టీ జనవరి 1, 2022 నుండి అమల్లోకి రానుంది. దీంతో బట్టలు, చెప్పులు ఇతర ఉత్పుత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) నవంబర్ 18న గార్మెంట్స్, ఫుట్‌వేర్, టెక్స్టైల్స్ గార్మెంట్‌పై జీఎస్టీ విధిస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే, నోటిఫికేషన్ ప్రకారం కొన్ని సింథటిక్ ఫైబర్లు, నూలుపై జీఎస్టీ రేట్లను 18శాతం నుండి 12శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. అదే మసయంలో ఫ్యాబ్రిక్స్‌పై జీఎస్టీ రేటు 5శాతం నుండి 12శాతానికి పెంచి సమం చేసింది. జీఎస్టీ బ్రాండెడ్ దుస్తులపై జీఎస్టీ 12శాతానికి వసూలు చేయనుంది. నేసిన వస్త్రాలు, సింథటిక్ నూలు, పైల్ ఫ్యాబ్రిక్స్, దుప్పట్లు, టెంట్లు, టేబుల్క్లాత్లు, సర్వియెట్‌లు, రగ్గులు, టేప్‌స్ట్రీస్ వంటి ఉపకరణాలతో కూడిన వస్త్రాలు, వాటి రేట్లు 5% నుండి 12% వరకు పెరిగాయి. బ్రాండెండ్ చెప్పులు 5శాతం నుండి 12శాతం వరకు పెరిగాయి. సీఎంఎఐ అసంతృప్తి జనవరి1,2022 నుండి దుస్తులపై జీఎస్టీ పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల భారత దుస్తుల తయారీదారుల సంఘం (సీఎంఎఐ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ముడిసరుకు ధరలు, ముఖ్యంగా నూలు, ప్యాకింగ్ మెటీరియల్, సరకు రవాణా పెరగడంతో పరిశ్రమ ద్రవ్యోల్బణ ఒత్తిడిని ఎదుర్కొంటున్నందున ఖర్చుల పెంపు ప్రధాన ప్రభావాన్ని చూపుతుందని పరిశ్రమ సంఘం పేర్కొంది. చదవండి: GST: ఐస్‌క్రీమ్ పార్లర్లు, స్టోర్ల నిర్వాహకులకు షాక్ -
దినసరి కూలీకి భారీ షాక్.. చివరికి..
రాంచీ: రోజుకు 198 రూపాయలు సంపాదించే కూలీకి జీఎస్టీ డిపార్టుమెంటు భారీ షాకిచ్చింది. అక్షరాలా మూడున్నర కోట్ల మేర పన్ను ఎగవేశారంటూ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో సదరు కూలీ ఇంటికి చేరుకున్న పోలీసులు గురువారం ఆయనను అరెస్టు చేశారు. వివరాలు.. జార్ఖండ్‌లోని తూర్పు సింగ్భూం జిల్లాలోని రాణీపహారీ గ్రామానికి చెందిన లాడన్ ముర్ము నిరుపేద. తన కుటుంబంతో కలిసి పూరి గుడిసెలో నివసిస్తున్నాడు. జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుడైన అతడు కూలీగా పనిచేస్తూ జీవనం గడుపుతున్నాడు. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబరులో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు ఆయన ఇంటికి వచ్చారు. ఎంఎస్ స్టీల్ కంపెనీ ఎండీ అయిన ముర్ము రూ. 3.5 కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడ్డారని, ఈ మొత్తం చెల్లించకపోతే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. (చదవండి: రూ. 10 లక్షల లంచం: బీజేపీ కౌన్సిలర్ సస్పెండ్) ఈ నేపథ్యంలో పలుమార్లు ఆయనకు నోటీసులు జారీ చేయగా.. కంపెనీ గురించి తనకేమీ తెలియదని, తన వద్ద డబ్బు లేదని సమాధానమిచ్చారు. దీంతో గురువారం ముర్ము ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తుల నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో సాయంత్రం విడిచిపెట్టారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ విషయం గురించి ఎస్ఎస్పీ డాక్టర్ ఎం. తమిల్ వణన్ మాట్లాడుతూ.. ‘‘గతేడాది తాము పంపిన నోటీసులకు బదులివ్వని కారణంగా ఎంఎస్ స్టీలు కంపెనీ ఎండీ లాడన్ ముర్ముపై జీఎస్టీ డిపార్టుమెంటు ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. దీంతో మా బృందం గురువారం ఆయన ఇంటికి చేరుకుంది. ఎంజీఎన్ఆర్ఈఏ పథక లబ్దిదారు అయిన ముర్ము పాన్, ఆధార్ కార్డును ఉపయోగించి కొంతమంది ఉద్దేశపూర్వకంగానే మోసానికి పాల్పడ్డట్లు తెలిసింది. లోతుగా దర్యాప్తు చేస్తున్నాం’’ అని వెల్లడించారు.( చదవండి: అస్తిత్వం కోసం ఆదివాసీల ఆరాటం) ఇక బాధితుడు ముర్ము స్పందిస్తూ.. ‘‘వరుసకు కుమారుడయ్యే బైలా ముర్ము 2018లో నా కో-ఆపరేటివ్ బ్యాంకు పాస్‌బుక్, పాన్, ఆధార్ కార్డు తీసుకున్నాడు. నా అకౌంట్‌ను ప్రభుత్వం ప్రతినెలా రూ. 2 వేలు జమ చేస్తుందని చెప్పాడు. ఈ పత్రాలన్నింటిని తన అల్లుడు సునరం హేంబ్రంకు ఇచ్చినట్లు తెలిసింది. సునరం వీటిని జంషెడ్‌పూర్‌కు చెందిన సుశాంత్ కుమార్ సమాంటోకు ఇచ్చాడట. వాటితో వాళ్లు ఏం చేశారో నాకు తెలియదు. జీఎస్టీ శాఖ నాకు నోటీసులు ఇచ్చింది. దీంతో జంషెడ్‌పూర్‌లోని జీఎస్టీ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చాను. నా పేరు మీద ఉన్న కంపెనీ గురించి, దాని లావాదేవీలతో సంబంధం లేదని చెప్పాను. నేను రోజూవారీ కూలీని. పనిచేస్తేనే ఆరోజు నా కడుపు నిండుతుంది. గతేడాదే నా భార్య చనిపోయింది. నా కొడుకుతో కలిసి గుడిసెలో జీవితం వెళ్లదీస్తున్నా’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. -
త్వరలోనే రాష్ట్రాలకు రూ.35వేల కోట్లు..
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించనుంది. కేంద్ర ప్రభుత్వ హామీ మేరకు జీఎస్టీ వసూళ్లలో ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు త్వరలోనే రూ.35వేల కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేయనుంది. రాష్ట్రాల పన్ను ఆదాయం 14శాతం పెరగకుంటే ఆ నష్టాన్ని ఐదేళ్ల పాటు కేంద్రం చెల్లిస్తుందన్న విషయం తెలిసిందే. జీఎస్టీ నష్టాల చెల్లింపులకు 2015-16 ఆర్థిక సంవత్సరాన్ని కేంద్రం ఆధారం చేసుకోనుంది. ఇప్పటి వరకు కేంద్రం జీఎస్టీ నష్టాలను ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు రూ.2.11లక్షల కోట్లను చెల్లించాయి. జీఎస్టీ రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషన్ పాండే స్పందస్తూ..జీఎస్టీ వసూళ్లను పెంచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోనుందని పేర్కొన్నారు. ప్రభుత్వం నెలకు రూ.లక్ష కోట్ల జీఎస్టీ వసూళ్లను పెంచే విధంగా కృషి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పాండే తెలిపారు. చదవండి: ఇలా చేస్తే రూ. 1 కోటి దాకా నజరానా -
ఆర్థిక మంత్రికి విజయసాయిరెడ్డి విఙ్ఞప్తి
న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను కింద ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన రూ.1605 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ ఈనెల 18న సమావేశం కానున్న నేపథ్యంలో ఏపీకి చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలని ఈమేరకు ఆయన జీఎస్టీ కౌన్సిల్‌కు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విఙ్ఞప్తి చేశారు. రాజ్యసభలో మంగళవారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా విజయసాయిరెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. రాష్ట్రం ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో జీఎస్టీ బకాయిల విడుదలలో జాప్యంతో ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని ఆయన సభ దృష్టికి తెచ్చారు. జీఎస్టీ నిబంధనల ప్రకారం 2015-16 నుంచి ప్రతి ఏటా జీఎస్టీ కింద రాష్ట్రాలకు చెల్లించే వాటాలో 14 శాతం పెరుదల ఉండాలని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. జీఎస్టీ వల్ల ఏదైనా రాష్ట్ర ఆదాయంలో నష్టం వాటిల్లితే జీఎస్టీ అమలు ప్రారంభమైన మొదటి ఐదేళ్లలో ఆ నష్టాన్ని కేంద్రమే భరిస్తుందని కూడా చట్టం స్పష్టం చేస్తోందన్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీఎస్టీ ఆదాయంలో నష్టాన్ని ఎదుర్కొంటోందని ఎంపీ తెలిపారు. -
రూ.35 కోసం రెండేళ్ల పోరాటం..!
ముంబై : సర్వీస్ టాక్స్ పేరుతో తన వద్ద అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఓ వ్యక్తి చేసిన రెండేళ్ల పోరాటం పలించింది. అతని వద్ద వసూలు చేసిన మొత్తాన్ని ఐఆర్టీసీ చెల్లిచింది. కోటాకు చెందిన ఓ రిటైర్డ్ ఇంజినీర్ 2017 జూలై 2న కోటా నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఏప్రిల్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. టికెట్ ధర రూ.765. అయితే, 2017 జూలై 1న గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అమల్లోకి వచ్చిన కారణంగా అతను టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. రిఫండ్‌గా రూ.100 తగ్గించుకొని ఐఆర్టీసీ అతనికి 665 చెల్లించింది. క్లరికల్ చార్జీలుగా రూ.65, సర్వీస్ టాక్స్‌గా రూ.35 కట్ చేసుకుంది. అయితే, లెక్క ప్రకారం తన దగ్గర క్లరికల్ చార్జీలు మాత్రమే వసూలు చేయాలని, సర్వీస్ టాక్స్ అదనంగా వసూలు చేశారని సదరు ప్రయాణికుడు లోక్ అదాలత్‌లో పిటిషన్ వేశాడు. అయితే, ఈ కేసు తమ పరిధిలోకి రాదని ఈ జనవరిలో లోక్ అదాలత్ స్పష్టం చేసింది. చివరగా ఆర్టీఐని ఆశ్రయించిన ప్రయాణికుడికి అనుకూల సమాచారం వచ్చింది. జీఎస్టీ అమల్లోకి వచ్చే ముందు బుక్ చేసుకున్న టికెట్లపై విధించిన సర్వీస్ టాక్స్ చెల్లించాలని ఆర్టీఐ వెల్లడించింది. ఆర్టీఐ కాపీని అటాచ్ చేస్తూ.. ఐఆర్‌టీసీని సంప్రదించడంతో అతని బ్యాంక్ ఖాతాలో రూ.33 జమ చేసింది. మరో రూ.2 కోత విధించింది. తనను ఇబ్బందులకు గురిచేయడంతో రెండు రూపాయలు కోత విధించారని, ఐఆర్‌టీసీపై మరోసారి ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, జీఎస్టీ కారణంగా టికెట్ క్యాన్సిల్ చేసుకున్న ప్రయాణికుల ద్వారా ఐఆర్‌టీసీకి ఏటా రూ.3.34 కోట్ల ఆదాయం సమకూరుతోంది. -
చాణక్యుడు-జీఎస్టీ... అసలేంటి సంబంధం?
సాక్షి : బనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఏ ప్రథమ సెమిస్టర్ పరీక్ష రాసిన విద్యార్థులు పొలిటికల్ సైన్స్ ప్రశ్నాపత్రం చూసి బుర్ర గోక్కున్నారు. జీఎస్టీ, గ్లోబలైజేషన్ మీద అడిగిన ప్రశ్నలే అందుకు కారణం. వాటికి చరిత్రకు ముడిపెట్టి ఓ ఫ్రొఫెసర్ గారు చేసిన ప్రయోగం విద్యార్థుల మతిపోవటానికి కారణమైంది. పుస్తకాల్లో లేని ప్రశ్నలు కనిపించటంతో ఒక్కసారిగా వాళ్లు అవాకయ్యారు. ఏం రాయాలో తెలీక బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పేపర్ తయారు చేసిన ప్రొఫెసర్ కౌశల్ కిషోర్ మిశ్రా మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకుంటున్నారు. అర్థశాస్త్రం రచించిన కౌటిల్యుడు(చాణక్యుడు) జీఎస్టీ గురించి, ప్రపంచీకరణ గురించి మను చెప్పటం అన్నది నిజం. ఆయా పుసక్తాల్లో వాటి గురించి పరోక్ష వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి అని కౌశల్ చెబుతున్నారు. మిశ్రా ఆరెస్సెస్ కార్యకర్త కావటంతో తన సొంత ఆలోచనలను రంగరించి బోధనలో తరచూ ప్రయోగాలు నిర్వహిస్తుంటారని.. ఈ మేరకు ఆయన సొంత మెటీరియల్‌ను కూడా తమకు అందించారని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. ఈ అంశంపై పలువురు ఫ్రొఫెసర్లు మండిపడ్డారు. తలా తోక లేని ఇలాంటి ప్రయోగాలు చేయటం సరికాదని వారు హితవు పలికారు. కాగా, యూనివర్సిటీ అధికారులు మాత్రం ఈ అంశంతో తమకేం సంబంధం లేదని.. నిపుణుల పర్యవేక్షణలోనే ఆ ప్రశ్నాపత్రం తయారయ్యిందని చెప్పటం కొసమెరుపు. గత ఏప్రిల్‌లో గుజరాత్ లో ఓ పరీక్ష సందర్భంగా ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు రావటంతో విద్యార్థులు ఇలాగే అవాక్కయ్యారు. ఆ ఘటన అప్పట్లో రాజకీయంగా కూడా విమర్శలకు తావునిచ్చింది. -
జీఎస్టీపై అవగాహన సదస్సు
నెల్లూరు(దర్గామిట్ట) : నగరంలోని డీఆర్ ఉత్తమ హోటల్లో గూడ్స్ సర్వీస్ టాక్స్(వస్తువులపై సర్వీస్ పన్ను విధానం) అమలుపై అవగాహన సదస్సు ఆదివారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమిషనర్ సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ టాక్స్ కాదర్ రహమాన్, అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ టాక్స్ శ్రీ భావన మోహన్ హాజరయ్యారు.రహమాన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర çప్రభుత్వాలు టాక్స్ విధానంలో పాత పద్ధతులు విడనాడి కొత్త తరహా విధానం అమలులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఒక జోన్ పరిధిలో ఉన్నాయని, ఈ జిల్లాల్లోని వాణిజ్య, వ్యాపారస్తులు రిజిస్ట్రేషన్ తప్పక చేయించుకోవాలని కోరారు. జిల్లా వాపారస్తులు ఎదుర్కొంటున్న వాణిజ్యపరమైన సమస్యలపై అధికారులతో అవగాహన కల్పిస్తామన్నారు. భావన మోహన్ మాట్లాడుతూ వ్యాపార లావాదేవీలలో మెళకువలు నేర్చుకోవడమే కాక పన్నులపై అవగాహన కల్గి ఉండాలన్నారు. çమన రాష్ట్రంలో తయారైన వస్తువులకు ఒకే పన్ను విధానముంటుందని, ఇతర రాష్ట్రాలతో తయారైతే కచ్చితంగా సుంకం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఏపీ టాక్స్ ప్రాక్టీషనర్స్‌అండ్ కన్సల్టెంట్ ప్రసిడెంట్ ఏవీఎస్.కృష్ణమోహన్, నెల్లూరు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ,, రాష్ట్ర హోటల్స్ అసోషియేన్ ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి, ఎడిబుల్ ఆయిల్స్ అసోషయేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి తదితరులు హాజరయ్యారు. -
రేట్ల కోతతో ఆర్థిక వ్యవస్థకు ఊతం: జైట్లీ
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తే దేశీ ఎకానమీకి ఊతమిచ్చినట్లవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. వడ్డీ రేట్ల తగ్గుదల వల్ల పెట్టుబడుల కోసం చౌకగా రుణాలు లభించగలవని ఆయన తెలిపారు. మరిన్ని పెట్టుబడులు వస్తే ఎకానమీ మరింతగా మెరుగుపడగలదన్నారు. సిటీ సంస్థ నిర్వహించిన ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెషనల్ సంస్థగా ఆర్బీఐ సముచిత నిర్ణయం తీసుకోగలదని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే ఉద్దేశంతో ఆర్బీఐ పాలసీ రేట్లను జనవరి నుంచి 8 శాతం స్థాయిలోనే కొనసాగిస్తోంది. తాజాగా సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.52 శాతానికి, టోకుధరల ఆధారిత సూచీ 1.77 శాతం రికార్డు స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతోనే వచ్చే నెల 2న జరిగే పాలసీ సమీక్షలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో బీమా సవరణ బిల్లు ఆమోదం పొందగలదని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ) అమల్లోకి తెచ్చేందుకు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నామని, ఇప్పటికే చాలా మటుకు వివాదాస్పద అంశాలు పరిష్కారమయ్యాయని ఆయన చెప్పారు. అన్నీ పరిశీలించాకే నిర్ణయం: ఆర్బీఐ న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే పరపతి విధాన సమీక్షలో పాలసీ రేట్లపై నిర్ణయం తీసుకునేటప్పుడు ద్రవ్యోల్బణ తగ్గుదల తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని ఆర్బీఐ డిప్యుటీ గవర్నర్ ఎస్ ఎస్ ముంద్రా చెప్పారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో ఏర్పాటు చేసిన ఆర్బీఐ స్టాల్‌ను సోమవారం ప్రారంభించిన సందర్భంగా ముంద్రా ఈ విషయాలు తెలిపారు. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగితే, భౌగోళిక..రాజకీయ అనిశ్చితి తలెత్తితే దేశీయంగా ద్రవ్యోల్బణం మళ్లీ ఎగిసే అవకాశం ఉందన్నారు. ఫిబ్రవరిలో చాన్స్!: గోల్డ్‌మన్ శాక్స్ న్యూఢిల్లీ: ఆర్బీఐవచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో వడ్డీ రేట్లను కుదించవచ్చునని గోల్డ్‌మన్ శాక్స్ తాజాగా అంచనా వేసింది. ఫిబ్రవరిలో 0.25%, ఏప్రిల్‌లో మళ్లీ మరో 0.25% చొప్పున రేట్లలో కోత పెట్టే అవకాశముందని పేర్కొంది. తద్వారా రెపో రేటును 8% నుంచి 7.5%కు తగ్గించవచ్చునని అభిప్రాయపడింది. 2015 ప్రథమార్ధంలో వడ్డీ రేట్లలో కోతకు చాన్స్ లేదంటూ ఇంతక్రితం వేసిన అంచనాను పక్కనపెట్టినట్లు రీసెర్చ్ నివేదికలో గ్లోబల్ బ్రోకరేజీ దిగ్గజ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ ఈ సందర్భంగా తెలిపింది.