
Central Government Increased GST on Apparel and Textiles & Footwear: సామాన్యులకు కేంద్రం మరో షాకిచ్చింది. గార్మెంట్స్, ఫుట్‌వేర్, టెక్స్‌టైల్స్ ప్రొడక్ట్‌లపై 5శాతం నుండి 12శాతం వరకు జీఎస్‌స్టీ(వస్తువులు మరియు సేవల పన్ను)ని వసూలు చేయనుంది. కొత‍్తగా వసూలు చేయనున్న జీఎస్టీ జనవరి 1, 2022 నుండి అమల్లోకి రానుంది. దీంతో బట్టలు, చెప్పులు ఇతర ఉత్పుత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) నవంబర్ 18న గార్మెంట్స్, ఫుట్‌వేర్, టెక్స్‌టైల్స్ గార్మెంట్‌పై జీఎస్‌టీ విధిస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే, నోటిఫికేషన్ ప్రకారం కొన్ని సింథటిక్ ఫైబర్‌లు, నూలుపై జీఎస‍్టీ రేట్లను 18శాతం నుండి 12శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. అదే మసయంలో ఫ్యాబ్రిక్స్‌పై జీఎస‍్టీ రేటు 5శాతం నుండి 12శాతానికి పెంచి సమం చేసింది. జీఎస‍్టీ బ్రాండెడ్ దుస్తులపై జీఎస్టీ 12శాతానికి వసూలు చేయనుంది.
నేసిన వస్త్రాలు, సింథటిక్ నూలు, పైల్ ఫ్యాబ్రిక్స్, దుప్పట్లు, టెంట్లు, టేబుల్‌క్లాత్‌లు, సర్వియెట్‌లు, రగ్గులు, టేప్‌స్ట్రీస్ వంటి ఉపకరణాలతో కూడిన వస్త్రాలు, వాటి రేట్లు 5% నుండి 12% వరకు పెరిగాయి. బ్రాండెండ్ చెప్పులు 5శాతం నుండి 12శాతం వరకు పెరిగాయి.
సీఎంఎఐ అసంతృప్తి
జనవరి1,2022 నుండి దుస్తులపై జీఎస‍్టీ పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల భారత దుస్తుల తయారీదారుల సంఘం (సీఎంఎఐ) అసంతృప్తి వ్యక‍్తం చేసింది. ముడిసరుకు ధరలు, ముఖ్యంగా నూలు, ప్యాకింగ్ మెటీరియల్, సరకు రవాణా పెరగడంతో పరిశ్రమ ద్రవ్యోల్బణ ఒత్తిడిని ఎదుర్కొంటున్నందున ఖర్చుల పెంపు ప్రధాన ప్రభావాన్ని చూపుతుందని పరిశ్రమ సంఘం పేర్కొంది.
చదవండి: GST: ఐస్‌క్రీమ్ పార్లర్లు, స్టోర్ల నిర్వాహకులకు షాక్
Comments
Please login to add a commentAdd a comment