కేంద్ర మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జీఎస్టీ సంబంధిత విషయాల్లో జోక్యం చేసుకునేలా వీలు కల్పించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పరిధిలోకి గూడ్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ (gstn)ను తెస్తున్నట్లు తెలిపింది. దానికి సంబంధించి నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది.
తాజా నిర్ణయంతో జీఎస్టీ చెల్లింపుల్లోని అక్రమాలు, ఇతర అనుమానాస్పద ఆర్ధిక లావాదేవీల్ని అరికట్టవచ్చు. అండర్ సెక్షన్ 66 (pmla) కింద పన్ను చెల్లింపుదారుల వివరాలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌తో తప్పని సరిగా షేర్ చేయాలనే నిబంధనలు ఉన్నాయి.
Government-issued a notification to bring the Goods & Services Tax Network (GSTN) under the Prevention of Money Laundering Act (PMLA). Information stored on GSTN can be now shared under PMLA Act. pic.twitter.com/VrhUq3vuCY
— ANI (@ANI) July 8, 2023
కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో.. జీఎస్టీ చెల్లింపు దారులు అనుమానాస్పదంగా ఫారెక్స్ ట్రాన్సాక్షన్ జరిపారని నిర్ధారిస్తే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్,ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అధికారులు సంబంధిత సమాచారాన్ని జీఎస్‌టీఎన్‌కు చేరవేస్తారు. వీటితో పాటు నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లు, నకిలీ ఇన్‌వాయిస్‌లు వంటి జీఎస్టీ మోసాలు మనీలాండరింగ్ నిరోధక చట్టం కిందకు వస్తాయి.
చదవండి : జాక్ మాకు మరో భారీ షాక్..మంచులా కరిగిపోతున్న ఆస్తులు!
Comments
Please login to add a commentAdd a comment