Money landaring
-
మనీలాండరింగ్ కేసులో సుజనా చౌదరికి ఎదురు దెబ్బ
ఢిల్లీ : ఈడీ మనీలాండరింగ్ కేసులో బీజేపీ విజయవాడ పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరికి ఎదురు దెబ్బ తగిలింది. బెస్త్ అండ్ క్రాప్టన్ కేసును క్వాష్ చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ని సుప్రీం కోర్టు డిస్మీస్ చేసింది. చైన్నై ఈడీ కోర్టులో తేల్చుకోవాలని సూచించింది. ఇదే కేసులో సీబీఐ సుజనా చౌదరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
ఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఊరట దక్కలేదు. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టు (ట్రయిల్ కోర్టు) తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుపై ఈడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ట్రయిల్ కోర్టు బెయిల్ ఇస్తూ తీర్పును వెలువరించగా.. ఆ తీర్పుపై స్టే విధించింది. ఈ సందర్భంగా సుదీర్ కుమార్ జైన్ ధర్మాసనం ..ట్రయిల్ కోర్టు ఇచ్చిన తీర్పులో లోపాల్ని ఎత్తి చూపింది. ఈడీ వాదనకు తగినంత సమయం ఇవ్వకపోవడం, మనీలాండరింగ్ నిరోధక చట్టంలో విడుదలకు సంబంధించిన షరతులను సరిగ్గా చర్చించడంలో విఫలమవడంతో పాటు ఇతర అంశాలు ఉన్నాయని స్పష్టం చేస్తూ కేజ్రీవాల్ బెయిల్‌పై స్టే విధించింది. దీంతో కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలినట్లైందిDelhi HC allows Enforcement Directorate's plea to stay the trial court's bail order for Delhi Chief Minister Arvind Kejriwal in the money laundering case linked to the alleged money laundering excise scam.The bench of Justice Sudhir Kumar Jain stays the Arvind Kejriwal bail… pic.twitter.com/A4XL3FKdm1— ANI (@ANI) June 25, 2024కేజ్రీవాల్‌కు బెయిల్.. అంతలోనే అంతుకు ముందు తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ జూన్ 20న రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌లో అరవింద్ కేజ్రీవాల్ ప్రమేయం నేరుగా ఉందని తెలిపేలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టు ఆధారాల్ని అందించడంలో విఫలం కావడంతో రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీం కోర్టులో రేపే విచారణ అయితే ట్రయిల్ కోర్టు తీర్పును ఈడీ సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ట్రయిల్ కోర్టు ఇచ్చిన తీర్పు హేతుబద్దంగా లేదని ఈడీ తరుపు న్యాయవాది అడిషినల్ సోలిసిటర్ జర్నల్ (ఏఎస్జీ) ఎస్వీ రాజు వాదించారు. ట్రయల్ కోర్టు తమ వాదనల్ని వినిపించేందుకు తగినంత సమయం ఇవ్వలేదని, వెంటనే ఆ ఉత్తర్వులపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే విచారణ చేపట్టాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టింది. ట్రయిల్ కోర్టు ఢిల్లీ సీఎంకు బెయిల్ ఇస్తూ తీర్పును వెలువరించిన విధానాన్ని తప్పుబట్టింది. కాగా, ట్రయిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించంపై కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై రేపు (జూన్ 26న) సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. -
సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో అరెస్టై.. తిహార్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. కేజ్రీవాల్ తరఫున ఆప్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, దిపాంకర్ దత్తాలతో కూడిన ధర్మానం విచారణ జరుపనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి సుప్రీం కోర్టు తెలిపింది. కేజ్రీవాల్ విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పరిశీలిస్తామని సుప్రీం కోర్టు మే 3వ తేదీన పేర్కొంది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదని, కేవలం సమాచారం అందిస్తున్నామని సుప్రీం కోర్టు ఈడీ తరఫు న్యాయవాదికి తెలియజేసింది.దీనికంటే ముందు జరిగిన విచారణలో లోక్‌సభ ఎన్నికల ముందు సీఎం కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ఈడీని సుప్రీం కోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ రోజు జరిగే మధ్యంతర బెయిల్ విచారణలో సుప్రీం కోర్టు వెల్లడించే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. -
మాజీ సీఎం హేమంత్ సోరెన్ కేసులో కీలకం కానున్న టీవీ, రిఫ్రిజిరేటర్
రాంచీ : జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ మనీ ల్యాండరింగ్ కేసులో టీవీ, రిఫ్రిజిరేటర్లు కీలకం కానున్నట్లు తెలుస్తోంది. రూ.31 కోట్ల కంటే ఎక్కువ విలువైన 8.86 ఎకరాల భూమిని అక్రమంగా సంపాదించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన వాదనను సమర్ధించేందుకు కీలకమైన సాక్ష్యాలలో రిఫ్రిజిరేటర్, స్మార్ట్ టీవీ ఇన్వాయిస్లను స్వీకరించింది. ఈడీ రాంచీకి చెందిన ఇద్దరు డీలర్ల నుండి ఈ రశీదులను పొందింది. సోరెన్‌తో పాటు మరో నలుగురిపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో వాటిని జత చేసింది. సంతోష్ ముండా పేరుమీద ఈడీ వర్గాల సమాచారం మేరకు..హేమంత్ సోరెన్ ఈడీ సేకరించిన టీవీ, రిఫ్రిజిరేటర్లను తన కుటుంబసభ్యుడు సంతోష్ ముండా పేరుమీద తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సంతోష్ ముండానే సోరెన్ కొనుగోలు చేసిన 8.86 ఎకరాల ల్యాండ్ వ్యవహరాలను గత 14 నుంచి 16 ఏళ్ల నుంచి చూసుకుంటున్నట్లు ఈడీ గుర్తించింది. సోరెన్‌కు ఈడీ సమన్లు.. రంగంలోకి పహాన్ మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టైన మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఆ 8.86 ఎకరాల ల్యాండ్‌కు తనకు సంబంధం లేదని ఈడీ అధికారులతో వాదించారు. అందుకు కౌంటర్‌గా ఈడీ అధికారులు సంతోష్ ముండా నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. అంతేకాదు, మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ తొలిసారి గతేడాది ఆగస్టులో హేమంత్ సోరెన్‌కు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లు జారీ చేసిన వెంటనే రాజ్‌కుమార్ పహాన్ అనే వ్యక్తి ఆ 8.86 ఎకరాల భూమి తనతోపాటు మరికొందరి ఆధీనంలో ఉందని, ఇతర యజమానుల పేరిట ఉన్న మ్యుటేషన్ రద్దు చేయాలని రాంచీ డిప్యూటీ కమిషనర్‌కు లేఖ రాశారు. తద్వారా తన ఆస్తిని కాపాడుకోవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు. ఖండించిన ఈడీ రాజ్‌కుమార్ పహాన్ లేఖను ఈడీ ఖండించింది. సోరెన్ తన ఆస్తుల్ని సంరక్షించుకునేందుకు బినామీల పేరిట రాశారని ఆరోపిస్తోంది. సోరెన్ ఆదేశానుసారం సంతోష్ ముండాకు ఆస్తి సంరక్షకుని బాధ్యతను అప్పగించారని ఈడీ చెబుతోంది. కేసులో మరొక నిందితుడు హిలారియాస్ కచాప్ అక్కడ విద్యుత్ మీటర్‌ను అమర్చారని వెల్లడించింది. ఇక సోరెన్ సంతోష్ ముండా పేరుమీద ఫిబ్రవరి 2017లో రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేయగా, నవంబర్ 2022లో అతని కుమార్తె పేరు మీద స్మార్ట్ టీవీని రాంచీలో భూమి ఉన్న చిరునామాలో కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఆధారాల్ని తారుమారు చేసే ప్రయత్నం సంతోష్ ముండాతో పాటు, రాజ్‌కుమార్ పహాన్‌లు హేమంత్ సోరెన్‌ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని, తద్వారా ఆస్తి పహాన్ అతని కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నట్లు చూపించి సోరెన్‌ను రక్షించేలా సాక్ష్యాలు తారుమారు చేయడం, అతని ఆస్తులు బయట పడకుండా దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందంటూ ఈడీ చెబుతోంది. జ్యుడీషియల్ కస్టడీలో హేమంత్ సోరెన్ కాగా, సీఎం పదవికి రాజీనామా చేసిన కొద్దిసేపటికే హేమంత్ సోరెన్‌ను మనీలాండరింగ్ కేసులో జనవరి 31న ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం సోరెన్ రాంచీలోని హోత్వార్‌లోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. -
మనిలాండరింగ్ కేసులో మాజీ మంత్రి.. ఈడీకి సుప్రీం కీలక ఆదేశాలు
మనీలాండరింగ్ కేసులో గత ఏడాది అరెస్టైన తమిళనాడు మాజీ మంత్రి వి.సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి స్పందన కోరింది. సెంథిల్ బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 29లోగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈడీని ఆదేశించింది. అంతకుముందు సెంథిల్ బెయిల్ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మనిలాండరింగ్ కేసులో బెయిలా ఫిబ్రవరి 28న సెంథిల్ బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఆ సమయంలో మనిలాండరింగ్ వంటి అసాధారణ కేసుల్లో బెయిల్ ఇవ్వడం తప్పుడు సంకేతాలు పంపుతుందని, అది ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొంది. అంతేకాదు, పిటిషనర్ ఎనిమిది నెలలకు పైగా జైలు శిక్ష అనుభవించారని, అందువల్ల ఈ కేసును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ప్రత్యేక కోర్టును ఆదేశించడం సముచితంగా ఉంటుందని పేర్కొంది.సుప్రీం ఆదేశాలకు అనుగుణంగాదీని ప్రకారం ఈ ఉత్తర్వుల కాపీ అందిన తేదీ నుంచి మూడు నెలల్లో కేసును పరిష్కరించాలని చెన్నై ప్రిన్సిపల్ స్పెషల్ కోర్టును కోరాలని ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రోజువారీగా విచారణ జరపాలని చెన్నై హైకోర్టు ఆదేశించింది.మనీ లాండరింగ్ కేసు గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈడీ అధికారులు సెంథిల్ బాలాజీని గత ఏడాది జూన్ 14న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్న ఆయన పలు మార్లు బెయిల్ కోసం అప్లయి చేశారు. తాజాగా సెంథిల్ బెయిల్‌పై సుప్రీం కోర్టు ఈడీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. -
శివబాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థల ఫోకస్
-
TS: శివబాలకృష్ణకు బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి ఈడీ, ఐటీ
హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెంచాయి. ఈడీ, ఐటీ అధికారులు రంగంలోకి దిగనున్నారు. శివబాలకృష్ణ ఎఫ్ఐర్, రిమాండ్ రిపోర్టు తదితర పత్రాలను ఇవ్వాలని ఏసీబీకి ఈడీ ఇప్పటికే లేఖ రాసింది. మనీలాండరింగ్ కోణంలోను శివబాలకృష్ణను ఈడీ విచారించనుంది. మరోవైపు శివబాలకృష్ణ బినామీ ఆస్తులపై కూడా ఐటీ అధికారులు విచారణ చేపట్టనున్నారు. అధికారాన్ని అపయోగించుకుని హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమంగా పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఆ ఆస్తుల విలువ సుమారు రూ.1000 కోట్లు ఉంటుందని అంచనా. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. డాక్యుమెంట్ వాల్యు ప్రకారం రూ. 250 కోట్లు ఆస్తులను బాలకృష్ణ కుడబెట్టుకున్నట్లు అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్ లో ఈ ఆస్తుల విలువ నాలుగు రెట్లు ఉండే అవకాశం ఉంది. ఈ కేసులో శివబాలకృష్ణ, సోదరుడు నవీన్ ప్రస్తుతం చంచల్ గూడ జైల్ లో ఉన్నారు. ఇదీ చదవండి: HYD: ‘వీక్షణం’ పత్రిక ఎడిటర్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు -
యూజర్లకు అలెర్ట్.. ‘పేటీఎం’ ఇక కనిపించదా?
ప్రముఖ దేశీయ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం మనీ ల్యాండరింగ్‌తో పాటు వందల కోట్లలో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని గుర్తించిన ఆర్బీఐ పేటీఎంపై పలు ఆంక్షలు విధించింది. ఫలితంగా పేటీఎం భవిష్యత్ మరింత గందరగోళంగా మారింది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పనిచేస్తుందా? లేదంటే స్తంభించి పోతుందా? ఇలాంటి అనేక ప్రశ్నల పరంపరకు స్పష్టత రావాలంటే అప్పటి వరకు ఎదురు చూడాల్సి ఉంది. ఆర్బీఐ ఇటీవల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)కు పలు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం నుంచి టోల్ ఛార్జీలు చెల్లించడం, డిపాజిట్ల సేకరణ, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు ఇలా అన్నీ రకాల ఆర్ధిక లావాదేవీలను నిలిపివేయాలని ఆదేశించింది. ఫిబ్రవరి 29 తర్వాత ఆర్బీఐ తాజా ఆదేశాల నేపథ్యంలో ఫిబ్రవరి 29 లోపు వినియోగదారులు డిపాజిట్లు చేయడంతో పాటు ఇతర సేవల్ని వినియోగించుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పనిచేస్తుందా? లేదా? అనేది ఆర్బీఐ మీద ఆధారపడింది. అప్పటి వరకు సెంట్రల్ బ్యాంక్ నిర్వహిస్తున్న విచారణలో లోపాలు తలెత్తితే మాత్రం పేటీఎంపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందుకే వినియోగదారులు పేటీఎం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్ద ఎత్తున అవకతవకలు పలు నివేదికల ప్రకారం.. పేటీఎం వినియోగిస్తున్న లక్షల కస్టమర్లకు కేవైసీ లేదు. పైగా మల్టీపుల్ బ్యాంక్ అకౌంట్స్‌కు ఒకటే పాన్ కార్డ్ ఉండటం మరిన్ని అనుమానాలకు దారి తీసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో దాదాపు 35 కోట్ల ఇ-వాలెట్లు ఉన్నాయి. ఇందులో, దాదాపు 31 కోట్ల అకౌంట్లు పనిచేయడం లేదు. కేవలం 4 కోట్లు మాత్రమే బ్యాలెన్స్ లేదా చిన్న నిల్వలతో నిర్వహణలో ఉన్నాయి. కాబట్టి కేవైసీల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఇది ఖాతాదారులు, డిపాజిటర్లు, వాలెట్ హోల్డర్లను తీవ్రమైన ప్రమాదానికి గురి చేసిందని ఓ అధికారి పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు ఆర్బీఐ చర్యలకు ఉపక్రమించింది. 2021 నుంచి ఇదే తంతు పేటీఎం నిబంధనలు ఉల్లంఘించిన కార్యకలాపాలు నిర్వహించడం ఇదేమీ తొలిసారి కాదు. 2021లో ఈ ఫిన్ టెక్ కంపెనీకి ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది. పేటీఎంలో అనేక అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపింది. కేవైసీ లేకపోవడం, మనీల్యాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించామని, వెంటనే లోపాల్ని సవరించాలని సూచించినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ కస్టమర్లకు సేవలందించారు పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ. ఇక ఈ లోపాలన్నీ ఆయా బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదులతో వెలుగులోకి వచ్చాయి. అదే విధంగా పేటీఎంలో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్లు తేలడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. 40 శాతం క్షీణించిన షేర్లు ఆర్బీఐ ఆదేశాలతో పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు గత రెండు రోజుల్లో 40 శాతం క్షీణించాయి. శుక్రవారం బీఎస్ఈలో ఈ షేరు 20 శాతం నష్టపోయి రూ. 487.05కి చేరుకుంది. రెండు రోజుల్లో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంక్యాప్) రూ.17,378.41 కోట్లు తగ్గి రూ.30,931.59 కోట్లకు చేరుకుంది. -
హేమంత్ సొరెన్‌కు ఐదు రోజుల కస్టడీ
రాంచీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టైన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్‌కు ఐదు రోజుల కస్టడీ విధించారు. హేమంత్ సోరెన్‌ను బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం రాంచీలోని ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టులో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం సోరెన్‌ను 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. కాగా.. సుప్రీంకోర్టులో హేమంత్ సోరెన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసులో ప్రస్తుతం తాము జోక్యం చేసుకోలేమని.. ముందుగా హైకోర్టుకు వెళ్లాలని తెలిపింది. హేమంత్ సోరెన్ మొదట జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం ఉదయం దానిపై ధర్మాసనం విచారించాల్సి ఉంది. అయితే సోరెన్ తరపు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ, హైకోర్టు నుంచి పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఈ ఇద్దరు న్యాయవాదులు గురువారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు హాజరై తమ పిటిషన్‌పై అత్యవసర జాబితా కింద విచారించాలని పేర్కొన్నారు. ఇదీ చదవండి: జార్ఖండ్ సీఎంగా చంపయ్ సొరెన్ ప్రమాణ స్వీకారం -
కోర్టుకు బ్లాక్ డ్రెస్‌లో రావా బేబీ.. వెలుగులోకి సుఖేష్ మెసేజ్‌లు
ఢిల్లీ:రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో జాక్వెలిన్‌కు సుఖేష్ పంపించిన మెసేజ్‌లు కీలకంగా మారాయి. కోర్టులో విచారణ సందర్భంగా జాక్వెలిన్‌ను బ్లాక్ డ్రెస్‌లో కనిపించాలని జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్.. జాక్వెలిన్‌కు వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. 2023 జూన్ 30న జాక్వెలిన్‌కు సుఖేష్ మెసేజ్ చేశాడు.'బేబీ వచ్చే 6వ తేదీ కోర్టులో విచారణ ఉంటుంది. హాజరైతే దయచేసి నల్ల కుర్తా ధరించు. తద్వారా నా మెసేజ్‌లన్నీ చూస్తున్నావని, నన్ను ప్రేమిస్తున్నావని అర్థం చేసుకుంటా. మిస్సింగ్ యూ.. ఐ లవ్ యూ బేబీ గర్ల్. నువ్వు ఎప్పటికీ నా దానివే' అని సుఖేష్ రాసుకొచ్చాడు. 'తాజా ట్రోల్‌లతో కలత చెందుతున్నావని నాకు తెలుసు. కానీ బాధపడకు. ఇవేవీ పెద్దవి కావు. నువ్వు నా యువరాణివి. సూపర్ స్టార్ అవుతావు.' అని పేర్కొన్న సుఖేష్.. జాక్వెలిన్ బ్లాక్ డ్రెస్ ధరించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా మెసేజ్ చేశాడు. 'బేబీ, కోర్టులో విచారణ సందర్భంగా బ్లాక్ డ్రెస్ ధరించకపోవడం చాలా బాధ కలిగించింది. ఏమి ఆలోచిస్తున్నావో నాకు నిజంగా అర్థం కాలేదు. ఏ విధంగానైనా సహాయం చేస్తానంటే నీకు తోడుగా ఉంటా. నీకు అవసరాలను ఎటువంటి సమస్యలు లేకుండా తీర్చడానికి సిద్ధంగా ఉన్నా.' అని సుఖేష్ మెసేజ్ చేశాడు. అంతేకాకుండా దర్శకుడు, సంగీత రచయిత లవ్ రంజన్ ఒక సినిమా కోసం జాక్వెలిన్‌ను కలుస్తారని పేర్కొన్నాడు. కాగా.. ఈ కేసులో ఫెర్నాండెజ్ పాత్ర ఉందని సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపణలు చేశాడు. దీంతో సుఖేష్‌పై ఫెర్నాండేజ్ తిరగబడ్డారు. సుఖేష్ బెదిరింపుల నుండి రక్షణ కోరుతూ ఇటీవల ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. సుకేష్ చంద్రశేఖర్ లక్షిత దాడిలో తాను అమాయకురాలినని, తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇదీ చదవండి: ఖర్గే పేరుతో ఇండియా కూటమిలో చీలిక? -
విపక్ష నేతలందరి అరెస్టుకు కుట్ర: మమతా బెనర్జీ
కోల్‌కతా: బీజేపీపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నాటికి ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు సీనియర్ ప్రతిపక్ష నాయకులను బీజేపీ అరెస్టు చేయడానికి కుట్ర పన్నిందని ఆరోపించారు. ఆ తర్వాత ఖాళీ దేశంలో వాళ్లకు వాళ్లే ఓట్లు వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రతిపక్ష నాయకుల ఫోన్లను కూడా బీజేపీ హ్యాక్ చేసిందని దీదీ ఆరోపించారు. “వచ్చే ఏడాది ఎన్నికలకు ముందే బీజేపీ ప్రతిపక్ష పార్టీల నోరు మూయడానికి ప్రయత్నిస్తోంది. బీజేపీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్టు చేయాలని ప్రణాళిక చేస్తున్నారు. ఈ విధంగా ఎన్నికల్లో లాభపడాలని చూస్తున్నారు" అని కోల్‌కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో మమతా బెనర్జీ ఆరోపించారు. దేశ రాజధానిలో మద్యం పాలసీ కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత గురువారం కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను, మంత్రి అతిషిని నవంబర్ 2న అరెస్టు చేయనున్నారని ఆప్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ స్పందించారు. అటు.. టీఎంసీ నాయకుల చుట్టూ కూడా ఈడీ ఉచ్చు బిగుస్తోంది. రేషన్ పంపిణీ కుంభకోణంలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ గత వారం అరెస్టయ్యారు. ఇండియా కూటమి నేతలే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయని దీదీ ఆరోపించారు. ఇదీ చదవండి: మరాఠా రిజర్వేషన్‌కు అనుకూలమే: ఏక్నాథ్ షిండే -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (55)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం సమన్లు జారీ చేసింది. నవంబర్ 2న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయనకు సమన్లు జారీ అయ్యాయి. ఇదే కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసిన కొద్ది గంటలకే ఈ పరిణామం చెటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన చార్జిషీట్లలో కేజ్రీవాల్ పేరును ఈడీ ఇప్పటికే పలుసార్లు పేర్కొనడం తెలిసిందే. ఈ కేసు నిందితులంతా ఢిల్లీ మద్యం విధానం 2021–22 తయారీ, అమలుకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ కేజ్రీవాల్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నట్టు అందులో చెప్పుకొచ్చింది. నవంబర్ 2న కేజ్రీవాల్ స్టేట్మెంట్ను ఈడీ నమోదు చేయనుందని సమాచారం. మద్యం కుంభకోణానికి సంబంధించి అవినీతి, నేరపూరిత కుట్ర అభియోగాల్లో కేజ్రీవాల్‌ను సీబీఐ ఏప్రిల్ 16న కూడా 9 గంటలపాటు ప్రశ్నించింది. మండిపడ్డ ఆప్ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లపై ఆప్ మండిపడింది. తమ పార్టీని ఎలాగైనా అంతం చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రలు పన్నుతోందని ఆరోపించింది. అందులో భాగంగానే ఈ తప్పుడు కేసులో తమ అధినేతను ఎలాగైనా ఇరికించేందుకు నరేంద్ర మోదీ సర్కారు ఎప్పట్నుంచో ప్రయతి్నస్తోందని ఆప్ నేత, మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. మరోవైపు, ఈ కేసులో సిసోడియా అవినీతికి సంబంధించి చాలినన్ని రుజువులున్నాయని సుప్రీం బెయిల్ నిరాకరణతో తేలిపోయిందని బీజేపీ పేర్కొంది. కనుక నైతిక బాధ్యత వహిస్తూ కేజ్రీవాల్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ కేసులో అవినీతి జరిగినట్టు ఎలాంటి రుజువులూ లేవని కేజ్రీవాల్‌తో పాటు ఆప్ నేతలంతా ఇప్పటిదాకా చెప్తూ వచి్చందంతా పచ్చి అబద్ధమని రుజువైందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ అన్నారు. ఆది నుంచీ వివాదాలే ఢిల్లీ మద్యం విధానాన్ని 2021లో కేజ్రీవాల్ ప్రభుత్వం అమల్లోకి తెచి్చంది. మద్యం లైసెన్సుదారులకు నిబంధనలకు విరుద్ధంగా అనేక విధాలుగా కేజ్రీవాల్ సర్కారు లబ్ధి చేకూర్చిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో దీనిపై విచారణ జరపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నాటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. మద్యం విధానం తప్పుల తడక అని, ఎక్సైజ్ మంత్రిగా సిసోడియా తీసుకున్న నిర్ణయాల వల్ల ఖజానాకు కనీసం భారీ నష్టం జరిగిందని, ఆప్ నేతలు తదితరులు లైసెన్సుదారుల నుంచి పలు మార్గాల్లో లబ్ధి పొందారని సీఎస్ నివేదించారు. ఈ వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో చివరికి 2022 జూలై 31న నూతన మద్యం విధానాన్ని కేజ్రీవాల్ సర్కారు రద్దు చేసింది. ఇందులో తీవ్ర అవకతవకలు జరిగాయంటూ 2022 ఆగస్టు 17న సీబీఐ కేసు నమోదు చేసింది. సిసోడియాతో పాటు 15 మందిని నిందితులుగా చేర్చింది. -
మనీలాండరింగ్ పై అప్పట్లోనే హెచ్చరించిన వై.ఎస్.ఆర్
-
కేంద్రం సంచలన నిర్ణయం.. మనీలాండరింగ్ పరిధిలోకి జీఎస్టీ
కేంద్ర మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జీఎస్టీ సంబంధిత విషయాల్లో జోక్యం చేసుకునేలా వీలు కల్పించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పరిధిలోకి గూడ్స్ అండ్ సర్వీస్ నెట్వర్క్ (gstn)ను తెస్తున్నట్లు తెలిపింది. దానికి సంబంధించి నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. తాజా నిర్ణయంతో జీఎస్టీ చెల్లింపుల్లోని అక్రమాలు, ఇతర అనుమానాస్పద ఆర్ధిక లావాదేవీల్ని అరికట్టవచ్చు. అండర్ సెక్షన్ 66 (pmla) కింద పన్ను చెల్లింపుదారుల వివరాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌తో తప్పని సరిగా షేర్ చేయాలనే నిబంధనలు ఉన్నాయి. Government-issued a notification to bring the Goods & Services Tax Network (GSTN) under the Prevention of Money Laundering Act (PMLA). Information stored on GSTN can be now shared under PMLA Act. pic.twitter.com/VrhUq3vuCY — ANI (@ANI) July 8, 2023 కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్లో.. జీఎస్టీ చెల్లింపు దారులు అనుమానాస్పదంగా ఫారెక్స్ ట్రాన్సాక్షన్ జరిపారని నిర్ధారిస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్,ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అధికారులు సంబంధిత సమాచారాన్ని జీఎస్టీఎన్కు చేరవేస్తారు. వీటితో పాటు నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లు, నకిలీ ఇన్వాయిస్లు వంటి జీఎస్టీ మోసాలు మనీలాండరింగ్ నిరోధక చట్టం కిందకు వస్తాయి. చదవండి : జాక్ మాకు మరో భారీ షాక్..మంచులా కరిగిపోతున్న ఆస్తులు! -
గేమింగ్ యాప్ స్కాం: గుట్టలకొద్దీ నగదు,కళ్లు చెదిరే వీడియో
కోలకతా: కోలకత్తా గేమింగ్ యాప్ స్కాంలో ఈడీ దాడుల్లో గుట్టల కొద్దీ నగదు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. గేమింగ్ యాప్ స్కాంలో ఈడీ ఏకంగా రూ. 17 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. ఈ నగ్గెట్స్` అనే గేమింగ్ యాపప్‌కు సంబంధించిన కుంభకోణంలో కోలకతాకు చెందిన గేమ్ ఆపరేటర్స్ కార్యాలయాల్లో శనివారం ఈడీ తనిఖీలు చేపట్టింది. మనీలాండరింగ్ ఆరోపణలతోసాగిన ఈసెర్చ్ ఆపరేషన్ కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్త ఇంటినుంచి సుమారు రూ. 17 కోట్లను రికవరీ చేసింది. గార్డెన్ రీచ్ ప్రాంతంలోని ఒకదానితో సహా ఆరు చోట్ల దాడులు చేపట్టింది. రూ. 2వేల నోట్లు, రూ.500 నోట్ల కుప్పలను లెక్కించేందుకు ఈడీ మనీకౌంటింగ్ మెషీన్ల సహాయం తీసుకోవాల్సి వచ్చింది. అంతేకాదు గంటల తరబడి కొనసాగుతున్న లెక్కింపులో నగదును తరలించేందుకు పెద్ద పెద్ద ట్రంక్ పెట్టెలను తీసుకొస్తుండటం గమనార్హం. ప్రజలను నమ్మించి మోసగించి అక్రమాలను పాల్పడిన "ఈ-నగ్గెట్స్" అనే గేమింగ్ యాప్‌ను నిందితుడు నిసార్ ఖాన్ ప్రమోట్ చేశారని దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే దీనికి, ఆపరేటర్లకు ఇతర "చైనీస్ నియంత్రిత" యాప్‌లతో లింక్‌లు ఉన్నాయో లేదో దర్యాప్తు చేస్తోంది. కాగా 2021, ఫిబ్రవరిలో కంపెనీ, దాని ప్రమోటర్లపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. ఫెడరల్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ యాప్ డౌన్ లోడింగ్, గేమింగ్ ప్రాసెస్‌లో రివార్డు పేరుతో డబ్బు ఎరగా వేశారు. మొదట్లో విత్ డ్రా చేసుకునే అవకాశం బాగానే కల్పించారు. ఎంత ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తే అంత మొత్తంలో రివార్డ్స్ ఇచ్చి ప్రజలకు ఆశలు కల్పించారు. దీంతో యూజర్లు పెద్ద మొత్తంలో డబ్బును డిపాజిట్ చేయడం ప్రారంభించడంతో అక్రమాలకు తెరలేచింది. #WATCH | Kolkata, WB: Stacks of cash amounting to several crores have been recovered from the residence of businessman Nisar Khan during ED's raid ongoing for several hours pic.twitter.com/o2qXzNSmDR — ANI (@ANI) September 10, 2022 #WATCH | Kolkata, WB: Trunks being carried into the residence of businessman Nisar Khan to collect crores in cash that have been recovered during ED's raid ongoing for several hours pic.twitter.com/jJjV3ZJRN6 — ANI (@ANI) September 10, 2022 -
మనీలాండరింగ్‌పై పోరుకు భారత్ కట్టుబడి ఉంది
వాషింగ్టన్: నగదు అక్రమ చెలామణీ (మనీలాండరింగ్), ఉగ్రవాదులకు నిధుల చేరవేతకు వ్యతిరేకంగా పోరాడేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ రక్షణ కోసం ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్)’ పోషిస్తున్న పాత్రను ఆమె అభినందించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎఎంఫ్), ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశాల్లో భాగంగా ఎఫ్ఏటీఎఫ్ మంత్రుల సమావేశాన్ని కూడా నిర్వహించారు. దీనికి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోనే పారిస్ కేంద్రంగా పనిచేసే ఎఫ్ఏటీఎఫ్ వ్యూహాత్మక ప్రాధాన్యతలకు (2022–24 సంవత్సరాలకు) ఆమోదం తెలిపారు. 1989లో ఏర్పాటైన ఎఫ్ఏటీఎఫ్ అంతర్ ప్రభుత్వ సంస్థగా పనిచేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు హాని చేసే మనీలాండరింగ్, ఉగ్రవాదులకు ఫైనాన్సింగ్, ఇతర సమస్యలపై పోరాడటమే ఈ సంస్థ ఎజెండా. ఎఫ్ఏటీఎఫ్ వ్యూహాత్మక ప్రాధాన్యతలకు సీతారామన్ మద్దతు పలికారు. మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, సామూహిక హననానికి దారితీసే ఆయుధాలకు ఫైనాన్సింగ్‌ను అడ్డుకోవడం కోసం.. ప్రపంచకూటమిగా ఎఫ్ఏటీఎఫ్ చేస్తున్న కృషికి వనరులను సమకూరుస్తామన్నారు. అమెరికన్ కంపెనీల సీఈవోలతో భేటీ తన పర్యటనలో భాగంగా మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికాకు చెందిన అంతర్జాతీయ సంస్థలు ఫెడ్ఎక్స్, మాస్టర్‌కార్డ్ సీఈవోలతో భేటీ అయ్యారు. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత్‌లో వ్యాపార అవకాశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. భారత్ మార్కెట్ పట్ల ఎంతో సానుకూలంగా ఉన్నామని, నైపుణ్య శిక్షణ సహా పెద్ద ఎత్తున విస్తరణ ప్రణాళికలు ఉన్నట్టు ఫెడ్ఎక్స్ ప్రెసిడెంట్, సీఈవోగా నియమితులైన రాజ్ సుబ్రమణ్యం తెలిపారు. భారత్‌లో పరిశోధన అభివృద్ధి కేంద్రాలను (ఆర్అండ్డీ) ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు సుబ్రమణ్యం తెలిపారు. మౌలిక సదుపాయాలు, రవాణా వ్యయాలు తగ్గించేందుకు రూ. 100 లక్షల కోట్లతో కూడిన నేషనల్ మాస్టర్‌ప్లాన్‌ను ప్రధాని గతేడాది ప్రారంభించడం గమనార్హం. యాక్సెంచర్ చీఫ్ జూలీ స్వీట్, మాస్టర్ కార్డ్ సీఈవో మిబాచ్ మైకేల్, డెలాయిట్ సీఈవో పునీత్ రంజన్‌తోనూ సీతారామన్ సమావేశమయ్యారు. చదవండి👉🏼 ప్రైవేటీకరణకు ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ఆర్ధిక శాఖ కీలక ఆదేశాలు! -
మనీ లాండరింగ్ కేసులో ఆ హీరోకు బెయిల్..
Special Court Grants Bail To Sachin Joshi In Money Laundering Case: 'మౌనమేలనోయి' సినిమాతో 2002లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు వ్యాపారవేత్త సచిన్ జోషి. ఆ తర్వాత ఒరేయ్ పండు, నిను చూడక నేనుండలేను, జాక్‌పాట్, నీ జతగా నేనుండాలి లాంటి సినిమాల్లో నటించాడు. చివరగా 2017లో వీడెవడు సినిమాలో కనిపించాడు.సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌తోనూ సచిన్ సుపరిచితుడే. ఇవే కాకుండా పలు బాలీవుడ్ చిత్రాల్లోనూ అలరించాడు సచిన్ జోషి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 (పీఎంఎల్ఏ) కింద 2021 ఫిబ్రవరి 14న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు కింద మొత్తం రూ. 410 కోట్ల బ్యాంకు నిధులను స్వాహా చేయడం, మళ్లించడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు సచిన్. తాజాగా ఈ కేసులో సచిన్ జోషికి ప్రత్యేక (పీఎంఎల్ఏ) కోర్టు సోమవారం (మార్చి 7) షరతులతో కూడిన బెయిల్ మంజూర్ చేసింది. రూ. 30 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు అంతే మొత్తంలో ఇద్దరికి షూరిటీతో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంజీ దేశ్ పాండే రెగ్యులర్ బెయిల్ దరఖాస్తుని ఆమోదించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ భారతదేశం విడిచిపెట్టి వెళ్లరాదని, అలాగే పాస్‌పోర్ట్‌ను ఈడీ అధికారులకు సమర్పించాలని ఆదేశించారు. దీంతోపాటు కేసు విచారణకు విఘాతం కలిగించే చర్యలకు, నేర ప్రక్రియకు సంబంధించిన ఎలాంటి కార్యకలామాల్లో పాల్గొనద్దని పేర్కొంది. -
బాలీవుడ్ భామకి గిఫ్ట్‌గా రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పిల్లి
బాలీవుడ్ భామ, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసు విచారణ ఎదర్కొంటూ జైలులో ఉన్న నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌కు సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె వాటిని కొట్టిపారేసింది. అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే ఇటీవల అతనితో దిగిన ఫోటో బయటకు రావడంతో ఈ అమ్మడు చుట్టూ ఉచ్చు బిగిసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ శ్రీలంక బ్యూటీపై మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. సుఖేష్ నుంచి జాక్వెలిన్ కోట్ల రూపాయల బహుమతి పొందినట్లు ఈడీ విచారణలో తేలిందట. అందులో రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పెర్షియన్ పిల్లితో పాటు దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సుఖేష్ భార్య లీనా పౌల్‌తో కూడా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. జాక్వెలిన్‌తో పాటు మరో హీరోయిన్ నోరా ఫతేహీనికి కూడా సుఖేష్ భారీ బహుమతులు ఇచ్చాడట. ఆమెకు ఒక బీఎండబ్ల్యూ కారు, ఐఫోన్‌తో పాటు మొత్తంగా రూ.కోటి విలువైన గిఫ్టులు ఇచ్చాడని సమాచారం.ప్రస్తుతం ఈ బహుమతుల ఇష్యూ బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. -
క్రిప్టోలతో మనీలాండరింగ్ భయాలు - ఆర్బీఐ మాజీ గవర్నర్ ఆందోళన
ముంబై: క్రిప్టో కరెన్సీల వేల్యుయేషన్‌పై స్పష్టత లేకపోవడం, మనీలాండరింగ్ అవకాశాలు ఉండటం వంటి అంశాలే వీటికి సంబంధించి సెంట్రల్ బ్యాంకుల్లో నెలకొన్న ప్రాథమిక అందోళనలని ఆర్బీఐ మాజీ డిప్యుటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. ఒకవేళ ప్రభుత్వం గానీ వీటిని అనుమతిస్తే బ్యాంకర్లు ఆచి తూచి వ్యవహరించాలని ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన సూచించారు. విశ్వనాథన్ సూచనలు క్రిప్టో ఆస్తులను బట్టి వ్యక్తుల సంపదను లెక్కగట్టొద్దని పేర్కొన్నారు. క్రిప్టో అసెట్స్‌ను తనఖా పెట్టకపోయినా.. వాటి విలువ ఆధారంగా రుణాలు ఇవ్వరాదని తెలిపారు. క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన బిల్లును నవంబర్ 29న ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్న నేపథ్యంలో విశ్వనాథన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే క్రిప్టో కరెన్సీల విషయంలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ఆందోళన చెందుతుంటే.. ప్రభుత్వాలు మాత్రం వీటివైపు ఎందుకు మొగ్గు చూపుతున్నాయో తెలియడం లేదని విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. చదవండి: క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ..! -
మనీలాండరింగ్ కేసులో రూ.18.67 కోట్లు జప్తు
సాక్షి, న్యూఢిల్లీ/ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు) : నాలుగేళ్ల కిందట విశాఖలోని ఓ వాణిజ్య సంస్థకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు చేపట్టింది. కుంభకోణంతో సంబంధమున్న వ్యక్తులకు చెందిన రూ.18.67 కోట్లు విలువచేసే ఆస్తులను జప్తు చేసింది. ‘కాకా’ గ్రూపునకు చెందిన రూ.16.97 కోట్లు, శశి గోయెల్‌కు చెందిన రూ.1.50 కోట్లు, ప్రగతి ప్రింట్‌ప్యాక్ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన రూ.20 లక్షలను జప్తుచేసినట్లు ఈడీ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. జప్తు చేసిన ఆస్తుల్లో వ్యవసాయ భూములతో పాటు వాణిజ్య స్థలాలు, ప్లాట్లు, స్థిర డిపాజిట్లు ఉన్నాయి. 2017లో హవాలా కుంభకోణం సమాచారంతో వడ్డి మహేష్ అనే వ్యక్తిని విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టుచేశారు. అనంతరం ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. పలువురు షెల్ కంపెనీలు సృష్టించి మనీలాండరింగ్ ద్వారా విదేశాలకు రూ.1,500 కోట్ల నగదు తరలించినట్లు ఈ కేసులో ప్రధాన అభియోగం. వడ్డి మహేష్ సమాచారంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈడీ దర్యాప్తు చేసి రెండు చార్జిషీట్లు వేసింది. గతంలో శశి గోయెల్ భర్త బీకే గోయెల్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించి గత ఏడాది సెప్టెంబర్ 3న అరెస్టు చేసింది. అంతకుముందు.. బీకే గోయెల్ అల్లుడు ఆయుష్ గోయెల్, యునైటెడ్ హిల్ (చైనా)కు చెందిన దీపక్ గోయెల్‌ను కూడా ఈడీ అరెస్టు చేయగా ప్రస్తుతం వారు బెయిల్‌పై ఉన్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ తెలిపింది. -
మనీలాండరింగ్ కేసు: మాజీ పోలీసు అధికారికి ఈడీ సమన్లు..
ముంబై: మహరాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై మనీలాండరింగ్ వివాదంలో గతంలోనే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఇదే కేసులో ఈడీ ముంబై మాజీ పోలీసు అధికారి పరమ్‌బీర్ సింగ్‌కు సమన్లను జారీ చేసింది. కాగా, అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రిగా ఉన్నప్పుడు పబ్‌లు, రెస్టారెంట్ల నుంచి నెలకు 100 కోట్ల రూపాయలు వసూలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారని పరమ్ బీర్ సింగ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పరమ్ బీర్ సింగ్ మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రెకు రాసిన లేఖ అప్పట్లో పెద్ద దుమారాన్నిరేపింది. దీంతో గత మార్చిలో అనిల్ దేశ్‌ముఖ్‌పై కేసు నమోదయ్యింది. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ.. బాంబె హైకోర్ట్ ఆదేశాల ప్రకారం, పరమ్ బీర్ సింగ్‌పై కూడా మనీలాండరింగ్ కేసుతో ఆరోపణల నేపథ్యంలో సమన్లు జారీచేశామని తెలిపింది. ఇప్పడికే ఈడీ నోటిసులను జారీ చేసి వారం గడిచింది. అయితే, అనారోగ్యం కారణంగా మరికొంత సమయం కావాలని పరమ్ బీర్ సింగ్ కోరినట్టు సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే, బాంబె కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి బలమైన ఆధారాలు లభించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. అలాగే ముంబై, నాగపూర్‌లో అనిల్ దేశ్‌ముఖ్ నివాసంలో, బంధువులు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. అదే విధంగా ఆయన వ్యక్తిగత సహాయకుడి నివాసంలోనూ సోదాలు నిర్వహించామని సీబీఐ అధికారులు తెలిపారు. -
భారత్‌కు నీరవ్ మోదీ అప్పగింత!
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు రూ.13,000 కోట్ల మేర మోసగించిన కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(50)ని భారత్‌కు రప్పించేందుకు దాదాపు రంగం సిద్ధమయ్యింది. అతడిని భారత్‌కు అప్పగించేందుకు యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అప్పగింత ఉత్తర్వుపై యునైటెడ్ కింగ్డమ్ హోంశాఖ మంత్రి(సెక్రెటరీ) ప్రీతి పటేల్ సంతకం చేసినట్లు యూకేలోని భారత రాయబార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణాలకు సంబంధించి మోసం, మనీలాండరింగ్ కేసులు నీరవ్ మోదీపై నమోదయ్యాయి. ఆయన ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నారు. హోంశాఖ సెక్రెటరీ జారీ చేసిన తాజా ఉత్తర్వుకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి కోరడానికి నీరవ్ మోదీకి 14 రోజుల గడువు ఇచ్చారు. ఆధారాల పట్ల కోర్టు సంతృప్తి నీరవ్ మోదీ తన మామ మెహుల్ చోక్సీతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించినట్లు ఇండియాలో కేసులు నమోదయ్యాయని, అతడు ఇండియాలోని న్యాయస్థానాలకు సమాధానం చెప్పుకోవాలని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరి 25న స్పష్టం చేసింది. నీరవ్‌పై నమోదైన కేసుల విషయంలో ఇండియాలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగదనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. నీరవ్‌ను భారత్ అప్పగించే విషయంలో నిర్ణయాన్ని హోంశాఖకు వదిలేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఇండియాలో అయితే సరైన వైద్యం అందదన్న నీరవ్ వాదనను న్యాయస్థానం కొట్టిపారేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ నిందితుడని చెప్పేందుకు ఉన్న ఆధారాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. మనీ లాండరింగ్, సాక్షులను బెదిరించడం, ఆధారాలను మాయం చేయడం తదితర అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదు చేసిన కేసుల్లో నీరవ్ మోదీ నిందితుడని స్పష్టంగా బయటపడుతోందని గుర్తుచేసింది. అందుకే బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తెలియజేసింది. యూకే అప్పగింత చట్టం–2003 ప్రకారం.. న్యాయమూర్తి తన అభిప్రాయాన్ని హోంశాఖ సెక్రెటరీకి తెలియజేస్తారు. ఇండియా–యూకే మధ్య కుదిరిన నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని పర్యవేక్షించే అధికారం ఉన్న యూకే కేబినెట్ మంత్రి దీనిపై రెండు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనిప్రకారమే నీరవ్ మోదీ అప్పగింతకు హోంశాఖ మంత్రి ప్రీతి సుముఖత వ్యక్తం చేశారు. అప్పగింత ఎప్పుడు? నీరవ్ మోదీని వాండ్స్‌వర్త్ జైలు నుంచి ముంబైలోని ఆర్థర్ రోడ్ కారాగారంలో ఉన్న 12వ నంబర్ బ్యారక్‌కు తరలించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. యూకే హోంమంత్రి ఉత్తర్వులను సవాలు చేస్తూ లండన్ హైకోర్టును ఆశ్రయించేందుకు నీరవ్ మోదీకి అవకాశం కల్పించారు. ఆయన ఒకవేళ హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడే మరికొంత కాలం విచారణ జరుగనుంది. యూకే సుప్రీంకోర్టులో కూడా నీరవ్‌మోదీ అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుందని సమాచారం. అయితే, లండన్ హైకోర్టు అనుమతిస్తేనే అది సాధ్యమవుతుంది. తాజా పరిణామాలపై నీరవ్ మోదీ లీగల్ టీమ్ ఇంకా స్పందించలేదు. హైకోర్టుకు వెళ్తారా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. యూకేలో అన్ని దారులు మూసుకుపోయిన తర్వాతే నీరవ్ మోదీ భారత్‌కు చేరుకుంటారు. అసలేమిటి కేసు? నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీతోపాటు మరికొందరు లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్‌ను (ఎల్ఓయూ) దుర్వినియోగం చేశారని పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ 2018 జనవరి 31న నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీతోపాటు ఇతరులపై కేసు నమోదు చేసింది. ఎల్ఓయూ అంటే తమ ఖాతాదారులకు విదేశాల్లోని తమ బ్యాంకుశాఖల నుంచి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు జారీ చేసే గ్యారంటీ పత్రం. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇచ్చిన ఎల్‌ఓయూతో నీరవ్ మోదీ ముఠా వివిధ కంపెనీల పేరిట విదేశాల్లోని పీఎన్బీ బ్యాంక్ శాఖల నుంచి రూ.13,000 కోట్లకుపైగా రుణాలుగా తీసుకొని, తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఈ కేసులో సీబీఐ 2018 మే 14న నీరవ్‌తోసహా మొత్తం 25 మంది నిందితులపై మొదటి చార్జిసీట్ కోర్టులో దాఖలు చేసింది. 2019 డిసెంబర్ 20న 30 మందిపై రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. మొదటి చార్జిషీట్లో ఉన్నవారంతా రెండో చార్జిషీట్లోనూ ఉన్నారు. బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును నీరవ్ మోదీ ముఠా దుబాయ్, హాంకాంగ్‌లోని తమ డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ముత్యాల ఎగుమతి, దిగుమతుల పేరిట ఈ సొమ్మును దారిమళ్లించారు. నీరవ్ మోదీ 2018 జనవరి 1న ఇండియా నుంచి తప్పించుకున్నాడు. ట్రయల్ కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2018 జూన్‌లో ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. 2019 మార్చిలో యూకే పోలీసులు నీరవ్ మోదీని లండన్‌లో అరెస్టు చేశారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ అతడు పలుమార్లు దాఖలు చేసిన పిటిషన్లను వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు, లండన్ హైకోర్టు కొట్టివేశాయి. నీరవ్ మోదీని తమకు అప్పగించాలంటూ భారత ప్రభుత్వం యూకేను అభ్యర్థించింది. -
నీరవ్ మోదీ అప్పగింతకు బ్రిటన్ గ్రీన్ సిగ్నల్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ఆమోదం తెలిపారు. దీనికి సంబందించిన ఉత్తర్వులపై యుకె హోంశాఖ కార్యదర్శి ఈ రోజు సంతకం చేశారు. 50 ఏళ్ల నీరవ్ మోడీకి చివరగా యుకె హైకోర్టు ముందు 28 రోజుల్లోగా చట్టబద్ధంగా సవాలు చేసే అవకాశం ఉంది. గతంలో విజయ్ మాల్యా 2019 ఫిబ్రవరిలో బ్రిటన్ ప్రభుత్వం తన అప్పగించే ఉత్తర్వులపై సంతకం చేసిన తర్వాత కోర్టుకు వెళ్లారు. రూ.14,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) కుంభకోణం, మనీలాండరింగ్ కోసం నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని యూకే, భారత్‌కి అప్పగిస్తుండడంతో నీరవ్ మోదీ కోసం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ప్రత్యేక సెల్‌ని సిద్ధం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. గతంలో కరోనా మహమ్మారితో నీరవ్ మోదీ మానసిక ఆరోగ్యం బాగాలేదని, భారత్ లో మానవ హక్కల ఉల్లంఘనను సాకుగా చూపిన ఆయన తరపు అడ్వకేట్ల వాదననూ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇక నీరవ్ కు ఆర్ధర్ రోడ్డు జైలులో బ్యారక్ నెంబర్ 12లో అన్ని సదుపాయాలు కల్పిస్తామని భారత్ హామీ ఇచ్చిందని జడ్జ్ గూజీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, నీరవ్ మోదీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ఆమోదముద్ర వేశారని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. -
పీఎఫ్ఐ కార్యాలయాల్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: నగదు అక్రమ రవాణా ఆరోపణలకు సంబంధించి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కు చెందిన 26 కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం సోదాలు నిర్వహించింది. దాదాపు 9 రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి. పీఎఫ్ఐ చైర్మన్ ఓఎం అబ్దుల్ సలాం, కేరళ రాష్ట్ర పీఎఫ్ఐ చీఫ్ నసారుద్దీన్ ఎల్మరామ్, పీఎఫ్ఐ జాతీయ కార్యదర్శి అబ్దుల్ వాహిద్‌ల నివాసాలు, కార్యాలయాల్లోనూ సోదాలు జరిపారు. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఆందోళనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ దాడులు చేశారని పీఎఫ్ఐ పేర్కొంది. చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముర్షీదాబాద్, లక్నో, ఔరంగాబాద్, జైపూర్, కొచ్చి, మలప్పురం తదితర నగరాలతోపాటు ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో దాడులు చేసింది. నగదు అక్రమ రవాణా కేసుకు సంబంధించి సాక్ష్యాలను సంపాదించేందుకు సోదాలు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలకు ఆర్థిక సాయం అందించారన్న ఆరోపణలతో పీఎఫ్ఐ ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. కేరళ గోల్డ్ స్మగ్లింగ్, బెంగళూరులో పోలీస్ స్టేషన్లపై దాడి, హాథ్రస్ హత్యాచారం తరువాత నిధుల లావాదేవీలు.. తదితర నేరాల వెనుక పీఎఫ్ఐ హస్తం ఉందన్న ఆరోపణలపై కూడా ఈడీ విచారణ చేస్తోంది. -
అతిపెద్ద హవాలా రాకెట్ గుట్టురట్టు
న్యూఢిల్లీ : అతిపెద్ద హవాలా అక్రమ డబ్బు లావావేవీలు చేస్తున్న ఢిల్లీకి చెందిన డీలర్ నరేష్ జైన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో దాదాపు 20 వేల కోట్ల లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి నరేష్ జైన్‌ను కోర్టు ముందు హాజరుపరుస్తామని తెలిపారు. దేశంలోనే ఇది అతిపెద్ద హవాలా, మనీ లాండరింగ్ కేసుల్లో ఒకటిగా తెలుస్తోంది. (వ్యాక్సిన్ హోప్- యూఎస్ దూకుడు) షెల్ కంపెనీలు ఏర్పాటుచేసి పలు విదేశీ వ్యాపారాలతో సహా అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మరికొంత మంది నిందితుల వివరాలు త్వరలోనే బయటపెడతామన్నారు. గత కొన్నాళ్లుగా నరేష్ జైన్ పలు సంస్థలకు అక్రమంగా హవాలా డబ్బును మళ్లించినట్లు గుర్తించారు. గతంలోనూ ఇతనిపై ఈడీ సహా పలు కేసులు ఉన్నాయి. బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసి వేల కోట్లు రూపాయలను విదేశాలకు దారి మళ్లించినట్లు 2016లో ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులోనూ ప్రధానంగా నరేష్ జైనే ఉన్నాడని, మరికొంత మంది వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. (ప్రధాని మోదీ ట్విటర్ ఖాతా హ్యాక్!) -
భారత్‌కు మాల్యా.. 28 రోజుల్లో
లండన్: వ్యాపార వేత్త, బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేసి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యా (64) న్యాయపరమైన పోరాటంలో చివరి అవకాశాన్ని కూడా కోల్పోయారు. దీంతో ఆయన్ను భారత్‌కు అప్పగించడం దాదాపుగా ఖరారైపోయినట్టే. ఈ ప్రక్రియ గరిష్టంగా 28–30 రోజుల్లోపు పూర్తికానుంది. బ్రిటన్ హోంమంత్రి ఆమోదం తర్వాత మాల్యాను భారత్‌కు అప్పగించే ప్రక్రియను పూర్తి చేస్తారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడడం, ఎయిర్‌లైన్స్ సంస్థ తరఫున తీసుకున్న సుమారు రూ.9,000 కోట్ల రుణాలను చెల్లించకపోవడంతో.. మాల్యాపై మనీలాండరింగ్, మోసపూరిత అభియోగాలతో భారత దర్యాప్తు సంస్థలు (సీబీఐ, ఈడీ) బ్రిటన్‌లో న్యాయపరమైన చర్యలను చేపట్టాయి. ‘బ్రిటన్–భారత్ మధ్య అప్పగింత ఒప్పందం’ కింద మాల్యాను తమకు అప్పగించాలని కోరాయి. ఇందుకు అనుకూలంగా వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు 2018 డిసెంబర్లోనే ఆదేశాలు వెలువరించింది. ఈ ఆదేశాలను బ్రిటన్ హైకోర్టు సమర్థించగా.. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు మాల్యాకు 14 రోజుల గడువు ఉంది. అయితే, సుప్రీంకోర్టులో అప్పీల్ కోసం అనుమతించాలన్న ఆయన దరఖాస్తును తాజాగా లండన్ హైకోర్టు కొట్టివేసింది. సాధారణ ప్రజా ప్రాముఖ్యత కోణంలో సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చన్న న్యాయపరమైన అంశాన్ని ధ్రువీకరించేందుకు తిరస్కరిస్తున్నట్టు లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ ధర్మాసనం స్పష్టం చేసింది. యూకే ఎక్స్ట్రాడిషన్ యాక్ట్ 2003 చట్టంలోని సెక్షన్ 36, సెక్షన్ 116 కింద అప్పగింత ప్రక్రియను నిర్ధేశించిన 28 రోజుల్లోపు పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. పెద్ద ఎత్తున బ్యాంకులకు రుణాలను ఎగవేసిన వ్యాపారవేత్తలను విదేశాలకు పారిపోనిచ్చారంటూ మోదీ సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఒక్క చాన్స్! అయితే, ఒక్క అవకాశం మాత్రం మాల్యాకు మిగిలి ఉంది. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ çహ్యూమన్‌రైట్స్ (ఈసీహెచ్ఆర్)ను ఆశ్రయించొచ్చు. పారదర్శక విచారణ లభించలేదంటూ యూరోపియన్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ రైట్స్‌లోని ఆర్టికల్ 3 కింద అప్పగింతను నిరోధించాలంటూ కోరొచ్చు. అయితే, ఈసీహెచ్ఆర్లో అప్పీల్ కు అవకాశాలు చాలా తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. ఇవే అంశాల ఆధారంగా ఇప్పటికే కోర్టుల్లో వాదనలు వీగిపోవడాన్ని పేర్కొంటున్నారు. రుణాలు చెల్లించేస్తా.. వదిలిపెట్టండి ఓటమిని గుర్తించిన మాల్యా మరోసారి రుణాలన్నింటినీ తిరిగి చెల్లిస్తానని, వాటిని తీసుకుని తనపై ఉన్న కేసును మూసేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘‘కరోనా ప్యాకేజీ కోసం భారత ప్రభుత్వం నచ్చినంత నగదును ముద్రించుకోగలరు. కానీ, ప్రభుత్వ బ్యాంకులకు చెల్లించాల్సిన నూరు శాతాన్ని తిరిగి చెల్లించేస్తానంటున్న నా విన్నపాన్ని అదే పనిగా విస్మరిస్తున్నారు. ఎటువంటి షరతుల్లేకుండా నా నుంచి డబ్బులు తీసుకోండి. కేసును క్లోజ్ చేయండి’’ అంటూ విజయ్‌మాల్యా ట్వీట్ చేశారు. తదుపరి ఏమిటి..? ► విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించిన తర్వాత దర్యాప్తు సంస్థలు ఆయన్ను ఇక్కడి కోర్టుల్లో ప్రవేశపెట్టి విచారణ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. ► ముంబైలోని ఆర్ధర్‌రోడ్డు జైలులో బరాక్ 12లో ఆయన్ను పూర్తి స్థాయి వైద్య సదుపాయాలతో ఉంచుతామని దర్యాప్తు సంస్థలు లోగడే బ్రిటన్ కోర్టులకు తెలియజేశాయి. ► విజయ్‌మాల్యా 2016 మార్చిలో బ్రిటన్‌కు వెళ్లిపోయారు. దీంతో ఆయన్ను పారిపోయినట్టు భారత్ ప్రకటించింది. ► 2017లో ఏప్రిల్ 18న అప్పగింత వారెంట్‌పై ఆయన్ను అరెస్ట్ చేయగా, బెయిల్‌పై బయట ఉన్నారు. ► 2018 డిసెంబర్లో చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టు అప్పగింతకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. ► దీన్ని 2020 ఏప్రిల్‌లో బ్రిటన్ హైకోర్టు సమర్థించింది. దీనిపై అప్పీల్ చేసుకునేందుకు తాజాగా అనుమతించలేదు. -
తబ్లిగీ జమాత్ చీఫ్‌కు ఐదోసారి నోటీసులు
న్యూఢిల్లీ : తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ నుంచి సరైన సమాధానం రానుందున ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు ఐదోసారి నోటీసులు జారీ చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో తబ్లిగీ జమాత్ కార్యక్రమాన్ని లాక్ డౌన్ నిబంధనలకు విరుద్దంగా నిర్వహించడంపై మౌలానా సాద్‌పై కేసు నమోదైన విషయం విదితమే. ఇప్పటికే సాద్‌పై ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 కింద కేసులు నమోదు చేయడంతో పాటు.. తబ్లీగ్ జమాత్‌కు విదేశాల నుంచి మనీలాండరింగ్ నిబంధనలు ఉల్లంఘించి హవాలా ద్వారా విరాళాలు సేకరించారని ఆరోపిస్తూ ఈడీ అధికారులు కూడా కేసులు నమోదు చేశారు. గల్ఫ్ దేశాల నుంచి ఢిల్లీలోని తబ్లీగ్ జమాత్ పెద్దల ఖాతాల్లోకి కోట్లాదిరూపాయల నిధులు వచ్చాయని ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసుల దర్యాప్తులో తేలడం సంచలనం రేపింది. నిజాముద్దీన్ మర్కజ్ చీఫ్ మౌలానా సాద్ తోపాటు అతని సన్నిహితుల ఖాతాల్లోకి గల్ఫ్ దేశాల నుంచి నిధులు వచ్చాయని తేలింది. జమాత్ చీఫ్ మౌలానా సాద్, అతని సన్నిహితుల బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిన కోట్లాదిరూపాయల నగదు వివరాలను ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు సమాచారం అందించారు. మౌలానా సాద్ తోపాటు అతని ముగ్గురు కుమారులు, మేనల్లుడి ఖాతాల్లోకి గల్ఫ్ డబ్బు వచ్చిందని సమాచారం. వీరిని ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు ఇప్పటికే విచారించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు పంపిన నోటీసులకు మౌలానా సాద్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేశారు. -
తబ్లిగీ నేతపై ఈడీ కేసు
న్యూఢిల్లీ: తబ్లిగీ జమాత్ నేత మౌలానా సాద్ కంధాల్వీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మేరకు కంధాల్వీతోపాటు అతనితో సంబంధమున్న ట్రస్టులు, మరికొందరు వ్యక్తులపైనా ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్) నమోదు చేసినట్లు గురువారం అధికారులు వెల్లడించారు. గత కొంతకాలంగా తబ్లిగీ జమాత్, ఆ సంస్థ ఆఫీస్ బేరర్లు నిర్వహించిన లావాదేవీలు, వారి ఆర్థిక వ్యవహారాలపై బ్యాంకులు, నిఘా విభాగాలు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలో కంధాల్వీకి సమన్లు జారీ చేసి, విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం సాద్ సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు. -
బ్యాంకులకు రూ.1,768 కోట్ల టోకరా
సాక్షి, హైదరాబాద్: తప్పుడు పత్రాలతో బ్యాంకులను రూ.1,768 కోట్ల మేర మోసం చేసిన లియో మెరీడియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ హోటల్స్ లిమిటెడ్ (ఎల్ఎమ్ఐపీహెచ్ఎల్) కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. సంస్థ ప్రమోటర్ జీఎస్ చక్రవర్తి రాజు, అతని ప్రధాన అనుచరుడు ఏవీ ప్రసాద్‌లను ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ (పీఎమ్ఎల్ఏ) చట్టం 2002 ప్రకారం అరెస్టు చేసినట్లు బుధవారం ఈడీ ప్రకటించింది. పీఎమ్ఎల్ఏ ప్రత్యేక జడ్జి వీరిద్దరికి ఏడు రోజుల కస్టడీ విధించారు. జీఎస్సీ రాజు, అతని బంధువులు, డైరెక్టర్లు, బినామీల పేర్ల మీద ఉన్న రూ.250.39 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బ్యాంకుల మోసంలో గతంలోనే బెంగళూరు సీబీఐ నమోదు చేసిన మూడు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ప్రస్తుత పీఎంఎల్ఏ కేసులో ముందుకు సాగుతోంది. కుట్ర జరిగిందిలా..! ఈడీ అధికారుల వివరాల ప్రకారం.. మొత్తం కుట్రకు జీఎస్సీ రాజు సూత్రధారి. తొలుత ఒక అక్రమ లేఅవుట్‌ను క్రియేట్ చేసి దాన్ని ప్లాట్లుగా మార్చి 315 మందికి విక్రయించారు. రిసార్ట్ ప్రాజెక్టు కోసమని చెప్పి.. ఆ లేఅవుట్లో విక్రయించిన ప్లాట్లనే బ్యాంకుల్లో కుదవపెట్టాడు. ఈ జాబితాలో అప్రోచ్ రోడ్లు ఉండటం గమనార్హం. ఈ విషయం బ్యాంకు అధికారులు గుర్తించకుండా రెవెన్యూ రికార్డులు సైతం ట్యాంపర్ చేశాడు. ఈ విషయం ప్లాట్ల ఓనర్లకు కూడా తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. అనంతరం 33 షెల్ కంపెనీలను సృష్టించాడు. వాటితో ఎల్ఎమ్ఐ పీహెచ్ఎల్లోకి రూ.372 కోట్లు నిధులు మళ్లించినట్లు చూపాడు. ఇందుకోసం కోల్‌కతాకు చెందిన ‘జమా ఖరచ్’అనే కంపెనీని వాడుకున్నాడు. తమ కంపెనీ ద్వారా చేపడుతున్న ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చూపించి, వివిధ బ్యాంకుల వద్ద రూ.1,768 కోట్లు (ఇందులో బ్యాంకుల కన్సార్టియం వద్ద రూ.700 కోట్లు) రుణంగా పొందాడు. తర్వాత మరో 40 డొల్ల కంపెనీలను సృష్టించి బోగస్ బిల్లులు, ఇన్వాయిస్లతో భారీ నిధులను దారి మళ్లించాడు. ఇప్పటిదాకా దారి మళ్లించిన నిధుల్లో రూ.182 కోట్ల లావాదేవీల ఆధారాలను ఈడీ గుర్తించింది. మొత్తానికి ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా జీఎస్సీ రాజు అతని కుటుంబ సభ్యులు 95 శాతం వ్యాపారానికి యజమానులుగా మారారు. అన్ని కోట్ల వ్యాపారానికి నో బ్యాలెన్స్ షీట్ ఈడీ అధికారుల బృందం దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. రూ.1,768 కోట్ల వ్యాపారానికి ఇంతవరకూ ఎలాంటి బ్యాలెన్స్ షీట్ కూడా నిర్వహించకపోవడం గమనార్హం. వారు ఏ ప్రాజెక్టు చేపట్టారు? ఎన్ని నిర్మాణాలు జరిపారు? అన్న విషయాలపై కనీసం ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు. దీంతో జీఎస్ఆర్ రాజు బ్యాంకులకు తిరిగి చెల్లించే ఉద్దేశం లేకుండానే.. కేవలం ఎగవేతనే లక్ష్యంగా రుణాలు తీసుకున్నట్లు స్పష్టమైంది. వీరు కుదవపెట్టిన ఆస్తులు కూడా బోగస్ కావడంతో బ్యాంకు అధికారులు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. స్థానికంగా వీరికి పలుకుబడి ఉండటంతో బినామీలపై ఆస్తులను సులువుగా సంపాదించగలిగారు. దర్యాప్తులో 33 షెల్ కంపెనీలు, 44 షెల్ వెండర్ల గుట్టు వీడింది. 3,43,18,948 ప్రమోటర్ల షేర్లలో 76,62,434 షేర్లు బినామీల పేర్లపై ఉన్నాయని గుర్తించారు. జీఎస్సీ రాజు అతని కుటుంబ సభ్యుల పేరిట 11 స్థిరాస్తులు, అతని బినామీలపై మరో 38 స్థిరాస్తులను అధికారులు గుర్తించారు. వీటి మొత్తం విలువ రూ.250.39 కోట్లుగా లెక్కగట్టారు. ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ కేసులో మరిన్ని వాస్తవాలు తవ్వితీసే పనిలో ఉన్నారు. -
వడ్డీ వ్యాపారి బతకనివ్వట్లేదు!
సాక్షి, అమరావతిబ్యూరో: ‘పండూ.. వాడు పోలీసుల్ని కూడా కొనేశాడు. మనకిక న్యాయం జరగదు. బతకాలని ఉన్నా.. బతకనివ్వట్లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నన్ను క్షమించు..’ అంటూ ఓ యువకుడు తన భార్యకు సెల్ఫీ వీడియో పంపించి బకింగ్‌హామ్ కెనాల్లో దూకిన ఘటన విజయవాడలో కలకలం రేపింది అతడి మృతదేహం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాలువ వెంబడి గాలింపు చర్యలు చేపట్టగా.. ఆదివారం రాత్రి వరకు ఆచూకీ లభించలేదు. వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని పటమటకు చెందిన ప్రేమ్‌కుమార్, అతని సోదరి జ్యోతి కలిసి ఇద్దరి ఇళ్లను అదే ప్రాంతానికి చెందిన కాసుల వెంకట రంగారావు అనే వడ్డీ వ్యాపారి వద్ద తనఖా పెట్టి 2017వ సంవత్సరంలో రూ.6 లక్షలు అప్పుగా తీసుకున్నారు. మొదట్లో రూ.3 వడ్డీ అని చెప్పిన రంగారావు.. ఆ తర్వాత వడ్డీ రేటును రూ.10కి పెంచాడు. ప్రేమ్‌కుమార్, జ్యోతి వడ్డీ మొత్తంతోపాటు అసలు మొత్తంలో రూ.5 లక్షలు చెల్లించేశారు. చివరకు రూ.లక్ష అప్పు ఉండగా.. దానిని కూడా త్వరలో చెల్లిస్తామని, ఈలోపు తమ ఇళ్లకు సంబంధించిన పత్రాలు తిరిగివ్వాలని రంగారావును కోరగా.. ఇంకా రూ.16 లక్షలు బకాయి ఉన్నారని, ఆ మొత్తం చెల్లిస్తేనే పత్రాలిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇదే విషయాన్ని ప్రేమ్‌కుమార్ ఈ నెల 16న స్పందన కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన సీపీ ద్వారకా తిరుమలరావు ఆ ఫిర్యాదు పరిష్కరించాలని పటమట పోలీసులకు ఆదేశాలిచ్చారు. ఫలితం లేకపోవడంతో ప్రేమ్‌కుమార్ 23వ తేదీన మరోసారి స్పందనలో సీపీకి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత వడ్డీ వ్యాపారి ప్రేమ్‌కుమార్‌పై కిరాయి గుండాలతో దాడి చేయించాడు. ఈ విషయాన్ని కూడా స్థానిక పోలీసులకు చెప్పినా పట్టించుకోవట్లేదని ప్రేమ్‌కుమార్ కుటుంబ సభ్యులతో చెప్పాడు. ఇక ఎక్కడికి వెళ్లినా తనకు న్యాయం జరగదని ఆవేదన చెందిన అతడు ఈనెల 28న సాయంత్రం తన భార్యకు సెల్ఫీ వీడియో పంపించి బకింగ్‌హామ్ కెనాల్లో దూకేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కాలువలో గాలింపు చేపట్టారు. -
వాళ్లంతా స్వాతంత్ర్య సమరయోధులు కాదు
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరంపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. చిదంబరం బెయిల్ కండీషన్‌ను ఉల్లంఘించారని ఆరోపించారు. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కుంభకోణం, మనీ ల్యాండరింగ్ కేసుల్లో చిదంబరానికి సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 106 రోజుల జైలు జీవితం తర్వాత ఆయన బుధవారం తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించి చిదంబరం మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. (చదవండి : చిదంబరానికి బెయిల్) జైలు నుంచి బయటకు వచ్చిన చిదంబరం ..గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రిగా తన రికార్డు స్వచ్ఛంగా ఉందని చెప్పారు. ‘అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం నాకుంది. మంత్రిగా ఉన్న సమయంలో నేను ఏం చేశానో అందరికీ తెలుసు’ అని చిదంబరం అన్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ జవదేకర్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ చిదంబరం బెయిల్ షరతులను ఉల్లంఘించారని ఆరోపించారు. చిదంబరానికి వ్యతిరేకంగా నమోదైన ఈ కేసు.. కేంద్ర మంత్రిగా ఆయన పని చేసిన కాలంలో అవినీతికి సంబంధించినదేనని గుర్తు చేశారు. అటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రిగా తన రికార్డు స్వచ్ఛంగా ఉందని చెప్పడం బెయిల్ షరతులను ఉల్లంఘించడమేనని ఆరోపించారు. తాను బహిరంగంగా ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వబోనని బెయిల్ తెచ్చుకున్న చిదంబరం .. ఇప్పుడు కేంద్ర మంత్రిగా తన రికార్డు స్వచ్ఛంగా ఉందన్నారని, ఇది స్వీయ ధ్రువపత్రం ఇచ్చుకోవడమేనని జవదేకర్ అన్నారు. ‘కొంతమంది బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతున్నారు. అంతమాత్రనా వాళ్లు స్వాతంత్ర్య సమరయోధులు కాబోరు’ అని పరోక్షంగా కాంగ్రెస్ నాయకులను విమర్శించారు. -
పార్లమెంట్ సమావేశాలకు చిదంబరం
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కుంభకోణం, మనీ ల్యాండరింగ్ కేసుల్లో బెయిల్‌పై విడుదలైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరు అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి చిదంబరం మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. కాగా ఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ ఈ ఏడాది ఆగస్టు 21న చిదంబరాన్నికస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. చదవండి: చిదంబరానికి బెయిల్ -
చిదంబరానికి బెయిల్
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కుంభకోణం, మనీ ల్యాండరింగ్ కేసుల్లో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి ఎట్టకేలకు ఊరట లభించింది. 106 రోజుల జైలు జీవితం తర్వాత ఆయనకు బుధవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీం ఉత్తర్వులు అందిన తర్వాత తీహార్ జైలు గేట్ నంబర్ 3 నుంచి రాత్రి 8.10 గంటలకు చిదంబరం బయటకి వచ్చారు. కుమారుడు కార్తితో పాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వందలాది మంది కార్యకర్తలు జైలు వెలుపల చిదంబరానికి ఘనంగా స్వాగతం పలికారు. జైలు బయట చిదంబరం స్పందన కోసం వేచి చూస్తున్న మీడియా ప్రతినిధులు ఆయనను చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘106 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది‘ అని అన్నారు. ఇన్ని రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించినా తనపై ఒక్క అభియోగం కూడా నమోదు కాలేదని చెప్పారు. అంతకుముందు సుప్రీంకోర్టు చిదంబరానికి బెయిల్ ఇస్తే ఆయన సాక్ష్యాలు తారుమారు చేస్తారన్న ఈడీ వాదనల్ని తోసిపుచ్చింది. ‘చిదంబరం ఇప్పుడు ప్రభుత్వ ప్రతినిధి కాదు, ఆయనకు రాజకీయ అధికారాలు లేవు. సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశమే లేదు’ అని జస్టిస్ ఆర్.భానుమతి ధర్మాసనం పేర్కొంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ ఆగస్టు 21న చిదంబరాన్నికస్టడీలోకి తీసుకుంది. ఆ తర్వాత తీహార్‌జైల్లోనే ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టింది. ఇంటర్వ్యూలు వద్దు: బెయిల్‌పై విడుదలయ్యాక ఈ కేసుకు సంబంధించి చిదంబరం మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. ఈడీ ఎప్పుడు అడిగినా చిదంబరం అందుబాటులో ఉండి విచారణకు సహకరించాలని, ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని ఆదేశాలిచ్చింది. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది: కాంగ్రెస్ చిదంబరానికి బెయిల్ మంజూరు చేయడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని వ్యాఖ్యానించింది. పగ, ప్రతీకారాల కారణంగా చిదంబరం వంద రోజులకుపైగా జైలులో మగ్గిపోయారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నిష్పాక్షికంగా జరిగే విచారణలో చిదంబరం నిర్దోషిత్వం రుజువు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, చిదంబరం ‘బెయిల్ క్లబ్’లో చేరారంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. ఎందరో కాంగ్రెస్ నేతలు బెయిల్‌పై బయట తిరుగుతున్నారని ఆ క్లబ్లో ఇప్పుడు చిదంబరం చేరారంటూ హేళన చేసింది. -
శివకుమార్‌కు బెయిల్
సాక్షి, బెంగళూరు: మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన కర్ణాటక కాంగ్రెస్ మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. సెప్టెంబర్ 3వ తేదీన ఢిల్లీలో సుదీర్ఘ విచారణ అనంతరం ఈడీ ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఢిల్లీ తీహార్ జైల్లో కస్టడీలో ఉన్నారు. బుధవారం ఢిల్లీ హైకోర్టులో ఆయన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది. పాసుపోర్టును అప్పజెప్పడంతో పాటు రూ.25 లక్షల పూచీకత్తు సమర్పించాలని, ఈడీ విచారణకు సహకరించాలని ఆదేశించింది. -
శివకుమార్‌కు 13 వరకు కస్టడీ
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కర్ణాటక సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌ను సెప్టెంబర్ 13 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం రాత్రి అరెస్టు చేసిన శివకుమార్‌ను 14 రోజుల కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరిన నేపథ్యంలో ప్రత్యేక జడ్జి ఈ ఉత్తర్వులిచ్చారు. బుధవారం రామ్మనోహర్ లోహియా ఆస్పత్రిలో పరీక్షల అనంతరం శివకుమార్‌ను ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరిచారు. శివకుమార్ తరఫున వాదిస్తున్న న్యాయవాదులు అభిషేక్‌మను సింఘ్వీ, దయన్ కృష్ణన్ వాదనలు వినిపిస్తూ శివకుమార్ అరెస్టు అన్యాయం అనీ, అతను పరారవుతాడన్న ఈడీ అనుమానాలు నిరాధారమని వాదించారు. శివకుమార్‌ను ఈడీ అరెస్టు చేసినందుకు నిరసనగా బుధవారం కర్ణాటక, ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను ఢిల్లీలోని యువజన కాంగ్రెస్ కార్యాలయం బయట దహనం చేశారు. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ నిరసనలు నిర్వహించింది. ఐదారు బస్సులపై రాళ్ల దాడి జరిగిందని, కనకపుర, బెంగళూరులో బస్సులను తగలబెట్టడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు. -
ఈడీ ముందు హాజరైన డీకే శివకుమార్
బెంగళూరు: మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. బెంగళూరు నుంచి బయలుదేరిన ఆయన ఢిల్లీ ఖాన్ మార్కెట్లోని లోక్ నాయక్ భవన్ ఈడీ ప్రధాన కార్యాలయానికి శుక్రవారం సాయంత్రం చేరుకున్నారు. ‘ఈడీ ఎదుట హాజరవడం నా బాధ్యత. వారు నాకు సమన్లు ఇచ్చారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద వారెందుకు పిలిచారో అర్థం కావడం లేదు. వారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా’ అని శివకుమార్ చెప్పారు. మనీలాండరింగ్ కేసులో హాజరు కావాల్సిందిగా గతంలో ఈడీ సమన్లు జారీ చేయడంతో, వాటిని సవాల్ చేస్తూ శివకుమార్ హైకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. హైకోర్టులో గురువారం ఆయనకు చుక్కెదురవడంతో ఈడీ తాజాగా శుక్రవారం మధ్యాహ్నం కల్లా హాజరు కావాల్సిందిగా ఈడీ సమన్లు జారీ చేసింది. తాను ఈ సమన్లపై న్యాయపరమైన పోరాటం చేస్తానని, కుటుంబ కారణాలు, ఇతర కార్యక్రమాల వల్ల ఈడీ ఎదుట హాజరు కాలేనని ఉదయం చెప్పారు. అయినప్పటికీ తనకు చట్టంమీద గౌరవం ఉందంటూ సాయంత్రం ఆరున్నర గంటలకు ఈడీ ఎదుట హాజరయ్యారు. 2017 గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలను బీజేపీకి దొరక్కుండా బెంగళూరు రిసార్ట్‌లలో దాచడంలో కీలక పాత్ర పోషించినందుకే బీజేపీ ఐటీ, ఈడీ దాడులు జరుపుతోందని ఆరోపించారు. హవాలా మార్గం ద్వారా కోట్ల రూపాయలను బెంగళూరు, ఢిల్లీలలో దాచారని ఆరోపిస్తూ ఏ1గా శివకుమార్‌తో పాటు సచిన్ నారాయణ్, ఆంజనేయ హనుమంతయ్య, ఎన్ రాజేంద్రలపై గతేడాది సెప్టెంబర్‌లో కేసులు నమోదయ్యాయి. వీరు ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగ్గొట్టే కుట్ర పన్నారని ఆదాయపన్ను శాఖ ఆరోపించింది. 2017 ఆగస్టులో శివకుమార్‌కు చెందిన దాదాపు రూ. 20 కోట్ల నల్లధనాన్ని పట్టుకున్నట్లు తెలిపింది. -
చిదంబరం కేసులో 5న సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌పై సెప్టెంబర్ 5న తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. చిదంబరాన్ని ఈడీ అరెస్టు చేయకుండా కల్పించిన తాత్కాలిక రక్షణ గడువును వచ్చే గురువారం వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. వచ్చే సోమవారం వరకు చిదంబరానికి సీబీఐ కస్టడీ కొనసాగుతుందని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని ఈడీని ఆదేశించింది. చిదంబరం అరెస్టు శుభవార్తే: ఇంద్రాణి చిదంబరం అరెస్టుపై ఐఎన్ఎక్స్ మీడియా మాజీ ప్రమోటర్ ఇంద్రాణి ముఖర్జియా స్పందించారు. ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరం అరెస్టు కావడం శుభవార్తే అని వ్యాఖ్యానించారు. తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న ఇంద్రాణిని గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరాన్ని అన్ని వైపుల నుంచి కట్టడి చేశారని అన్నారు. ఇదే కేసులో కార్తీ చిదంబరానికి మంజూరు చేసిన బెయిల్‌ను కూడా రద్దు చేయాలని వ్యాఖ్యానించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇంద్రాణి అప్రూవర్‌గా మారడం తెల్సిందే. -
చిదంబరం సీబీఐ కస్టడీ మరో 4 రోజులు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంను మరో నాలుగు రోజులపాటు విచారించేందుకు ఢిల్లీ స్పెషల్ కోర్టు సీబీఐకి అనుమతించింది. చిదంబరం నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టాల్సి ఉన్నందున కస్టడీని మరో 5రోజులపాటు పొడిగించాలంటూ సీబీఐ విజ్ఞప్తి చేసింది. సీబీఐ వినతి న్యాయబద్ధంగా ఉందన్న స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ ఈ 30వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, ఐఎన్ఎక్స్ మీడియా మనీ ల్యాండరింగ్ కేసులో చిదంబరంను ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణను సుప్రీంకోర్టు మంగళవారం వరకు పొడిగించింది. ఇదే కేసులో తన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించటాన్ని సవాల్ చేస్తూ చిదంబరం వేసిన పిటిషన్‌పై వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. అప్పటికే(ఆగస్టు 21) చిదంబరం అరెస్టయినందున దీనిపై విచారణ నిష్ప్రయోజనమని వ్యాఖ్యానించింది. అయితే, ఈ కేసులో చట్టబద్ధమైన పరిష్కారం కోరే స్వేచ్ఛ ఆయనకు ఉందని పేర్కొంది. దీంతో ఈడీ కౌంటర్ అఫిడవిట్‌కు సమాధానం(రీజాయిండర్) ఇస్తామని చిదంబరం తరఫున సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ తెలిపారు. నిష్పాక్షిక విచారణ, దర్యాప్తు అనేవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో అంతర్భాగమని, చిదంబరం ప్రాథమిక హక్కులను న్యాయస్థానం కాపాడాలని పేర్కొన్నారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం ఈ పిటిషన్‌పై వాదనలు కొనసాగించేందుకు ధర్మాసనం అంగీకరించింది. -
వారి వాంగ్మూలంతో బిగిసిన ఉచ్చు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా వ్యవస్థాపకులు ఇంద్రాణీ ముఖర్జీ–పీటర్ ఈ మనీలాండరింగ్ కేసులో అప్రూవర్లుగా మారడంతో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మెడకు ఉచ్చు బిగుసుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) కోసం అనుమతులు ఇవ్వాలంటే తన కుమారుడు కార్తీకి వ్యాపారంలో సహకరించాలని 2008లో అప్పటి ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం కోరినట్లు ఇంద్రాణీ, పీటర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. తన కుమారుడికి సాయం చేస్తే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) నుంచి అనుమతులు వచ్చేస్తాయని చిదంబరం చెప్పారన్నారు. దీంతో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో తాము కార్తీతో సమావేశమయ్యామనీ, ఈ సందర్భంగా తనకు 10 లక్షల డాలర్లు చెల్లిస్తే ఎఫ్‌ఐడీల కోసం అనుమతులు లభిస్తాయని కార్తీ చెప్పినట్లు ఇంద్రాణి ముఖర్జీ వెల్లడించారు. కార్తీకి చెందిన అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ కంపెనీ ఖాతాలో రూ.10 లక్షలు జమచేసినట్లు పీటర్ ముఖర్జీ వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని ‘క్విడ్ ప్రో కో’గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభివర్ణించింది. అయితే 10 లక్షల డాలర్లలో మిగతా మొత్తాన్ని ఇంద్రాణీ–పీటర్లు కార్తీకి చెల్లించారా? లేదా? అన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. ఇంద్రాణీ–పీటర్ ముఖర్జీలు ఎవరో తెలియదు రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే సీబీఐ అధికారులు పి.చిదంబరాన్ని అరెస్ట్ చేశారని ఆయన కుమారుడు కార్తీ చిదంబరం తెలిపారు. చెన్నై నుంచి ఢిల్లీకి చేరుకున్న కార్తీ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీలను కలుసుకోలేదు. సీబీఐ విచారణలో భాగంగా ఓసారి బైకుల్లా జైలులో కలిశా. అలాగే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ)లో ఎవ్వరితోనూ నేను భేటీకాలేదు. కాంగ్రెస్ పార్టీని కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. -
బొల్లినేని గాంధీపై ఈడీ కేసు
సాక్షి, హైదరాబాద్: ‘కత్తి పట్టుకుని వీరంగం చేసినోడు అదే కత్తికి బలవుతాడు’ అన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లో తన పోస్టును అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు, సూచనల మేరకు ఎదుటివారిపై విరుచుకుపడిన ఈడీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీపై ఆ విభాగమే కన్నేసింది. ఆయనపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ మేరకు మంగళవారం శ్రీనివాస గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) దాఖలైంది. గాంధీ భారీ ఎత్తున మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు అందులో పేర్కొన్నారు. ఈనెల 8న గాంధీపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు ఆ మరుసటి రోజు హైదరాబాద్, విజయవాడల్లోని ఆయన ఆస్తులపై ఏక కాలంలో దాడులు చేశారు. ఈ నేపథ్యంలోనే దాదాపు రూ.200 కోట్ల విలువైన అక్రమాస్తుల్ని గుర్తించారు. సీబీఐ కేసు ఆధారంగా ముందుకెళ్లిన ఈడీ అధికారులు.. గాంధీపై ఈ మేరకు కేసు నమోదు చేశారు. 288 శాతం మేర పెరిగిన ఆస్తులు సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రకారం 2010 నుంచి 2019 మధ్య శ్రీనివాస గాంధీ ఆస్తులు ఏకంగా 288 శాతం మేర పెరిగాయి. ఆయన ఆస్తులు అనూహ్యంగా పెరిగాయని, ఈడీలో బాధ్యతాయుతమైన పోస్టులో ఉంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించాడని గాంధీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తూ ఆయన చెప్పిన వారిని టార్గెట్ చేయడం, అనుకూలంగా వ్యవహరించాలని కోరిన వారిని విడిచిపెడుతూ భారీగా ఆర్జించినట్లు ఆయనపై ఫిర్యాదులు ఉన్నాయి. ఇలాంటి వ్యవహారాలతో లబ్ధి పొందిన నేపథ్యంలోనే 2010లో రూ.21 లక్షలుగా ఉన్న ఆయన ఆస్తులు 2019 జూన్ 26 నాటికి ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఏకంగా రూ.3.74 కోట్లకు చేరాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.200 కోట్ల పైమాటే. చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉండి, ఆయన అండదండలతో గతంలో ఏ అధికారి పని చేయని విధంగా 2004 నుంచి 2017 వరకు బొల్లినేని శ్రీనివాస గాంధీ ఈడీలోనే విధులు నిర్వర్తించారు. కొన్ని నెలల క్రితమే ఆయన్ను బషీర్‌బాగ్‌లోని జీఎస్టీ భవన్లో జీఎస్టీ ఎగవేత నిరోధక విభాగం సూపరింటెండెంట్ ఆఫీసర్‌గా నియమించారు. ఇలా వరుసగా కీలక పోస్టింగులు పొందడం వెనుకా చంద్రబాబు సహకారం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. బొల్లినేని గాంధీపై కొంతకాలంగా వరుస ఫిర్యాదులు అందుకున్న సీబీఐ హైదరాబాద్ విభాగం.. విజయవాడతోపాటు హైదరాబాద్‌లోని హైదర్‌నగర్, కూకట్‌పల్లిలోని ఆయన నివాసాల్లో దాడులు చేసింది. ఈ దాడుల్లో పలు బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వ ఉన్నట్లు, ఆయన పేరిట హెదరాబాద్లో ప్లాట్లు, స్థిరాస్తులు, కుటుంబసభ్యుల పేరిట ఆస్తులు, విలువైన ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. -
మనీల్యాండరింగ్ వివాదంలో రిలయన్స్!
న్యూఢిల్లీ: దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తాజాగా మనీల్యాండరింగ్ వివాదంలో చిక్కుకుంది. నెదర్లాండ్స్ సంస్థ ఎ హక్ తోడ్పాటుతో 1.2 బిలియన్ డాలర్లు మళ్లించినట్లు డచ్ ప్రాసిక్యూటర్స్ ఆరోపించడం సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఎ హక్ ఉద్యోగులు ముగ్గురు అరెస్టయ్యారు. మూడు రోజుల విచారణ తర్వాత వారిని కోర్టు విడుదల చేసింది. మరోవైపు, ఈ ఆరోపణలను రిలయన్స్ ఇండస్ట్రీస్ తోసిపుచ్చింది. వివరాల్లోకి వెడితే.. ఎ హక్ ఉద్యోగులను అరెస్ట్ చేసిన ఫిస్కల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ సర్వీస్ అండ్ ఎకనమిక్ ఇన్వెస్టిగేషన్ సర్వీస్ (ఎఫ్ఐవోడీ–ఈసీడీ) కథనం ప్రకారం.. 2006–2008 మధ్య ఈస్ట్‌వెస్ట్ పైప్‌లైన్ (ఈడబ్ల్యూపీఎల్) అనే సంస్థ రిలయన్స్‌కి చెందిన కేజీ–డీ6 బ్లాక్ క్షేత్రం నుంచి పశ్చిమ భారతంలోని రాష్ట్రాల కస్టమర్లకు గ్యాస్ చేరవేసేందుకు పైప్‌లైన్ నిర్మాణం చేపట్టింది. దీనికి డచ్ సంస్థ ఎ హక్ కూడా సర్వీసులు అందించింది. ఈ క్రమంలోనే ఎ హక్ ఉద్యోగులు కొందరు ఓవర్ ఇన్వాయిసింగ్ (బిల్లులను పెంచేయడం) ద్వారా 1.2 బిలియన్ డాలర్ల మేర అవకతవకలకు పాల్పడ్డారు. ఈ నిధులు ఆ తర్వాత సంక్లిష్టమైన లావాదేవీలతో దుబాయ్, స్విట్జర్లాండ్, కరీబియన్ దేశాల గుండా అంతిమంగా సింగపూర్‌లో ఉన్న బయోమెట్రిక్స్ మార్కెటింగ్ అనే సంస్థకు చేరాయి. ఈ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందినదేనని ప్రాసిక్యూటర్స్ ఆరోపిస్తున్నారు. ఈ లావాదేవీలకు ప్రతిఫలంగా ఎ హక్ ఉద్యోగులకు 10 మిలియన్ డాలర్లు ముట్టాయని వారు పేర్కొన్నారు. ఇలా పైప్‌లైన్ నిర్మాణ వ్యయాలను పెంచేయడం వల్ల అంతిమంగా భారత ప్రజలే నష్టపోతున్నారని తెలిపారు. నష్టాల్లోని ఈడబ్ల్యూపీఎల్ (గతంలో రిలయన్స్ గ్యాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ –ఆర్జీటీఐఎల్) సంస్థను కొన్నాళ్ల క్రితం కెనడా సంస్థ బ్రూక్‌ఫీల్డ్‌కు చెందిన ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ రూ. 13,000 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఈడబ్ల్యూపీఎల్ ఖండన.. మనీల్యాండరింగ్ ఆరోపణలను ఈడబ్ల్యూపీఎల్ ఖండించింది. ఈ పైప్‌లైన్ ప్రాజెక్టు పూర్తిగా ప్రమోటరు సొంత నిధులతో ఏర్పాటు చేసిన ప్రైవేట్ కంపెనీ ద్వారా నిర్మించడం జరిగిందని పేర్కొంది. భారత్, చైనా, రష్యా, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన స్వతంత్ర కాంట్రాక్టర్ల కన్సార్షియం దీన్ని పూర్తి చేసిందని, స్వతంత్ర ఏజెన్సీలు మదింపు చేసిన ప్రామాణిక వ్యయాలతో ఈ ప్రాజెక్టును అత్యంత వేగవంతంగా పూర్తి చేయడం జరిగిందని పేర్కొంది. సదరు కాంట్రాక్టర్లలో ఎ హక్ కూడా ఒకటని వివరించింది. ఇక పెట్టుబడి వ్యయాలు పెరగడం వల్ల అధిక టారిఫ్ భారం పడిందన్న ఆరోపణలు తప్పని తెలిపింది. ఈ కేసంతా ఊహాగానాలు, అంచనాలే ప్రాతిపదికగా ఉందని, వాస్తవాలు లేవని పేర్కొంది. మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా మనీలాండరింగ్ ఆరోపణలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. 2006లో తాము గానీ తమ అనుబంధ సంస్థలు గానీ ఏ గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు చేయలేదని స్పష్టం చేసింది. ఏ పైప్‌లైన్ నిర్మాణంలోనూ ఎప్పుడూ నెదర్లాండ్స్‌కి చెందిన ఏ సంస్థతోనూ కలిసి పనిచేయలేదని స్పష్టం చేసింది. ‘ఆర్ఐఎల్ ఎప్పుడూ కూడా చట్టాలు, నిబంధనలకు లోబడే పనిచేస్తోంది. అవకతవకల ఆరోపణలను ఖండిస్తున్నాం‘ అని ఆర్ఐఎల్ పేర్కొంది. -
నీరవ్ మోదీపై అరెస్ట్ వారెంట్
న్యూఢిల్లీ: రూ.13వేల కోట్ల మేర పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో ఆభరణాల వ్యాపారి నీరవ్ మోదీకి బ్రిటన్ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో అతడిని స్వదేశానికి పంపించాలన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వినతి మేరకు అక్కడి న్యాయస్థానం స్పందించిందని అధికార వర్గాలు తెలిపాయి. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు మోదీపై ఇటీవలే వారెంట్ జారీ చేసినట్లు అక్కడి దర్యాప్తు విభాగం తమకు సమాచారం అందించిందని అధికారులు తెలిపారు. లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు మోదీని త్వరలోనే అధికారికంగా అరెస్టు చేసే అవకాశాలున్నాయన్నారు. అనంతరం వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరుస్తారు. ఆపైన అతడిని భారత్‌కు అప్పగించే న్యాయ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. అయితే, అతడిని అరెస్టు చేసి, అభియోగాలు మోపే వరకు ఈ పరిణామాలపై స్పందించలేమని లండన్ కోర్టు, స్కాట్లాండ్ యార్డు పోలీసు అధికారులు స్పష్టం చేశారు. మోదీని అప్పగించాలంటూ ఈ నెల ప్రారంభంలో ఈడీ బ్రిటన్ హోం మంత్రిని కోరింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో మోదీ, అతని మామ మెహుల్ చోక్సీపై ఈడీతోపాటు సీబీఐ కూడా మనీలాండరింగ్, తదితర నేరాల కింద కేసులు నమోదు చేశాయి. ఈ నేరాల కింద మోదీ, అతని కుటుంబానికి చెందిన సుమారు రూ. 2,300 కోట్ల ఖరీదైన ఆస్తులను ఇప్పటికే ఈడీ అటాచ్ చేసింది. పారిపోయిన మోదీ లండన్‌లోని ఖరీదైన ప్రాంతంలో నివసిస్తున్నట్లు ఇటీవల అక్కడి మీడియా వెల్లడించిన విషయం తెలిసిందే. రూ. 9 వేల కోట్ల మేరకు మోసం చేసి బ్రిటన్‌లో ఆశ్రయం పొందుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించే ప్రక్రియ కూడా చివరి దశలో ఉందని అధికార వర్గాలు తెలిపాయి. మోడీ విషయంలో అనుసరించిన ప్రక్రియనే మాల్యాకు వర్తింపజేస్తామని పేర్కొన్నాయి. ఈడీ వినతి మేరకు లండన్ కోర్టు విజయ్ మాల్యాపై 2017 వారెంట్ జారీ చేయగా ప్రస్తుత ఆయన బెయిల్‌పై ఉన్నారు. -
ఈడీ దర్యాప్తుపై స్టే కుదరదు..
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొం టున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణపై స్టే విధించాలన్న వాద్రా పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. మంగళవారం జరగనున్న ఈడీ విచారణకు హాజరుకావాలని వాద్రాను ఆదేశించింది. ఇక గతేడాది వాద్రా ఆఫీసుల్లో నిర్వహించిన దాడుల్లో సేకరించిన డాక్యుమెంట్ల హార్డ్‌కాపీలను వాద్రాకు అందించాలని సీబీఐ ప్రత్యేక జడ్జి అరవింద్ కుమార్ ఈడీని ఆదేశించారు. తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేశారు. గతేడాది డిసెంబర్ 7న ఢిల్లీలో ఉన్న వాద్రా ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించిన ఈడీ పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. వీటి ఆధారంగా ప్రస్తుతం తనను విచారిస్తోందని.. ఈ డాక్యుమెంట్ల కాపీలను తనకు అందించాలని కోరుతూ వాద్రా కోర్టును ఆశ్ర యించారు. డాక్యుమెం ట్ల కాపీలు తనకు ఇచ్చేవరకు విచారణ ఆపేయాల్సిందిగా ఈడీని ఆదేశించాలని వాద్రా తన పిటిషన్లో కోరారు. తొందరేముంది.. వస్తా ప్రస్తుతం తనపై ఉన్న కేసులన్నీ పూర్తయిన తర్వాత రాజకీయాల్లోకి వస్తానని వాద్రా అన్నారు. సోమవారం ఆయన ఈ మేరకు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. వాద్రా రాజకీయాల్లోకి వస్తున్నారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘రాజకీయాల్లోకి వస్తా. ప్రజా సేవ చేస్తా. తొందరేముంది. తొలుత నాపై ఉన్న నిరాధార ఆరోపణలన్నీ తొలగిపోవాల్సి ఉంది. అలాగే నేను మార్పు తీసుకురాగలనని ప్రజలు కూడా నమ్మాలి’ అని పేర్కొన్నారు. -
వాద్రా మధ్యంతర బెయిల్ పొడిగింపు
న్యూఢిల్లీ: భూకుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను ఢిల్లీ కోర్టు మార్చి 2 వరకు పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు సహకరించాలని వాద్రాకు సూ చించింది. తదుపరి వాదనలు వినేంత వరకు వాద్రా ను అరెస్టు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో మరో నిందితుడు, వాద్రా సన్నిహితుడు మనోజ్ అరోరాను కూడా మార్చి 2 వరకు అరెస్టు చేయకూడదని ఈడీని ఆదేశించింది. మనీల్యాండరింగ్ కేసులో వాద్రా విచారణకు సహకరించడం లేదని.. అతడిని మరింత ప్రశ్నించాల్సి ఉందని ఈడీ కోర్టుకు నివేదించింది. విచారణకు సంబంధించిన విషయాలను వాద్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారంది. అతడికి మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. ఈ వాదనలను వాద్రా తరఫు న్యాయవాది ఖండించారు. ఈడీ ఆదేశించిన ప్రతిసారీ వాద్రా విచారణకు హాజర య్యారని, తదుపరి విచారణకు కూడా హాజరయ్యేందుకు సిద్ధం గా ఉన్నారని కోర్టుకు తెలిపారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. వాద్రా మధ్యంతర బెయిల్ ను పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. విచారణ పేరుతో వేధిస్తున్నారు.. ఈడీ విచారణ తీరుపై రాబర్ట్ వాద్రా మండిపడ్డారు. విచారణకు సహకరిస్తున్నా అధికారులు తనను వేధిస్తున్నారన్నారు. రూ. 4.62 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్బుక్ వేదికగా ఈడీపై విమర్శల వర్షం కురిపించారు. ఈడీ ఆదేశించిన నాటి నుంచి తాను విచారణకు సహకరిస్తున్నానని, ఏమీ దాయ డం లేదని స్పష్టం చేశారు. 6 రోజుల నుంచి రోజూ 8 నుంచి 12 గంటల పాటు తనను విచారిస్తున్నారని తెలిపారు. లంచ్‌కు మాత్రమే 40 నిమిషాల విరా మం ఇచ్చేవారని చెప్పారు. వాష్‌రూమ్‌కు వెళ్లే సమయంలో కూడా తన వెంట అధికారులను పంపే వారని ఆరోపించారు. -
రాబర్ట్ వాద్రాకు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ బావ రాబర్ట్ వాద్రాకు ఢిల్లీలోని ఓ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఈ నెల 6వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరై విచారణకు సహకరించాలని సూచించింది. లండన్‌లోని రూ.17.77 కోట్ల విలువ చేసే ఆస్తులను మనీలాండరింగ్ ద్వారానే వాద్రా సమకూర్చున్నారంటూ ఈడీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న వాద్రా తన న్యాయవాది ద్వారా మధ్యంతర బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ‘వాద్రా తన తల్లికి చికిత్స చేయించేందుకు లండన్ వెళ్లారు. 6న ఇక్కడికి వచ్చిన తర్వాత ఈడీ ఎదుట హాజరవుతారు’ అని వాద్రా తరఫు లాయర్ చెప్పారు. దీంతో కోర్టు వాద్రాకు బెయిలు మంజూరు చేసింది. ఇందుకోసం, రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుతోపాటు అంతే సమానమైన జామీను సమర్పించాలని ఆదేశించింది. -
రూ.16 కోట్ల జకీర్ ఆస్తుల అటాచ్మెంట్
న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్‌కు సంబంధించిన రూ. 16.40 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఆస్తులను జప్తు చేసినట్లు శనివారం వెల్లడించింది. జకీర్ కుటుంబసభ్యుల పేరిట ముంబై, పుణేలో ఉన్న ఈ స్థిరాస్తులను ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎమ్ఎల్ఏ) కింద జప్తు చేసినట్లు పేర్కొంది. జకీర్ బ్యాంక్ ఖాతాకు వచ్చిన విరాళాలను తన భార్య, కొడుకు, మేనకోడలు అకౌంట్లకు పంపినట్లు ఆధారాలు సేకరించిన ఈడీ ఈ ఆస్తులను జప్తు చేసింది. జప్తు చేసిన వాటిలో ముంబైలోని ఫాతిమా హైట్స్, ఆఫియా హైట్స్ భవంతులతో పాటు బాందప్ ప్రాంతంలోని ఆస్తులు, పుణేలోని కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. -
ఎంపీలే ఎగవేతదారులైతే...?
దేశానికి దిశానిర్దేశం చేయాల్సిన పార్లమెంటు సభ్యులే వ్యాపారులుగా మారి వేలకోట్లలో బ్యాంకు రుణాలను ఎగ్గొట్టడం దేన్ని సూచిస్తోంది? విజయ్ మాల్యా వంటి కొందరు ఎంపీలు బ్యాంకు రుణాలకు సంబంధించి అతిపెద్ద ఎగవేతదారులుగా ఆరోపణల పాలయ్యారు. ఇక నిన్నటి వరకు కేంద్రమంత్రి పదవిని చలాయించిన సుజనా చౌదరి రుణాల ఎగవేతలో అందరినీ మించిపోవడం (దాదాపు రూ.7,000 కోట్లు) యావద్దేశాన్ని దిగ్భ్రాంతిలో ముంచెత్తుతోంది. ఎంపీలు, కేంద్రమంత్రులే ఎగవేతదారులైతే దేశానికి దిక్కేమిటి? ప్రజాసేవ ముసుగులో వీరు సాగిస్తున్న అక్రమాలపై ఆర్బీఐ, కేంద్ర సంస్థలు ప్రధానంగా దృష్టి సారించాలి. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడన్న విషయాన్ని పార్లమెంటు సాక్షిగా వ్యాపారులైన ఎంపీలు కొందరు నిరూపిస్తున్నారు. వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగ్గొట్టడంలో ఎంపీల పాత్రే ఎక్కువ కావడం, బ్యాంకుల నికర నష్టాలకు వీరి రుణఎగవేతలే మూల కారణం కావడం ప్రమాదహేతువు. సుజనా ఇండస్ట్రీస్ పేరుతో సుజనా చౌదరి చేసిన ఆర్థిక అరాచకం బడా వ్యాపారుల ఎగవేతనే తలదన్నుతోంది. ఆర్పీఐకీ, కేంద్రప్రభుత్వానికి మధ్య వైరుధ్యాన్ని ఈ కోణం లోంచి చూసి తీవ్ర చర్యలు చేపట్టకపోతే దేశమూలాలే కదిలిపోవడం ఖాయం. ఈమధ్య ఆర్బీఐకి, కేంద్రప్రభుత్వానికి జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఎవరి శ్రేయస్సు కోసం? ఈ సంఘర్షణలో నిగూఢమైన ఉద్దేశాలు ఉన్నాయా? ఈ పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థకి, తమ కష్టా ర్జితాన్ని డిపాజిట్ల రూపంలో భద్రపర్చుకున్న బ్యాంకు ఖాతాదారులకు, స్వయం ప్రతిపత్తితో అనేక ఆర్థిక సమస్యలను విజయవంతంగా ఎదుర్కొన్న ఆర్బీఐకి చేటు కల్గించేవిధంగా ఉన్నాయా? కేంద్రప్రభుత్వం ఎంచుకున్న ఈ ప్రత్యక్ష ఘర్షణాత్మక వైఖరి సరైందేనా? కేంద్రప్రభుత్వం కోరుకుంటున్నదేమిటి? గత సంవత్సరకాలంగా కేంద్రప్రభుత్వం అనేక దఫాలుగా ఆర్బీఐతో చర్చించినట్లు చెబుతూనే తాము ఆశించినదేమీ ఆర్బీఐ పట్టించుకోలేదని ఆరోపిస్తోంది. కనీసం వారి కోరికల్ని అర్బీఐ వారి బోర్డు సమావేశాల్లో కూడా చర్చించడం లేదని తీవ్రంగా విమర్శిస్తోంది. అసలు ప్రభుత్వానికి ఉన్న కోరికలేమిటి? ఎ) పబ్లిక్ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి క్షీణించి ఉన్నందున రుణ వితరణ సమృద్ధిగా జరగటం కోసం, అభివృద్ధే ప్రధాన అంశంగా, ద్రవ్య లభ్యతకై ఆర్బీఐ చొరవ చూపాలి. బి) ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అనే సంస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనై దాదాపు రూ. 9,500 కోట్ల మేరకు నష్ట పోయినందున దాని ప్రభావం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలమీద తీవ్రంగా ఉండటంతో ఆర్బీఐ వీటి రక్షణకై ఒక ప్రత్యేక వ్యవస్థ (స్పెషల్ విండో)ను రూపొందించాలని ప్రభుత్వం కోరుకుంటోంది. వాటి కోసం కనీసం రూ. 4,200 కోట్లను బ్యాంకులకు సమకూర్చాలని కోరుకుంటోంది. సి)విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపులు (ఎఫ్‌పీఐ) కార్పొరేట్ బాండ్లలో 20 శాతం కంటే మించి ఎక్స్పోజర్స్ ఉండరాదన్న నిబంధనలను సడలించమని కోరుతోంది. డి) ప్రస్తుతం 11 జాతీయ బ్యాంకులపై విధించిన సత్వర దిద్దుబాటు చర్య నిబంధనలను సడలించాలని కోరుతోంది. ఇ) నిరర్థక ఆస్తుల వర్గీకరణ ఆంక్షలను సడలించి బ్యాంకులకు ఊతమివ్వాలని కోరుతోంది. ఎఫ్) ఏళ్లతరబడి ఆర్బీఐ దాచుకున్న లక్షల కోట్ల రూపాయల మిగులు నిధుల్లో కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో చెల్లించాలని కేంద్రం కోరుతోంది. జి) ప్రస్తుత వడ్డీరేట్లు తగ్గించమని ప్రభుత్వం కోరుతోంది. పైన పేర్కొన్న విషయాలపై ఆర్బీఐతో చర్చించిన తర్వాత కూడ ఏరకమైన ప్రయోజనం లేకపోయిన తర్వాతనే సెక్షన్ 7 ఆర్బీఐ యాక్ట్ 1934 అమలు చేయాల్సి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. దాని నుంచి వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదని తెగేసి చెబుతోంది. సెక్షన్ 7 పేర్కొన్న విధంగా ‘ప్రజల అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్బీఐ గవర్నర్‌తో సంప్రదించిన తర్వాత ఎటువంటి ఆదేశాలనైనా ఇవ్వ వచ్చు‘ అని స్పష్టం చేస్తోంది. అయితే ఈ 83 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఇంతవరకు ఏ కేంద్ర ప్రభుత్వమూ ఆర్బీఐ మీద సెక్షన్ 7ని ప్రయోగించ లేదన్నది కూడా వాస్తవమే. ఆర్బీఐ కొన్ని కీలక అంశాల్లో కేంద్రప్రభుత్వంతో తీవ్రంగా విభేదిస్తోంది. వాటిల్లో కొన్ని. ఎ) తీవ్రమైన కీలకాంశమైన మిగులు నిధుల బదిలీ విషయంలో ఆర్బీఐ ససేమిరా అంటోంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం 60,000 కోట్ల మేరకు రిజర్వ్ బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ల రూపంలో చెల్లిస్తున్న నేపథ్యంలో ఇంకా నిధుల బదిలీ కుదరదని, అది ఆర్బీఐ అస్తిత్వానికే ప్రమాదమని వాదించింది. బి). నిధుల కొరతతో సతమతమవుతూ నష్టాల్లో కూరుకుపోయిన పబ్లిక్ రంగ బ్యాంకులకు ఊతమిచ్చే విషయంలో ఆర్బీఐ కొంతకాలం వేచి చూడాలని, ఈలోపు బ్యాంకులు తమ పరిస్థితిని తామే మెరుగుపరచుకోవాలని వాదిస్తోంది. నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ప్రతిపాదిస్తోంది. సి). బలహీన బ్యాంకులపై విధించిన సత్వర దిద్దుబాటు చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నందున వాటిని సమీక్షించాల్సిన అవసరం లేదని భావిస్తోంది. డి). తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలకు ఏ రకమైన వెసులుబాటు చర్యలు కల్పించినా అవి బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని మరింత కుంగదీస్తాయని, ఇవి డిపాజిటర్ల ప్రయోజనాల్ని మరింత దెబ్బతీస్తాయని వాదిస్తోంది. ఇ). ప్రస్తుత తరుణంలో నిరర్థక ఆస్తుల వర్గీకరణపై రూపొందించిన ప్రపంచవ్యాప్త నిబంధనలను సడలించాల్సిన అవసరం లేదని కుండబద్ధలు కొట్టినట్టు చెప్తోంది. ఎఫ్). వడ్డీరేట్ల తగ్గుదల విషయంలోనూ, కార్పొరేట్ల బాండ్లలో ఆర్బీఐ నిబంధన సడ లింపు విషయంలోను ఏ విధమైన పునఃపరిశీలన అవసరం లేదని చెప్తోంది. జి). రూ.14,000 కోట్ల మేరకు నీరవ్ మోదీ చేసిన మోసంలో, కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా ఆర్బీఐని దోషిగా పేర్కొన్న నేపథ్యంలో, తమకు మరిన్ని విస్తృత అధికారాలు ఇవ్వమని ఆర్బీఐ కోరుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తాము సెక్షన్ 7 కింద ఆర్బీఐకి ఇచ్చిన ఆదేశాలకే కట్టుబడ్డామన్న ప్రకటన, దానికి సమాధానంగా ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పత్రికా సమావేశం వీరిద్దరి మధ్య ఉన్న భేదాభిప్రాయాల్ని ప్రపంచానికి తెలియజేశాయి. ఇప్పుడు వీరిద్దరి ముందున్న పరిష్కారాలు ఎ) ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విషయాలను ఆర్బీఐ ధైర్యంగానే ఎదుర్కోవాలి. బి) ప్రస్తుతమున్న 8 శాతం మూలధన నిష్పత్తి నిబంధనలను భవిష్యత్తులో 9 శాతం పెంచాలన్న ప్రతిపాదన కొద్దిగా కఠినతరమయినా వాటికి వెసులుబాటు కల్పించే విషయంలో జాగ్రత్త వహించాలి. సి) ఏళ్ల తరబడి పోగుచేసిన మిగులు నిధుల విషయంలో పరస్పరం చర్చించుకోవాలి. మూలధన కొరతతో సతమత మవుతున్న ప్రభుత్వరంగ బ్యాంకులపట్ల సానుకూలత ప్రదర్శించాలి. డి) ఆర్బీఐ కోరుకుంటున్న విస్తృత అధికారాలను పరస్పరం పంచుకో వాలి. ఇ) సెక్షన్ 7 ఆర్బీఐ యాక్ట్ ఒక్కటే కాదు, అనేక చట్టాలకు, ప్రభు త్వాలకు వ్యవస్థలలో జోక్యం చేసుకోవడానికి వీలు కల్పిస్తాయి. దాని అర్థం వ్యవస్థలను నిర్వీర్యం చేయడం కాదు. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అంశాలేమిటి? 2018 మార్చి నాటికి ఒక లక్షా అరవై వేల కోట్ల నిర్వహణ లాభాన్ని సంపాదించిన బ్యాంకింగ్ రంగం, 86 వేల కోట్ల నికర నష్టాన్ని ప్రక టించడం సమస్య తీవ్రతని తెలియజేస్తోంది. అనేక కార్పొరేట్ పెద్దలు బ్యాంకు రుణాలు ఎగవేసినారు. వారి వారి వ్యక్తిగత ఆస్తులను పెంచుకొ న్నారు. అనేకమంది పార్లమెంట్లలోను, అసెంబ్లీలలోను సభ్యులుగా ఉన్నారు. కొంతమంది మంత్రులుగాను, పూర్వపు మంత్రులుగానూ కూడా ఉన్నారు. ఈరోజు అనేకమంది పారిశ్రామికవేత్తలే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. వారు వ్యాపారాలు విరమించుకుని ప్రజాసేవ చేయడం లేదు. విజయ్ మాల్యా దేశం విడిచి వెళ్లేనాటికి దాదాపు 9 వేల కోట్ల రూపాయల బడా ఎగవేతదారుడైన అధికారపార్టీ పార్లమెంట్ సభ్యుడన్న విషయం మర్చిపోవద్దు. ల్యాంకో ఇండస్ట్రీస్ అధిపతి అయినా, సుజనా ఇండస్ట్రీస్ అధిపతి అయినా రాయపాటి సాంబశివరావు (ట్రాన్స్ట్రాయ్ కంపెనీ) అయినా, కావూరి సాంబశివరావు అయినా.. వీరందరూ పార్లమెంటులో సభ్యులు కావడం విశేషం. సుజ నాచౌదరి అయితే ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన నాటికే దేశంలో ఒక పెద్ద జాతీయ బ్యాంకులో డిఫాల్టర్‌గా ఉన్నారన్న విషయం బహిర్గతమే. ఈయనపై మారిషస్ బ్యాంకుల ఆరోపణలు అనేకం ఉన్నాయి. ఇప్పటికే వీరంతా వ్యాపారాల్లో ఉన్నవారే. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇప్పటికే వ్యాపారాలు చేస్తూనే ఉన్నారు. వారి ప్రజా సేవ అంతా డబ్బుయావతో చేస్తున్నవే. ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వాలు వీటిమీద దృష్టి సారించాలి. కష్టార్జితాన్ని బ్యాంకులలో తమ అవసరాల కోసం డిపాజిట్లు చేసుకున్న వారి ప్రయోజనాలకు పెద్దపీట వెయ్యాలి. సీబీఐ లాంటి అత్యున్నత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అనేకమంది డిఫాల్టర్లమీద, వారు ఫండ్స్‌ని వ్యక్తిగత, రాజకీయ అవసరాల కోసం దారి మళ్లించారని ఆరోపించాయి. వాటి మీద విచారించి ఆ డబ్బుని రాబట్టాలి. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని కాపాడు తూనే కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐకి అండగా నిలిచింది. ప్రభుత్వాల ప్రాథమ్యాల ఆర్బీఐకి వివరించాలి. వీటిమధ్య విభేదాలు బడా ఎగవేతదారు లకు ఎట్టిపరిస్థితుల్లోను ప్రయోజనం చేకూర్చకూడదు. ఈ విషయంలో ఆర్బీఐ, ప్రభుత్వం రెండూ పరిపక్వత ప్రదర్శించాలి. ప్రభుత్వ బడా బ్యాంకులు ఈ దేశానికి పట్టుగొమ్మలు. సామాన్యుడి డబ్బుకి భద్రత కల్పించే అత్యంత నమ్మకమైన సంస్థలు. రైతు ప్రగతికి చిన్న చిన్న రుణగ్రస్తులకు చేయూతనిచ్చే సాధనాలు. బ్యాంకులను పరిరక్షించు కోవడం వాటి ద్వారా దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడటం ఈ రెండింటి సమన్వయంమీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కొనసాగుతున్న విభేదాలు దేశానికి చేటు చేస్తాయి. రుణ ఎగవేతదారులకు కావలసిన శక్తినిస్తాయి. అందుకని ఆర్బీఐ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విజ్ఞతతో వ్యవ హరిస్తారని ఆశిద్దాం. - బీఎస్ రాంబాబు, నేషనల్ సెక్రటరీ, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మొబైల్ : 98666 33422 -
చిదంబరాన్ని ప్రశ్నించిన ఈడీ
న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ప్రశ్నించింది. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద చిదంబరం వాంగ్మూలం తీసుకున్నారు. ఒప్పందానికి సంబంధించి మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపీబీ) అధికారుల వాంగ్మూలాల్ని ఈడీ రికార్డు చేసింది. ఆయన హయాంలో ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ ఒప్పందానికి అనుమతిచ్చేందుకు ఎఫ్ఐపీబీ అనుసరించిన ప్రమాణాలు, ఇతర అంశాలపై జూన్‌లో ప్రశ్నించారు. 2006లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నపుడు మ్యాక్సిస్ అనుబంధ సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్స్‌కి రూ.3,680 కోట్ల మేర ఎఫ్ఐపీబీ అనుమతులు జారీచేసింది. రూ.600 కోట్లు దాటితే కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీనే అనుమతులివ్వాలి. చిదంబరం నిబంధనలు ఉల్లంఘించి ఎలా అనుమతులిచ్చారనే విషయమై దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. -
లాలూ ఫ్యామిలీకి భారీ షాక్
పాట్నా : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి భారీ షాక్ తగిలింది. లాలూ కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉన్న 11 ఫ్లాట్లను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్ (ఈడీ) జప్తు చేసింది. ప్రస్తుతం ఈ స్థలంలో షాపింగ్ మాల్ నిర్మాణం జరగుతున్నట్టు తెలుస్తోంది. మార్కెట్ రేట్ ప్రకారం వీటి విలువ 44.75 కోట్ల రూపాయలు ఉంటుందని ఈడీ వెల్లడించింది. ఐఆర్సీటీసీ హోటల్ కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినందుకు ఈడీ ఈ స్థలాన్ని సీజ్ చేసినట్టు ఈడీ తెలిపింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఈ ఫ్లాట్లను జప్తు చేసినట్టు పేర్కొంది. ఈడీ జప్తు చేసిన ప్రాపర్టీ తొలుత డీలైట్ మార్కెటింగ్ ప్రైవేటు కపంనీ పేరు మీద ఉండగా.. ప్రస్తుతం లారా ప్రాజెక్ట్స్ పేరు మీద ఉన్నాయి. అందులో లాలూ సతీమణి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవితో పాటు లాలూ తనయులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌లు భాగస్వాములుగా ఉన్నారు. ఇప్పటికే దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూకు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా కోర్టు ఆరువారాల ప్రొవిజనల్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. -
1,217 కోట్ల చోక్సీ ఆస్తుల అటాచ్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) కుంభకోణం కేసులో గీతాంజలి జెమ్స్, దాని ప్రమోటర్ మెహుల్ చోక్సీలకు చెందిన రూ. 1,217.2 కోట్ల విలువైన 41 ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఈ ఆస్తుల్ని అటాచ్ చేశారు. ఈ ఆస్తుల్లో ముంబైలోని 15 ఫ్లాట్లు, 17 కార్యాలయ ప్రాంగణాలు, కోల్‌కతాలోని ఒక మాల్, అలీబాగ్‌లోని 4 ఎకరాల ఫాంహౌస్, నాసిక్, నాగ్‌పూర్, తమిళనాడులోని విల్లుపురంలోని 231 ఎకరాల భూమి ఉన్నాయి. పీఎన్బీ ఎండీ, సీఈవో సునీల్ మెహతాను ముంబైలో ఈడీ విచారించింది. సీబీఐ గురువారం తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. సెంట్రల్ ముంబై శివారులో ఒక భవనంలో ని గది నుంచి లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్‌కు సంబంధించిన పత్రాల్ని సీజ్ చేశామని సీబీఐ అధికారులు చెప్పారు. డాక్యుమెంట్లు దాచిన ఆ ప్రాంతం నీరవ్ మోదీకి చెందినదని భావిస్తున్నారు. కాగా ఆయన ఏ దేశంలో ఉన్నారో అక్కడి భారతీయ రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని నీరవ్‌కు సీబీఐ లేఖలో సూచించింది. -
మాల్యా ఆస్తులు అటాచ్
ఐడీబీఐ రుణం కేసులో రూ.1,411 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ ముంబై: ఐడీబీఐ బ్యాంకుకు రుణాన్ని ఎగవేసిన కేసులో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్ విజయ్ మాల్యా, యూబీ సంస్థలకు చెందిన కొన్ని ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) శనివారం అటాచ్ చేసింది. వీటి మార్కెట్ విలువ సుమారు రూ. 1,411 కోట్లు ఉంటుందని ఈడీ అధికారులు తెలిపారు. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద అటాచ్ చేసిన ఆస్తుల జాబితాలో రూ.34 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, బెంగళూరు.. ముంబైలలో రెండు ఫ్లాట్లు, చెన్నైలో పారిశ్రామిక ప్లాటు, కూర్గ్‌లో 28.75 ఎకరాల కాఫీ ప్లాంటేషన్ స్థలం తదితరాలున్నాయి. ఐడీబీఐ బ్యాంకు నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పొందిన రూ. 900 కోట్ల పైచిలుకు రుణాల విషయంలో మనీ ల్యాండరింగ్ కోణంపై ఈడీ విచారణ జరుపుతోంది. గతేడాది సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రాతిపదికగా మాల్యాతో పాటు మరికొందరిపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. రుణాల ఎగవేత ఆరోపణలెదుర్కొంటున్న దరిమిలా మాల్యా .. దేశం విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే.