
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ఆమోదం తెలిపారు. దీనికి సంబందించిన ఉత్తర్వులపై యుకె హోంశాఖ కార్యదర్శి ఈ రోజు సంతకం చేశారు. 50 ఏళ్ల నీరవ్ మోడీకి చివరగా యుకె హైకోర్టు ముందు 28 రోజుల్లోగా చట్టబద్ధంగా సవాలు చేసే అవకాశం ఉంది. గతంలో విజయ్ మాల్యా 2019 ఫిబ్రవరిలో బ్రిటన్ ప్రభుత్వం తన అప్పగించే ఉత్తర్వులపై సంతకం చేసిన తర్వాత కోర్టుకు వెళ్లారు.
రూ.14,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) కుంభకోణం, మనీలాండరింగ్ కోసం నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని యూకే, భారత్‌కి అప్పగిస్తుండడంతో నీరవ్ మోదీ కోసం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ప్రత్యేక సెల్‌ని సిద్ధం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. గతంలో కరోనా మహమ్మారితో నీరవ్ మోదీ మానసిక ఆరోగ్యం బాగాలేదని, భారత్ లో మానవ హక్కల ఉల్లంఘనను సాకుగా చూపిన ఆయన తరపు అడ్వకేట్ల వాదననూ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇక నీరవ్ కు ఆర్ధర్ రోడ్డు జైలులో బ్యారక్ నెంబర్ 12లో అన్ని సదుపాయాలు కల్పిస్తామని భారత్ హామీ ఇచ్చిందని జడ్జ్ గూజీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, నీరవ్ మోదీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ఆమోదముద్ర వేశారని సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment