![ED questions Chidambaram in Aircel-Maxis PMLA case - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/25/VFG.jpg.webp?itok=Vuhuq8sC)
న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ప్రశ్నించింది. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద చిదంబరం వాంగ్మూలం తీసుకున్నారు. ఒప్పందానికి సంబంధించి మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్‌ఐపీబీ) అధికారుల వాంగ్మూలాల్ని ఈడీ రికార్డు చేసింది. ఆయన హయాంలో ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ ఒప్పందానికి అనుమతిచ్చేందుకు ఎఫ్‌ఐపీబీ అనుసరించిన ప్రమాణాలు, ఇతర అంశాలపై జూన్‌లో ప్రశ్నించారు. 2006లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నపుడు మ్యాక్సిస్ అనుబంధ సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్స్‌కి రూ.3,680 కోట్ల మేర ఎఫ్‌ఐపీబీ అనుమతులు జారీచేసింది. రూ.600 కోట్లు దాటితే కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీనే అనుమతులివ్వాలి. చిదంబరం నిబంధనలు ఉల్లంఘించి ఎలా అనుమతులిచ్చారనే విషయమై దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment