న్యూఢిల్లీ : అతిపెద్ద హవాలా అక్రమ డబ్బు లావావేవీలు చేస్తున్న ఢిల్లీకి చెందిన డీలర్ నరేష్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో దాదాపు 20 వేల కోట్ల లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి నరేష్ జైన్‌ను కోర్టు ముందు హాజరుపరుస్తామని తెలిపారు. దేశంలోనే ఇది అతిపెద్ద హవాలా, మనీ లాండరింగ్ కేసుల్లో ఒకటిగా తెలుస్తోంది. (వ్యాక్సిన్ హోప్- యూఎస్ దూకుడు)
షెల్ కంపెనీలు ఏర్పాటుచేసి పలు విదేశీ వ్యాపారాలతో సహా అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మరికొంత మంది నిందితుల వివరాలు త్వరలోనే బయటపెడతామన్నారు. గత కొన్నాళ్లుగా నరేష్ జైన్ పలు సంస్థలకు అక్రమంగా హవాలా డబ్బును మళ్లించినట్లు గుర్తించారు. గతంలోనూ ఇతనిపై ఈడీ సహా పలు కేసులు ఉన్నాయి. బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసి వేల కోట్లు రూపాయలను విదేశాలకు దారి మళ్లించినట్లు 2016లో ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులోనూ ప్రధానంగా నరేష్ జైనే ఉన్నాడని, మరికొంత మంది వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. (ప్రధాని మోదీ ట్విటర్ ఖాతా హ్యాక్!)
Comments
Please login to add a commentAdd a comment