Hawala racket
-
హైదరాబాద్‌లో హవాలా ముఠా గుట్టు రట్టు
-
హైదరాబాద్‌లో హవాలా ముఠా గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో అక్రమంగా తరలిస్తున్న హవాలా ముఠా గుట్టు రట్టయ్యయింది. టాస్క్ ఫోర్స్ , నార్త్ జోన్ టీంతో కలిసి హవాలా మనీ రాకెట్‌ను చేదించారు. నిందితులిద్దరిని హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 31లక్షల 26వేల నగదుతో పాటు యాక్టివా మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మనీష్ తోష్నివాల్ రాజస్థాన్‌కు చెందిన వాడని కొన్నేళ్ల క్రితమే నగరానికి వలస వచ్చినట్లు పోలీసులు తెలిపారు. విష్ణు బిరాదార్ అనే మరో నిందితుడి హస్తం కూడా ఉందని పేర్కొన్నారు. -
బెజవాడలో హవాలా దందా..
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ హవాలా ముఠాలకు హబ్‌గా మారింది. హవాలా, జీరో వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. వస్తు, ధన రూపంలో రూ.కోట్లలో లావాదేవీలు చప్పడులేకుండా చేస్తున్నారు. ఇదంతా జీఎస్టీ అధికారులకు, ఆదాయపన్ను శాఖాధికారులకు, పోలీసులకు తెలిసినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారని విమర్శలున్నాయి. అందుకు మామూళ్లే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.కోట్లలో వ్యాపారం వాణిజ్య నగరం విజయవాడ. ఈ నగరంలో బంగారం, వస్త్ర, చెప్పులు తదితర వ్యాపారాలకు ప్రసిద్ధి. మరీ ముఖ్యంగా బంగారం కొన్ని కుటుంబాలు రోజూ రూ.కోట్లలో వ్యాపారం చేస్తుంటారని ఇక్కడి వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇంచుమించు ఇదే తరహాలో వస్త్ర, చెప్పుల వ్యాపారం. వ్యాపారులు కేంద్ర, రాష్ట్రాలకు పన్నుల చెల్లింపుల నుంచి తప్పించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. వివిధ నగరాల నుంచి దుకాణాలకు తెప్పించుకునే సరుకులో సగానికి మాత్రమే బిల్లులు చూపుతూ.. మిగిలిన సగం సరుకు జీరో కింద ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు. అలాగే వ్యాపారులకు ఇచ్చే డబ్బును హవాలా(హుండీ) మార్గం ద్వారా యథేచ్ఛగా చెల్లింపులు చేస్తున్నారు. పశి్చమగోదావరి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న హవాలా డబ్బుపై మంగళవారం ఆకాశరామన్నలు పోలీసులకు పక్కా సమాచారం ఇవ్వడంతోనే వెలుగులోకి వచ్చింది. అడపాదడపా కేసులు.. జీరో, హవాలా వ్యాపారాలపై అడపాదడపా ఆకాశరామన్నలు అందిస్తున్న సమాచారంతో టాస్‌్కఫోర్స్ పోలీసులు ఈ ముఠాలను పట్టుకుంటున్నారు. వారికి అధికారాలు పరిమితంగానే ఉండటంతో సంబంధిత శాఖలకు ఈ కేసులను అప్పగించి చేతులు దులిపేసుకుంటున్నారు. ♦ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవాడలోని కొత్తపేట పరిధిలోని గణపతి రోడ్డులో ఈ కేఆర్ ఫ్యాషన్ వరల్డ్ షాపు రాజస్థాన్‌కు చెందిన జగదీష్ వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నారు. అతడు హవాలా మార్గం ద్వారా ఇతరులకు పంపాల్సిన రూ.35 లక్షలు తన షాపులో లెక్కిస్తుండగా కొత్తపేట పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఆదాయపన్ను శాఖకు సమాచారం ఇచ్చారు. ♦అదే నెలలో విజయవాడలోని వన్‌టౌన్ పరిధిలో జీరో వ్యాపారం కోసం ఈ నెల 12న ముంబాయి నుంచి మరుదూరు కొరియర్ సరీ్వస్‌కు వచ్చిన రూ.17.37 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను టాస్‌్కఫోర్స్ పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. వాటికి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో జీఎస్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ♦మే నెలలో ఢిల్లీ నుంచి విజయవాడ నగరానికి ట్రక్‌లో తరలిస్తున్న రూ.2.99 కోట్ల విలువైన నిషేధిత సిగరెట్లను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్(డీఆర్ఐ) అధికారులు విజయవాడ గ్రామీణ పరిధిలోని పి.నైనవరంలో పట్టుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం రాష్ట్ర జీఎస్టీ అధికారులకు అప్పగించారు. -
అతిపెద్ద హవాలా రాకెట్ గుట్టురట్టు
న్యూఢిల్లీ : అతిపెద్ద హవాలా అక్రమ డబ్బు లావావేవీలు చేస్తున్న ఢిల్లీకి చెందిన డీలర్ నరేష్ జైన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో దాదాపు 20 వేల కోట్ల లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి నరేష్ జైన్‌ను కోర్టు ముందు హాజరుపరుస్తామని తెలిపారు. దేశంలోనే ఇది అతిపెద్ద హవాలా, మనీ లాండరింగ్ కేసుల్లో ఒకటిగా తెలుస్తోంది. (వ్యాక్సిన్ హోప్- యూఎస్ దూకుడు) షెల్ కంపెనీలు ఏర్పాటుచేసి పలు విదేశీ వ్యాపారాలతో సహా అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మరికొంత మంది నిందితుల వివరాలు త్వరలోనే బయటపెడతామన్నారు. గత కొన్నాళ్లుగా నరేష్ జైన్ పలు సంస్థలకు అక్రమంగా హవాలా డబ్బును మళ్లించినట్లు గుర్తించారు. గతంలోనూ ఇతనిపై ఈడీ సహా పలు కేసులు ఉన్నాయి. బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసి వేల కోట్లు రూపాయలను విదేశాలకు దారి మళ్లించినట్లు 2016లో ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులోనూ ప్రధానంగా నరేష్ జైనే ఉన్నాడని, మరికొంత మంది వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. (ప్రధాని మోదీ ట్విటర్ ఖాతా హ్యాక్!) -
కేరళ గోల్డ్ స్కామ్‌కు హైదరాబాద్‌కు లింకు?
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న కేరళ బంగారం స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసుకు హైదరాబాద్‌తో లింకులు ఉన్నట్లు కస్టమ్స్ విభాగం గుర్తించిందని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ కేసులో అత్యంత కీలకమైన నగదు చెల్లింపులు హైదరాబాద్ నుంచే జరిగాయని అధికారులు అనుమానిస్తున్నారు. రూ. కోట్లాది విలువ చేసే బంగారం కొనేందుకు నిందితులు అడ్డదారుల్లో హవాలా మార్గాల్లో చెల్లిస్తారన్న విషయం తెలిసిందే. ఈ కేసులో రూ. కోట్లు హైదరాబాద్ నుంచి హవాలా రూపంలో దుబాయ్‌కి చెల్లింపులు చేశారన్న సమాచారంపై కస్టమ్స్ శాఖ కూడా కూపీ లాగుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులు స్వప్నా సురేశ్, సందీప్ నాయర్‌ను అరెస్ట్ చేసింది. కాగా గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కేరళలో పెను ప్రకంపనలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఏకంగా సీఎం కార్యాలయం ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్‌ను తొలగించారు. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఐటీ శాఖ ఉద్యోగి పాత్రపై ఆరోపణలు బయటపడిన వెంటనే శివకంర్‌పై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. ఈ నెల 6వ తేదీన దుబాయ్ నుంచి చార్టర్డ్ విమానంలో వచ్చిన కన్సైన్మెంట్ ద్వారా దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. దౌత్య మార్గంలో తరలిన రూ. 15 కోట్ల విలువైన బంగారం విమానాశ్రయంలో పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కేరళలో యూఏఈ కాన్సులేట్‌లో పనిచేసే ఓ మాజీ ఉద్యోగిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా.. ఇందులో ఐటీ విభాగంలో పనిచేసే స్వప్న సురేశ్ హస్తం ఉన్నట్టు వెల్లడించాడు. దీంతో రాష్ట్ర ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పరిధిలోని స్పేస్ పార్క్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా ఉన్న స్వప్న బంగారం తరలింపులో కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. -
భారత నావికులకు వలపు వల
ఈ ఏడాది జనవరిలో.. ఫేస్బుక్లో అనితా చోప్రా అనే పాక్ యువతి వేసిన వలలో ఆర్మీ జవాన్లు చిక్కుకుని మన సైనిక సమాచారాన్ని శత్రు దేశానికి చేరవేసిన ఘటన ప్రకంపనలు సృష్టించింది. దాయాది దేశమైన పాకిస్తాన్ భారత నౌకాదళ సమాచారాన్ని దోచుకున్న వైనం తాజాగా వెలుగు చూసింది. భారత నావికులకు ఫేస్బుక్ ద్వారా అమ్మాయిల్ని పరిచయం చేసి.. వారితో ఏకాంతంగా ఉన్నప్పటి సెక్స్ వీడియోలు తీసిన పాక్ గూఢచారి విభాగం.. వాటితో బెదిరింపులకు పాల్పడి.. నౌకాదళ సమాచారం సేకరిస్తూ దేశద్రోహ చర్యలకు పాల్పడింది. దీనిపై ఉప్పందడంతో నిఘా వర్గాలు నెల రోజుల పాటు నిర్వహించిన ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఏడుగురు ఇండియన్ నేవీ సెయిలర్స్ (నావికులు)తో పాటు ఒక హవాలా ఆపరేటర్‌ను అరెస్ట్ చేశారు. హనీట్రాప్ ఇలా! నౌకాదళ సమాచారాన్ని తెలుసుకునేందుకు శత్రు దేశమైన పాకిస్తాన్ కుట్ర పన్నింది. ఇందుకు 2017లో భారత నావికులను లక్ష్యంగా చేసుకుంది. ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకుని కొందరు యువతులతో హనీ ట్రాప్ (వలపు వల) వేసింది. ఇలా కొందరు యువతులు ఫేస్బుక్ ద్వారా నావికులతో పరిచయం పెంచుకున్నారు. తాము వ్యాపార వేత్తలమంటూ వారు నావికుల్ని నమ్మించి వారితో శారీరక సంబంధం వరకు వెళ్లారు. నావికులతో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో పాక్ ఏజెంట్లు ఆ దృశ్యాలను రహస్యంగా వీడియోలు చిత్రీకరించారు. వాటిని చూపించి పాక్ గూఢచర్య విభాగం భారత నావికుల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టింది. భారత నౌకాదళ సమాచారం తమకు చేరవేయాలని, ఇందుకు ప్రతిఫలంగా హవాలా ద్వారా సొమ్ము కూడా ఇస్తామని ఆశ చూపడంతో నేవీ సెయిలర్స్ వారికి లొంగిపోయారు. ఏడాది నుంచి సమాచారం ఈ సెయిలర్స్ 2018 అక్టోబర్ నుంచి పాకిస్తాన్‌కు సమాచారం అందించడం ప్రారంభించినట్లు నిఘా వర్గాలు గుర్తిం చాయి. యుద్ధ నౌకలు, సబ్మెరైన్ల సమాచా రాన్ని శత్రు దేశానికి చేరవేసినట్లు సమాచారం. ఏ యుద్ధ నౌక ఎక్కడ ఉంది, వివిధ జలాంతర్గాముల ప్రెజెంట్ స్టేటస్ ఏమిటి.. తదితర కీలక సమాచారం సెయిలర్లు దాయాది దేశానికి చేరవేశారు. సమాచారం ఇచ్చిన ప్రతి నెలా వారికి పాక్ ఏజెంట్లు హవాలా రూపంలో డబ్బులు అందజేసేవారు. ఇందుకోసం ఒక హవాలా ఆపరేటర్‌ను సైతం నియమించారు. ఒకరికి తెలియకుండా మరొకరి ద్వారా ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు. ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’తో బట్టబయలు భారత నౌకాదళంలో కొందరు దేశద్రోహులున్నారని అధికారిక వర్గాలకు రహస్య సమాచారం అందింది. నౌకాదళ నిఘా వర్గాలు 4 నెలల క్రితం ఓ సెయిలర్ ఫోన్ మాట్లాడుతుండగా.. రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నట్లు గుర్తించాయి. దీనిపై దర్యాప్తు చేపట్టాయి. మిగిలిన వారిపైనా నిఘా పెంచగా.. ఏడుగురు నావికులు వేర్వేరు మహిళలతో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. వారి ఫేస్బుక్ సంభాషణల్నీ గమనించారు. దీంతో ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ), ఏపీ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్, నేవీ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ మొదలు పెట్టాయి. హవాలా ద్వారా డబ్బులు తీసుకుంటున్న సమయంలో నావికుల్ని వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. 7 నేవీ సెయిలర్స్‌తో పాటు ఒక హవాలా ఆపరేటర్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు. వీరిని గూఢచర్యం కేసులో అరెస్ట్ చేసి.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.వారిలో కర్ణాటకకు చెందిన ఇద్దరు, ముంబైకి చెందిన ఇద్దరు, విశాఖకు చెందిన ముగ్గురు నౌకాదళ సిబ్బందితోపాటు ముంబైకి చెందిన ఒక హవాలా ఏజెంట్ ఉన్నారు. మరికొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నిందితుల్ని విజయవాడలోని ఎన్ఐఏ కోర్టుకు తరలించగా.. జనవరి 3 వరకూ రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. వీరి నుంచి పెద్ద మొత్తం లో హవాలా సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
వెలుగులోకి రూ. 3,300 కోట్ల హవాలా రాకెట్!
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ అధికారులు రూ.3,300 కోట్ల విలువైన హవాలా రాకెట్‌ను గుర్తించినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. మౌలిక సదుపాయాల రంగంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థల పాత్ర ఇందులో ఉన్నట్టు పేర్కొంది. కాకపోతే ఆయా కంపెనీల వివరాలను సీబీడీటీ గోప్యంగా ఉంచింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ తదితర నగరాలకు ఈ రాకెట్ విస్తరించినట్టు తెఇపింది. భారీ పన్ను ఎగవేతలను గుర్తించేందుకు ఈ నెల మొదటి వారంలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, ఈరోడ్, పుణె, ఆగ్రా, గోవాలోని 42 ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించినట్టు వెల్లడించింది. ‘‘సోదాలు ఫలితాన్నిచ్చాయి. బడా కార్పొరేట్లు, హవాలా ఆపరేటర్ల మధ్య ఉన్న బంధం తాలూకూ ఆధారాలు లభించాయి. బోగస్ కాంట్రాక్టుల ద్వారా రూ.3,300 కోట్ల మేర నిధులను కాజేసిన వ్యవహారం వెలుగు చూసింది’’అని సీబీడీటీ తన ప్రకటనలో తెలిపింది. బోగస్ కాట్రాక్టులు, బిల్లుల ద్వారా ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలు నడిపించిన నగదు ప్రవాహ రాకెట్ వ్యవహారం వెలుగుచూసినట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వ్యక్తికి రూ.150 కోట్ల నగదు చెల్లింపునకు సంబంధించి ఆధారాలు కూడా లభించినట్టు తెలిపింది. -
హవాలా రాకెట్ గుట్టు రట్టు
సాక్షి, సిటీబ్యూరో: హవాలా రాకెట్ గురించి సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం ముగ్గురిని అదుపులోకి తీసుకుని రూ.70.63 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ పి.రాధాకిషన్‌రావు కథనం ప్రకారం... ఏపీలోని గుడివాడకు చెందిన కె.నరేష్ కూకట్‌పల్లిలో ఉంటూ డెయిరీ వ్యాపారం చేస్తున్నారు. నగరంలోని హబ్సిగూడ, యాకత్పురాలకు చెందిన ఖాసిం మహ్మద్ రజా, హైదర్ రజాలు బేగంపేటలోని ఏజీఎస్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థలో మేనేజర్, ఆఫీస్‌బాయ్‌గా పని చేస్తున్నారు. వ్యాపారి అయిన నరేష్‌కు ఏజీఎస్ సంస్థ యజమాని మూర్తి స్నేహితుడు. నరేష్ సమీప బంధువైన విజయ శంకర్ నగరానికి చెందిన కీర్తి అనే వ్యక్తికి రూ.70.63 లక్షలు పంపాలని భావించాడు. ఈ మొత్తాన్ని నరేష్ సూచనల మేరకు విజయ శంకర్ ఏజీఎస్ సెక్యూరిటీస్ సంస్థ ఖాతాకు పంపారు. డబ్బు డ్రా చేసిన ఆ సంస్థకు చెందిన ఖాసిం, హైదర్లు ఆ మొత్తం డ్రా చేసి తీసుకొచ్చి నరేష్‌కు ఇవ్వడానికి ప్రయత్నించారు. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం మాలకుంట వద్ద మాటువేసి ముగ్గురిని పట్టుకుంది. వీరి నుంచి నగదుతో పాటు వాహనాలు స్వాధీనం చేసు కుంది. తదుపరి చర్యల నిమిత్తం కేసును బేగంబజార్ ఠాణాకు అప్పగించారు. -
20 వేల కోట్ల హవాలా గుట్టు రట్టు
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు ఢిల్లీలో దాడులు, సర్వేలు చేసి రూ. 20 వేల కోట్ల మనీ లాండరింగ్ హవాలా రాకెట్ల గుట్టు రట్టు చేసినట్లు సోమవారం వెల్లడైంది. ఐటీ ఢిల్లీ దర్యాప్తు విభాగం అధికారులు గత కొన్ని వారాలుగా పాత ఢిల్లీలోని పలు చోట్ల ఈ సర్వేలు, దాడులు చేసినట్లు ఐటీ విభాగంలోని ఓ అధికారి వెల్లడించారు. మూడు ముఠాలు ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఈ దాడుల్లో బయటపడిందని చెప్పారు. నయా బజార్ ప్రాంతంలో రూ. 18 వేల కోట్ల విలువైన నకిలీ బిల్లులును గుర్తించామనీ, ఈ బిల్లులను సృష్టించడం కోసం ఓ ముఠా 12 నకిలీ కంపెనీలను ఏర్పాటు చేసిందని అధికారి తెలిపారు. ఇక రెండో ముఠా పూర్తి వ్యవస్థీకృతంగా మనీ లాండరింగ్‌కు పాల్పడిందనీ, షేర్ మార్కెట్లలో ప్రస్తుత లావాదేవీలను పాత షేర్ల అమ్మకాలుగా చూపించి క్యాపిటల్ గెయిన్స్ ప్రయోజనాలను పొందారని చెప్పారు. ఈ మోసం విలువ వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నామనీ, అయితే చాలా ఏళ్లుగా ఈ మోసం జరుగుతున్నందున ఇంకా భారీ మొత్తంలోనే అక్రమ లావాదేవీలు జరిగి ఉండొచ్చని అధికారి అనుమానం వ్యక్తం చేశారు. మరో ముఠా రహస్యంగా విదేశీ బ్యాంకు ఖాతాలను కలిగి ఉడటంతోపాటు ఎగుమతుల వాస్తవ ధర కన్నా బిల్లుల్లో ఎక్కువ ధర చూపి నకిలీ డ్యూటీ, జీఎస్టీ ప్రయోజనాల పొందిందనీ, ఈ మోసం విలువ రూ. 1,500 కోట్లకు పైగా ఉంటుదని అధికారి తెలిపారు. సోదాల్లో సంతకాలు చేసిన, చేయని కొన్ని పత్రాలు, ఒప్పందాలు, ఆర్థిక వివాదాల పరిష్కార పత్రాలు తదితరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
అప‘కీర్తి’ హవాలా C/o నరసాపురం
నరసాపురం: నరసాపురం పేరు చెప్పగానే సుదూర తీరప్రాంతం.. గోదావరి అందాలు.. అంతర్జాతీయ లేసు అల్లికలు.. రాజకీయ ఉద్దండులు.. సినీ ప్రముఖులు గుర్తుకు వస్తారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే హవాలా వ్యాపారం పేరుతో నరసాపురం మార్మోగిపోతోంది. ఎక్కడెక్కడో అక్రమంగా తరలిస్తున్న డబ్బు సంచులు బయటపడుతున్నా నరసాపురం పేరు వినిపిస్తోంది. ముఖ్యంగా జీన్దత్ జ్యూయలరీ షాపు, దాని యజమాని కీర్తి కుమార్‌జైన్ పేరు తెరమీదకు వస్తోంది. బుధవారం నెల్లూరు జిల్లా తడ వద్ద కారులో తరలిస్తున్న రూ.6.52 కోట్లను పోలీసులు పట్టుకోగా ఈ మొత్తం కీర్తికుమార్ జైన్‌ది కావడం గమనార్హం. కళలు, సాహిత్యం వంటి రంగాల్లో కీర్తి గడించిన ప్రాంతం చట్టవ్యతిరేక వ్యవహారాలతో మారుమోగడం జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లా తడలో పోలీసులు పట్టుకున్న నగదులో విదేశీ కరెన్సీ కూడా భారీగా ఉండటంతో హ వాలా వ్యాపార దందా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్ల క్రితం బెంగళూరులో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ అంశంలో కూడా ఇదే వ్యక్తి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం కలిగించింది. సొమ్ములెక్కడదొరికినా.. ఇక్కడే లింకు 2014 ఎన్నికల సమయంలో భీమవరం వద్ద భారీగా నగదును జీన్దత్ జ్యూయలరీ షాపు యజమాని నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు హవాలా మార్గంలో సొమ్ము సమకూర్చడానికే తరలించినట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆ కేసు ఈడీ వద్ద ఉంది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల సమయంలోనూ అదే షాపు గుమాస్తాలు కారులో తరలిస్తున్న రూ.7 కోట్లను కరీంనగర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. సొమ్ములకు ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేశారు. మళ్లీ ఇప్పుడు తడలో రూ.6.52 కోట్లు పట్టుబడ్డ వ్యవహారం సంచలనం రేపింది. 2006లో ఇదే షాపునకు బిల్లులు లేకుండా తరలిస్తున్న 20 కిలోల బంగా రం, 500 కిలోల వెండి ఆభరణాలను తూర్పుగోదావరిలో పోలీసులు పట్టుకున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే ఎక్కువ సందర్భాల్లో అసలు కేసులు ఏమయ్యాయో కూడా తెలియని పరిస్థితి. బిల్లులు పుట్టించి పోలీసులు పట్టుకున్న సొమ్మును తిరిగి తెచ్చుకోవడం హవాలాలో ఆరితేరిన బులియన్ వ్యాపారులకు పెద్ద కష్టం కాదనే వాదన ప్రచారంలో ఉంది. అసలు ఏం జరుగుతోంది పాత కారు, అందులో ప్రత్యేక అరలో కోట్ల కొద్దీ డబ్బు కట్టలను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే హవాలా వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు సొమ్మును ఎంత పకడ్బందీగా తరలిస్తున్నారో అర్థమవుతుంది. హోల్‌సేల్ బంగారం కొనుగోలును వ్యాపారులు బ్యాంకు డీడీ ద్వారా చేయాలి. అయితే డబ్బు కట్టలతో పట్టుబడుతున్న వారు బంగారం కొనుగోలుకు సొమ్ము తీసుకువెళుతున్నామని చెబుతున్నారు. ఇందులో వాస్తవం లేదనేది అర్థమవుతోంది. అయితే దొంగచా టుగా సినీఫక్కీలో కారులో ప్రత్యేక అర చేయించి సొమ్ము పెట్టడం ఏమిటనే ప్రశ్న తెరమీదకు వస్తుంది. విషయాన్ని లోతుగా అధ్యయనం చేస్తే బంగారం వ్యాపారాన్ని అడ్డుగా పెట్టి కొందరు అక్రమ వ్యాపారాలను యథేచ్ఛగా సాగిస్తున్నారని అర్థమవుతోంది. ఇది పోలీసు, ఆదాయశాఖ, కస్టమ్స్ ఇలా అనేక శాఖలకు ముడిపడి ఉన్న అంశం. మరి తరచూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నా? ఎలాంటి కేసులు నమోదు కావడం లేదంటే ఆయా శాఖల విశ్వసనీయతపై కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వ్యాపారం విస్తరించిందా? ఇటీవల నోట్ల రద్దు, బ్యాంకింగ్ వ్యవస్థలో వచ్చిన సవాలక్ష ఆంక్షల నేపథ్యంలో నగదు లభ్యత గగనంగా మారింది. అక్ర మ వ్యాపారాలు సాగించే వారు అన్నీ బ్యాంకు లావాదేవీల ద్వారా సాగించలేని పరిస్థితి. వీరికి పెద్ద మొత్తంలో నగదు అవసరమైనప్పుడు ఇలాంటి హవాలా వ్యాపారులను ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలో ఏ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నా, పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చాల్సి వచ్చినా ఇక్కడి హవాలా వ్యాపారులు వ్యవహారాలు నడుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల హవాలా వ్యాపారం పరిధి భారీగా పెరిగినట్టు సమాచారం. ఓ వైపు డిజిటల్ కరెన్సీ ఉద్యమం, మరోవైపు ఆర్థిక లావాదేవీల్లో సంస్కరణల నేపథ్యంలో బ్యాంకుల వద్ద కూడా కనిపించనంతగా డబ్బు సంచులు వీరికి ఎలా సమకూరుతున్నాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగులుతోంది. -
లాకర్లలో బయటపడ్డ రూ 25 కోట్లు
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఐటీ అధికారుల దాడుల్లో ప్రైవేట్ లాకర్ల నుంచి రూ 25 కోట్లు బయటపడ్డాయి. ఢిల్లీలో ఆదివారం ఏకకాలంలో పది ప్రాంతాల్లో ఆదాయ పన్ను అధికారులు దాడులు చేపట్టారు. హవాలా వ్యాపారులు తమ సొమ్మును ప్రైవేట్ లాకర్లలో దాచుకుంటున్నారని ప్రాధమిక విచారణలో వెల్లడైనట్టు అధికారులు తెలిపారు. దాడుల్లో పట్టుబడిన మొత్తం పొగాకు వ్యాపారులు, కెమికల్ ట్రేడర్లు, డ్రైఫ్రూట్ డీలర్లతో సహా ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో కొందరు ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన సొమ్ముగా భావిస్తున్నారు. వీరు పెద్ద ఎత్తున హవాలా లావాదేవీలు సాగించడంతో పాటు, వీరికి అంతర్జాతీయ సంబంధాలున్నాయని చెబుతున్నారు. కాగా ఇది ఈ ఏడాది ఐటీ అధికారులు ఢిల్లీలో చేపట్టిన మూడో భారీ లాకర్ ఆపరేషన్. కాగా ఈ ఏడాది జనవరిలో ఢిల్లీలోని సౌత్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలోని ప్రైవేట్ లాకర్లలో ఐటీ అధికారులు దాడులు జరిపి రూ 40 కోట్ల నగదును సీజ్ చేశారు. -
హైదరాబాద్‌లో కట్టల కట్టలు డబ్బు పట్టివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం అనుమానాలకు తావిస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లో ఓ అపార్ట్మెంట్లో 7 కోట్ల 71 లక్షల 25 వేల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైఫాబాద్‌లో తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఇద్దరు అనుమానితులు దొరికారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా నగదును గుర్తించారు. అయితే తాము దిగుమతి, ఎగుమతి వ్యాపారం చేస్తున్నామని పోలీసులకు నిందితులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తం ఎక్కడి నుంచి తెచ్చారు, ఇంట్లో ఎందుకు ఉంచారన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు రాకపోవడంతో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కంపెనీ సంబంధించిన వివరాలు లేకపోవడంతో రాజ్ పురోహిత్, సునీల్‌కుమార్ ఆహుజ, ఆశిష్ కుమార్ ఆహుజ, మహుమ్మద్ అజాంలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రివాల్వర్, వొల్వో కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 171(బీ), 468, 471, 420, 120(బీ) సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీ, ముంబై నుంచి హవాలా మార్గంలో డబ్బును తీసుకొచ్చివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు రాజకీయ నాయకులెవరైనా ఈ డబ్బును తెప్పించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.700కోట్ల హవాలా రాకెట్ : ఈడీ దాడులు
సాక్షి, న్యూఢిల్లీ: కోట్లాది రూపాయల భారీ హవాలా రాకెట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. అంతర్జాతీయ హవాలా రాకెట్ విలువ రూ .700 కోట్లకు పైమాటేనని తెలుస్తోంది. దుబాయ్‌కి చెందిన హవాలా ఆపరేటర్ పంకజ్ కపూర్, అతని అనుచరులపై ఫెమా చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఢిల్లీ , ముంబై నగరాల్లో 11 ప్రదేశాలలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 29.19 లక్షల నగదును,ఆదాయ పన్ను పత్రాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, హవాలా లావాదేవీల రికార్డులతో పాటు 150 షెల్ సంస్థలకు సంబంధించిన స్టాంపు పత్రాలు, వస్తువులను కూడా ఈడీ సీజ్ చేసింది. వీటితోపాటు ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్లు, కస్టం హౌస్ ఏజెంట్ కార్యాలయాలలో కూడా దాడులు నిర్వహించారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోందని ఈడీ వెల్లడించింది. కపూర్‌కు చెందిన 50కిపైగా కంపెనీలు భారతీయ కంపెనీలు రాధికా జెమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ హవాలా లావాదేవీలు నిర్వహిస్తున్నాయని ఈడీ ప్రాధమిక విచారణలో తేలింది. భారతదేశంలో నగదును సేకరించి, డైమండ్ల దిగుమతి పేరుతో విదేశాల్లోని సంస్థలకు జమ చేస్తున్నాయని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఈ విదేశీ కంపెనీలు కూడా పంకజ్ కపూర్ నియంత్రణలోనే ఉన్నాయని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లావాదేవీలకు సంబంధించి వివరాలను వెరిఫై చేస్తున్నామనీ, ఖాతాదారుల నుండి కూడా వివరణలు కోరనున్నామని తెలిపారు. అలాగే రూ .3,700 కోట్ల మరోహవాలా రాకెట్ కేసులో పంకజ్ కపూర్‌ను విచారిస్తున్నట్టు ఈడీ తెలిపింది. -
అందగత్తెతో ఎస్ఐ వీడియో సంభాషణ
సాక్షి, చెన్నై: హవాలా మోసం వ్యవహారానికి సంబంధించి ఓ అందగత్తెతో ఎస్ఐ ఆడియో వాట్సప్‌లో విడుదలై సంచలనం కలిగిస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి పలువురు పోలీసు అధికారులు పట్టుబడనున్నట్లు సమాచారం. శనివారం వెల్లడైన వివరాల మేరకు తమిళనాడు విల్లుపురం జిల్లా స్పెషల్ క్రైంబ్రాంచిలో ఎస్ఐగా పనిచేస్తున్న పూంగుండ్రన్కు నకిలీ నోట్లు, బంగారు బిస్కెట్లు, కార్ల మోసానికి పాల్పడే బెంగళూరు యువతి ప్రియతో సంబంధాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా పలువురు ఉన్నతాధికారులకు ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉండడంతో ఎస్ఐ పూంగుండ్రన్ ముఖ్య వ్యక్తిగా చలామణి అయ్యాడు. బెంగళూరు హవాలా ప్రియకు, పోలీసు ఎస్ఐ పూంగుండ్రన్కు నగదు లావాదేవీలలో వివాదం ఏర్పడడంతో ఎస్ఐ ప్రియకు హత్యా బెదిరింపులు చేసిన ఆడియో వాట్సప్‌లో విడుదలై సంచలనం కలిగించింది. ఈ సంభాషణలో పూంగుండ్రన్ తాను పలువురి దగ్గర నగదు తీసుకుని నీకిచ్చానని, అయితే చెప్పిన విధంగా కార్లు, బంగారం ఇవ్వకుండా మోసగిస్తున్నట్లు ఆరోపించాడు. ఈ వ్యవహారంలో పలువురు అధికారులు పట్టుబడనున్నట్లు సమాచారం. -
‘హుండీ’ దందా.. వెయ్యి కోట్లు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమంగా ద్రవ్యమార్పిడికి పాల్పడే హవాలా, హుండీ ముఠాల వార్షిక టర్నోవర్ రూ.వెయ్యి కోట్లు ఉండొచ్చని సిటీ పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటికీ గుర్తించిన ఐదు ముఠాల్లో ఓ గ్యాంగ్‌ను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారన్నారు. వీరి టర్నోవరే ఏడాదికి రూ.200 కోట్ల వరకు ఉంటుందన్నారు. మొత్తం ఆరుగురు నిందితుల్ని పట్టుకుని వారి నుంచి రూ.1.4 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సోమవారంతన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ‘వజ్రాల’కన్నా ‘హుండీ’మేలని... రెండు దేశాల మధ్య జరిగే అక్రమ ద్రవ్యమార్పిడిని హవాలా అని, దేశంలోని రెండు ప్రాంతాల మధ్య జరిగే దాన్ని హుండీ అని అంటారు. గుజరాత్‌కు చెందిన జయేశ్ కుమార్ పటేల్ అలియాస్ అతుల్ 2009లో హైదరాబాద్‌కు వలసవచ్చాడు. అబిడ్స్ కేంద్రంగా వజ్రాలు, బంగారం వ్యాపారం చేసే సమయంలో కొన్ని అక్రమ ద్రవ్యమార్పిడి ముఠాలతో పరిచయం ఏర్పడింది. దీంట్లో లాభాల గురించి తెలుసుకుని చిరాగ్ అలీ లైన్లో ఓ కార్యాలయం అద్దెకు తీసుకుని ఏకంగా హుండీ దందా చేసే కంపెనీ తెరిచాడు. దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న హుండీ వ్యాపారులు, ఏజెంట్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. 2013 నుంచి ఈ దందా చేస్తున్న పటేల్‌ను 2014లో ఓసారి ఐటీ అధికారులు పట్టుకున్నా తీరు మార్చుకోలేదు. వాట్సాప్‌ను విరివిగా వాడేసుకుంటూ... ప్రధానంగా బడా వ్యాపారులు పన్ను ఎగ్గొట్టడానికి, నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి హవాలా, హుండీ మార్గాలను ఆశ్రయిస్తుంటారు. నగరానికి చెందిన రియల్టర్లు, బంగారం వ్యాపారులతో పాటు బడా వ్యాపారులకు పటేల్ సహకరిస్తున్నాడు. నగదు తీసుకునే పటేల్ రూ.50 లేదా రూ.100 నోటు నంబర్‌ను చెప్పడమో, వాట్సాప్ ద్వారా షేర్ చేయడమో చేస్తాడు. దీన్ని సదరు సంస్థకు చెందిన వ్యక్తులు నగదు రిసీవ్ చేసుకోవాల్సిన వారికి వాట్సాప్ ద్వారా పంపిస్తారు. పటేల్ సైతం అదే నంబర్‌ను ఆయా నగరాల్లో ఉన్న తమ ఏజెంట్‌కు పంపిస్తాడు. నగదు తీసుకోవాల్సిన సంస్థ ప్రతినిధి ఈ నంబర్‌ను అక్కడి ఏజెంట్‌కు చెప్తే చాలు ఆ మొత్తం అతడికి అందుతుంది. రూ.లక్షకు 600 వరకు కమీషన్... దందా చేసినందుకు హవాలా, హుండీ ఏజెంట్లు రూ.లక్షకు రూ.600 వరకు కమీషన్ తీసుకుంటారు. ఈ పర్సెంటేజ్లో నగదు తీసుకున్న ఏజెంట్, డెలివరీ ఇచ్చిన ఏజెంట్ చెరి సగం తీసుకుంటారు. హవాలా, హుండీ ఏజెంట్ల మధ్య లావాదేవీలన్నీ 3 నెలలకోసారి జరుగుతాయి. ఈ మొత్తాన్ని నగదు, విలువైన వస్తువుల రూపంలో మార్పిడి చేసుకుంటారు. పటేల్ గ్యాంగ్ ప్రతి ఏడాదీ రూ.200 కోట్ల వరకు టర్నోవర్ చేస్తోంది. మిగిలిన ముఠాలూ ఇలాగే రెచ్చిపోతున్నాయి. పటేల్ దందాపై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు ఉప్పందడంతో ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు కేఎస్ రవి, బి.శ్రవణ్‌కుమార్, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్ వారం రోజులుగా నిఘా ముమ్మరం చేశారు. కంపెనీలకు డెలివరీ చేయగా... నగరానికి చెందిన కన్నయ్య అగర్వాల్ రాయలసీమ స్టీల్ రీ–రోలింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఒడిశాకు చెందిన నిమిశ్.. స్కాన్ ఎనర్జీ అండ్ పవర్ లిమిటెడ్ సంస్థకు యజమాని. దీనికి బంజారాహిల్స్‌లో ఓ బ్రాంచ్ ఉంది. ఈ సంస్థలూ ఇటీవల రాయ్‌పూర్, ఒడిశాల్లోని హోల్‌సేల్ వ్యాపారులకు ఐరన్ డెలివరీ చేశాయి. వాటి నుంచి రావాల్సిన చెల్లింపులు హుండీ రూపంలో పటేల్ కంపెనీకి వచ్చాయి. ఈ మొత్తాన్ని డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేశాడు. దీనిపై టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. ‘స్కాన్ ఎనర్జీ’ఉద్యోగి బి.విఘ్నేశ్వర్, రాయలసీమ సంస్థ ఉద్యోగి గణేశ్ సత్యనారాయణ సబూ వేర్వేరుగా పటేల్ నుంచి డబ్బు తీసుకుని వస్తుండగా టాస్క్‌ఫోర్స్ పట్టుకుంది. 2 వాహనాలతో పాటు రూ.75 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. వీరిచ్చిన సమాచారంతో పటేల్ కార్యాలయంతో పాటు స్కాన్ సంస్థలో టాస్క్‌ఫోర్స్ సోదాలు చేసింది. అప్పటికే కొంత మొత్తం డెలివరీ... విఘ్నేశ్వర్ అప్పటికే కొంత నగదును తన కార్యాలయంలోని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ ధడ్చీకి అప్పగించినట్లు చెప్పాడు. అరుణ్‌ను పట్టుకున్న అధికారులు రూ.47.35 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పటేల్ కంపెనీపై దాడి చేసి అతడితో పాటు ఉద్యోగి ప్రదీప్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని రూ.18.45 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్నవారితో పాటు స్వాధీనం చేసుకున్న నగదునూ ఆదాయపు పన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజేశ్వర్‌రెడ్డికి అప్పగిస్తున్నామని పోలీసు కమిషనర్ చెప్పారు. సిటీలో ఉన్న మిగిలిన అక్రమ ద్రవ్యమార్పిడి ముఠాల కోసం గాలిస్తున్నామని తెలిపారు. కన్నయ్య, నిమిశ్కూ నోటీసులు జారీ చేస్తామని రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. -
హైదరాబాద్‌లో భారీ హవాలా గ్యాంగ్ అరెస్ట్
-
హైదరాబాద్‌లో భారీ హవాలా రాకెట్ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలో భారీ హవాలా రాకెట్ గుట్టురట్టయింది. బడా వ్యాపారులకు వాహలా రూపంలో డబ్బు సమకూరుస్తున్న హవాలా వ్యాపారి పటేల్ నుంచి పోలీసులు రూ. కోటి 40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహలా రాకెట్‌కు సంబంధించి అబిడ్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఐటీ అధికారుల సాయంతో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. గుజరాత్‌కు చెందిన పటేల్ తన వాహలా రాకెట్ ద్వారా బడా వ్యాపారులకు పెద్దమొత్తంలో డబ్బు సమకూరుస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
పాతబస్తీలో హవాలా గుట్టురట్టు
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో హవాలా రాకెట్ గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం రట్టు చేశారు. భారీగా నగదును తరలిస్తున్న హవాలా ముఠాకు చెందిన నలుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2 కోట్ల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. హవాలా ముఠా సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. -
చాపకింద నీరులా.. ‘హవాలా’!
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హవాలా మార్గంలో పెద్ద ఎత్తున సొమ్ము రాష్ట్రంలోకి చాప కింద నీరులా చేరుతోంది. కమీషన్ కోసం ఆశపడి పలువురు యువకులు ఈ మార్గంలో సొమ్ము తరలించేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో పోలీసులకు కూడా ఈ హవాలా రాకెట్‌ను అరికట్టడం కష్టంగా మారుతోంది. ప్రస్తుతం ఎన్నికల్లో ఖర్చుల నిమిత్తం పలువురు రాజకీయ నాయకులు లెక్కకు మించి సొమ్ము ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీనికోసం వివిధ మార్గాల్లో సొమ్మును సేకరించడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ‘హవాలా’ సొమ్ము వరదలా రాష్ర్టంలోకి చేరుతోంది. దీంతో పోలీసులు అప్రమత్తమై డేగ కళ్లతో సోదాలు చేస్తున్నారు. ఇటీవల భాండూప్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ నితిన్ గిజే నేతృత్వంలోని బృందం దాడుల్లో రూ.25 లక్షల నగదు పట్టుబడింది. ఈ మొత్తాన్ని కువైట్ నుంచి హవాలా మార్గం ద్వారా భారత్‌కు తరలించినట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం భాండూప్‌లోని సోనాపూర్ ప్రాంతంలో కూరగాయల సంచిలో రూ.25 లక్షలు తీసుకుని ఆటో వెళుతున్నట్లు సమాచారం అందింది. దీంతో నితిన్ నేతృత్వంలోని బృందం డబ్బును తీసుకెళుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మహబూబ్ అలీఖాన్ (60), ఇనాముల్ ఖాన్ (32), రాంప్రసాద్ యాదవ్ (36)గా గుర్తించారు. ఈ మొత్తాన్ని తన కుటుంబ సభ్యుడొకరు కువైట్ నుంచి తీసుకుని వచ్చినట్లు మహబూబ్ వెల్లడించాడు. ప్రతీ జిల్లాలో ఇలా హవాలా మార్గంలో డబ్బు తీసుకొచ్చేవారు దాదాపు వందకుపైనే ఉన్నట్లు వీరు వెల్లడించారు. కమీషన్ డబ్బులకు ఆశపడి పలువురు యువకులు ఈ ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు రూ.2.72 కోట్ల సొమ్ము హవాలా మార్గంలో వచ్చినట్లు పట్టుబడిన ఓ ఏజంట్ తెలపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డబ్బు.. మంచినీళ్ల ప్రాయం ఎలాంటి ఎన్నికలు జరిగినా రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం పరిపాటిగా మారింది. ఇందులో కొంత డబ్బు అధికారికంగా ఖర్చు చేయగా ఎక్కువ శాతం డబ్బు గుట్టుచప్పడు కాకుండా చేస్తారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ డబ్బులు ఖర్చు చేయడం మరింత ఎక్కువవుతుంది. ఈ శాసనసభ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సొంతంగా బరిలో దిగడంవల్ల అభ్యర్థులకు విజయం కత్తిమీద సామే. ముఖ్యంగా ఈ ఎన్నికలను వారు సవాలుగా తీసుకుని శక్తినంతా కూడగట్టుకుని ప్రచారాలు చేస్తున్నారు. సభలు, ర్యాలీలు, ఇంటింటికి తమ గురించి ప్రచారం చేయడం తదితరాలకు ప్రతీ అభ్యర్థికి సుమారు రూ.8-10 కోట్లు వృథా కానున్నాయి. నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఖర్చు ఇలా ... 1. ప్రతి సంఘానికి, హౌసింగ్ సొసైటీ సంస్థలకు రూ.50- 60 వేలు రహస్యంగా చెల్లిస్తారు. 2. ప్రతి ప్రచార కార్యక్రమానికి వచ్చే ఒక్కో అద్దె కార్యకర్తకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. 3. మహిళా సంఘాలకు రహస్యంగా రూ.10-15 వేలు చెల్లిస్తారు. 4. రోజూ భోజనం, అల్పాహారానికి రూ.15-20 వేలు ఖర్చు. 5. ఆఖరు రోజు ఒక్కో ఓటరుకు రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేల వరకు గుట్టుచప్పుడు కాకుండా ఇస్తారు. 6. ఎన్నికల రోజు పార్టీ బూత్‌లో కూర్చుండే ఒక్కో కార్యకర్తకు రూ.1,500, పదాధికారికి రూ.4-5 వేలు చెల్లిస్తారు. 7. తాత్కాలిక పార్టీ బూత్ నిర్మాణానికి దాదాపు రూ. మూడు వేలు ఖర్చు. -
హవాలా రాకెట్‌తో చతుర్లుకాదు!
హైదరాబాద్: హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం గుట్టురట్టు చేసిన హవాలా రాకెట్ వ్యవహారాన్ని ఆర్థిక నేరాల ప్రత్యేక దర్యాప్తు విభాగం ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) లోతుగా ఆరా తీస్తోంది. ఈ రాకెట్‌ను నిర్వహిస్తున్న హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దుబాయ్ కేంద్రంగా లావాదేవీలు నడుపుతున్నట్లు బయటపడటంతో అండర్‌వరల్డ్ లింకులపై ప్రధానంగా దష్టి పెట్టింది. దర్యాప్తులో భాగంగా ఈడీ సోమ, మంగళవారాల్లో నగరంలోని విజయ్‌నగర్ కాలనీ, మెదక్ జిల్లాలోని పటాన్‌చెరులతో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న హీరా గ్రూప్ కార్యాలయాలపై దాడులు నిర్వహించి పలు రికార్డులు స్వాధీనం చేసుకుంది. వీటిలోని లావాదేవీలను ఈడీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న సంస్థ సీఈఓ షేక్ నౌహీరాతో పాటు రాకెట్లో కీలక సూత్రధారిగా ఉన్న లక్ష్మణ్ కోసం గాలిస్తున్నారు. పన్ను ఎగ్గొట్టడంతో పాటు అసాంఘిక కార్యకలాపాల కోసం దేశంలో అంతర్గతంగా జరిగే అక్రమ ద్రవ్యమార్పిడిని హుండీ అని, రెండు దేశాల మధ్య జరిగే దాన్ని హవాలా అని అంటారు. దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్న హీరా గ్రూప్ బంగారం, వస్త్రాలు తదితర వ్యాపారాల ముసుగులో హవాలా వ్యాపారం చేస్తోందని ఈడీ గుర్తించిది. ముంబైకు చెందిన పటేల్ ప్లాస్టిక్స్ ఇండస్ట్రీస్ దీనికి ప్రధాన ఏజెంట్‌గా వ్యవహరిస్తోంది. గుజరాత్‌లోని పలు సంస్థలతో సంబంధాలు పెట్టుకున్న హీరా గ్రూప్ యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తోంది. హీరా, పటేల్ సంస్థలకు చెందిన ఆరుగురు వ్యక్తులు రూ.84.75 లక్షల నగదును దుబాయ్ తరలించేందుకు ప్రయత్నిస్తుండగా హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన నార్త్‌జోన్ టీమ్ శనివారం పట్టుకుంది. ఈ నిందితుల విచారణలోనే నౌహీరా పేరు వెలుగులోకి వచ్చింది. గతంలోనే ఈ సంస్థ పలు మోసాలకు పాల్పడుతోందని ఫిర్యాదులు ఉన్నాయని, ఈడీ సైతం అక్రమ ద్రవ్యమార్పిడి, విదేశీ మారకద్రవ్య నిబంధనల ఉల్లంఘనలపై నోటీసులు జారీ చేసిందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఇప్పుడు రెడ్‌హ్యాండెడ్‌గా హవాలా సొమ్ము చిక్కడంతో ఈడీ సైతం దర్యాప్తు ముమ్మరం చేసింది. హీరా గ్రూప్ నుంచి స్వాధీనం చేసుకున్న రికార్డుల్ని పరిశీలిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ అధికారులు నౌహీరాను అరెస్టు చేయడం కోసం అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకూ లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేయాలని నిర్ణయించారు. భారత్-దుబాయ్‌ల మధ్య నేరస్తుల మార్పిడి ఒప్పందం ఉండటంతో ఇంటర్‌పోల్ సాయం తీసుకోవాలని భావిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన ఆరుగురూ కేవలం పాత్రధారులు మాత్రమే కావడంతో సూత్రధారులు చిక్కితేనే ఈ హవాలా రాకెట్‌కు, అండర్వరల్డ్కు ఉన్న లింకులు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెప్తున్నారు. ఈ అక్రమ ద్రవ్యమార్పిడిలో హీరా గ్రూప్‌నకు ప్రధాన ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న ముంబైలోని పటేల్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ పైనా దాడులు చేయడానికి ఈడీ సిద్ధమౌతోంది.