సాక్షి, హైదరాబాద్ : నగరంలో అక్రమంగా తరలిస్తున్న హవాలా ముఠా గుట్టు రట్టయ్యయింది. టాస్క్ ఫోర్స్ , నార్త్ జోన్ టీంతో కలిసి హవాలా మనీ రాకెట్‌ను చేదించారు. నిందితులిద్దరిని హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 31లక్షల 26వేల నగదుతో పాటు యాక్టివా మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మనీష్ తోష్నివాల్ రాజస్థాన్‌కు చెందిన వాడని కొన్నేళ్ల క్రితమే నగరానికి వలస వచ్చినట్లు పోలీసులు తెలిపారు. విష్ణు బిరాదార్ అనే మరో నిందితుడి హస్తం కూడా ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment