
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఐటీ అధికారుల దాడుల్లో ప్రైవేట్ లాకర్ల నుంచి రూ 25 కోట్లు బయటపడ్డాయి. ఢిల్లీలో ఆదివారం ఏకకాలంలో పది ప్రాంతాల్లో ఆదాయ పన్ను అధికారులు దాడులు చేపట్టారు. హవాలా వ్యాపారులు తమ సొమ్మును ప్రైవేట్ లాకర్లలో దాచుకుంటున్నారని ప్రాధమిక విచారణలో వెల్లడైనట్టు అధికారులు తెలిపారు.
దాడుల్లో పట్టుబడిన మొత్తం పొగాకు వ్యాపారులు, కెమికల్ ట్రేడర్లు, డ్రైఫ్రూట్ డీలర్లతో సహా ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో కొందరు ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన సొమ్ముగా భావిస్తున్నారు. వీరు పెద్ద ఎత్తున హవాలా లావాదేవీలు సాగించడంతో పాటు, వీరికి అంతర్జాతీయ సంబంధాలున్నాయని చెబుతున్నారు. కాగా ఇది ఈ ఏడాది ఐటీ అధికారులు ఢిల్లీలో చేపట్టిన మూడో భారీ లాకర్ ఆపరేషన్. కాగా ఈ ఏడాది జనవరిలో ఢిల్లీలోని సౌత్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలోని ప్రైవేట్ లాకర్లలో ఐటీ అధికారులు దాడులు జరిపి రూ 40 కోట్ల నగదును సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment