
పాతబస్తీలో హవాలా గుట్టురట్టు
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో హవాలా రాకెట్ గుట్టును టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం రట్టు చేశారు. భారీగా నగదును తరలిస్తున్న హవాలా ముఠాకు చెందిన నలుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ. 2 కోట్ల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. హవాలా ముఠా సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.