busted
-
ఐదేళ్లలో రూ. 300 కోట్లు.. నకిలీ వీసా ముఠా గుట్టురట్టు
ఢిల్లీ: నకిలీ వీసాలు తయారు చేసి అక్రమంగా డబ్బు సంపాదిస్తున్న కేటుగాళ్ల గుట్టురట్టయింది. సెప్టెంబర్ 2 తేదీన సందీప్ అనే వ్యక్తి నకిలీ స్వీడిష్ వీసాతో ఇటలీ వెళ్లేందుకు ప్రయత్నించగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుబడ్డాడు. దీంతో ఓ భారీ నకిలీ వీసా రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు సుమారు నాలుగైదు వేలకుపైగా నకిలీ వీసాలు తయారు చేసి ఈ ముఠా రూ. 300 కోట్లు సందపాదించనట్లు అధికారులు పట్టుపడిన సందీప్ అనే వ్యక్తి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫ్ అలీ అనే ఏజెంట్ ద్వారా రూ. 10 లక్షలకు సందీప్ నకిలీ వీసా పొందాడు. దీంతో పోలీసులు ఆసిఫ్ అలీతో పాటు అతని సహచరులు శివ గౌతమ్, నవీన్ రానాలను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో శివ గౌతమ్.. ఈ ముఠాతో సంబంధం ఉన్న మరో ఇద్దరు ఏజెంట్ల బల్బీర్ సింగ్ , జస్విందర్ సింగ్ పేర్లను చెప్పాడు. వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలోని మనోజ్ మోంగా అనే వ్యక్తి నిర్వహిస్తున్న ఫ్యాక్టరీలో పలు దేశాలకు చెందిన నకిలీ వీసాలు తయారు చేసినట్లు వారు వెల్లడించారు. పోలీసులు తిలక్ నగర్‌లోని ఫ్యాక్టరీపై దాడి చేసి గ్రాఫిక్ డిజైన్‌లో డిప్లొమా చేసిన మనోజ్ మోంగాను అరెస్ట్ చేశారు. ఐదు సంవత్సరాల క్రితం.. జైదీప్ సింగ్ అనే వ్యక్తిని మనోజ్ కలిశాడు. మనోజ్ గ్రాఫిక్ డిజైనింగ్ స్కిల్స్ చూసి.. జైదీప్ నకిలీ వీసాలను తయారుచేయమని ప్రోత్సహించాడు. అంతేకాకుండా వాటిని సంబంధిచి అవసరమైన సామగ్రిని కూడా అందించాడు. ఈ ముఠా ప్రతి నెలా 30 నుంచి 60 నకిలీ వీసాలు తయారు చేస్తుంది. కేవలం 20 నిమిషాల్లో వీసా స్టిక్కర్‌ను సిద్ధం చేస్తారు. ప్రతి నకిలీ వీసాకు సుమారు 8 నుంచి 10 లక్షలకు విక్రయిస్తారు. టెలిగ్రామ్, సిగ్నల్, వాట్సాప్‌లను ద్వారా విదేశాలలో ఉద్యోగాలు చేయాలనుకునే వ్యక్తులతో మాట్లాడి నకిలీ వీసాలు అందిస్తారు.ఇప్పటి వరకు ఈ ముఠాలో ఆరుగురిని అరెస్టు చేశామని, 16 నేపాలీ పాస్‌పోర్ట్‌లు, రెండు భారతీయ పాస్‌పోర్ట్‌లు, 30 వీసా స్టిక్కర్లు, 23 వీసా స్టాంపులను స్వాధీనం చేసుకున్నామని ఐజీఐ ఎయిర్పోర్ట్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఉషా రంగరాణి తెలిపారు. నకిలీ వీసాల తయారీలో ఉపయోగించిన ప్రింటర్లు, లామినేటింగ్ షీట్లు, ల్యాప్‌టాప్‌ల ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.చదవండి: బాలికపై లైంగిక దాడి.. తృణమూల్ నేత అరెస్టు -
HYD: టెకీల ‘రేవ్’ పార్టీ భగ్నం..!
సాక్షి,హైదరాబాద్: నగరంలో డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఐటీ ఏరియా గచ్చిబౌలిలో ఎస్ఓటీ పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఐటీ ఉద్యోగులే ఓ గెస్ట్‌హౌజ్‌లో రేవ్‌పార్టీని నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్టీలో పాల్గొన్నవారిలో 8 మంది అమ్మాయిలు,12 మంది అబ్బాయిలు ఉన్నారు. వీరి వద్ద నుంచి స్వల్పంగా గంజాయి, మద్యం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పార్టీలో పాల్గొన్న వారిని ఎస్ఓటీ పోలీసులు గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. రేవ్ పార్టీపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పార్టీ నిర్వహించిన వారికి, పాల్గొన్న వారికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్నో రేవ్ పార్టీలను అడ్డుకుని కేసులు నమోదు చేశారు. ఇదీ చదవండి.. వ్యభిచారం చేసైనా డబ్బులు తెమ్మన్నాడు -
రూ. 200 కోట్ల హవాలా గుట్టు రట్టు.. ఆ పార్టీ పనేనా..?
చెన్నై: లోక్‌సభ ఎన్నికల వేళ ఆదాయపన్ను శాఖ అధికారులు రూ.200 కోట్ల హవాలా గుట్టు రట్టు చేశారు. మలేషియా నుంచి వచ్చిన హవాలా ట్రేడర్ వినోత్‌కుమార్ జోసెఫ్‌ను చెన్నై ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న ఐటీ అధికారులు అతడి నుంచి రూ.200 కోట్ల హవాలాకు సంబంధించి విస్తుపోయే విషయాలను కనిపెట్టారు. లోక్‌సభ ఎన్నికల వేళ తమిళనాడులోని ఓ ప్రముఖ పార్టీ కోసం రూ.200 కోట్ల హవాలా సొమ్మును దుబాయ్ నుంచి తీసుకురావడానికి ప్లాన్ చేసినట్లు వినోత్ వాట్సాప్ చాట్ల ద్వారా ఐటీ అధికారులు కనిపెట్టారు. వినోత్ లాప్టాప్, మొబైల్‌ఫోన్, ఐ పాడ్లను ఐటీ అధికారులు సీజ్ చేశారు. అప్పు, సెల్వం, మోనికవిరోల, సురేశ్‌లు వినోత్ బృందంలో పనిచేస్తున్నట్లు బయటపడింది. ఈ హవాలా కేసు దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి అప్పగించనున్నారు. కాగా, తమిళనాడులో ఉన్న అన్ని లోక్‌సభ సీట్లకు ఏప్రిల్ 19న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత -
ఉత్తరకాశీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌లో సైన్యం ఎంట్రీ
ఉత్తరకాశీ: ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడే ఆపరేషన్‌లో భారత సైన్యం ఎంట్రీ ఇచ్చింది. సొరంగంలో ఇరుక్కుపోయిన ఆగర్ యంత్రం భాగాన్ని బయటకు తొలగించే పనుల్లో సైన్యం నిమగ్నమైంది . ఇందుకు ఆర్మీ తమ పరికరాలను కొండ పైభాగానికి తరలిస్తున్నారు. 800 ఎంఎం ఇనుప పైపును డ్రిల్లింగ్ చేసి, ఇన్సర్ట్ చేస్తున్న ఆగర్ మిషన్ బ్లేడ్లు శనివారం శిథిలాలలో చిక్కుకున్నాయి. దీంతో యంత్రం ధ్వంసమైంది. ఫలితంగా సొరంగానికి పైనుంచి తవ్వకాలు జరిపి, బాధితులను చేరుకునే మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. సొరంగంలో ఇరుక్కుపోయిన ఆగర్ యంత్రం భాగాన్ని తొలగించేందుకు హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్‌ను విమానంలో తీసుకువచ్చారు. ఆగర్ యంత్రం భాగాలను తొలగించే పనిలో సైన్యం నిమగ్నమైంది. ఉత్తరాఖండ్, ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారాలో సొరంగం కుప్పకూలింది. ఈ ఘటనలో 41 మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకురావడానికి గత 15 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చురుగ్గా సాగుతోంది. ఆగర్ యంత్రం ధ్వంసం కావడంతో సొరంగానికి పైనుంచి తవ్వకాలు జరిపి, బాధితులను చేరుకునే మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ కారణంగా కార్మికులను రక్షించడానికి కొన్ని వారాలు పట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: Uttarkashi tunnel collapse: సొరంగ బాధితులకు క్రిస్మస్కు విముక్తి? -
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు బాంబ్ స్క్వాడ్. శ్రీనగర్ బారాముల్లా హైవేపై ఐఈడీని అమర్చిన ఉగ్రవాదులు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ బృందం నిముషాల వ్యవధిలో దాన్ని నిర్వీర్యం చేశారు. పాకిస్తాన్ లో ఉగ్రదాడి జరిగిన గంటలు కాలేదు అప్పుడే భారత దేశంలో భారీ విధ్వంసానికి వ్యూహరచన చేశాయి ఉగ్రమూకలు. శ్రీనగర్ లోని బారాముల్లా హైవేపై సంగమ్ ఫ్లై ఓవర్ వద్ద ఐఈడీ ని అమర్చారు ఉగ్రవాదులు. సంగమ్ ఫ్లై ఓవర్ వద్ద ఒక బ్యాగ్ కనిపించడంతో స్థానికులు అప్రమత్తమై బాంబ్ స్క్వాడ్ కు సమాచారమందించారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఐఈడీని నిర్మానుష్య ప్రదేశంలో నిర్వీర్యం చేశాయి. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సంగమ్ ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది.. ఒకవేళ ఈ పేలుడు గనుక యధాతధంగా జరిగి ఉంటే భారీగా నష్టం వాటిల్లేది. ఇది కూడా చదవండి: ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా -
ఐపీఎల్ బెట్టింగ్ భారీగా పట్టుబడ్డ డబ్బు
-
భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. 15 కిలోల ఐఈడీ స్వాధీనం
శ్రీనగర్: నూతన సంవత్సర వేడుకల వేళ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి భద్రతా దళాలు. జమ్ముకశ్మీర్‌లోని ఉధంపుర్ జిల్లాలో సోమవారం భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బసంత్‌గఢ్ ప్రాంతంలో సిలిండర్ లాంటి బాక్సులో సుమారు 15 కిలోల ఐఈడీని అమర్చినట్లు గుర్తించామన్నారు. దాంతో పాటు సంఘటనా స్థలం నుంచి 300-400 గ్రాముల ఆర్డీఎక్స్, 7.62ఎంఎం కార్ట్రిడ్జెస్, ఐదు డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేలుడు పదార్థాలతో పాటు కోడ్ లాంగ్వేజ్‌లో ఉన్న ఓ పత్రం, నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు సంబంధించిన గుర్తులు లభించినట్లు జమ్మూ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ముకేశ్ సింగ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఓ అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. బసంత్‌గఢ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: కరోనా ఫోర్త్ వేవ్ భయాలు.. అక్కడ మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు! -
హైదరాబాద్ లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
-
జూబ్లీహిల్స్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు
-
గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం.. నలుగురు అరెస్ట్
సాక్షి, జవహర్గనర్(హైదరాబాద్): వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జవహర్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మాయిగూడలోని వాయుష్కినగర్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మల్కాజిగిరి ఎస్వోటీ, జవహర్‌నగర్ పోలీసుల సంయుక్త ఆద్వర్యంలో దాడులు నిర్వహించారు. ఘటనలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.3690 నగదుతో పాటు మూడు సెల్ఫోన్లు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. ఇలా చేస్తాడని ఎవరు అనుకోరు -
వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తెచ్చి..
యశవంతపుర(కర్ణాటక): పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల నుంచి అమ్మాయిలను బెంగళూరుకు తెచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురిని విద్యారణ్యపుర పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాటరాయనపురకు చెందిన మధు (43), అసోంవాసి రఫికుల్ ఇస్లాం (21), పశ్చిమ బెంగాల్‌వాసి రుబేల్ మండల్ నిందితులు. దొడ్డబొమ్మసంద్ర కృష్ణ టెంపుల్రోడ్డులో ఈ దందా చేసేవారని తేలింది. (చదవండి: బార్లో అశ్లీల నృత్యాలు.. 64 మంది అమ్మాయిలతో.. ) మరో ఘటనలో.. కుటుంబ కలహాలతో ఆత్మహత్య హోసూరు: హోసూరు సమీపంలోని జొనబండ గ్రామానికి చెందిన వెంకటేష్ (33) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి తాగుడు అలవాటుండడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. బుధవారం ఏర్పడిన గొడవల్లో విరక్తి చెందిన వెంకటేష్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
హైదరాబాద్ పోలీస్.. టార్గెట్ న్యూ ఇయర్ పార్టీస్!
సాక్షి, సిటీబ్యూరో: డిసెంబర్ 31 రాత్రి జరగనున్న న్యూ ఇయర్ వేడుకలను టార్గెట్‌గా చేసుకున్న డ్రగ్ పెడ్లర్లు దందా వేగం పెంచారు. గంజాయికి బదులుగా దాని కంటే తేలిగ్గా రవాణా చేయగలిగే హష్ ఆయిల్‌పై దృష్టి పెట్టారు. దీనిని గమనించిన నగర పోలీసు విభాగం నిఘా ముమ్మరం చేసింది. ఫలితంగా నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముగ్గురిని పట్టుకుని, రూ.25 లక్షల విలువైన 3.5 లీటర్ల ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, డీసీపీ చక్రవర్తి గుమ్మిలతో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ► విశాఖపట్నం జిల్లా, పాయకరావుపేటకు చెందిన సంపతి కిరణ్‌కుమార్ ఐటీఐ పూర్తి చేశాడు. ఆపై విజయవాడ, కాకినాడల్లో ఉద్యోగాలు చేసినా నిలదొక్కుకోలేదు. పాడేరు ఏజెన్సీకి చెందిన గంజాయి విక్రేతలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ► గత ఏడాది మేలో గంజాయి రవాణా చేస్తూ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పోలీసులకు చిక్కాడు. మూడు నెలలకు బెయిల్‌పై బయటకు వచ్చిన ఇతగాడు నగరానికి వచ్చి మణికొండ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ► గత కొద్ది కాలంగా పోలీసులు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో రవాణా చేĶæడానికి అనువుగా మారిన హష్ ఆయిల్‌పై ఇతడి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో పాడేరు ప్రాంతానికి చెందిన వినోద్‌తో పరిచయం పెంచుకున్నాడు. ► వినోద్ స్థానికంగా లభించే గంజాయి మొక్కలతో ఈ ఆయిల్ తయారు చేస్తున్నాడు. అక్కడ తక్కువ రేటుకు 1.5 లీటర్లు ఖరీదు చేసిన కిరణ్ ట్రావెల్స్ బస్సులో సిటీకి తెచ్చాడు. విక్రయించడానికి ప్రయత్నిస్తూ గోల్కొండ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కాడు. ► జహనుమ, యాప్రాల్ ప్రాంతాలకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్, షేక్ కమల్ దూరపు బంధువులు. చిన్న చిన్న పనులు చేసే వీరు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం అక్రమ మార్గం పట్టారు. పాడేరుకు చెందిన గౌతమ్ నుంచి హష్ ఆయిల్ కొంటున్నారు. ► తొలినాళ్లల్లో వీళ్లే వినియోగించే వారు. అయితే న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలో ఈ సరుకు డి మాండ్ పెరగడంతో దందా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల సింహాచలం వరకు వెళ్లి గౌతమ్ నుంచి 2 లీటర్ల కొని తీసుకువచ్చారు. ► దీనిని విక్రయించే ప్రయత్నాల్లో ఉండగా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఫల క్‌నుమ ప్రాంతంలో పట్టుకున్నారు. వీడ్ ఆయిల్‌గానూ పిలిచే దీన్ని ఒక్కో మిల్లీ లీటర్ రూ.700 నుంచి రూ.1000 వరకు అమ్ముతున్నారు. ► న్యూ ఇయర్ సీజన్లో ఇది రూ.2000కు చేరే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ పార్టీలపై కన్నేసి ఉంచామని, పబ్ ఓనర్లనూ హెచ్చరించామని కొత్వాల్ పేర్నొఆ్నరు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై కన్నేసి ఉంచాలని సూచించారు. చదవండి: నవవధువు ఆత్మహత్య: భర్త వేధింపుల వల్లే మా కుమార్తె చనిపోయింది -
వైఎస్సార్సీపీ కౌన్సిలర్ హత్యకేసు: ఆర్థిక లావాదేవీలే కారణం
సాక్షి, సూళ్లురుపేట (నెల్లూరు): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ సురేష్ దారుణ హత్య సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి బినామీ బాలు అనే వ్యక్తి పక్కా ప్లాన్‌తో సురేష్‌ను హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యకు ఆర్థికపరమైన లావాదేవీలే కారణమని డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. -
అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ను బంజారాహిల్స్ పోలీసులు గుట్టు రట్టు చేశారు. నగర వాసులకు డబ్బులిచ్చి విదేశాల్లో సర్జరీలు చేయిస్తున్న పవన్ శ్రీనివాస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై శ్రీలంకతో పాటు భారత్‌లోనూ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు వివరాలను వెస్ట్‌జోన్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ మీడియాకు వివరిస్తూ.. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్ ముప్పై కేసుల్లో నిందితుడని, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి నష్టపోయారని తెలిపారు. ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తితో శ్రీనివాస్ కిడ్నీ అమ్ముకున్నాడు. ఒక్కొక్క కిడ్నీ అమ్మకంలో డాక్టర్లకు రూ.15 లక్షలు, డోనర్‌కు రూ.5 లక్షలు, నిందితుడు శ్రీనివాస్ రూ.5 లక్షల నుంచి 7 లక్షలు తీసుకునే వాడు. 2013లో శ్రీనివాస్ కిడ్నీ వ్యాపారం ప్రారంభించాడని తెలిపారు. ఇప్పటివరకు 30 కేసుల్లో శ్రీనివాస్ నిందితుడని, కిడ్నీ అమ్మేవారిని తీసుకుని శ్రీలంకలోని 4 ఆస్పత్రుల్లో అమ్మేవాడు. అక్కడ 9 ఆపరేషన్లలో శ్రీనివాస్ నేరుగా పాల్గొన్నారని జాయింట్ సీపీ తెలిపారు. బంజారాహిల్స్ కమలాపురి కాలనీకి చెందిన నాగరాజుకు రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఆయన భార్య బిజ్జల భారతీ స్టార్ ఆసుపత్రికి తీసుకొచ్చింది. డయాలసిప్ చేయించేందుకు భర్తను తీసుకొచ్చే క్రమంలో భారతీని గమనించిన నిందితుడు శ్రీనివాస్.. విదేశాల్లో మీ భర్తకి మెరుగైన చికిత్స చేయిస్తానని నమ్మబలికాడు. ఇందు కోసం రూ.34 లక్షలు ఖర్చవుతాయని చెప్పగా, బాధితురాలు పలు దఫాలుగా నిందితుడికి సంబంధించిన పలు బ్యాంక్ అకౌంట్లకు మనీ ట్రాన్స్ఫర్ చేసింది. డబ్బును తీసుకుని నిందితుడు పరారీ అయ్యాడు. జూన్ 2019లో శ్రీనివాస్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదయ్యింది. -
అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు
-
మహేంద్రసింగ్‌ది కిరాయి హత్యే !
నెల్లూరు (క్రైమ్): జిల్లాలో సంచలనం రేకెత్తించిన రాజస్థాన్ వ్యాపారి మహేంద్రసింగ్ హత్య కేసులో చిక్కుముడిని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఇది కిరాయి హత్యేనని తమ విచారణలో తేల్చిన పోలీసులు సూత్రదారిని అదుపులోకి తీసుకుని పాత్రదారుల కోసం గాలిస్తున్నట్లు సమాచారం. రాజస్థాన్ రాష్ట్రం బార్మేర్ జిల్లా సంద్రి మండలం ఆర్తండి గ్రామానికి చెందిన మహేంద్రసింగ్ రాజ్‌పురోహిత్ (40) ఈ నెల 3వ తేదీన తుపాకీలతో కాల్చి హత్య చేసిన విషయం తెలిసిందే. రాజ్‌పురోహిత్ తన భార్య ఉషాదేవితో కలిసి 15 ఏళ్ల కిందట ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వలస వచ్చారు. ఫత్తేఖాన్‌పేట రైతుబజారు సమీపంలోని అక్కనవారి వీధిలో నివాసం ఉంటున్న ఆయన తన కుమార్తె కోమల్ పేరుతో సంతపేటలో, ఫత్తేఖాన్‌పేటలో, తిరుపతిలో పవర్ టూల్స్ సర్వీస్ అండ్ సేల్స్ పేరిట దుకాణాలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని దుకాణ బాధ్యతలను ఆయన అన్న మంగిలాల్ రాజ్‌పురోహిత్ చూస్తున్నాడు. ఈ నెల 3వ తేదీ శనివారం రాత్రి 10 గంటల సమయంలో దుకాణం మూతవేసి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఆయనపై ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి తుపాకీతో కాల్పులు జరిపారు. మహేంద్రసింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనను జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి సవాల్‌గా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించారు. తొలుత నగదు కోసం దుండగలు హత్య చేశారా? అనే కోణంలో సైతం పోలీసులు విచారణ చేపట్టారు. అయితే హత్య జరిగిన సమయంలో మృతుడి వద్ద రూ. 1.50 లక్షలు నగదు ఉండడంతో నగదు కోసం కాదని నిర్ధారణకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రం నిర్మల్‌లో ఆయన బావమరిది ఆత్మహత్య చేసుకోగా, మృతిపై అనుమానాలు ఉన్నాయనీ మహేంద్రసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి ఈ హత్యకు ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేపట్టారు. మహేంద్రసింగ్ స్వగ్రామంలోని స్థానిక సర్పంచ్‌తో గొడవలు పడేవారని ఈ నేపథ్యంలో ఏమైనా హత్య జరిగి ఉంటుందేమోననే అనుమానాలు వ్యక్తమవడంతో ఆ దిశగా సైతం విచారణ చేపట్టారు. మృతుడి సెల్‌ఫోను కాల్ డిటైల్స్‌ను పరిశీలించారు. బిహార్‌కు చెందిన వ్యక్తితో గొడవలు ఉన్నాయని తేలడంతో అతన్ని సైతం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రత్యేక బృందాలు తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో విచారణ చేపట్టినా ఎక్కడా చిన్నపాటి ఆధారాలు కూడా పోలీసులకు చిక్కలేదు. లోతైన దర్యాప్తులో వీడిన చిక్కుముడి ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఒక్కొక్కరుగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను విచారించే క్రమంలో మృతుడి సమీప బంధువు ఒకరు పొంతన లేని సమాధానాలు చెబుతుండటతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో ఈ కేసులోని చిక్కుముడి దాదాపుగా వీడిపోయినట్లు సమాచారం. ఆస్తి విషయాల్లో నెలకొన్న విభేదాలే హత్యకు దారితీసినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ విషయంలో పలుమార్లు హతుడు తన కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని, స్వగ్రామంలోని ఆస్తిని పంచకుండా అడ్డుకుంటున్నాడని, మరో కారణంతో మహేంద్రసింగ్‌ను అడ్డుతొలగించుకోవాలని నిందితుడు నిశ్చయించుకున్నట్లు తెలిసింది. నిందితుడు రాజస్థాన్‌లోని తన స్నేహితులతో కలిసి మహేంద్రసింగ్ హత్యకు పథక రచన చేసినట్లు, హత్యకు రూ.8 లక్షలు కిరాయి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకొన్నట్లు సమాచారం. దీంతో నిందితుడి స్నేహితులు (హంతకులు) రెక్కీ వేసి మహేంద్రసింగ్‌ను ఈ నెల 3వ తేదీ రాత్రి తుపాకీతో కాల్చిచంపినట్లు తెలిసింది. కిరాయి హంతకుల కోసం గాలింపు మహేంద్రసింగ్‌ను హత్య చేసిన కిరాయి హంతకుల కోసం ప్రత్యేక బృందాలు రాజస్థాన్, ముంబైల్లో గాలిస్తున్నాయి. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద హత్య కేసులో చిక్కుముడి దాదాపు వీడడంతో పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంపై పోలీసు అధికారులను వివరణ కోరగా వారు ధ్రువీకరించలేదు. త్వరలోనే వివరాలను వెల్లడిస్తామన్నారు. -
దారుణం : నాయక్ సినిమా తరహా ఘటన
సాక్షి, బళ్లారి : కొన్నేళ్ల క్రితం రామ్‌చరణ్ నటించిన నాయక్ సినిమా చూశారా? అందులో చిన్న పిల్లలను ఎత్తుకెళ్లి, వికలాంగులుగా మార్చి బిక్షాటన చేయిస్తూ ఉంటారు. సరిగ్గా అదే తరహా ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. అభం శుఖం తెలియని చిన్నారులను, అపహరించిన చిన్నారుల నాలుకలు కత్తరించి మాటలు రాకుండా చేసి భిక్షాటన చేసేందుకు ఉపయోగిస్తున్న ముగ్గురు మానవ అక్రమ రవాణాదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదంతం కర్ణాటకలోని కలబురిగిలో శుక్రవారం వెలుగు చూసింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన చిన్నారులను కలబురిగికి తీసుకొచ్చి భిక్షాటన చేయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈనెల 8న అధికారులు పోలీసులు తనిఖీలు చేపట్టారు. భిక్షాటన చేస్తున్న ఐదు మంది చిన్నారులను గుర్తించి స్థానిక ఆస్పత్రికి తరలించగా చిన్నారుల నాలుకలను కత్తరించినట్లు వైద్యపరీక్షల్లో తేలింది. పగలంతా భిక్షాటన చేయగా వచ్చిన సొమ్మును రవాణాదారులకు అందజేసినా కడుపునిండా అన్నం కూడా పెట్టడం లేదని విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు చిన్నారులను అపహరించి తీసుకొచ్చి భిక్షాటన చేయిస్తున్న రూబీ, రైయిసా బేగం, ఫరీదాలను కలబుర్గిలోని అరెస్ట్ చేశారు. -
గుంటూరులో వెలుగు చూసిన కొత్తదందా
-
భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
జైపూర్ : గ్యాంగ్‌గా ఏర్పడి భారీ వసూళ్లకు పాల్పడుతున్న మెగా సెక్స్ రాకెట్‌ను స్పెషల్ పోలీసులు చేధించారు. గ్యాంగ్‌కు చెందిన యువతులు సంపన్నులతో పరిచయం చేసుకోవడం, ఆ తర్వాత క్లోజ్‌గా మూవ్ అవ్వడం. అనంతరం రూమ్‌కి పిలిచి, వారితో ఏకాంతంగా గడిపి, రేప్ కేసు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడటం ఈ గ్యాంగ్ స్టైల్. ఈ సెక్స్ రాకెట్ గ్రూప్ దాదాపు ఏడాది నుంచి తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తేలింది. ఇప్పటి వరకు దాదాపు రూ.20 కోట్లకుపైగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఆరుగురు యువతులతో సహా మొత్తం33న మందిని స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అరెస్ట్ చేసింది. అరెస్టయిన వారిలో ఆరుగురు లాయర్లు కూడా ఉన్నారు. సెక్స్ రాకెట్‌కు చెందిన షికా తివారి ముంబైలోని ఓ హోటల్లో డీజేగా పని చేస్తోంది. జైపూర్‌కు చెందిన ఓ ప్రముఖ డాక్టర్‌ను ట్రాప్ చేసి బ్రాక్మెయిల్కు పాల్పడింది. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్‌లో ముఖ్యపాత్రపోషిస్తున్న అకన్షా హిజ్కిల్, ఆమె బోయ్ ఫ్రెండ్ అక్షంత్ శర్మను మంగళవారం రాత్రి అజ్మీర్‌లో అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ సంపన్నులను లక్ష్యంగా చేసుకొని, ట్రాప్‌లోకి దించి బెదిరింపులకు పాల్పడి అక్రమ వసూళ్లకు పాల్పడేదని పోలీసుల విచారణలో తేలింది. తమ డిమాండ్లకు ఒప్పుకోకపోతే కొన్ని సందర్భాల్లో బాధితులపై రేప్ కేసులు కూడా నమోదు చేశారని పోలీసులు తెలిపారు. -
విశాఖ జిల్లాలో నకిలీ నాణేలు
-
నోట్ల మార్పిడి దందా గుట్టు రట్టు
-
ప.గో.జిల్లాలో రేవ్ పార్టీ గుట్టు రట్టు
-
న్యూ ఇయర్ కోసం భారీగా డ్రగ్స్.. పట్టివేత
-
గుంటూరు జిల్లాలో నకిలీ కారం గుట్టురట్టు
-
రాయదుర్గంలో అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్
అనంతపురం: రాయదుర్గంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 6 లక్షల విలువైన బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు బైకులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యోగాల ఎరచూపి యువతులను..
బెంగళూరు(బనశంకరి): మసాజ్‌పార్లర్ ముసుగులో హైటెక్ వేశ్యావాటిక నిర్వహిస్తున్న కేంద్రంపై ఇందిరానగర పోలీసులు దాడిచేసి ఓ మహిళతో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఇందిరానగరలోని ఆరోమా స్టాఅండ్ సెలూన్ మసాజ్పార్లర్లో బాడీ టుబాడీ మసాజ్, హ్యాపీ ఎండింగ్, స్యాండ్విచ్ పేరుతో వేశ్యావాటిక నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. జాసియా, చిత్రదుర్గకు చెందిన మహేశ్వరప్ప, హిమాయత్ ఉల్లా, రాణేశ్రాయ్, తమిళనాడుకు చెందిన వైదేశ్వరన్ను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 9 సెల్ఫోన్లు, రూ.20 వేల 250 నగదు స్వాధీనం చేసుకున్నారు. వేశ్యావాటికలో చిక్కుకున్న పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నలుగురు యువతులను కాపాడారు. మసాజ్ పార్లర్ యజమాని మునీంద్రకుమార్ ఉద్యోగాల ఎరచూపి యువతులను రప్పించి వేశ్యావాటిక నిర్వహిస్తున్నట్లు విచారణలో వెలుగుచూసినట్లు పోలీసులు తెలిపారు. మునీంద్రకుమార్, సింగారవేలు, రవిలు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
డబుల్ బెడ్రూం ఇళ్లు స్కాం గ్యాంగ్ అరెస్ట్
-
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
చిత్తూరు : తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాగుట్టును చిత్తూరు పోలీసులు రట్టు చేశారు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉగ్రవాదుల కుట్ర భగ్నం, ఐదుగురి అరెస్ట్
శ్రీనగర్: ఒకవైపు గణతంత్ర దినోత్సవం దగ్గరపడుతోంటే మరోవైపు దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల ఉనికి భద్రత దళాలను కలవరపెడుతోంది. తాజాగా కశ్మీర్ లోని సొపోర్ లో ఉగ్రవాద సంస్థ హర్కత్- ఉల్ ముజాహిదీన్ కుట్రను భద్రత బలగాలు భగ్నం చేశాయి. రిపబ్లిక్ డే వేడుకలు లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేసిన హర్కత్- ఉల్ ముజాహిదీన్ కు చెందిన అయిదుగురు టెర్రరిస్టులను భద్రత బలగాలు అరెస్ట్ చేశాయి. వీరి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తనిఖీలను ముమ్మరం చేశారు. ముంబై, హైదరాబాద్, ఢిల్లీ తదితర నగరాల్లో ఇప్పటికే 14 మంది ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. -
జాబన్నారు.. కిడ్నీ కోట్టేశారు!!
-
విజయవాడలో భారీ ఫైరసీ రాకెట్
-
అక్రమాల పుట్టగా కల్తీనెయ్యి రాకెట్
-
నకిలీ నెయ్యి సూత్రధారుడు ఫణీంద్ర ఆరెస్ట్
-
కెమికల్స్ మిక్సింగ్‌తో నకిలీ నెయ్యి
-
అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
-
అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాద్ : నలుగురు అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా గుట్టును శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. బుధవారం ఎయిర్ పోర్ట్‌లో ముఠాకు చెందిన నలుగురు సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి 4.2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.16 లక్షల నగదుతోపాటు విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసి... పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పంచలోహ విగ్రహాల చోరీ ముఠా అరెస్ట్
హైదరాబాద్: పంచలోహ విగ్రహాలు చోరీ చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ నగర పోలీసులు శనివారం రట్టు చేశారు. ముఠాలోని సభ్యుల నుంచి మూడు పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పోలీసులు తమదైన శైలిలో వారిని విచారిస్తున్నారు. సదరు మూడు విగ్రహాలను వరంగల్ జిల్లా మొగిళ్లపల్లి నుంచి చోరీ చేసినట్లు దొంగలు వెల్లడించారని పోలీసులు తెలిపారు. -
విశాఖలో బంగ్లాదేశ్ ముఠామోసాలు
-
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 13 మంది అరెస్ట్
హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న 13 మందిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ. 26 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే ఆరు ల్యాప్‌టాప్‌లు, మూడు టీవీలు, 36 సెల్ ఫోన్లు, 2 మౌత్ స్పీకర్లు, 4 లయన్ బాక్సులు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలలో ఈ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందని గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ బెట్టింగ్‌ల్లో హైదరాబాద్‌కు చెందిన సత్యప్రకాశ్ జిందాల్ అలియాస్ నిక్కూబాయ్ ప్రధాన నిందితుడు అని తెలిపారు. రాజస్థాన్ కేంద్రంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం సాగుతుందన్నారు. ఇంటర్నేషనల్ బెట్టింగ్ కూడా కొనసాగుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ వ్యవహారంలో రాజస్థాన్‌కు చెందిన ఆషును అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పెద్దెఎత్తున క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించామని మహేందర్‌రెడ్డి చెప్పారు. -
పల్లెలకూ..రేవ్ పార్టీ
-
రేవ్ పార్టీ: యువతీ యువకుల అరెస్ట్
-
హైదరాబాద్‌లో మరో రేవ్ పార్టీ భాగోతం
-
పాతబస్తీలో హవాలా గుట్టురట్టు
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో హవాలా రాకెట్ గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం రట్టు చేశారు. భారీగా నగదును తరలిస్తున్న హవాలా ముఠాకు చెందిన నలుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2 కోట్ల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. హవాలా ముఠా సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. -
రేవ్ పార్టీపై పోలీసులు దాడి
-
మేడ్చల్‌లో రేవ్ పార్టీ?
-
రేవ్ పార్టీపై దాడి: నిందితులు అరెస్ట్
-
బ్లూఫిల్మ్ రాకెట్‌ను పట్టుకున్న పోలీసులు
-
సెక్స్ రాకెట్ గుట్టురట్టు: 100 మందికి విముక్తి
ముంబైలో సెక్స్ రాకెట్ గుట్టును నగర పోలీసులు శనివారం రట్టు చేశారు. విదేశాలకు రహస్యంగా తరలించేందుకు సిద్దంగా ఉన్న100 మంది యువతులను పోలీసులు రక్షించారు. పోలీసుల కథనం ప్రకారం... ముంబై నగరంలోని ఫిష్ కంపెనీలో 100 మందికిపైగా బాలికలు బందీలుగా ఉన్నారని... సాధ్యమైనంత త్వరగా వారిని రక్షించాలని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన ఫిష్ కంపెనీకి చేరుకుని... ఆ కంపెనీపై దాడులు నిర్వహించారు. అందులోభాగంగా బందీలుగా ఉన్న 100 మంది యువతులను పోలీసులు రక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఫిష్ కంపెనీ యజమానులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
హైటెక్ వేశ్య కేంద్రంపై పోలీసుల దాడి
ప్రవాసాంధ్రులు అధికంగా నివాసముండే ప్రాంతంలో హైటెక్ వేశ్య కేంద్రం బయటపడటంతో ఆ ప్రాంతంలో తీవ్ర అలజడి ఏర్పడింది. నిందితులు మురడేశ్వర సమీపంలోని ఉత్తరకోప్పకు చెందిన దుర్గయ్య, హాసన్ జిల్లా చెన్నరాయణపట్ట తాలుకా హిరిసావా గ్రామానికి చెందిన దీపు, అదే జిల్లా సకలేశపుర తాలుకా బాళగెద్ద గ్రామానికి చెందిన కుమార్, బెంగళూరు కేఆర్ పురంలోని గాయత్రీ లేఔట్‌కు చెందిన నాగరాజ్ అలియాస్ జాన్సన్‌లను అరెస్టు చేశామని శనివారం బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపారు. కోల్‌కతాకు చెందిన ముగ్గురు యువతులతో పాటు ఒక బంగాదేశ్‌కు చెందిన యువతిని రక్షించామని చెప్పారు. పాస్‌పోర్టు లేని బంగ్లా యువతిపై కేసు నమోదు చేశామని అన్నారు. దేవసంద్ర సమీపంలోని ఆర్‌ఎంవీ రెండో స్టేజ్‌లోని ఒక ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో బంగ్లాదేశ్, కోల్‌కత్తాకు చెందిన యువతులను నిర్బంధించి బయట ప్రాంతాల నుంచి విటులను తీసుకువచ్చి దందా నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ది ఫ్రీడం ప్రాజెక్ట్ ఇండియా నిర్వాహకులు గుర్తించారు. కొన్ని రోజులుగా ఈ ప్రాంతంపై నిఘా పెట్టిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం రాత్రి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు జయణ్ణ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. -
ఎల్బీనగర్లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
-
హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు