
ఉత్తరకాశీ: ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడే ఆపరేషన్‌లో భారత సైన్యం ఎంట్రీ ఇచ్చింది. సొరంగంలో ఇరుక్కుపోయిన ఆగర్ యంత్రం భాగాన్ని బయటకు తొలగించే పనుల్లో సైన్యం నిమగ్నమైంది . ఇందుకు ఆర్మీ తమ పరికరాలను కొండ పైభాగానికి తరలిస్తున్నారు.
800 ఎంఎం ఇనుప పైపును డ్రిల్లింగ్ చేసి, ఇన్‌సర్ట్ చేస్తున్న ఆగర్ మిషన్ బ్లేడ్‌లు శనివారం శిథిలాలలో చిక్కుకున్నాయి. దీంతో యంత్రం ధ్వంసమైంది. ఫలితంగా సొరంగానికి పైనుంచి తవ్వకాలు జరిపి, బాధితులను చేరుకునే మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. సొరంగంలో ఇరుక్కుపోయిన ఆగర్ యంత్రం భాగాన్ని తొలగించేందుకు హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్‌ను విమానంలో తీసుకువచ్చారు. ఆగర్ యంత్రం భాగాలను తొలగించే పనిలో సైన్యం నిమగ్నమైంది.
ఉత్తరాఖండ్, ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారాలో సొరంగం కుప్పకూలింది. ఈ ఘటనలో 41 మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకురావడానికి గత 15 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చురుగ్గా సాగుతోంది. ఆగర్ యంత్రం ధ్వంసం కావడంతో సొరంగానికి పైనుంచి తవ్వకాలు జరిపి, బాధితులను చేరుకునే మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ కారణంగా కార్మికులను రక్షించడానికి కొన్ని వారాలు పట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: Uttarkashi tunnel collapse: సొరంగ బాధితులకు క్రిస్మస్‌కు విముక్తి?