Uttarakashi
-
ఉత్తరకాశీలో భయపెడుతున్న మరో సొరంగం
ఉత్తరకాశీ జిల్లాలోని మరో సొరంగం స్థానికులను భయానికి గురిచేస్తోంది. ఈ సొరంగం నుంచి భారీగా నీరు ఉబికివస్తుండంతో ఇక్కడి సాగునీటి కాలువ, పంట భూములు దెబ్బతిన్నాయి. మరోవైపు ఇటీవలే కుప్పకూలిన టన్నెల్ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని ఉత్తరాఖండ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (యూజేవీఎన్‌ఎల్) తెలిపింది. ఉత్తరకాశీలోని మనేరి భళి-2 ప్రాజెక్ట్‌లో 16 కిలోమీటర్ల పొడవైన సొరంగం ఉంది. ఈ సొరంగం గుండా నీరు ప్రవహిస్తోంది. ధారసులో విద్యుత్తు ఉత్పత్తి అవుతుంటుంది. ధారసు బ్యాండ్ సమీపంలోని మహర్‌గావ్‌లోని సొరంగం నుండి నీటి లీకేజీ రెండేళ్ల క్రితమే ప్రారంభమైంది. ఇది క్రమంగా పెరుగుతోంది. యూజేవీఎన్‌ఎల్ ఇప్పటికే దీని మరమ్మతుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. అయినా లీకేజీ అదుపులోకి రావడం లేదు. గత రెండేళ్ల నుంచి ఇక్కడ నీటి లీకేజీ వేగంగా పెరుగుతోందని గ్రామ పెద్ద సురేంద్రపాల్ చెప్పారు. ఫలితంగా సాగునీటి కాలువ, పలు పంట భూములు దెబ్బతిన్నాయని, పలు చోట్ల భూమి కోతకు గురవుతోందని అన్నారు. ఈ సొరంగానికి తక్షణమే మరమ్మతులు చేయాలని ఆయన కోరారు. కాగా మనేరి భళి సొరంగం నీటి లీకేజీ నివారణకు మరమ్మతులు చేస్తున్నామని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని యూజేవీఎన్‌ఎల్ ఎండీ సందీప్ సింఘాల్ తెలిపారు. ఇది కూడా చదవండి: ఇటలీ ప్రధానితో భారత ప్రధాని దోస్తీ చేస్తే.. -
ఎయిమ్స్ నుంచి కార్మికులు డిశార్జ్
ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా టన్నెల్ నుండి బయటపడిన మొత్తం 41 మంది కార్మికులను రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. వైద్య పరీక్షల్లో వీరంతా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వారిని ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించామని ఎయిమ్స్ అడ్మినిస్ట్రేషన్ మీడియాకు తెలియజేసింది. కార్మికులను క్షుణ్ణంగా పరీక్షించామని, రక్తపరీక్షలు, ఈసీజీ, ఎక్స్‌రే రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని ఎయిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగం చైర్మన్ డాక్టర్ రవికాంత్ తెలిపారు. చార్ధామ్ యాత్ర మార్గంలో నిర్మాణంలో ఉన్న నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన ఉత్తరకాశీ టన్నెల్లో ఒక భాగం నవంబర్ 12న కూలిపోయి 41 మంది కార్మికులు దానిలో చిక్కుకుపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ నేపధ్యంలో 17వ రోజున వారు విజయవంతంగా బయటపడ్డాడు. వెంటనే వారిని ఇంటెన్సివ్ హెల్త్ చెకప్ కోసం ఎయిమ్స్ రిషికేశ్కు చేర్చారు. డాక్టర్ రవికాంత్ మాట్లాడుతూ కార్మికులు ఇంత కాలం సొరంగంలో మగ్గిపోయారని, అందువల్ల వారికి పర్యావరణ అనుకూలత అవసరమని, ఇది కొద్ది రోజుల్లో జరుగుతుందని అన్నారు. ఇక్కడి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ఇందుకోసం కార్మికుల మొబైల్ నంబర్లు తీసుకున్నట్లు తెలిపారు. కార్మికుల సొంత రాష్ట్రాలలోని వైద్య కళాశాలలు, ఆసుపత్రులకు వారికి సంబంధించిన సమాచారం అందించామన్నారు. కార్మికులు ఈరోజు లేదా రేపటిలోగా వారి ఇంటికి చేరుకుంటారని డెహ్రాడూన్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రామ్‌జీ శరణ్ శర్మ తెలిపారు. కాగా బాధిత కార్మికుల్లో గరిష్టంగా 15 మంది జార్ఖండ్‌కు చెందినవారు కాగా, ఎనిమిది మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు, ఐదుగురు ఒడిశా, బీహార్, ముగ్గురు పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు, ఇద్దరు ఉత్తరాఖండ్, అస్సాం, ఒకరు హిమాచల్ ప్రదేశ్‌కు చెందినవారున్నారు. ఇది కూడా చదవండి: ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఏమన్నారు? -
Uttarkashi tunnel collapse rescue: పీడకల... అగ్నిపరీక్ష
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకొని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికిన 41 మంది కార్మికులు 17 రోజుల తర్వాత మంగళవారం రాత్రి క్షేమంగా బయటకు వచ్చారు. సొరంగంలో తమకు ఎదురైన భయానక అనుభవాలు, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ప్రాణాలు నిలబెట్టుకున్న తీరును పలువురు కార్మికులు బుధవారం మీడియాతో పంచుకున్నారు. సొరంగంలో తామంతా కష్టసుఖాలు కలబోసుకున్నామని, మిత్రులుగా మారామని చెప్పారు. ఆడిన ఆటలు, పాడుకున్న పాటల గురించి తెలియజేశారు. సొరంగంలో చిక్కుకున్నప్పుడు ప్రాణాలపై ఆశలు వదులుకున్నామని జార్ఖండ్‌లోని ఖిరాబేడా గ్రామానికి చెందిన అనిల్ బేడియా(22) అనే కార్మికుడు వెల్లడించాడు. ‘‘నవంబర్ 12న సొరంగంలో మేము పనిలో ఉండగా, హఠాత్తుగా కొంత భాగం కూలిపోయింది. భారీ శబ్ధాలు వినిపించాయి. మేమంతా లోపలే ఉండిపోయాం. బయటకు వచ్చే దారి కనిపించలేదు. ఎటు చూసినా చిమ్మచీకటి. అక్కడే సమాధి కావడం తథ్యమని అనుకున్నాం. మొదటి రెండు రోజులపాటు బతుకుతామన్న ఆశ లేకుండాపోయింది. క్రమంగా ధైర్యం కూడదీసుకున్నాం. బయట పడడానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ముందు ఎలాగైనా ప్రాణాలు రక్షించుకోవాలని నిర్ణయించుకున్నాం. నిజంగా అదొక పీడకల, అగ్ని పరీక్ష. సొరంగం పైభాగంలోని రాళ్ల సందుల నుంచి పడుతున్న ఒక్కో చుక్క నీటిని ఒడిసిపట్టుకొని చప్పరించాం. మా దగ్గరున్న బొరుగులతో 10 రోజులపాటు కడుపు నింపుకున్నాం. అర్ధాకలితో గడిపాం. ఆ తర్వాత అధికారులు పైపు గుండా పండ్లు, భోజనం, నీళ్ల సీసాలు మాకు అందించారు. ప్రమాదం జరిగాక 70 గంటల తర్వాత అధికారులు మాతో మాట్లాడారు. అప్పుడే ప్రాణాలపై మాలో ఆశలు మొదలయ్యాయి. మేమంతా కలిసి నిత్యం దేవుడిని ప్రార్థించేవాళ్లం. చివరకు దేవుడు మా ప్రార్థనలు ఆలకించాడు. మొదట్లో కష్టంగా గడిచింది సొరంగంలో తాము చిక్కుకున్నట్లు తెలియగానే ఆందోళనకు గురయ్యామని ఉత్తరాఖండ్‌లోని చంపావత్ గ్రామానికి చెందిన పుష్కర్‌సింగ్ ఐరే అనే కార్మికుడు చెప్పాడు. మొదట్లో చాలా కష్టంగా గడిచిందని, చనిపోతామని అనుకున్నామని, క్రమంగా అక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డామని తెలిపాడు. తొలుత సరైన ఆహారం లేదు, బయటున్నవారితో మాట్లాడే వీలు లేదని అన్నాడు. ఒంటిపై ఉన్న బట్టలతోనే 17 రోజులపాటు ఉండాల్సి వచి్చందని, స్నానం చేయలేదని, సొరంగం లోపలంతా అపరిశుభ్రంగా మారిందని తెలియజేశాడు. ప్లాస్టిక్ షీట్లపై నిద్రించామని పేర్కొన్నాడు. ఆహారం, నీరు అందిన తర్వాత ఊపిరి పీల్చుకున్నామని చెప్పాడు. కాలక్షేపం కోసం పేకాడామని, కాగితాలను క్రమపద్ధతిలో చింపుతూ ఉండేవాళ్లమని వివరించాడు. సాక్సులతో బంతులు చేసి, చోర్–సిఫాయి ఆట ఆడామని, పాటలు పాడుకున్నాం తెలిపాడు. నిత్యం యోగా, వాకింగ్ చేశాం.. సొరంగం నుంచి బయటకు వచి్చన 41 మంది కార్మికులతో మంగళవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా మాట్లాడారు. వారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. సొరంగంలో ఉన్నప్పుడు నిత్యం యోగా, వాకింగ్ చేశామని, తద్వారా మనోస్థైర్యం సడలకుండా జాగ్రత్తపడ్డామని, ఆత్మవిశ్వాసం పెంచుకున్నామని ప్రధానమంత్రికి కార్మికులు తెలియజేశారు. విదేశాల్లో ఉన్న భారతీయులు ప్రమాదాల్లో చిక్కుకుంటే మన ప్రభుత్వం కాపాడిందని, స్వదేశంలోనే ఉన్న తామెందుకు భయపడాలని భావించామని అన్నారు. రిషికేశ్ ఎయిమ్స్‌కు కార్మికుల తరలింపు సిల్క్యారా టన్నెల్ నుంచి బయటకు వచి్చన కార్మికులను బుధవారం రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు హెలికాప్టర్లో తరలించారు. డిజాస్టర్ వార్డులో చేర్చి, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మానసిక పరిస్థితి కూడా పరీక్షిస్తామని, అవసరమైన వారికి తగిన చికిత్స అందిస్తామని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. ఆరోగ్యం కుదుటపడిన వారిని ఇళ్లకు పంపిస్తామని వెల్లడించారు. కార్మికుల కుటుంబ సభ్యులు, బంధులను కూడా సిల్క్యారా నుంచి బస్సుల్లో ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. కార్మికుల గ్రామాల్లో సంబరాలు ఖిరాబేడా గ్రామం నుంచి మొత్తం 13 మంది యువకులు సొరంగం పనుల కోసం ఉత్తరకాశీకి చేరుకున్నారు. అదృష్టం ఏమిటంటే వారిలో ముగ్గురు మాత్రమే సొరంగంలో చిక్కుకున్నారు. బాధితులుగా మారిన మొత్తం 41 మంది కార్మికుల్లో 15 మంది జార్ఖండ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందినవారే కావడం గమనార్హం. ఖిరాబేడాలో అనిల్ బేడియా తల్లి 17 రోజులపాటు తల్లడిల్లిపోయింది. కుమారుడు జాడ తెలియక ఆందోళనకు గురైంది. ఇంట్లో వంట చేసింది లేదు. ఇరుగు పొరుగు అందించిన భోజనంతో కడుపు నింపుకుంది. ఎట్టకేలకు కుమారుడు అనిల్ బేడియా సొరంగం నుంచి బయటకు రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఇదే గ్రామానికి చెందిన శ్రవణ్ బేడియా(55)కు పక్షవాతం. ఏకైక కుమారుడు రాజేంద్ర సొరంగం నుంచి బయటపడడంతో అతని ఇంట సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రశంసలందుకున్న నాగపూర్ నిపుణుల సేవలు సిల్క్యారా సొరంగంలో సహాయక చర్యల్లో పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పాల్గొన్నాయి. నిపుణులు తమవంతు సేవలందించారు. కార్మికులకు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది లేకుండా, కార్బన్డయాక్సైడ్ స్థాయిలు పెరగకుండా వీరు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ డబ్ల్యూసీఎల్కు నిపుణులు సొరంగం వద్దే మకాం వేశారు. భారీ యంత్రాలతో తవ్వకం పనులు చేపట్టడంతో సొరంగం లోపల కార్బన్డయాక్సైడ్ స్థాయిలు పెరుగుతుండేవి. ప్రమాదకర స్థాయికి చేరగానే యంత్రాలను ఆపించేవారు. వారి సేవలు ప్రశంసలందుకున్నాయి. సొరంగంలో కార్మికులు భుజాలపై ఎత్తుకున్నారు ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణుల్లో ఢిల్లీకి చెందిన ఫిరోజ్ ఖురేïÙ, యూపీకి చెందిన మోను కూమార్ తొలుత సొరంగంలోని కార్మికుల వద్దకు చేరుకున్నారు. తమను చూడగానే కార్మికులు ఆనందంతో భుజాలపై ఎత్తుకున్నారని ఫిరోజ్ వెల్లడించాడు. ‘‘మాకు పండ్లిచ్చారు. పేర్లు అడిగారు. అరగంట పాటు సొరంగంలో ఉన్నాం’’ అని మోను కూమార్ చెప్పాడు. తాము కార్మికుల వద్దకు వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం వచ్చారని పేర్కొన్నాడు. కార్మికులను కాపాడినందుకు తాము డబ్బులేమీ తీసుకోలేదని తెలియజేశాడు. తల్లిదండ్రుల ఫొటో చూస్తూ కాలం గడిపా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖీంపూర్ ఖేరీ జిల్లా భైరాంపూర్కు చెందిన 25 ఏళ్ల మంజీత్ చౌహాన్ సిల్క్యారా టన్నెల్లో చిక్కకొని, 17 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. అతడి రాకతో స్వగ్రామంలో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. మంజీత్ తల్లిదండ్రులు భైరాంపూర్లో ఉంటున్నారు. అతడి సోదరుడు గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తల్లిదండ్రుల ఫొటో మంజీత్ వద్ద ఉంది. ఆ ఫొటో చూస్తూ ధైర్యం తెచ్చుకొని సొరంగంలో కాలం గడిపానని, ఒత్తిడిని అధిగమించానని చెప్పాడు. ‘‘సొరంగం లోపలిభాగం కూలిన సమయంలో అక్కడికి కేవలం 15 మీటర్ల దూరంలోనే పని చేస్తున్నాను. తొలుత అసలేం జరిగిందో అర్థం కాలేదు. క్రమంగా అది పీడ కలగా మారింది. ప్రమాదం జరిగాక మొదటి 24 గంటలు చాలా కష్టంగా గడిచాయి. మేమంతా భయందోళనకు గురయ్యాం. ఆకలి, దాహం, నీరసం, నిరాశ వంటివి అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. నాలుగు అంగుళాల పైపు గుండా అధికారులు ఆహారం, నీరు పంపించిన తర్వాత మా మానసిక స్థితి మారింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలియడంతో మాలో మనోధైర్యం పెరిగింది. కుటుంబ సభ్యులతో మాట్లాడగలిగాం. అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలని నాన్నకు చెప్పా. ఫోన్ వాల్‌పేపర్‌లో నా తల్లిదండ్రుల ఫొటో చూస్తూ ఉండిపోయేవాడిని. ప్రాణాలపై ఆశ కోల్పోకుండా అది ఉపయోగపడింది. సొరంగంలో అటూ ఇటూ నడుస్తూ ఉండేవాళ్లం. పైపు గుండా అధికారులు పంపించిన పప్పు నాకెంతో నచ్చింది. సొరంగంలో చిక్కుకున్న మేమంతా ఒకరికొకరం మంచి మిత్రులుగా మారిపోయాం. మా కష్ట సుఖాలు తెలియజేసుకున్నాం. క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూడలేకపోవడం పట్ల విచారంగా ఉంది. ఇంటికెళ్లిన తర్వాత మ్యాచ్ హైలైట్స్ చూస్తా’’ అని మంజీత్ చౌహాన్ ఉత్సాహంగా చెప్పాడు. సొరంగం పనులు కొనసాగుతాయి ఉత్తరాఖండ్‌లో 4.5 కిలోమీటర్ల పొడవైన సిల్క్యారా సొరంగం పనులు కొనసాగుతాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారులు బుధవారం ప్రకటించారు. కూలిపోయిన ప్రాంతంలో మరమ్మతులు, సేఫ్టీ ఆడిట్ ముగిసిన తర్వాత పనులు యథావిధిగా కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇకపై ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభంచిన 900 కిలోమీటర్ల ‘చార్ధామ్ యాత్ర ఆల్ వెదర్ రోడ్’ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా టెన్నల్‌ను నిర్మిస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చార్‌ధామ్‌లో భాగమైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను అనుసంధానించడానికి కేంద్రం రూ.12,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో నాలుగు క్షేత్రాలను చుట్టిరావడానికి వీలుగా ప్రాజెక్టును రూపొందించారు. నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 డిసెంబర్ 27న శంకుస్థాపన చేశారు. వాస్తవానికి 2020 మార్చిలోగా ప్రాజెక్టు పూర్తికావాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జాప్యం జరుగుతోంది. కేబినెట్ భేటీలో మోదీ భావోద్వేగం సిల్క్యారా సొరంగంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావనకు వచి్చంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ మంగళవారం రాత్రి సమావేశమైంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను తలచుకొని ప్రధానమంత్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం చెప్పారు. కార్మికులను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. సహాయక చర్యలపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు స్వయంగా ఆరా తీశారని, అధికారులకు ఆదేశాలు జారీ చేశారని వివరించారు. దేశ విదేశాల్లోని భారతీయులను కాపాడడం ప్రభుత్వ కర్తవ్యమని ఉద్ఘాటించారు. -
ఆ 17 రోజులు ఎలా గడిచాయంటే..
ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు క్షేమంగా బయటకు వచ్చారు. వీరిని బయటకు తీసుకురావడంలో ర్యాట్ మైనర్ల బృందం విజయం సాధించింది. ఉత్తరకాశీ సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులలో ఒకరైన సుబోధ్ కుమార్ వర్మ మీడియాతో మాట్లాడుతూ ‘తాము టన్నెల్లో ఆహారం కోసం అలమటించిపోయామని, గాలి ఆడక ఇబ్బంది పడ్డామన్నారు. తరువాత అధికారులు పైపుల ద్వారా ఆహార పదార్థాలను పంపించారన్నారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఎలాంటి అనారోగ్య సమస్య లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కఠోర శ్రమ కారణంగానే తాను బయటపడగలిగానని’ తెలిపారు. మరో కార్మికుడు విశ్వజీత్ కుమార్ వర్మ మాట్లాడుతూ ‘తాము సొరంగంలో చిక్కుకున్నామని తెలుసుకున్నామని, బయట అధికారులు తమను బయటకు తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నించారు. మాకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఆక్సిజన్‌తో పాటు ఆహారం అందించారు. మేము టన్నెల్లో చిక్కుకున్న మొదటి 10 నుంచి 15 గంటలు సమస్యలను ఎదుర్కొన్నాం. తరువాత ఆహారాన్ని పైపుల ద్వారా అందించారు. అనంతరం మైకు అమర్చి, కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. ఇప్పుడు తామంతా సంతోషంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. నవంబర్ 12వ తేదీ తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో సొరంగంలో ప్రమాదం జరిగి 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. తరువాత వారికి అధికారులు ఒక పైపు ద్వారా మందులు, డ్రై ఫ్రూట్స్ పంపించారు. నవంబర్ 20న ఆరు అంగుళాల పైపును సొరంగంలోనికి పంపి కిచ్డీతో పాటు అరటిపండ్లు, నారింజ, డ్రైఫ్రూట్స్, బ్రెడ్, బ్రష్‌లు, టూత్‌పేస్టులు, మందులు, అవసరమైన దుస్తులను వారికి పంపించారు. ఎట్టకేలకు 17 రోజుల అనంతరం కార్మికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఇది కూడా చదవండి: సొరంగం నుంచి వచ్చిన కుమారుడుని చూడకుండానే తండ్రి మృతి -
ఆయన సపోర్టు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు : ఉత్తరాఖండ్ సీఎం
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్నవారిని రక్షించే రెస్క్యూ ఆపరేషన్ విజయం సాధించింది. 41 మంది కార్మికులను సురక్షితంగా సొరంగంనుంచి బయటికి తీసుకువచ్చారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు. 17 రోజులు సుదీర్ఘ నిరీక్షణ తరువాత వారంతా ఈసంక్షోభం నుంచి బైటపడటంతో కార్మికుల కుటుంబాలు, రెస్క్యూ సిబ్బందితోపాటు, దేశ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో భాగమైన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి మోదీ నిరంతరం తనతో టచ్‌లో ఉంటూ, రెస్క్యూ ఆప్‌కు సంబంధించిన అప్డేట్లు తెలుసుకున్నారనీ పలు సలహాలిచ్చారని సీఎం వెల్లడించారు. (ఉత్తరాఖండ్ టన్నెల్: మన ఊరూ కాదు,పేరూ కాదు అయినా! ఎవరీ ఆర్నాల్డ్ డిక్స్) ఎలాగైనా అందరినీ క్షేమంగా రక్షించడమే కర్త్యవ్యంగా పెట్టుకున్నాననీ, ఈ విషయంలో ప్రధాని సపోర్టు లేకుంటేఇది సాధ్యమయ్యేది కాదంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు కార్మికులందరికీ తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించి, క్షేమంగా ఇళ్లకు చేరేలా అన్ని సౌకర్యాలు కల్పించాలని మోదీ తనను ఆదేశించారని వెల్లడించారు. కాగా ఈ విజయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానిమోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితర ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని ప్రకటించారు. (ఇంత కన్నా గొప్ప విజయం ఏముంటుంది : ఆనంద్ మహీంద్ర) (అద్భుతం..ఉద్వేగమైన క్షణాలివి: ఆనందోత్సాహాల వెల్లువ) #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue: CM Pushkar Singh Dhami says, " I want to thank all the members who were part of this rescue operation...PM Modi was constantly in touch with me and was taking updates of the rescue op. He gave me the duty to rescue everyone safely… pic.twitter.com/TldZLK6QEB — ANI (@ANI) November 28, 2023 -
పైప్‌లైన్ అమరిక పూర్తి.. ఏ క్షణంలోనైనా కార్మికులు బయటకు!
ఉత్తరకాశీ: ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు మరికొద్ది క్షణాల్లో విముక్తి కలగనుంది. దాదాపు 17 రోజుల నుంచి కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ కొలిక్కి వచ్చింది. ఇప్పటికే పైపులైన్‌ను పూర్తిగా దించేశారు. ర్యాట్ హోల్ మైనింగ్ టెక్నిక్‌లో రెస్క్యూ బృందాలు సొరంగంలో చిక్కుకున్న కార్మికుల వద్దకు డ్రిల్లింగ్ పనులు పూర్తి చేసినట్లు సమాచారం. పైప్‌లైన్ గుండా కార్మికులను బయటకు తీసుకురావడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాక్ డ్రిల్స్ కూడా పూర్తి చేశారు. కార్మికులు ఏ క్షణంలోనైనా బయటకు రావచ్చని ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ట్వీట్ చేశారు. #WATCH | Uttarkashi tunnel rescue | Operation intensifies to rescue the 41 workers trapped inside the Silkyara tunnel. CM Pushkar Singh Dhami tweeted that the work of inserting the pipe inside the tunnel is complete and all the workers will be rescued soon. pic.twitter.com/a7iE6R9yEs — ANI (@ANI) November 28, 2023 అంబులెన్స్‌లు సిద్ధం.. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటికే సమాచారాన్ని అందించారు. కార్మికులను కలుసుకోవడానికి కుటుంబ సభ్యులు దుస్తులు, బ్యాగులతో సిద్ధంగా ఉండాలని కోరారు. టన్నెల్ నుంచి బయటకు తీసుకురాగనే కార్మికులకు ప్రాథమిక చికిత్స అందించడానికి టన్నెల్లో బెడ్స్‌ను ఏర్పాటు చేశారు. కార్మికులను బయటకు తీసుకురాగానే ఉత్తరకాశీలో ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి 41 అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. ఆస్పత్రిలో 41 బెడ్స్‌తో ప్రత్యేక వార్డ్‌ను కూడా ఏర్పాటు చేశారు. తమ కుటుంబ సభ్యులను కలుసుకోవాడనికి బాధిత బంధువులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. PHOTO | Beds, chairs kept ready inside #SilkyaraTunnel, Uttarkashi as 41 workers, trapped since last 16 days, are expected to come out anytime soon.#UttarakhandTunnelRescue pic.twitter.com/UF57yncByE — Press Trust of India (@PTI_News) November 28, 2023 ‘ర్యాట్ హోల్ మైనింగ్’ బృందానికి చెందిన అనుభవజ్ఞులైన 24 మంది మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ముందుగా 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీల్ పైపు నుంచి డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను తొలగించారు. అదే మార్గంలో దూరిన కార్మికులు.. సొరంగానికి మ్యాన్యువల్‌గా రంధ్రం చేయడం ప్రారంభించారు. ర్యాట్ హోల్ మైనింగ్ కార్మికులు మాన్యువల్ డ్రిల్లింగ్ ద్వారా శిథిలాలను బయటకు తీస్తున్నారు. VIDEO | Uttarkarshi tunnel collapse UPDATE: "It is a matter of happiness for us. I want to thank PM Modi, the Uttarakhand administration and those involved in the rescue operation on behalf of the UP government," says Arun Mishra, coordinator of UP government for rescue… pic.twitter.com/WRW2EPD3Np — Press Trust of India (@PTI_News) November 28, 2023 'ఇది మనందరికి సంతోషకరమైన వార్త. రెస్క్యూ ఆపరేషన్ దాదాపుగా విజయం సాధించినందుకు ప్రధాని మోదీ, ఉత్తరఖండ్ పాలనా యంత్రాంగానికి, యూపీ ప్రభుత్వం తరపున పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.' అని రెస్క్యూ ఆపరేషన్ యూపీ ప్రభుత్వం కోఆర్డినేటర్ అరుణ్ మిశ్రా తెలిపారు. ఏమిటీ ర్యాట్–హోల్ పద్ధతి? మేఘాలయలో ఈ పద్ధతి చాలా ఫేమస్. అక్రమ బొగ్గు గనుల్లో ఈ విధానంలోనే బొగ్గు తవ్వేస్తారు. ముందుగా గని ఉపరితలంపై మనిషి దూరేంత చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లి సమాంతరంగా చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ బొగ్గుపొరలను తొలుస్తారు. ‘‘ మేం పదేళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నాం. కార్మికులను కాపాడేందుకు పనిచేయడం ఇదే తొలిసారి. ఇక్కడ 800 మిల్లీమీటర్ల పైపులోంచి వెళ్లి పనిచేయాలి. మేం 600 మిల్లీమీటర్ల పైపులో కూడా దూరి పనిచేశాం. చిన్న గడ్డపార, పార, చిన్న తట్ట వెంట తీసుకెళ్లి చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ శిథిలాలను తొలగిస్తాం. 12 మీటర్లలో కేవలం మట్టి ఉంటే పని 24 గంటల్లో పూర్తి అవుతుంది. ఒకవేళ గట్టి రాళ్లు ఉంటే 36 గంటలకుపైనే పడుతుంది. వంతుకు ఇద్దరు చొప్పున ఆరుగురం తవ్వేస్తాం’’ అని కార్మికులు వెల్లడించారు. ఇదీ చదవండి: Uttarakhand Tunnel Rescue Operation: రెస్క్యూ ఆపరేషన్‌కు ఎడతెగని ఆటంకాలు! -
ఉత్తరకాశీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌లో సైన్యం ఎంట్రీ
ఉత్తరకాశీ: ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడే ఆపరేషన్‌లో భారత సైన్యం ఎంట్రీ ఇచ్చింది. సొరంగంలో ఇరుక్కుపోయిన ఆగర్ యంత్రం భాగాన్ని బయటకు తొలగించే పనుల్లో సైన్యం నిమగ్నమైంది . ఇందుకు ఆర్మీ తమ పరికరాలను కొండ పైభాగానికి తరలిస్తున్నారు. 800 ఎంఎం ఇనుప పైపును డ్రిల్లింగ్ చేసి, ఇన్సర్ట్ చేస్తున్న ఆగర్ మిషన్ బ్లేడ్లు శనివారం శిథిలాలలో చిక్కుకున్నాయి. దీంతో యంత్రం ధ్వంసమైంది. ఫలితంగా సొరంగానికి పైనుంచి తవ్వకాలు జరిపి, బాధితులను చేరుకునే మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. సొరంగంలో ఇరుక్కుపోయిన ఆగర్ యంత్రం భాగాన్ని తొలగించేందుకు హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్‌ను విమానంలో తీసుకువచ్చారు. ఆగర్ యంత్రం భాగాలను తొలగించే పనిలో సైన్యం నిమగ్నమైంది. ఉత్తరాఖండ్, ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారాలో సొరంగం కుప్పకూలింది. ఈ ఘటనలో 41 మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకురావడానికి గత 15 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చురుగ్గా సాగుతోంది. ఆగర్ యంత్రం ధ్వంసం కావడంతో సొరంగానికి పైనుంచి తవ్వకాలు జరిపి, బాధితులను చేరుకునే మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ కారణంగా కార్మికులను రక్షించడానికి కొన్ని వారాలు పట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: Uttarkashi tunnel collapse: సొరంగ బాధితులకు క్రిస్మస్కు విముక్తి? -
‘సొరంగ బాధితులు బయటకు రావాలంటే మరి కొన్ని వారాలు నిరీక్షించాల్సిందే(
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారాలో కుప్పకూలిన సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు బయటకు రావాలంటే క్రిస్మస్ వరకు సమయం పడుతుందని తెలుస్తోంది. 800 ఎంఎం ఇనుప పైపును డ్రిల్లింగ్ చేసి, ఇన్సర్ట్ చేస్తున్న ఆగర్ మిషన్ బ్లేడ్లు శనివారం శిథిలాలలో చిక్కుకున్నాయి. దీంతో యంత్రం ధ్వంసమైంది. ఫలితంగా సొరంగానికి పైనుంచి తవ్వకాలు జరిపి, బాధితులను చేరుకునే మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ కారణంగా కార్మికులను రక్షించడానికి కొన్ని వారాలు పట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఎంఎ) సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ మాట్లాడుతూ ఈ ఆపరేషన్‌కు చాలా సమయం పట్టవచ్చని అన్నారు. సంఘటనా స్థలం వద్ద ఉన్న అంతర్జాతీయ సొరంగ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ మాట్లాడుతూ క్రిస్మస్ నాటికి బాధిత కార్మికులను బయటకు తీసుకురాగలుగుతామని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మాన్యువల్ డ్రిల్లింగ్‌లో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే తవ్వడానికి వెళ్లేందుకు అవకాశం ఉంది. దీనికితోడు ఆ వ్యక్తి తనతో పాటు ఆక్సిజన్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ ఆక్సిజన్ కూడా ఒక గంట మాత్రమే ఉంటుంది. అంటే గంటకోసారి తవ్వే వ్యక్తిని మార్చాల్సి ఉంటుంది. దీంతో తవ్వే వేగం తగ్గుతుంది. అంతర్జాతీయ నిపుణుడు డిక్స్.. ఆగర్ యంత్రం పగిలిపోయిందని చెప్పడంతో సొరంగంలో ఇరుక్కుపోయిన ఆగర్ యంత్రం భాగాన్ని తొలగించేందుకు హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్‌ను విమానంలో తీసుకువచ్చారు. ఆగర్ యంత్రం భాగాలను తొలగించిన అనంతరం మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రారంభం కానున్నదని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: రాజస్థాన్ రాజకీయాలను శాసిస్తున్న ఓటింగ్ శాతం -
బయటివారితో మాట్లాడుతున్న సొరంగంలోని బాధితులు
ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంగళవారం సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దానిలో వారంతా సురక్షితంగా ఉన్నట్లు కనిపించారు. సొరంగంలోని కార్మికులతో బయట ఉన్న వారి బంధువులు మాట్లాడుతున్నారు. బుధవారం ఆ కార్మికులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారిలో ఒక కార్మికుడు మొబైల్ ఛార్జర్‌ను లోపలికి పంపించాలని కోరాడు. సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులలో పుష్కర్ సింగ్ యేరీ ఒకరు. అతని సోదరుడు విక్రమ్ సింగ్ యేరీ తాను పుష్కర్‌తో మాట్లాడినట్లు మీడియాకు తెలిపారు. తన సోదరుడు.. తాను బాగున్నానని, మమ్మల్ని ఇంటికి వెళ్లాలని చెప్పాడని తెలిపారు. కాగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు ఆహారపదార్థాలను, ఇతర వస్తువులను అందించడానికి ఆరు అంగుళాల వెడల్పు గల పైపును లోపలికి పంపారు. ఈ ఆరు అంగుళాల ‘లైఫ్‌లైన్’ అందించకముందు కార్మికులకు ఆహారం, నీరు, మందులు, ఆక్సిజన్‌ను నాలుగు అంగుళాల పైపు ద్వారా సరఫరా చేశారు. కాగా తాజాగా లోనికి పంపిన విశాలమైన పైప్‌లైన్‌తో మెరుగైన కమ్యూనికేషన్ అందడంతో పాటు ఆహార పదార్థాలను కూడా పెద్ద మొత్తంలో పంపేందుకు అవకాశం కలిగింది. సొరంగంలో చిక్కుకున్న కార్మికుడు ప్రదీప్ కిస్కు క్షేమ సమాచారాన్ని అతని బంధువు సునీతా హెంబ్రామ్ తెలుసుకున్నారు. అతను బాగున్నాడని ఆమె మీడియాకు తెలిపారు. కాగా కొత్త పైపు సొరంగంలోకి పంపడం వలన కార్మికులతో కమ్యూనికేట్ చేయడం సులభతరం అయ్యింది. ఇప్పుడు వారి గొంతు స్పష్టంగా వినిపిస్తున్నదని సొరంగం బయట ఉన్నవారు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి ఫోన్ చేసి నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చేపడుతున్న రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ల గురించిన సమాచారం తెలుసుకున్నారు. ఉత్తరకాశీ జిల్లాలోని చార్ధామ్ యాత్ర మార్గంలో నిర్మాణంలో ఉన్న నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన సిల్క్యారా సొరంగంలోని ఒక భాగం నవంబర్ 12న కూలిపోయింది. ఈ సమయంలో 41 మంది కూలీలు సొరంగంలో చిక్కుకుపోయారు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితుల కోసం సైకత శిల్పి ప్రార్థనలు VIDEO | "He said -'I am good. You people go home. I will come.' Fruits and other food items were sent through the pipe. He has asked for a mobile charger," says Vikram Singh Yeri, brother of Pushkar Singh Yeri, one of the workers who is stuck inside the collapsed Silkyara… pic.twitter.com/LKS66h5FCy — Press Trust of India (@PTI_News) November 22, 2023 -
హిమాచల్‌లోనూ సొరంగ ప్రమాదం.. ఎప్పుడంటే..
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలి 41 మంది కూలీలు చిక్కుకున్నారు. కార్మికులంతా క్షేమంగా ఉండడం, 10వ రోజు రెస్క్యూ ఆపరేషన్‌లో కార్మికులందరి ఫొటోలు బయటకు రావడం కాస్త ఊరట కలిగించింది. కాగా హిమాచల్‌ప్రదేశ్‌లో తొమ్మది ఏళ్ల క్రితం కూడా ఇటాంటి సొరంగ ప్రమాదమే చోటు చేసుకుంది. నాటి ప్రమాదంలో ఇద్దరు కూలీలు సజీవంగా బయటపడ్డారు. ఒక కూలీ మృతి చెందాడు. సొరంగంలో చిక్కుకున్న ఈ కూలీలు పది రోజుల పాటు ఆహారపానీయలు లేకుండా దయనీయ స్థితిలో కాలం గడిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కిరాత్పూర్-మనాలి దగ్గరున్న సొరంగంలో 2015, సెప్టెంబరు 15న ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్‌లో మాదిరిగానే నాడు ఈ సొరంగంలో కొంత భాగం కూలిపోవడంతో కార్మికులు లోపల చిక్కుకుపోయారు. మొదట ఎంత మంది కార్మికులు లోపల చిక్కుకున్నారో తెలియరాలేదు. నాడు దీనికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ అప్పటి డీసీ మాన్సీ సహాయ్ నేతృత్వంలో జరిగింది. ఆయన ప్రస్తుతం హిమాచల్‌లో లేబర్ కమిషనర్‌గా ఉన్నారు. నాడు కిరాత్పూర్-మనాలి దగ్గరున్న సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు 211 గంటల 47 నిమిషాల సమయం పట్టింది. 42 మీటర్ల మేర సొరంగంలో డ్రిల్లింగ్ చేసిన అనంతరం రెస్క్యూ టీం ఇద్దరు కార్మికులను క్షేమంగా బయటకు తీసుకువచ్చింది. ఇది కూడా చదవండి: సొరంగంలో చిక్కుకున్నవారంతా క్షేమం.. ఫొటో విడుదల! -
సొరంగంలో చిక్కుకున్నవారంతా క్షేమం.. ఫొటో విడుదల!
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో గల సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా జరుగుతోంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. ఈ చిత్రంలో కార్మికులందరూ సురక్షితంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అమెరికన్ ఆగర్ యంత్రంతో సిల్క్యారా టన్నెల్ నుండి ఎస్కేప్ టన్నెల్ తయారు చేసే పనులు ప్రారంభం అయ్యాయి. ఢిల్లీకి చెందిన మెకానికల్ బృందం అమెరికన్ అగర్ యంత్రంలోని భాగాలను మార్చింది. యంత్రాన్ని ఆపరేట్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. శిథిలాలలో ఆరు పైపులు అమర్చిన తర్వాత మొదటిసారిగా కార్మికులకు ఘన ఆహారాన్ని పంపిణీ చేశారు. పైపు ద్వారా కెమెరాను కూడా లోనికి పంపించారు. దీంతో లోపల చిక్కుకున్న కార్మికులకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. లోపల చిక్కుకుపోయిన కార్మికులతో అధికారులు మాట్లాడి, వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితులకు తొలిసారిగా వేడి కిచిడీ పంపిణీ! #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | First visuals of the trapped workers emerge as the rescue team tries to establish contact with them. The endoscopic flexi camera reached the trapped workers. pic.twitter.com/5VBzSicR6A — ANI (@ANI) November 21, 2023 -
ఆగిన టన్నెల్ తొలిచే పనులు...ప్రమాదంలో 40 మంది ప్రాణాలు!
ఉత్తర కాశీ: ఉత్తరాఖండ్‌లో టన్నెల్ కూలిన ఘటనలో చిక్కుకున్న 40 మంది కార్మికులను కాపాడే రెస్క్యూ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. డ్రిల్లింగ్ మెషిన్ మళ్లీ మొరాయించడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. టన్నెల్లోకి వెడెల్పైన స్టీల్ పైపులను పంపి చిక్కుకున్న వారిని కాపాడేందుకు భారీ యంత్రంతో ఆరు రోజులుగా డ్రిల్లింగ్ చేస్తున్నారు. టన్నెల్ డ్రిల్లింగ్ చేస్తూ శుక్రవారం ఆగిపోయిన యంత్రం రెండోది కావడం గమనార్హం. గురువారం ఒక యంత్రం డ్రిల్లింగ్ చేస్తూ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అధికారులు మూడో యంత్రాన్ని ఇండోర్ నుంచి వాయు మార్గంలో తీసుకువస్తున్నారు. ఈ యంత్రం శనివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకోనున్నట్లు సమాచారం. కాగా, ఆదివారం(నవంబర్ 12) ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో చార్దామ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న 4 కిలోమీటర్ల టన్నెల్‌లోని ఓ భాగం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేస్తేన్న 40 మంది కార్మికులు టన్నెల్ కింద చిక్కుకుపోయారు. వీరిని కాపాడేందుకు అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. అయితే టన్నెల్లో చిక్కుకున్న కార్మికులకు ఎప్పటికప్పుడు ఆక్సిజన్, ఆహారపదార్థాలు, నీరు పంపిస్తున్నారు. ఇప్పటివరకు వారంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదీచదవండి..ఆ ఉద్యోగాల్లో రిజర్వేషన్ చెల్లదు : హర్యానా హై కోర్టు -
ఉత్తరకాశీకి థాయ్ రెస్క్యూ బృందాలు
ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్‌లో సొరంగం కుప్పకూలిన ఘటనలో 40 మంది కార్మికులు నాలుగు రోజులుగా అందులో చిక్కుకుపోయారు. వీరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే కొండచరియలు విరిగిపడటంతోపాటు పలు సాంకేతిక సమస్యలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. తాజాగా థాయ్‌ల్యాండ్, నార్వేలకు చెందిన రెస్క్యూ బృందాలను అధికారులు ఇక్కడకు రప్పించాలని నిర్ణయించారు. 2018లో థాయ్‌లాండ్‌లోని ఒక గుహలో చిక్కుకున్న పిల్లలను రక్షించడంలో థాయ్‌లాండ్, నార్వేలకు చెందిన రెస్క్యూ నిపుణులు విజయం సాధించారు. ఇప్పుడు వీరు ఉత్తరకాశీలోని చార్ధామ్ రహదారిపై ఉన్న ఈ గుహలో చిక్కుకున్నవారిని బయటకు తెచ్చేందుకు సహాయం అందించనున్నారు. ఈ సొరంగంలో చిక్కుకున్న 40 మందిని వెలికితెచ్చేందుకు స్థానిక అధికారులు చేసిన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలించకపోవడంతో థాయ్‌లాండ్, నార్వేలకు చెందిన రెస్క్యూ నిపుణుల సాయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఉత్తర థాయ్‌లాండ్‌లోని చియాంగ్ రాయ్ ప్రావిన్స్‌లోని థామ్ లుయాంగ్ నాంగ్ నాన్ గుహలో చిక్కుకున్న జూనియర్ అసోసియేషన్ ఫుట్‌బాల్ జట్టును రక్షించడంలో థాయ్‌కి చెందిన ఒక రెస్క్యూ కంపెనీ విజయం సాధించింది. నాడు ఆ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసేందుకు వారం రోజులు పట్టింది. ఇది కూడా చదవండి: ఢిల్లీలో రోడ్లు కనిపించక జనం అవస్థలు! -
ఉత్తరాఖండ్‌లో భూకంపం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశిలో గురువారం వేకువజామున 6 గంటల 12 నిమిషాలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది. భారత వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. భూకంప కేంద్రం ఉత్తరకాశి నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని 30.8 ఉత్తర అక్షాంశం, 78.2 తూర్పు రేఖాంశాల మధ్య కేంద్రీకృతమైంది. కాగా ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. Earthquake of Magnitude:4.0, Occurred on:14-06-2018, 06:12:08 IST, Lat:30.8 N & Long: 78.2 E, Depth: 10 Km, Region:Uttarkashi, Uttarakhand pic.twitter.com/Jrg6NXmrJ2 — IMD-Earthquake (@IMD_Earthquake) June 14, 2018 -
కుప్పకూలిన గంగోత్రి బ్రిడ్జి
ఉత్తర కాశీ : భారత్-చైనాల మధ్య మధ్య ఉన్న ఏకైక వారధి గురువారం కుప్పకూలిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా ఒకేసారి రెండు వాహనాలు దీనిపైకి రావటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనలో ప్రాణ నష్టం సంభవించలేదు. ఉత్తరకాశీ-చైనా సరిహద్దును కలుపుతూ ఈ వారధి ఉంది. ఈ వంతెన పైనుంచి ఒకసారి ఒక ట్రక్కు వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు. అయితే ఘటన సమయంలో రెండు వాహనాలు రావటంతో.. అధిక బరువు తట్టుకోలేక బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు ఉత్తరకాశీ జిల్లా న్యాయమూర్తి అశిష్ చౌహాన్ తెలిపారు. బ్రిడ్జి కూలిపోయి సంబంధాలు తెగిపోవడంతో ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని సిద్ధం చేయనున్నట్టు అధికారులు తెలిపారు. వంతెన కూలడంతో గంగోత్రి, మనేరి, హార్సిల్ సహా సుమారు 12 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. కూలీలు, విద్యార్థలు మరో మార్గం లేక అవస్థలు పడ్డారు. ఉత్తరాఖండ్‌ను ముంచెత్తిన వరదల తర్వాత 2013 గంగోత్రి జాతీయ రహదారిపై బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) ఈ బ్రిడ్జిని నిర్మించింది. -
ఉత్తరాఖండ్‌లో మళ్లీ భారీ వర్షాలు, విధ్వంసం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. విధ్వంసం సృష్టిస్తున్నాయి.ప్రధానంగా చమోలి జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షాలు కురవడంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఉత్తరకాశీ జిల్లాలో కూడా పలు నివాస ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ఆ ప్రాంతాల్లో నివసించేవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. హరిద్వార్ జిల్లాలో 24 మందితో వెళ్తున్న పడవ ఒకటి లక్సర్ సమీపంలో గంగానదిలో చిక్కుకుపోవడంతో కాసేపు అంతా ఆందోళన చెందినా, తర్వాత మాత్రం వారందరినీ రక్షించగలిగిగనట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరద ప్రభావంతో దారుణంగా పాడైన రోడ్ల పునరుద్ధరణ పనులను బీఆర్ఓ, పీడబ్ల్యుడీ శాఖలు చేపడుతుండగా, ఇప్పుడు కురుస్తున్న వర్షాలు ఆ పనులకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలోని బాడ్కోట్ ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 10.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హరిద్వార్‌లో గంగానది గత కొన్ని రోజులుగా ప్రమాద స్థాయికి సమీపంలో ప్రవహిస్తోంది. పౌరి జిల్లాలో శతాబ్దాల నాటి మఠం ఒకటి అలకనందా నది వరదలో కొట్టుకుపోయింది. అలకనందా నది ఒడ్డున ఎప్పుడో 1625 సంవత్సరంలో ఏర్పాటుచేసిన ఈ చారిత్రక కేశోరాయ్ మఠం నదిలో కొట్టుకుపోయినట్లు పౌరి జిల్లా విపత్తు నివారణ అధికారి రవ్నీత్ చీమా తెలిపారు. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పునాదులతో సహా మఠం మొత్తం కుప్పకూలినట్లు ఆమె చెప్పారు. ఇప్పుడక్కడ కేవలం ఒక గోడ మాత్రమే మిగిలింది. జిల్లాలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. చమోలిలోని కమెడా ప్రాంతం నుంచి కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసేశారు. ఆ జిల్లాలోని దేవల్, తరాలి ప్రాంతాల్లో ఆరు ఇళ్లు కుప్పకూలాయి. అర డజనుకు పైగా వంతెనలు కొట్టుకుపోయాయి. ఉత్తరకాశీ జిల్లాలోని గునాల్ గ్రామంలో ఇళ్లు మునిగిపోతున్నాయి. దీంతో ఆ ఇళ్లలోని వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.