ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్‌లో సొరంగం కుప్పకూలిన ఘటనలో 40 మంది కార్మికులు నాలుగు రోజులుగా అందులో చిక్కుకుపోయారు. వీరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే కొండచరియలు విరిగిపడటంతోపాటు పలు సాంకేతిక సమస్యలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. తాజాగా థాయ్‌ల్యాండ్, నార్వేలకు చెందిన రెస్క్యూ బృందాలను అధికారులు ఇక్కడకు రప్పించాలని నిర్ణయించారు.
2018లో థాయ్‌లాండ్‌లోని ఒక గుహలో చిక్కుకున్న పిల్లలను రక్షించడంలో థాయ్‌లాండ్, నార్వేలకు చెందిన రెస్క్యూ నిపుణులు విజయం సాధించారు. ఇప్పుడు వీరు ఉత్తరకాశీలోని చార్‌ధామ్ రహదారిపై ఉన్న ఈ గుహలో చిక్కుకున్నవారిని బయటకు తెచ్చేందుకు సహాయం అందించనున్నారు. ఈ సొరంగంలో చిక్కుకున్న 40 మందిని వెలికితెచ్చేందుకు స్థానిక అధికారులు చేసిన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలించకపోవడంతో థాయ్‌లాండ్, నార్వేలకు చెందిన రెస్క్యూ నిపుణుల సాయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.
ఉత్తర థాయ్‌లాండ్‌లోని చియాంగ్ రాయ్ ప్రావిన్స్‌లోని థామ్ లుయాంగ్ నాంగ్ నాన్ గుహలో చిక్కుకున్న జూనియర్ అసోసియేషన్ ఫుట్‌బాల్ జట్టును రక్షించడంలో థాయ్‌కి చెందిన ఒక రెస్క్యూ కంపెనీ విజయం సాధించింది. నాడు ఆ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసేందుకు వారం రోజులు పట్టింది.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో రోడ్లు కనిపించక జనం అవస్థలు!
Comments
Please login to add a commentAdd a comment