Thai
-
ఎంతటి ఫిట్నెస్ కింగ్‌లైనా..ఆ మెట్లు ఎక్కితే కాళ్లు వణికిపోవాల్సిందే!
ఎన్నో విచిత్రమైన ప్రదేశాలు గురించి విన్నాం.ఎంతో ఎత్తులో ఉండే హోటల్స్ దేవాలయాలు గురించి విన్నాం. కానీ వాటిని ఎక్కడం కష్టమేమి కాదు. కేవలం అంత ఎత్తులో ఉన్నాయన్న భయమేతప్పతే ఇంకేమీ ఉండదు. ఎంచక్కా మెట్ల మార్గం లేదా రోప్‌వే సాయంతో వెళ్లిపోయేవారు. కానీ చైనాలో ఈ ప్రసిద్ధ పర్వతం ఎక్కితే ఎంతటి వారికైన కాళ్లు వణికిపోతాయి. చేతిలో కర్ర లేనిది నడవలేరు ఎందుకంటే.. చైనాలో ప్రసిద్ధ తాయ్ పర్వతం చారిత్రక సాంస్కృతికి ప్రాముఖ్యత కలిగిన పర్వతం. చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌లో ఎత్తైన ప్రదేశం. దీన్ని చైనా వాళ్లు పవిత్ర తూర్పు పర్వతంగా పిలుస్తారు. సూర్యోదయం, సూర్యాస్తమయం రెండు ఈ పర్వతం వద్ద చూడొచ్చు. అంత విశేషం గల భారీ పర్వతం. ఈ పర్వతం ఎక్కేందుకు ఏకంగా 6600 మెట్లు ఉంటాయి. అయితే ఈ మెట్లు ఎక్కినప్పుడు కింద భాగం సమ ఉష్ణోగ్రత ఉంటుంది. పైకి వెళ్లే కొద్ది ఉష్ణోగ్రత తక్కువగా ఉండి చలిగా ఉంటుంది. అయితే ఎవ్వరైనా ఈ మెట్లు ఎక్కితే కర్ర పట్టుకోక తప్పదు. అన్ని మెట్టు ఎక్కుతుండటం వల్లనే ఏమో ఎంతటి ఫిట్నెస్ గల వాళ్లైనా వృద్ధుల వలే గజగజ కాళ్లు వణికిపోతుంటాయి. మీసాలు మెలేసిన కండల ధీరుడైన ఈ మెట్లు ఎక్కితే మాత్రం బాబోయ్ అంటూ కర్ర పట్టుకుని వణికిపోక తప్పదు. అంతలా ఉంటుంది ఆ పర్వతం వొంపు, దాని ఉష్ణోగ్రతలు కారణంగానే ఈ పరిస్థితి ఎదురయ్యింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ తెగ వైరల్ అయ్యింది. 中国の泰山。7200段の階段があり、登頂に4~6時間かかるため観光気分で訪れた人々が後悔する。 pic.twitter.com/DY7xwj18iy — ロアネア@最多情報源バズニュース (@roaneatan) April 17, 2024 (చదవండి: అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..!) -
థాయ్ రాచరికంపై విమర్శలు.. 50 ఏళ్ల జైలు
బ్యాంకాక్: దేశంలోని రాచరిక వ్యవస్థను అగౌరవపరిచిన ఓ వ్యక్తికి థాయ్‌ల్యాండ్ కోర్టు రికార్డు స్థాయిలో 50 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కఠిన చట్టాలు అమల్లో ఉన్న థాయ్‌ల్యాండ్‌లో ఇంతటి భారీ శిక్షను విధించడం ఇదే మొదటిసారని హక్కుల సంఘాలు అంటున్నాయి. చియాంగ్ రాయ్ ప్రావిన్స్‌కు చెందిన మొంగ్కొల్ తిరఖోట్(30) ఆన్లైన్లో వస్త్ర వ్యాపారం చేస్తుంటాడు. రాజకీయ హక్కుల కార్యకర్త కూడా. రాజు ప్రతిష్టకు భంగం కలిగేలా ఆన్లైన్లో పోస్టులు పెట్టారంటూ 2023లో కోర్టు ఈయనకు 28 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో 12కు పైగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలడంతో గురువారం ఆయనకు మరో 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రపంచంలోనే అత్యంత కఠిన రాజరిక చట్టాలు థాయ్‌ల్యాండ్‌లో అమలవుతున్నాయి. రాజు, రాణి, వారసులను విమర్శిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష ఖాయం. -
ఉత్తరకాశీకి థాయ్ రెస్క్యూ బృందాలు
ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్‌లో సొరంగం కుప్పకూలిన ఘటనలో 40 మంది కార్మికులు నాలుగు రోజులుగా అందులో చిక్కుకుపోయారు. వీరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే కొండచరియలు విరిగిపడటంతోపాటు పలు సాంకేతిక సమస్యలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. తాజాగా థాయ్‌ల్యాండ్, నార్వేలకు చెందిన రెస్క్యూ బృందాలను అధికారులు ఇక్కడకు రప్పించాలని నిర్ణయించారు. 2018లో థాయ్‌లాండ్‌లోని ఒక గుహలో చిక్కుకున్న పిల్లలను రక్షించడంలో థాయ్‌లాండ్, నార్వేలకు చెందిన రెస్క్యూ నిపుణులు విజయం సాధించారు. ఇప్పుడు వీరు ఉత్తరకాశీలోని చార్ధామ్ రహదారిపై ఉన్న ఈ గుహలో చిక్కుకున్నవారిని బయటకు తెచ్చేందుకు సహాయం అందించనున్నారు. ఈ సొరంగంలో చిక్కుకున్న 40 మందిని వెలికితెచ్చేందుకు స్థానిక అధికారులు చేసిన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలించకపోవడంతో థాయ్‌లాండ్, నార్వేలకు చెందిన రెస్క్యూ నిపుణుల సాయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఉత్తర థాయ్‌లాండ్‌లోని చియాంగ్ రాయ్ ప్రావిన్స్‌లోని థామ్ లుయాంగ్ నాంగ్ నాన్ గుహలో చిక్కుకున్న జూనియర్ అసోసియేషన్ ఫుట్‌బాల్ జట్టును రక్షించడంలో థాయ్‌కి చెందిన ఒక రెస్క్యూ కంపెనీ విజయం సాధించింది. నాడు ఆ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసేందుకు వారం రోజులు పట్టింది. ఇది కూడా చదవండి: ఢిల్లీలో రోడ్లు కనిపించక జనం అవస్థలు! -
అక్కడ చేపలు జస్ట్ తినడానికి ట్రై చేసినా చాలు..క్యాన్సర్ ఖాయం!
చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదంటారు. పైగా చేపనూనె లేదా చేపతో చేసిన రెసిపీలు కనీసం వారానికి ఒక్కసారి తీసుకుంటే చాలా మంచిదని పదేపదే ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు కూడా. కానీ ఆ దేశంలోని చేపలు గురించి వైద్యులు చెబుతున్న షాకింగ్ విషయాలు వింటే వెంటనే మీ నిర్ణయం మార్చుకుంటారు. ఎందుకంటే చేపలను జస్ట్ తినాలని ట్రై చేసినా చాలు మందులతో కూడా నయం చేయలేని భయానక క్యాన్సర్ రావడం పక్కా అంటున్నారు. విచిత్రం ఏంటంటే.. అక్కడ చేపలతో చేసిన వంటకాలనే అక్కడ ప్రజలు చచ్చేంత ఇష్టంగా తింటారట. ఆ చేప కథకమామీషు ఏంటో చూద్దాం!. థాయ్ వంటకాలకు అత్యంత రుచికర, ఆరోగ్యకరమైన వంటకాలుగా మంచి ప్రసిద్ధి. కానీ అక్కడ ఓ చేప వంటకం మాత్రం చాలా డేంజర్ అని దాదాపు 20 వేల మంది మరణాలకు కారణమైందని వైద్యులు షాకింగ్ విషయాలు చెబుతున్నారు. థాయ్‌లోని కోయి ప్లా అనే మంచి నీటి చేప చాలా ప్రమాదకరమైందని ఒక్కసారి తిన్నా చాలు ఆ క్యాన్సర్ బారిన పడటం ఖాయం అంటున్నారు వైద్యులు. కానీ అక్కడ ఈ చేపకు సంబంధించి వివిధ రకాల వంటకాలకు చాలా ప్రసిద్ధి. పైగా ప్రజలు కూడా ఆ చేప వంటకాలను తెగ ఇష్టంగా తింటుంటారు. థాయ్‌లోని ఖోన్‌సాన్, ఇసాన్ వంటి ప్రాంతాల్లో ఈ చేప వంటకాలను ఎక్కువగా తింటారట. ఈ వంటకానికి సంబంధించి కొంచెం తిన్నా చాలు ఆ భయనక క్యాన్సర్ కచ్చితంగా వస్తుందని నొక్కి చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది తిన్న వారికి కొద్ది రోజులు లేదా నెలల్లోనే కాలేయ సంబంధ క్యాన్సర్ వ్యాధి బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఆ చేపలో లివర్ ఫ్లూక్ అనే ఫ్లాట్ వార్న్ పరాన్నజీవి ఉందని ఇది కాలేయం పిత్తాశయం, చిన్నపేగులను కలిపి ఉండే ప్రాంతంలో దాడి చేసి పిత్తాశయం లేదా కాలేయ క్యాన్సర్‌కి దారితీస్తుందని అంటున్నారు. ఈ చేపలను తినే ఆయా ప్రాంతాల్లో సర్వే చేయగా..దాదాపు 80 శాంత మంది శరీరంలో ఆ పరాన్నజీవి ఉందని వారంతా కూడా పిత్తాశయం లేదా కాలేయం క్యాన్సర్ బారిన పడినట్లు తేలిందని వెల్లడైంది. ఆయా బాధితులకు చికిత్స అందించడం కూడా ఓ సవాలుగా ఉందన్నారు. అంతేగాదు బాధితుల్లో ఈ ప్రాణాంతక క్యాన్సర్ ఏ స్టేజ్‌లో ఉందన్న నిర్థారణ ఆధారంగానే ఆ వ్యక్తలు నెలలు లేదా సంవత్సరాలు బతకగలరని అంచనా వేసి చెప్పగలం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ క్యాన్సర్ లక్షణాలు.. పిత్తాశయం లేదా కాలేయ క్యాన్సర్ వచ్చే వ్యక్తుల్లో కళ్లు చర్మం పసుపు రంగులోకి మారిపోవడం జరుగుతుంది, చర్మం చాలా దురదగా ఇరిటేషన్‌గా ఉంటుంది. ఆకలిని కోల్పోవడం. ఏ ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గిపోవడం సడెన్‌గా అధిక ఉష్ణోగ్రత లేదా వణుకుపోతున్న ఫీలింగ్ ఈ చేపల్లోని ఫ్లాట్ వార్మ్ పిత్తవాహికలో ఏళ్ల తరబడి నివశిస్తాయని చెబుతున్నారు వైద్యులు. వైద్య పరీక్షలు చేసినప్పుడు కూడా కాలేయ వాపుగానే కనిపిస్తుందని వాటిని గుర్తించలేం అని తెలిపారు ఆరోగ్య నిపుణులు. మనిషి బలహీనపడినప్పుడూ ఒకేసారి ఆ పరాన్నజీవి విజృంభించడం మొదలు పెట్టి క్యాన్సర్ బారిన పడేల చేస్తుందని చెబుతున్నారు. (చదవండి: ఓ మహిళకి క్యాన్సర్ థర్డ్ స్టేజ్!ఎలాంటి సర్జరీ లేకుండానే..) -
థాయ్ ఆపరేషన్ సాగిందిలా..!
మే సాయ్ : థాయ్‌లాండ్‌లో థామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 13 మందిని సహాయక బృందాలు మంగళవారం క్షేమంగా బయటకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మూడు రోజులుగా థాయ్‌లాండ్ నౌకాదళ సిబ్బందితో కలసి వివిధ దేశాల నిపుణులు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. 18 రోజుల నరకయాతన తర్వాత మొత్తం 13 మంది గుహ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. చివరి క్షణంలో అనుకోని ప్రమాదం... అయితే చివరి పిల్లవాడిని కాపాడిన తర్వాత నీటిని బయటకు తోడే మోటర్లలో ప్రధాన మోటార్ చెడిపోయిందంట. ఆ సమయంలో డైవర్స్, మరికొందరు సహాయక సిబ్బంది ఇంకా గుహ లోపలనే ఉన్నారు. ఈ విషయం గురించి సహాయక సిబ్బంది సభ్యుడొకరు చెబుతూ.. ‘మేమంతా గుహ ప్రధాన ద్వారానికి 1.5 కిమీ దూరాన ఉన్నాం. మోటార్ చెడిపోవడంతో నీటి ప్రవాహం పెరిగింది. మేమే కాక మరో 100 మంది గుహ ప్రధాన ద్వారం వద్ద ఉన్నారు. నీటి ప్రవాహం పెరగడంతో వారంతా బయటకు వెళ్లి పోయారు. మేము నలుగురం మాత్రమే లోపల మిగిలి పోయాము. ఆ సమయంలో మేమంతా ప్రాణాల మీద ఆశ వదులుకున్నాము. కానీ చివరకు క్షేమంగా బయటకు వచ్చాం’ అని తెలిపారు. సబ్‌మెరైన్ ఆచరణ సాధ్యం కాదు... పూర్తి ఆపరేషన్ ఎలా సాగిందనే విషయాన్ని కూడా తొలిసారి బయటకు వెల్లడించారు. పిల్లలు ఉన్న చోటకు ప్రవేశ ద్వారానికి మధ్య 3 కిలోమీటర్ల దూరం ఉంది. పిల్లల ఆచూకీ తెలిసిన తర్వాత వారి కోసం ఆహారం, మందులు సరఫరా చేశారు. ఇంతలో గుహలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో, ఆక్సిజన్ సిలిండర్లు అమర్చాలని భావించారు. అందుకోసం సమన్ గుణన్ అనే డైవర్ లోపలికి వెళ్లాడు. కానీ దురదృష్టవశాత్తు అతను మరణించడంతో ప్రమాద తీవ్రత ప్రపంచానికి తెలిసింది. దాంతో సబ్‌మెరైన్‌ను వాడదామనుకున్నారు. కానీ అది కూడా సాధ్యపడదని తేలింది. దాంతో చివరకూ డైవర్లనే గుహ లోపలికి పంపించి పిల్లలను బయటకు తీసుకురావాలని భావించారు. (ఊహాచిత్రాలు బీబీసీ సౌజన్యంతో) ప్రమాదకర దారిలో ప్రయాణం... జూన్ 30న వచ్చిన ఆస్ట్రేలియా డైవర్లు ప్రమాద తీవ్రతను పరీక్షించారు. ప్రవేశ ద్వారం నుంచి పిల్లలు ఉన్న చోటుకు చేరడం అంత తేలిక కాదు అనే విషయం వారికి అర్ధమయ్యింది. ఎందుకంటే ఆ మార్గం అంతా బురదతో నిండి పోయి ఉండటమే కాక కొన్ని చోట్ల కేవలం 70 సెంటీ మీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. మరికొన్ని చోట్ల ఎగుడుదిగుడుగా ఉంది. పిల్లలున్న ప్రాంతానికి కొద్ది దూరంలో గుహ చాలా కోసుగా ఉంది. అది దాటి కాస్తా ముందుకు వెళ్తే 30 మీటర్ల లోతు ఉంది. గుహ లోపలికి చేరుకోవాలంటే డైవర్లు కూడా ఆక్సిజన్ సిలిండర్లను ధరించాల్సిందే. మనిషి పట్టడమే కష్టంగా ఉన్న చోట ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు మనిషి ప్రయాణం చేయడం అస్సలు సాధ్యమయ్యే పని కాదు. కానీ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న వారంతా అసాధ్యాన్ని సుసాధ్యం చేసే అసమాన్యులు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 19 మంది డైవర్లు పాల్గొన్నారు. వీరిలో కేవలం ముగ్గురికి మాత్రమే లోపలికి వెళ్లడానికి అవకాశం ఉంది. ఒక్కో పిల్లవాన్ని కోసం 8 గంటలు... ఈ ముగ్గురిలో ఇద్దరు డైవర్లు, ఒకరు వైద్యుడు. పిల్లలున్న చోటు నుంచి గుహ ప్రవేశ ద్వారం వరకూ మొత్తం మార్గాన్ని మూడు చాంబర్లుగా విభజించారు. పిల్లలను తీసుకు రావడానికి వెళ్లే ముగ్గురు డైవర్లు కాక మిగతా అందరూ రెండో చాంబర్లో మానవహారంగా నిల్చున్నారు. లోపలికెళ్లిన ముగ్గురు డైవర్లు ఒక్కోసారి ఒక పిల్లవాన్ని తమతో పాటు తీసుకొచ్చారు. ఒక డైవర్ ఆక్సిజన్ ట్యాంక్‌ని పట్టుకుంటే అతని వెనుక భాగాన బాలుడిని కట్టారు. మరో డైవర్ బాలుడి వెనకాల ఇంకో ఆక్సిజన్ ట్యాంక్ పట్టుకుని పిల్లాడు ఎలా ఉన్నాడో జాగ్రత్తగా గమనించారు. ముగ్గురు ఆక్సిజన్ సిలిండర్లు ధరించి ఉంటారు. వెడల్పు తక్కువగా ఉన్న ప్రాంతానికి రాగానే సిలిండర్లను తొలగిస్తారు. ఒక్కొక్కరుగా రెండో చాంబర్లోకి వస్తారు. (ఊహాచిత్రాలు బీబీసీ సౌజన్యంతో) అక్కడికి రాగానే అప్పటికే అక్కడ మానవహారంగా నిలబడిన డైవర్లు ఒకరి తర్వాత ఒకరిగా బాలున్ని బయటకు చేర్చుతారు. ఇలా ఒక్కో పిల్లవాన్ని బయటకు తీసుకురావడానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. అంతసేపు రెండో చాంబర్లో ఉన్న డైవర్లు అలా బురదలోనే నిల్చుని ఉండాలి. ఏ ఒక్కరు కాస్తా ఏమరుపాటుగా ఉన్న అంతే సంగతులు. చాంబర్ 3 చాంబర్ 2 వరకూ రావడానికి మొదట 5 గంటల సమయం పట్టేది. అయితే నీటిని నిరంతరం బయటకు పంపిచడంతో ఓ గంట సమయం కలిసి వచ్చింది. డైవర్లు ప్రతీ బాలుడి ముఖానికి మాస్క్ తొడిగారు. ఈదేటపుడు వెట్ సూట్ వేశారు. బూట్లు వేసి, హెల్మెట్ పెట్టారు. రిచర్డ్ హరీ ధైర్యం అసామన్యం... అయితే డైవర్లతో పాటు వెళ్లిన డాక్టర్ రిచర్డ్ హరీస్ ధైర్యసాహసాలను ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. పిల్లలందరిని బయటకు తీసుకొచ్చేవరకూ రిచర్డ్ డైవర్లతోనే ఉన్నారు. బుధవారం మరో విషాదం చోటుచేసుకుంది. ఆ రోజు రిచర్డ్ నాన్న గారు మరణించారు. కానీ రిచర్డ్ ఆ బాధను దిగిమింగి రోజులానే గుహలోకి వెళ్లి పిల్లలను కాపాడారు. -
క్లబ్బులో గొడవ: హీరోయిన్ అరెస్టు
-
థాయ్ గ్రామంలో వింత ఆకారం...
ఓ వింత రూపం థాయ్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. థాయ్ ల్యాండ్ లోని మారు మూల గ్రామంలో కనిపించిన ఆ వింతను చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. ఆ రూపం పుట్టింది గేదెకైనా దానికి మొసలి ఆకారం మిళితమై ఉండటాన్ని వింతగా చూస్తున్నారు. చూసేందుకు నల్లని ఆకారంతో కాళ్ళు గేదె రూపాన్ని సంతరించుకున్నా... శరీరం మాత్రం పొలుసులుదేరి మొసలిని తలపించడంతో అంతా ఆ వింతను చూసి విస్తుపోతున్నారు. ఇది సంకర జాతి అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు ఈ వింత జన్మ తమ గ్రామానికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని నమ్ముతున్నారు. అయితే పుట్టిన కొద్ది సమయానికే మృతి చెందిన ఆ జంతువుకు.. వింత ఆకారం ఎలా వచ్చింది అన్న దానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. -
మళ్లీ తెరచుకున్న బ్రహ్మ దేవాలయం
బ్యాంకాక్ : థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని సోమవారం బాంబు పేలుడు సంభవించిన బ్రహ్మా దేవాలయం తిరిగి బుధవారం తెరుచుకుంది. ఈ రోజు ఉదయం దేవాలయాన్ని తెరిచారు. దేవాలయంలో బౌద్ధ బిక్షువులు ప్రార్థనలు నిర్వహించారు. భారీగా భక్తులు దేవాలయానికి వచ్చి దేవుడిని దర్శించుకున్నారు. సోమవారం బ్యాంకాక్‌లోని బ్రహ్మా దేవాలయంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 20 మంది మరణించారు. మృతుల్లో తొమ్మిది మంది విదేశీయులున్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటువంటి పేలుడు థాయ్‌లాండ్ చరిత్రలో ఎప్పుడు చోటు చేసుకోలేదని ఉన్నతాధికారులు వివరించారు. మృతుల్లో ఏడు మృతదేహాలను గుర్తించవలసి ఉందని చెప్పారు. సీసీ ఫుటేజ్‌లో గుర్తించిన అనుమానితుడి కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు జాతీయ పోలీసు అధ్యక్షుడు తెలిపారు. ఆ క్రమంలో అతడు అక్కడి తీసుకు వచ్చిన ట్యాక్సీ డ్రైవర్‌ను విచారిస్తున్నామన్నారు. ఈ పేలుడులో దేవాలయంలోని బ్రహ్మా దేవుని విగ్రహం యొక్క గెడ్డం, చెయ్యి స్వల్పంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే.