ఉత్తర కాశీ : భారత్-చైనాల మధ్య మధ్య ఉన్న ఏకైక వారధి గురువారం కుప్పకూలిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా ఒకేసారి రెండు వాహనాలు దీనిపైకి రావటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనలో ప్రాణ నష్టం సంభవించలేదు.
ఉత్తరకాశీ-చైనా సరిహద్దును కలుపుతూ ఈ వారధి ఉంది. ఈ వంతెన పైనుంచి ఒకసారి ఒక ట్రక్కు వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు. అయితే ఘటన సమయంలో రెండు వాహనాలు రావటంతో.. అధిక బరువు తట్టుకోలేక బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు ఉత్తరకాశీ జిల్లా న్యాయమూర్తి అశిష్ చౌహాన్ తెలిపారు.
బ్రిడ్జి కూలిపోయి సంబంధాలు తెగిపోవడంతో ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని సిద్ధం చేయనున్నట్టు అధికారులు తెలిపారు. వంతెన కూలడంతో గంగోత్రి, మనేరి, హార్సిల్ సహా సుమారు 12 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. కూలీలు, విద్యార్థలు మరో మార్గం లేక అవస్థలు పడ్డారు. ఉత్తరాఖండ్‌ను ముంచెత్తిన వరదల తర్వాత 2013 గంగోత్రి జాతీయ రహదారిపై బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) ఈ బ్రిడ్జిని నిర్మించింది.
Comments
Please login to add a commentAdd a comment