collapsed bridge
-
Maharashtra Samruddhi Expressway: నిర్మాణ దశలో ఘోర ప్రమాదం
ముంబై: మహారాష్ట్రలో నిర్మాణంలో ఉన్న సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వంతెనలోని శ్లాబులను యథాస్థానంలో కూర్చోబెట్టేందుకు వినియోగించే గిర్డెర్ లాంఛర్ కుప్పకూలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సెగ్మెంట్ లాంచర్(క్రేన్)తో కలుపుకుని దాదాపు 700 టన్నుల బరువైన గిర్డెర్ లాంఛర్ 35 మీటర్ల ఎత్తునుంచి కిందకు కుప్పకూలింది. దీంతో అక్కడే పనిచేస్తున్న కార్మికులు, సిబ్బంది దాని కింద నలిగిపోయారు. ఈ ఘోర దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైను నాగ్‌పూర్‌ను కలుపుతూ 701 కిలోమీటర్ల పొడవైన సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మిస్తున్నారు. ముంబైకి 80 కి.మీ.ల దూరంలో థానె జిల్లాలో సార్లాంబే గ్రామం వద్ద సోమవారం అర్ధరాత్రిదాటాక ఈ ఘటన జరిగింది. ఘటనపై నిపుణులతో కూడిన దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసినట్లు ఉపముఖ్యమంత్రి ఫడ్నవిస్ చెప్పారు. పోతపోసిన బాక్స్ శ్లాబులను తర్వాతి రోజు నిర్మాణం కోసం సిద్ధంచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేíÙయా ఇస్తామన ప్రధాని ప్రకటించారు. తలో రూ.5 లక్షల ఆర్థికసాయం అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చెప్పారు. దుర్ఘటన నేపథ్యంలో సంబంధిత ఇద్దరు కాంట్రాక్టర్లపై పోలీసులు కేసు నమోదుచేశారు. మొత్తం ఎక్స్‌ప్రెస్‌వేలో ఇప్పటికే 600 కి.మీ.ల మేర నిర్మాణం పూర్తయి రాకపోకలు సైతం మొదలయ్యాయి. ఈ 101 కి.మీ.ల నిర్మాణ పనులు కొనసాగుతాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌వే మీద గత ఆరు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 88 మంది ప్రాణాలు కోల్పోయారు. -
ప్రపంచవ్యాప్తంగా పలు బ్రిడ్జిల ఘోర ప్రమాదాలు (ఫొటోలు)
-
వైరల్ వీడియో: అందరు చూస్తుండగా కుప్పకూలిన హైవే రోడ్!
-
వైరల్: అందరు చూస్తుండగా కుప్పకూలిన హైవే రోడ్!
ఇటానగర్ : గతకొన్నిరోజులుగా నిప్పులు చెరిగిన భానుడు శాంతించాడు. ఇదే సమయంలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపడంతో వాగులు,వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. దీంతో ఆస్తినష్టం, ప్రాణ నష్టం సంభవిస్తుందేమోనన్న భయంతో బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. తాజాగా ఓ హైవే అందరూ చూస్తుండగా కుప్పకూలిపోయింది. అరుణాచల్ ప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షాల ధాటికి రాజధాని ఇటానగర్‌లో భారీ వర్షపాతానికి అనేక భవనాలు, మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇటానగర్ గాంధీ పార్క్ జాతీయ రహదారి 415లో ఓ రోడ్డు కూలిపోయింది. అదేదో ఏళ్ల నాటి పాతరోడ్లు కూడా కాదు. ఈ మధ్యనే కొత్తగా నిర్మించారు. వర్షం దాటికి రోడ్డు కుంగిపోయి ప్రమాదం జరిగినట్లు హైవే అధికారులు తెలిపారు. మరో వైపు రోడ్డు కుప్పకూలిపోవడంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. మరికొంత మంది వాహనదారులు అలెర్ట్ గా ఉండడంతో భారీ ప్రమాదం తప్పింది. కాగా, వర్షం దాటికి జాతీయ రహదారి రోడ్డు కుప్పకూలిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంపై సదరు సదరు రహదారి నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త నిర్మించిన రోడ్డు ఇలా కుప్పకూలిపోతే ఎలా అంటూ మండిపుతున్నారు. -
నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఇద్దరి మృతి
ఆగ్రా : నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మలవాన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, అక్కడ పనిచేసే కార్మికులతో సహా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. UP: Under-construction bridge collapses on NH-91 in Chechana area of Malawan police limits in #Etah. pic.twitter.com/9U0MLDuC7w — TOI Agra (@TOIAgra) June 19, 2020 'పశువుల కోసం గడ్డి తీసుకెళ్తున్న ట్రక్‌పై 30 అడుగుల ఎత్తు నుంచి వంతెన కూలిపోయింది. దీంతో వాహనంలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. నాసిరకం కాంక్రీటు వాడటం వల్లే వంతెన కూలిపోయిందని ప్రాథమికంగా అంచనా వేశాం. పీఎన్‌సి ఇన్ఫ్రా టెక్ సంస్థ దీన్ని నిర్మిస్తుంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం' అని పోలీసు అధికారి రాహుల్ కుమార్ తెలిపారు. కాగా పిఎన్సి ఇన్ఫ్రా టెక్ చైర్మన్..ఆగ్రా నగర మేయర్ సోదరుడు అని తెలుస్తోంది. -
కుప్పకూలిన గంగోత్రి బ్రిడ్జి
ఉత్తర కాశీ : భారత్-చైనాల మధ్య మధ్య ఉన్న ఏకైక వారధి గురువారం కుప్పకూలిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా ఒకేసారి రెండు వాహనాలు దీనిపైకి రావటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనలో ప్రాణ నష్టం సంభవించలేదు. ఉత్తరకాశీ-చైనా సరిహద్దును కలుపుతూ ఈ వారధి ఉంది. ఈ వంతెన పైనుంచి ఒకసారి ఒక ట్రక్కు వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు. అయితే ఘటన సమయంలో రెండు వాహనాలు రావటంతో.. అధిక బరువు తట్టుకోలేక బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు ఉత్తరకాశీ జిల్లా న్యాయమూర్తి అశిష్ చౌహాన్ తెలిపారు. బ్రిడ్జి కూలిపోయి సంబంధాలు తెగిపోవడంతో ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని సిద్ధం చేయనున్నట్టు అధికారులు తెలిపారు. వంతెన కూలడంతో గంగోత్రి, మనేరి, హార్సిల్ సహా సుమారు 12 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. కూలీలు, విద్యార్థలు మరో మార్గం లేక అవస్థలు పడ్డారు. ఉత్తరాఖండ్‌ను ముంచెత్తిన వరదల తర్వాత 2013 గంగోత్రి జాతీయ రహదారిపై బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) ఈ బ్రిడ్జిని నిర్మించింది. -
పదిరోజులైనా.. పట్టించుకోరా..?
మోర్తాడ్ : ఇటీవల కురిసిన వర్షాలకు మొండివాగు ఉధృతంగా ప్రవహించడంతో రైల్వేస్టేషన్‌కు వెళ్లే దారిలో మొండివాగుపై నిర్మించిన వంతెన కూలిపోయింది.. వంతెన కూలి పది రోజులు కావస్తున్నా రైల్వే అధికారులు చర్యలు చేపట్ట లేదు. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.. వంతెన నిర్మాణంలో అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో చిన్నపాటి వాగు ప్రవాహానికే కూలిపోయిందని స్థానికులు అంటున్నారు. వంతెన నిర్మించే సమయంలో పిల్లర్లు వేసి స్లాబ్ వేయకుండా రింగులను ఏర్పాటు చేసి వాటిపై సిమెంట్ బిల్లలు మాత్రమే వేశారు. మొండి వాగు ఉధృతికి వంతెనపై ఏర్పాటు చేసిన సిమెంట్ బిల్లలు కుప్పకూలాయి. వంతెన పూర్తిగా కూలడంతో రైల్వే స్టేషన్‌కు వెళ్లేదారి మూతపడింది. రైల్వే స్టేషన్, లైన్ ప్రారంభించకపోవడంతో ఈ ప్రాంతంలో అంతగా రద్దీ ఉండదు. అయితే రైల్వేస్టేషన్ పరిసరాల్లో పంటపొలాలు ఉండడంతో రైతులు, కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లాలంటే ఈ వంతెన మీదుగానే వెళ్లాలి. అంతేకాక రైల్వే స్టేషన్లో చిన్న చిన్న పనులు కొనసాగుతున్నాయి. అధికారులు, కూలీలు, కాంట్రాక్టర్లు కూడా వెళ్లడానికి దారిలేకుండా పోయింది. పంట పొలాలకు వెళ్లడానికి వేరే మార్గం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు స్పందించి వంతెన నిర్మాణం పూర్తి చేయించాలని పలువురు కోరుతున్నారు.