ఇటానగర్ : గతకొన్నిరోజులుగా నిప్పులు చెరిగిన భానుడు శాంతించాడు. ఇదే సమయంలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపడంతో వాగులు,వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. దీంతో ఆస్తినష్టం, ప్రాణ నష్టం సంభవిస్తుందేమోనన్న భయంతో బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. తాజాగా ఓ హైవే అందరూ చూస్తుండగా కుప్పకూలిపోయింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షాల ధాటికి రాజధాని ఇటానగర్‌లో భారీ వర్షపాతానికి అనేక భవనాలు, మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇటానగర్ గాంధీ పార్క్ జాతీయ రహదారి 415లో ఓ రోడ్డు కూలిపోయింది. అదేదో ఏళ్ల నాటి పాతరోడ్లు కూడా కాదు. ఈ మధ్యనే కొత్తగా నిర్మించారు. వర్షం దాటికి రోడ్డు కుంగిపోయి ప్రమాదం జరిగినట్లు హైవే అధికారులు తెలిపారు. మరో వైపు రోడ్డు కుప్పకూలిపోవడంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. మరికొంత మంది వాహనదారులు అలెర్ట్ గా ఉండడంతో భారీ ప్రమాదం తప్పింది.
కాగా, వర్షం దాటికి జాతీయ రహదారి రోడ్డు కుప్పకూలిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంపై సదరు సదరు రహదారి నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త నిర్మించిన రోడ్డు ఇలా కుప్పకూలిపోతే ఎలా అంటూ మండిపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment