చూస్తుండగానే కూలిపోయింది.. పెద్ద ప్రమాదం తప్పింది | Portion Of National Highway Collapse In Itanagar Arunachal Pradesh Viral | Sakshi
Sakshi News home page

చూస్తుండగానే కూలిపోయింది.. పెద్ద ప్రమాదం తప్పింది

Published Tue, Jun 1 2021 4:23 PM | Last Updated on Tue, Jun 1 2021 7:22 PM

Portion Of National Highway Collapse In Itanagar Arunachal Pradesh Viral - Sakshi

ఇటానగర్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 415 జాతీయ రహదారి అందరూ చూస్తుండగానే కుప్పకూలిపోయింది. ఇటానగర్‌లోని గాంధీ పార్క్‌ డీ సెక్టార్‌ వద్ద మంగళవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్డు కుంగిపోయి ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇటీవలే కొత్తగా నిర్మించిన ఈ రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

అయితే రహదారిపై వన్‌వేలో వాహనాలు అనుమతించడంతో ఘటన జరిగిన సమయంలో భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. కాగా ఈ జాతీయ రహదారి ఇటానగర్‌-నహర్‌లాగున్‌లను కలుపుతుంది.తాజాగా ప్రమాదానికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.


చదవండి: మాకొద్దీ క‌రోనా ట్రీట్మెంట్‌, ప్రాణాలు పోతే పోనీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement