itanagar
-
అరుణాచల్‌లో భారీ వరదలు.. జనజీవనం అస్తవ్యస్తం
అరుణాచల్ ప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. రాజధాని ఈటానగర్‌లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయని స్థానిక విపత్తు నిర్వహణ,పరిపాలన అధికారులు తెలిపారు.అరుణాచల్‌లోని హైవే-415పై నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. ఇటానగర్తో పాటు పరిసర ప్రాంతాల్లోని అనేక చోట్ల కొండచరియలు విరిగిపడినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారి తెలిపారు. ఏడు చోట్ల సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రజలు నదీ తీరాలు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. కాగా ఈశాన్య రాష్ట్రాల్లో వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులను సమాయత్తం చేస్తూ హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.అసోంలో వరద పరిస్థితి తీవ్రంగా ఉన్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వరదల కారణంగా 37 మంది మృతిచెందగా, 10 జిల్లాల్లో 1.17 లక్షల మందికి పైగా జనం వరదల బారిన పడ్డారు. అధికారులు 134 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం 17,661 మంది ఆశ్రయం పొందుతున్నారు. బరాక్‌లోని కరీంగంజ్‌లోని కుషియారా నది ప్రస్తుతం ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోందని తెలుస్తోంది. -
ఇటానగర్‌లో క్లౌడ్‌బర్స్ట్.. విరిగిపడ్డ కొండచరియలు
ఇటానగర్: అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో ఆదివారం(జూన్23) కుండపోత వర్షం కురిసింది. దీంతో వరదలు పోటెత్తి కొండచరియలు విరిగిపడ్డాయి. గత వారం రోజులుగా ఇక్కడ భారీ వర్షాలు పడుతున్నప్పటికీ ఆదివారం తక్కువ సమయంలో కురిసిన ఎక్కువ వర్షం(క్లౌడ్ బర్స్ట్) ధాటికి కొండ చరియలు విరిగిపడ్డాయి. జాతీయ రహదారి 415పై కూడా వరద ప్రభావం పడింది. దీంతో ఇటానగర్లోకి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. చాలా వాహనాలు రోడ్డుపై ఎక్కడికక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. కొండ చరియలు విరిగిపడే ఛాన్సున్న ప్రాంతాలకు, నదుల వద్దకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. -
అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయం
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, దాని మిత్రపక్షం కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో బీజేపీ ఏకంగా 42 స్థానాల్లో గెలపొందింది. ఇంకా నాలుగు స్థానాల్లో బీజేపీ లీడింగ్‌లో కొనసాగుతోంది. మిత్రపక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ 4 సీట్లు గెలుచుకుంది. రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 50 స్థానాల ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడి అయ్యాయి. బీజేపీ గెలుపుతో పెమా ఖండూ మూడోసారి ముఖ్యమంత్రి కానున్నారు.ఇప్పటికే 10 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. అందులో ముఖ్యమంత్రి పెమా ఖండూ కూడా ఉన్నారు. మిగతావారిలో డిప్యూటీ ముఖ్యమంత్రి చౌనా మెయిన్, ఇటానగర్ నుండి టెకీ కాసో, తాలిహా నుండి న్యాతో దుకమ్, రోయింగ్ నుంచి ముచ్చు మితితో పాటు పలువురు ఉన్నారు. ఇక.. 2019లో 41 సీట్లు గెలుచుకున్న బీజేపీ మొత్తం 60 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ 34 స్థానాల్లో తమ అభ్యర్థులను ఇక్కడ బరిలో నిలిపింది. -
‘ఈశాన్యం’లో అభివృద్ధి వేగవంతం
ఈటానగర్/జోర్హాట్: ఈశాన్య రాష్ట్రాల్లో తమ ప్రభుత్వం గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి 20 సంవత్సరాలు పట్టేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శనివారం అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఈశాన్య భారతదేశానికి సంబంధించి రూ.55,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం ఈటానగర్‌లో ‘వికసిత్ భారత్–వికసిత్ నార్త్ఈస్ట్’ బహిరంగ సభలో ప్రసంగించారు. ఇండియాకు.. దక్షిణాసియా, తూర్పు ఆసియా దేశాలకు మధ్య వాణిజ్యం, టూరిజంతోపాటు ఇతర సంబంధాల విషయంలో ఈశాన్య రాష్ట్రాలు బలమైన అనుసంధానంగా మారబోతున్నాయని తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో ఈ ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టామని, అభివృద్ధిని వేగవంతం చేశామని పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌ను సందర్శించేవారికి ‘మోదీ గ్యారంటీ’ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. ఈశాన్య ప్రజలంతా నా కుటుంబ సభ్యులే మోదీకి కుటుంబం ఉందా అని ప్రతిపక్ష నేతలు ప్రశి్నస్తున్నారని ప్రధాని అన్నారు. ‘‘వారికి ఒక్కటే చెబుతున్నా. ఈశాన్య రాష్ట్రాల ప్రజలంతా నా కుటుంబ సభ్యులే’’ అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికీ సురక్షితతాగునీరు, సొంతిల్లు, వంట గ్యాస్ కనెక్షన్, విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యం కలి్పంచాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. అప్పడే ‘వికసిత్ భారత్’ కల నెరవేరుతుందన్నారు. సేలా టన్నెల్ జాతికి అంకితం ప్రపంచంలో అత్యంత పొడవైన రెండు వరుసల సొరంగం ‘సేలా టన్నెల్’ను మోదీ వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత్–చైనా సరిహద్దు ఎల్ఏసీ సమీపంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రూ.825 కోట్లతో సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తున ఈ టన్నెల్ నిర్మించింది. ఈ ప్రాజెక్టులో రెండు సొరంగాలున్నాయి. ఒకటి సింగిల్ ట్యూబ్ టన్నెల్. దీని పొడవు 1,003 మీటర్లు. ఎస్కేప్ ట్యూబ్‌తో కూడిన రెండో టన్నెల్ పొడవు 1,595 మీటర్లు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బలిపారా–చారిదువార్–తవాంగ్ మార్గం మూతపడుతోంది. సేలా టన్నెల్‌తో ఆ ఇక్కట్లు తప్పాయి. లచిత్ బోర్ఫుకన్ విగ్రహావిష్కరణ అస్సాంలోని జోర్హాట్లో 125 అడుగుల ఎత్త యిన అహోం జనరల్ లచిత్ బోర్ఫుకన్ కంచు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా అస్సాం సంప్రదాయ దుస్తులు, తలపాగా ధరించి, అహోం ఆచార ంలో పాలుపంచుకున్నారు. అస్సాంలో 1228 నుంచి 1826 వరకు అహోం రాజవంశం పరిపాలన సాగింంచింది. 1671లో జరిగి న స రాయ్‌ఘాట్ యుద్ధంలో అహోం సైనికాధికా రి లచిత్ బోర్ఫుకన్ అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. బలీయమైన మొ ఘల్ సైన్యాన్ని వెనక్కి తరిమికొట్టారు. అహోం రా జ్యాన్ని కాపాడారు. ఆయనను అస్సాం ప్రజ లు ఇప్పటికీ స్మరించుకుంటూ ఉంటారు. -
G20 summit: చైనా డుమ్మా ఖాయమైనట్లే!
భారత్ ఈ ఏడాదికి అధ్యక్షత వహిస్తూ.. ఆతిథ్యం ఇవ్వబోతున్న జీ20 సదస్సుకు చైనా డుమ్మా కొట్టడం దాదాపుగా ఖాయమైనట్లేనని సంకేతాలు అందుతున్నాయి. ఈ మేరకు ఆదివారం ఇటానగర్(అరుణాచల్ ప్రదేశ్)లో జరిగిన జీ20 సన్నాహాక సమావేశాలకు చైనా దూరంగా ఉండిపోయింది. జీ 20 సదస్సులో భాగంగా.. దేశంలోని యాభై ప్రధాన నగరాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా.. రీసెర్చ్ ఇన్నోవేషన్ ఇన్షియేటివ్, గ్యాదరింగ్ థీమ్‌తో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆదివారం ఇటానగర్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించింది. అత్యంత గోప్యంగా భావించే ఈ సమావేశానికి.. మీడియా కవరేజ్‌ను అనుమతించలేదు. కాకపోతే ప్రతినిధుల బృందం అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీని, ఇటానగర్‌లో ఉన్న బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా కొందరు ఫొటోలు తీశారు. తద్వారా చైనా నుంచి ప్రతినిధులెవరూ హాజరు కాలేదన్న విషయం బయటకు వచ్చింది. దీంతో.. సెప్టెంబర్‌లో ఢిల్లీ వేదికగా జరగబోయే జీ-20 సదస్సుకు చైనా హాజరు కావడంపై అనుమానాలు కలుగుతున్నాయి. నిరసనల్లో భాగంగానే చైనా ఇలా సమావేశానికి దూరంగా ఉండిపోయిందా? లేదంటే మరేయితర కారణం ఉందా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ పరిణామంపై విదేశాంగ శాఖగానీ, చైనా గానీ స్పందించలేదు కూడా. ఇదిలా ఉంటే.. అరుణాచల్ ప్రదేశ్‌ను టిబెట్‌లో అంతర్భాగమంటూ చైనా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ మాత్రం చైనా వాదనను తోసిపుచ్చి.. అది తమ దేశంలోని అంతర్భాగమేనని స్పష్టం చేస్తోంది. మరోవైపు వాస్తవ నియంత్రణ రేఖ వెంట ఇరు దేశాల మధ్య ఆమధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కూడా. ఇదీ చదవండి: అమెరికాలోని గురుద్వార్‌లో కాల్పులు -
భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన 700 దుకాణాలు
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నాహర్లాగున్ ప్రాంతంలో మంటలు చెలరేగి సుమారు 700లకుపైగా దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు. మొదట రెండు దుకాణాల్లోనే మంటలు అంటుకున్నాయని స్థానికులు తెలిపారు. సుమారు రెండు గంటల తర్వాత.. మిగితా దుకాణాలు వ్యాపించాయని, ఎగిసిపడుతున్న జ్వాలలను అదుపు చేయటంలో అగ్నిమాపక విభాగం విఫలమవటం కారణంగానే పెద్ద సంఖ్యలో దుకాణాలు దగ్ధమైనట్లు ఆరోపించారు. #WATCH | Arunachal Pradesh: A massive fire broke out in Itanagar's Naharlagun due to unknown reasons. Over 700 shops burnt to ashes; however, no casualties reported yet As per sources, fire engulfed only 2 shops in the initial 2hrs, but the fire dept failed to control the spread pic.twitter.com/edeFudEXHl — ANI (@ANI) October 25, 2022 ఇదీ చదవండి: కలిచివేసే ఘటన: చావుబతుకుల మధ్య ఉంటే చుట్టూ చేరి ఫోటోలు తీస్తూ... -
మేకింగ్ ఆఫ్ ఎ క్వీన్.. పచ్చళ్ల మహారాణి
నాలుగేళ్ల వయసులో తల్లి చనిపోయింది. చెల్లిని తీసుకుని అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లిపోయింది డుజోమ్. అక్కాచెల్లెళ్లు టీనేజ్ లోకి వస్తుండగా అమ్మమ్మ కూడా చనిపోయింది. మారుతల్లి ఉన్నా తల్లి కాలేకపోయింది. ఆమె దగ్గర కనాకష్టంగా బతికి ఇంటర్మీడియెట్ అవగానే రాజధాని ఇటానగర్ వెళ్లిపోయింది. అదే ఆమె జీవితానికి మలుపయింది. ఇప్పుడామె ‘పికిల్ క్వీన్’! పచ్చళ్ల సామ్రాజ్ఞి. బాగా డబ్బు సంపాదిస్తున్న వ్యాపారులు ఇంకొకర్ని తమ దారి లోకి రానివ్వరు. కానీ డుజోమ్.. నిరుపేద గృహిణుల స్వయం సమృద్ధి కోసం వారికి పచ్చళ్ల మేకింగ్‌లో, మార్కెటింగ్‌లో ఉచితంగా శిక్షణ ఇస్తోంది. యదే డుజోమ్ ఎనిమిదవ తరగతి చదువుతుండగా అమ్మమ్మ చనిపోవడంతో డుజోమ్, ఆమె చెల్లెలు మళ్లీ తండ్రి చెంతకే వారు చేరవలసి వచ్చింది. తండ్రి ఒక్కడే లేడు ఆ ఇంట్లో! ఇంకో ‘అమ్మ’ కూడా ఉంది. తనను, చెల్లిని ఆమె ఎంత హింసపెట్టిందో డుజోమ్ కొన్నిసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. డుజోమ్ ఇప్పుడు పచ్చళ్ల వ్యాపార సామ్రాజ్యానికి మహారాణి. ‘అరుణాచల్ పికిల్ హౌస్’ అంటే ఇప్పుడు ఆ రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో పెద్ద పేరు. అయితే పికిల్ హౌస్ ప్రారంభం రోజు ఒక్కరంటే ఒక్కరు కూడా అటువైపే రాలేదు! ‘పికిల్ క్వీన్’గా ప్రసిద్ధి చెందిన డుజోమ్ తన వ్యాపారం గురించి మాత్రమే చూసుకోవడం లేదు. ఆర్థికంగా అసహాయులైన గృహిణులనూ చూసుకుంటోంది. వారిని చేరదీసి పచ్చళ్ల తయారీలో శిక్షణ ఇస్తోంది. పచ్చళ్ల మార్కెటింగ్ గురించి టిప్స్ ఇస్తోంది. అలా ఇటానగర్‌లోని ఎందరో గృహిణులను గ్రూపులుగా చేసి, ఉపాధి నైపుణ్యాలను నేర్పిస్తోంది. అసలు ఇదంతా ఆమెకు ఎలా చేతనైనట్లు?! ‘‘జీవితంలో కష్టాలు తప్పవు. ఆ కష్టాల్లోనే పరిష్కారం దొరుకుతుంది. ఎప్పటికీ నిరాశ చెందకూడదు’’ అంటుంది డుజోమ్. డుజోమ్కు ఇప్పుడు 29 ఏళ్లు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ‘అరుణాచల్ పికిల్ హౌస్’ను ప్రారంభించింది. ఈ నాలుగు నెలల్లో పికిల్ క్వీన్ అయింది! ∙∙ పినతల్లి ఇంట్లోంచి వెళ్లిపోయిన ఈ పన్నెండేళ్లలో నెలకింతని డబ్బును దాచిపెట్టగలిగింది డుజోమ్. ఫుడ్ ప్రాసెసింగ్‌లో శిక్షణ తీసుకుంది. లేబుల్ మేకింగ్ నేర్చుకుంది. పదార్థాలను ఎలా నిల్వ ఉంచాలో తెలుసుకుంది. పచ్చళ్ల తయారీ మెళకువలను మణిపుర్ వెళ్లిప్పుడు అక్కడ కొంతమంది మహిళల నుంచి శ్రద్ధగా గ్రహించింది. అరుణాచల్‌ప్రదేశ్ తిరిగొచ్చాక పచ్చళ్ల తయారీ పద్ధతులలో శాస్త్రీయంగా శిక్షణ పొందింది. ఆ క్రమంలో పికిల్ హౌస్ అంకురార్పణ జరిగింది. ప్రస్తుతం ఎనిమిది మంది సిబ్బంది ఆమెకు చేదోడుగా ఉన్నారు. వారంతా గృహిణులు. లేమిలో, కుటుంబ సమస్యల కుంగుబాటులో ఉన్నవారు. వారిని పెట్టుబడి లేని భాగస్వాములుగా చేర్చుకుంది. అమ్మకాల వల్ల వస్తున్న లాభాలను వారికి పంచుతోంది. వ్యాపారాన్ని మరింతగా పెంచాలన్న ఆలోచనలో ఉంది. డుజోమ్ తనకు తానుగా వెజ్, నాన్‌వెజ్ పచ్చళ్లను రుచికరంగా తయారు చేయడంలో నిపుణురాలు. ప్రత్యేకించి ఆమె పెట్టే.. చేపలు, పోర్క్, చికెన్, అల్లం, వంకాయ, కాప్సికమ్, బంగాళదుంప, పనస, ముల్లంగి నిల్వ పచ్చళ్లు ప్రత్యేక గుర్తింపు పొందాయి. అలాగే డిమాండ్ కూడా. చెల్లెలు కూడా ఇప్పుడు ఆమెతోనే ఉంటోంది. ఇటానగర్ ఆమె అమ్మ తరఫు వారు ఉండే పట్టణం. అందుకనే డుజోమ్ అక్కడ స్థిరపడింది. -
శాంతి బోధకులమే కానీ, మా జోలికొస్తే ఊరుకోం..
కిమిన్(అరుణాచల్‌ప్రదేశ్): శాంతి కాముక దేశం భారత్‌కు దురాక్రమణను దీటుగా ఎదుర్కొనే సత్తా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. చైనాతో సరిహద్దుల్లో గురువారం ఆయన సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్వో) నిర్మించిన 12 వ్యూహాత్మక రహదారులను జాతికి అంకితం చేసిన అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. భారతదేశం ప్రపంచ శాంతికి బోధకుడు వంటిదన్న రక్షణమంత్రి.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతికి ఎటువంటి అవరోధం వాటిల్లినా పరిణామాలు ప్రతికూలంగా ఉంటాయన్నారు. ‘మనం ప్రపంచ శాంతిని కోరుకుంటాం. ఎవరైనా దుందుడుకుగా వ్యవహరిస్తే తగు సమాధానమిస్తాం’అని స్పష్టం చేశారు. హాట్ స్ప్రింగ్స్, గోగ్రా పోస్ట్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో చైనా బలగాలను కొనసాగిస్తుండటంపై పరోక్షంగా డ్రాగన్ దేశాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘గత ఏడాది గల్వాన్ లోయలో మన జవాన్లు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి, వీరోచితంగా పోరాడారు. దేశం కోసం జరిగిన అప్పటి పోరులో వీరమరణం పొందిన వారికి సెల్యూట్ చేస్తున్నాను’అని ఆయన అన్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణకు కొత్త రోడ్ల నిర్మాణం ఉపకరిస్తుందన్నారు. ఈ రహదారుల నిర్మాణంతో సరిహద్దుల్లో బలగాలు వేగంగా కదిలేందుకు వీలవుతుందన్నారు. గురువారం ప్రారంభించిన 12 రహదారుల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో 10, లద్దాఖ్, జమ్మూకశ్మీర్‌లలో ఒక్కోటి చొప్పున రహదారులున్నాయి. చదవండి: దేశంలో 8 లక్షల దిగువన కరోనా పాజిటివ్ కేసులు -
చూస్తుండగానే కూలిపోయింది.. పెద్ద ప్రమాదం తప్పింది
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లోని 415 జాతీయ రహదారి అందరూ చూస్తుండగానే కుప్పకూలిపోయింది. ఇటానగర్‌లోని గాంధీ పార్క్ డీ సెక్టార్ వద్ద మంగళవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్డు కుంగిపోయి ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇటీవలే కొత్తగా నిర్మించిన ఈ రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అయితే రహదారిపై వన్‌వేలో వాహనాలు అనుమతించడంతో ఘటన జరిగిన సమయంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. కాగా ఈ జాతీయ రహదారి ఇటానగర్-నహర్‌లాగున్‌లను కలుపుతుంది.తాజాగా ప్రమాదానికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. చదవండి: మాకొద్దీ కరోనా ట్రీట్మెంట్, ప్రాణాలు పోతే పోనీ #WATCH | Arunachal Pradesh: A portion of the National Highway-415, collapses after heavy rainfall, near Indira Gandhi Park in Itanagar pic.twitter.com/CoEUOIKB7N — ANI (@ANI) May 31, 2021 -
జూ సిబ్బంది పై రాయల్ బెంగాల్ టైగర్ ఎటాక్..
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లోని బయోలాజికల్ పార్కులో దారుణం చోటు చేసుకుంది. 35 ఏండ్ల వయసున్న పౌలాష్ కర్మకర్ అనే జూ అటెండెంట్‌పై రాయల్ బెంగాల్ టైగర్ దాడి చేసి చంపేసింది. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో టైగర్ ఉన్న కేజ్‌లోకి పౌలాష్ ప్రవేశించి వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా పులి అతనిపై దాడి చేసింది. అయితే పులి ఉన్న బోను మూడు గేట్లు తెరిచి నిర్లక్ష్యంగా వ్యవరించడంతో ఈ ఘటన జరిగినట్లు జూ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడు అస్సాంలోని లఖింపూర్ జిల్లాలోని ధేకిజులికి చెందిన వ్యక్తిగా జూ అధికారులు తెలిపారు .ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి:దారుణం: ఎంత పని చేశావు తల్లీ! -
ఒక్క సిమెంట్ బస్తా ధర రూ.8000
ఇటానగర్ : సాధారణంగా ఒక సిమెంట్ బస్తా ధర ఎంత ఉంటుంది? గరిష్టంగా ఓ రూ.330 వరకు పలుకవచ్చు. కానీ అరుణాచల్ ప్రదేశ్‌లోని విజోయ్‌నగర్‌లో మాత్రం ఒక్క సిమెంట్ బస్తా ధర 8వేల రూపాయలు. అదీ కూడా దొరికితేనే. ఛంగ్‌లంగ్ జిల్లాలోని సబ్ డివిజనల్ పట్టణం అయిన విజోయ్‌నగర్‌లో మొత్తం 1500 మంది వరకు నివసిస్తున్నారు. కానీ ఆ ప్రాంత వాసులకు బయట ప్రాంతాల వారితో సంబంధాలు ఉండవు. అక్కడి నుంచి సమీపంలోని మరో పట్టణానికి వెళ్లాలంటే ఐదు రోజుల పాటు నడవాల్సిందే. అలాంటి ఈ ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి కార్యక్రమం అధికారులకు సవాళ్లలాగానే నిలుస్తోంది. విజోయ్‌నగర్‌కు సరఫరా చేసే ఒక్కో సిమెంట్ బస్తాకు రూ.8వేలు, డబ్ల్యూసీ ప్యాన్‌కు రూ.2వేలు చెల్లించాల్సి వస్తుందని పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ జూనియర్ ఇంజనీర్ జుమ్లి అడో చెప్పారు. ఈ పట్టణంలో ప్రతిఒక్క ఇంటికి ఓ మరుగుదొడ్డి నిర్మించే కార్యక్రమాన్ని పీహెచ్ఈ డిపార్ట్మెంట్ చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం ఒక్కో ఇంటి మరుగుదొడ్డికి కేంద్రం నుంచి రూ.10,800, రాష్ట్రం నుంచి రూ.9,200 ఫండ్లు జారీ అయ్యాయి. విజోయ్‌నగర్‌కు రవాణా చేసే అన్ని మెటీరియల్స్‌ను, భారత్- చెన్నై- మయన్మార్ ట్రై-జంక్షన్ నుంచి నాండఫా నేషనల్ పార్క్ ద్వారా చక్మాస్ సరఫరా చేస్తున్నారు. దీంతో రూ.150 కేజీల ఒక్కో సిమెంట్ బస్తాకు రూ.8000 వరకు చెల్లించాల్సి వస్తుందని అడో తెలిపారు. భుజాలపై మోసుకుంటూ 156 కిలీమీటర్ల మేర ఐదు రోజలు పాటు నడుస్తూ తమ గ్రామానికి ఈ సిమెంట్ బస్తాలను చేరవేస్తున్నారని పేర్కొన్నారు. కొండ ప్రాంత ప్రజలు ఏ మేర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలియజేయడానికి ఇదే నిదర్శనమని అడో పేర్కొన్నారు. ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ, స్వచ్ఛ్ భారత్ అభియాన్-గ్రామిన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కటి ఇంటికి మరుగుదొడ్డి చాలా త్వరగా పూర్తిచేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతానికి రోడ్డు నిర్మాణ ప్రాజెక్టును ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. -
అరుణాచల్ మాజీ సీఎం పుల్ ఆత్మహత్య?
* తీవ్ర మనోవేదన వల్లే.. * రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత * సీఎం, మంత్రుల నివాసాలపై దాడులు * మెజిస్టీరియల్ విచారణ చేయిస్తాం: రాష్ట్ర ప్రభుత్వం * రాష్ట్రపతి, ప్రధాని సంతాపం ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. మంగళవారం ఉదయం ఇటానగర్‌లోని తన అధికారిక నివాసంలో ఉరి వేసుకుని కనిపించారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ర్ట రాజకీయాల్లో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా కలిఖో సీఎం పదవి నుంచి వైదొలిగారు. నాలుగు నెలలకే పదవిని కోల్పోవడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. పలువురు ఆందోళనకారులు సీఎం పెమా ఖండు, మంత్రుల నివాసాలపై దాడి చేశారు. ఉద్రిక్త పరిస్థితులపై చర్చించడానికి కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమైంది. వీవీఐపీ జోన్లో భద్రత పెంచారు. పుల్ మృతిపై మెజిస్టీరియల్ విచారణ జరపనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్విహంచనున్నట్లు తెలిపింది. కాగా పుల్ మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. పుల్ మృతి రాష్ట్రానికి, దేశానికి తీరని లోటుగా వారు అభివర్ణించారు. రాష్ట్రానికి ఆయన అందించిన సేవలు మరపురానివని పేర్కొన్నారు. 41 ఏళ్ల కలిఖో పుల్ ఇటానగర్‌లోని సీఎం అధికారిక నివాసంలో తన బెడ్రూమ్లోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతుండగా ఉదయం ఆయన ముగ్గురి భార్యల్లో ఒకరు గుర్తించారు. పుల్ స్వగృహానికి మర మ్మతులు చేయిస్తున్నందున ఆయన ఇంకా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. కాగా గత వారం రోజులుగా పుల్ బయటి వారెవరినీ కలవలేదని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో రాజకీయ పర ఒత్తిడి వల్లే ఆయన బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని హోం శాఖ అధికారులు తెలిపారు. పుల్ మద్దతుదారుల ఆందోళన .. పుల్ అకాల మరణంపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. పుల్ మద్దతుదారులు పలువురు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. కొత్త ముఖ్యమంత్రి పెమా ఖండు నివాసంపై దాడులకు దిగారు. పుల్ అసహజ మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ నివాసానికి వెళ్లి ప్రహరీతోపాటు అక్కడ నిలిపి ఉంచిన10 వాహనాలను ధ్వంసం చే శారు. కొన్నింటికి నిప్పుపెట్టారు. సమీపంలోని మంత్రుల ఇళ్లపైనా దాడి చేశారు. దీంతో ప్రభుత్వం పుల్ మృతిపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్రం 500మంది పారామిలిటరీ జవాన్లను పంపింది. తిరుగుబాటు చేసి.. మళ్లీ కలసి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన పుల్ కిందటేడాది చివర్లో అప్పటి ముఖ్యమంత్రి నబం టుకీపై పలువురు ఎమ్మెల్యేలతో కలసి తిరుగుబాటు చేశారు. దీంతో నబమ్ టుకీ ప్రభుత్వం రద్దయింది. 2015 డిసెంబర్ 9న ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కేంద్రం ఆమోదంతో 20 మంది కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రులు, 11 మంది బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో అరుణాచల్ సీఎంగా పుల్ ఈ ఏడాది ఫిబ్రవరి 19న ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలో తిరిగి టుకీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో పుల్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అయితే బలపరీక్షకు ముందే టుకీ రాజీనామా చేశారు. తర్వాతి నాటకీయ పరిణామాలతో తిరుగుబాటు నేతలు తిరిగి కాంగ్రెస్ చెంతకు రావడం.. పెమా ఖండు సీఎం కావడం తెలిసిందే. -
ముఖ్యమంత్రి ఇంటిపై దాడి
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ తిరుగుబాటు నాయకుడు కలిఖో పుల్ (48) అనుమానాస్పద మృతి అంశం ఆందోళనకరంగా మారింది. ప్రస్తుత కొత్త ముఖ్యమంత్రి పెమా ఖండూ నివాసంపై కొంతమంది దాడులకు దిగారు. వీధుల్లోకి వచ్చి నిరసన నినాదాలు చేస్తూ పెమా ఖండూ నివాసంపై రాళ్లు విసిరారు. అనంతరం డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ వద్దకు వెళ్లి అక్కడి వాహనాలను ధ్వంసం చేశారు. కొన్నింటికి నిప్పు పెట్టారు. దాంతోపాటు అక్కడే నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద ఉన్న వస్తువులకు నిప్పంటించారు. అలాగే, సమీపంలోని మంత్రుల నివాసాలపై కూడా దాడి చేశారు. కలిఖో పుల్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే. రాజకీయపరమైన ఒత్తిడి కారణంగానే ఆయన బలవన్మరణానికి పాల్పడివుండొచ్చని భావిస్తున్నారు. అయితే, ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, కుంగుబాటు కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని హోంశాఖ అధికారులు తెలిపారు. గత నెలలో ఆయన పదవి కోల్పోయారు. అరుణాచల్ ప్రదేశ్ కు ఆయన 145 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఫిబ్రవరి 19 నుంచి జూలై 13 వరకు సీఎంగా ఉన్నారు. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సాయంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి దక్కించుకున్నారు. -
సైనిక స్కూళ్ల ఏర్పాటుకు అంగీకారం!
ఇటానగర్ః అరుణాచల్ ప్రదేశ్ లో రెండు సైనిక పాఠశాలలు సహా రెండు పర్మనెంట్ రిక్రూట్ మెంట్ సెంటర్ల స్థాపనకు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అంగీకరించారు. రాష్ట్రంలో రక్షణ దళాల నియామకాలను మరింతగా పెంచేందుకు వీలుగా రిక్రూట్ మెంట్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అరుణాచల్ ముఖ్యమంత్రి కలిఖో పుల్ ప్రతిపాదనను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అంగీకరించారు. గురువారం రక్షణ మంత్రితో ఢిల్లీలో సమావేశమైన కలిఖో... సైనిక పాఠశాలల స్థాపన విషయాన్ని ఓ అధికారిక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆర్మీ స్టాఫ్ జనరల్ దల్బీర్ సింగ్ ను కూడ ముఖ్యమంత్రి కలిఖో కలుసుకున్నారు. తాజా ప్రతిపాదన ప్రకారం ఒక పాఠశాలను పశ్చిమ ప్రాంతంలోని షెర్గాన్ లోనూ, మరొకటి తూర్పు ప్రాంతంలోని తెజు లోనూ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. అయితే పర్మనెంట్ రిక్రూట్ మెంట్ సెంటర్లను మాత్రం పశ్చిమ ప్రాంతంలోని తవాంగ్ లో ఒకటి, తూర్పు ప్రాంతంలోని తెజులో ఒకటి స్థాపించేందుకు రక్షణ మంత్రి అంగీకరించినట్లు తెలిపారు. అంతేకాక, పౌర అవసరాల కోసం రక్షణ దళాలు వినియోగించే అత్యవసర హెలికాప్టర్ల విస్తరణను సులభతరం చేసేందుకు అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ (ఏఎల్జీ) ఎంవోఏ ను కూడ పునరుద్ధరించేందుకు రక్షణమంత్రి పారికర్ అంగీకరించారు. అయితే బోర్డర్ రోడ్స్ అర్గనైజేషన్ ద్వారా సరిహద్దు రోడ్ల నిర్మాణం, నిర్వహణ విషయాన్నికూడ కలిఖో పాల్ రక్షణమంత్రిని కోరినట్లు తెలుస్తోంది. -
ఒక్క పోలీస్ స్టేషన్ తో కథలో మంచి ట్విస్ట్
ఒక్క పోలీస్ స్టేషన్.... ఒక్కటంటే ఒక్క పోలీస్ స్టేషన్ అరుణాచల్ క్రైమ్ చరిత్రను మార్చేసింది. రాజధాని ఈటానగర్ లో ఏర్పాటు చేసిన ఈ పోలీస్ స్టేషన్ మహిళలపై అత్యాచారాలను తగ్గించడంలో కీలకపాత్ర పోషించింది. ఇది అరుణాచల్ ప్రదేశ్ లోని మొట్టమొదటి మహిళా పోలీస్ స్టేషన్. ఇప్పటికి అరుణాచల్ లో ఇదొక్కటే మహిళా పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్ లో పెద్దగా వనరులు లేవు. వసతులు కూడా లేవు. కానీ మహిళలపై హింసను, అత్యాచారాలను అరికట్టడంలో మాత్రం ఈ పోలీస్ స్టేషన్ చాలా కీలకపాత్ర పోషిస్తోంది. మహిళా పోలీస్ స్టేషన్ ఇలాంటి కేసుల విషయంలో సత్వరమే రంగంలోకి దిగడంతో దోషులను పట్టుకోవడం సులువవుతోంది. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రెండేళ్ల క్రితం అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇటానగర్ లో ఈ పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై హింస, దౌర్జన్యం, అత్యాచారం వంటి ఘటనలు తగ్గాయి. పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల్లో 70 శాతం కేసులు పరిష్కరించడం జరిగింది. మొత్తం 123 కేసుల్లో 86 కేసుల్లో చార్జిషీట్లు దాఖలయ్యాయి. 20 కేసుల్లో ఫైనల్ రిపోర్టులు తయారయ్యాయని ఆ స్టేషన్ ఆఫీసర్ చుఖు నాను బుయ్ చెబుతున్నారు. ఇప్పుడు ఇతర జిల్లాలనుంచి కూడా కేసులు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. -
మా ఊరికి రైలొచ్చిందోచ్...!
సంప్రదాయ దుస్తులతో తండోపతండాలుగా ప్రజలు పట్టాలకు ఇరు వైపులా నిల్చుని, హారతులు పట్టి, జెండాలు ఊపి, నృత్యాలు చేసి, రైలు డ్రైవర్లను పూల దండలతో ముంచేసి, ఆ రైలుకు స్వాగతం పలికారు. ఆ రైలు ఉదయం ఏడు గంటలకు ప్రయాణమై, మధ్యాహ్నం 12.30 కి గమ్యం చేరుకుంది. దారి పొడవునా పండుగ వాతావరణం నెలకొంది. అసొంలోని డెకార్ గావ్ నుంచి అరుణాచల్ రాజధాని ఇటా నగర్ కి మొట్టమొదటిసారి రైలు వచ్చిన దృశ్యం అది. దీంతో ఈశాన్య భారతదేశంలో రైలు కనెక్టివిటీ ఉన్న రెండో రాజధానిగా ఈటానగర్ చరిత్రకెక్కింది. ఇలా అరుణాచల్ రైలు కల నెరవేరింది. ఇటానగర్ కి రైలు కళ వచ్చేసింది. పది మంది ప్రయాణికులు, రెండు గూడ్సు కంపార్ట్ మెంట్లతో కూడిన ఆ రైలు రావడంతో ఇటానగర్ రైల్వే స్టేషన్ లో 'జై విశ్వకర్మ' అన్న నినాదాలు మిన్ను ముట్టాయి. ఈశాన్యభారతదేశం, బెంగాల్, ఒడిశా లలో మెకానికల్ వస్తువులు, యంత్రాలకు విశ్వకర్మ ఆది దేవుడిగా భావిస్తారు. ఈ రైలు ప్రారంభం కావడంతో బుధవారం యాత్రీకులందరికీ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. ఎవరు ఎక్కడైనా ఎక్కొచ్చు. ఎక్కడైనా దిగొచ్చు. వీరంతా అరుణాచల్ ప్రదేశ్ కి తమ తొలి రైలు ప్రయాణాన్ని సెల్ ఫోన్లలో బంధించారు. ఈ రైలును ఏర్పాటు చేస్తామని 1997 లో అప్పటి రైల్వే మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ప్రకటించారు. దీన్ని పూర్తి చేస్తామని 2008 లో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. ఇన్నాళ్లకి అరుణాచల్ ప్రదేశ్ రైలు కల నిజమైంది. -
ఇద్దరు ఓటర్ల కోసం ఒక పోలింగ్ బూత్!
ఇద్దరంటే ఇద్దరు ఓటర్లు... వారి చేత ఓటు వేయించేందుకు ఒక అరడజను మంది సిబ్బంది... కొండ కోనలపై ఉండే పోలింగ్ బూత్ లు... అక్కడికి చేరుకోవాలంటే దట్టమైన అడవులను దాటాలి. ఇలాంటి నియోజకవర్గాలు అసలుంటాయా అనిపిస్తుంది కదూ...! కానీ మనదేశంలో సూర్యుడి తొలి అరుణకిరణాలు తాకే అరుణాచల్ ప్రదేశ్ లో ఇలాంటి పోలింగ్ బూత్ ఒకటుంది. అంజా జిల్లాలో హేయులియాంగ్ డివిజన్ లోని మాలోగావ్ అనే ఊళ్లో ఒక పోలింగ్ బూత్ ఉంది. ఆ ఊరి మొత్తానికి ఉండేది ఒకే కుటుంబం. ఆ కుటుంబంలో ఉన్నది ఇద్దరంటే ఇద్దరు. వారి కోసమే పోలింగ్ బూత్ ఏర్పాటైంది. అరుణాచల్ ప్రదేశ్ లో పది మంది కన్నా తక్కువ ఓట్లున్న పోలింగ్ బూత్ లు పది వరకూ ఉంటాయి. ఇరవై పోలింగ్ బూత్ లలో కేవలం 20 మంది ఓట్లే ఉన్నాయి. యాభై మంది వరకూ ఓటర్లున్న బూత్ లు 105 వరకూ ఉంటాయి. మరి అరుణాచల్ లో అత్యధిక ఓటర్లున్న పోలింగ్ బూత్ ఎక్కడుంది? రాజధాని ఈటానగర్ లో 1650 ఓట్లు ఉన్నాయి. ఇదే అత్యధిక ఓటర్లున్న బూత్. మొత్తం అరుణాచల్ లో 2158 బూత్ లు ఉన్నాయి. వీటిలో 664 బూత్ లు అత్యంత దుర్గమ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇంత పెద్ద అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.53 లక్షలే. అంటే విజయవాడ నగరం జనాభాతో సమానమన్నమాట. -
కాంగ్రెస్‌కు అపాంగ్ రాంరాం
ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ అగ్రనేత గెగాంగ్ అపాంగ్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 22 ఏళ్లపాటు సీఎంగా కొనసాగిన ఆయన దేశంలో అత్యధిక కాలం పదవిలో ఉన్న రెండో ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ పార్టీసభ్యత్వానికి ఆయన ఈనెల 17న రాజీనామా చేశారు.