700 Shops Burnt To Ashes As Massive Fire In Arunachal Pradesh - Sakshi
Sakshi News home page

భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో 700 దుకాణాలు దగ్ధం

Published Tue, Oct 25 2022 2:54 PM | Last Updated on Tue, Oct 25 2022 5:08 PM

700 Shops Burnt To Ashes As Massive Fire In Arunachal Pradesh - Sakshi

ఇటానగర్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నాహర్లాగున్‌ ప్రాంతంలో మంటలు చెలరేగి సుమారు 700లకుపైగా దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.  

అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు. మొదట రెండు దుకాణాల్లోనే మంటలు అంటుకున్నాయని స్థానికులు తెలిపారు. సుమారు రెండు గంటల తర్వాత.. మిగితా దుకాణాలు వ్యాపించాయని, ఎగిసిపడుతున్న జ్వాలలను అదుపు చేయటంలో అగ్నిమాపక విభాగం విఫలమవటం కారణంగానే పెద్ద సంఖ్యలో దుకాణాలు దగ్ధమైనట్లు ఆరోపించారు.

ఇదీ చదవండి: కలిచివేసే ఘటన: చావుబతుకుల మధ్య ఉంటే చుట్టూ చేరి ఫోటోలు తీస్తూ...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement