shops burned
-
Manipur Violence: మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ
ఇంఫాల్: మణిపూర్‌లో హింసాకాండ ఇంకా కొనసాగుతోంది. మోరె జిల్లాలో బుధవారం నాడు అల్లరిమూక దాదాపుగా 30 ఇళ్లు, దుకాణాలు తగులబెట్టింది. మయన్మార్ సరిహద్దుల్లోని మోరే బజార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అల్లరి మూకను అదుపు చేయడానికి భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఎంతమందికి గాయాలయ్యాయో వివరాలు ఇప్పటివరకు తెలియలేదు. కంగ్పోక్పి జిల్లాలో భద్రతా దళాలను తరలించడానికి ఉంచిన బస్సులకి కూడా దుండగులు నిప్పు పెట్టినట్టుగా అధికారులు తెలిపారు. సపోర్మినాలో మణిపూర్ రిజి్రస్టేసన్ కలిగిన బస్సుల్ని స్థానికులు ఆపేసి ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరైనా ఉన్నారని తనిఖీ చేశారు. ఆ తర్వాత కొందరు ఆ బస్సుల్ని తగులబెట్టారు. మరోవైపు హింసాకాండలో ఇళ్లు కోల్పోయి సహాయ శిబిరాల్లో ఉంటున్న వారి కోసం తాత్కాలిక ఇళ్ల నిర్మాణం పూర్తి కావస్తోందని ముఖ్యమంత్రి ఎన్. బైరన్ సింగ్ చెప్పారు. ఇంఫాల్‌లోని సజీవా, తౌబల్ జిల్లాలోని యతిబి లౌకోల్‌లో ఇళ్లను నిర్మిస్తున్నారు. త్వరలోనే సహాయ శిబిరంలో ఉన్న వారందరినీ ఈ ఇళ్లకు తరలిస్తామని బైరన్ సింగ్ ట్వీట్ చేశారు. -
భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన 700 దుకాణాలు
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నాహర్లాగున్ ప్రాంతంలో మంటలు చెలరేగి సుమారు 700లకుపైగా దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు. మొదట రెండు దుకాణాల్లోనే మంటలు అంటుకున్నాయని స్థానికులు తెలిపారు. సుమారు రెండు గంటల తర్వాత.. మిగితా దుకాణాలు వ్యాపించాయని, ఎగిసిపడుతున్న జ్వాలలను అదుపు చేయటంలో అగ్నిమాపక విభాగం విఫలమవటం కారణంగానే పెద్ద సంఖ్యలో దుకాణాలు దగ్ధమైనట్లు ఆరోపించారు. #WATCH | Arunachal Pradesh: A massive fire broke out in Itanagar's Naharlagun due to unknown reasons. Over 700 shops burnt to ashes; however, no casualties reported yet As per sources, fire engulfed only 2 shops in the initial 2hrs, but the fire dept failed to control the spread pic.twitter.com/edeFudEXHl — ANI (@ANI) October 25, 2022 ఇదీ చదవండి: కలిచివేసే ఘటన: చావుబతుకుల మధ్య ఉంటే చుట్టూ చేరి ఫోటోలు తీస్తూ... -
అగ్ని ప్రమాదంలో పది షాపుల దగ్ధం
తూర్పుగోదావరి, పాశర్లపూడి (మామిడికుదురు): పాశర్లపూడి కొండాలమ్మ చింత సెంటర్లో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పది షాపులు దగ్ధమయ్యాయి. సుమారు రూ.పది లక్షల ఆస్తి నష్టం ఉంటుందని ప్రాథమిక అంచనా వేశారు. పొయ్యి నుంచి లేచిన నిప్పురవ్వల వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఓఎన్జీసీకి చెందిన ఫైరింజన్‌తో పాటు రాజోలు, అమలాపురం అగ్ని మాపక కేంద్రాలకు చెందిన ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. గుండాబత్తుల ఆంజనేయులు, ఉలిశెట్టి మంగాదేవి, గుండాబత్తుల వెంకటరమణ, గుండాబత్తుల సూర్యనారాయణల షాపులు, నివాసగృహాలతో పాటు, కొమ్ముల కోటేశ్వరరావు, ఆకుల వీరరాఘవులు, యర్రంశెట్టి కొండలరావు, బొరుసు వెంకటేశ్వరరావు, పి.గోపాలరావు, బోణం వెంకన్న, కడలి సత్యనారాయణల చెందిన షాపులు ఈ ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవుల షాపులు ప్రమాదంలో పూర్తిగా కాలిపోవడంతో వారు తీవ్రంగా రోధిస్తున్నారు. బాధితులు కట్టుబట్టలతో వీధిన పడ్డారు. వైఎస్సార్ సీపీ పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, వైఎస్సార్ సీపీ సేవాదళ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల కొండలరావు, నాయకులు మొల్లేటి త్రిమూర్తులు, యూవీవీ సత్యనారాయణ, తోలేటి ఆదినారాయణమూర్తి, బొరుసు చిట్టిబాబు, పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి తదితరులు బాధితులను పరామర్శించి వారిని ఓదార్చారు. బా«ధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
కిలిగిరిలో భారీ అగ్ని ప్రమాదం
-
కలిగిరిలో భారీ అగ్ని ప్రమాదం
కిలిగిరి: నెల్లూరు జిల్లా కలిగిరిలో నేటి వేకువజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి 10 షాపులు దగ్ధమయ్యాయి. ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపే షాపులు కాలిపోయి భారీ నష్టం సంభవించింది. వీటి విలువ దాదాపు రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.