ఇంఫాల్: మణిపూర్‌లో హింసాకాండ ఇంకా కొనసాగుతోంది. మోరె జిల్లాలో బుధవారం నాడు అల్లరిమూక దాదాపుగా 30 ఇళ్లు, దుకాణాలు తగులబెట్టింది. మయన్మార్ సరిహద్దుల్లోని మోరే బజార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అల్లరి మూకను అదుపు చేయడానికి భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఎంతమందికి గాయాలయ్యాయో వివరాలు ఇప్పటివరకు తెలియలేదు. కంగ్‌పోక్పి జిల్లాలో భద్రతా దళాలను తరలించడానికి ఉంచిన బస్సులకి కూడా దుండగులు నిప్పు పెట్టినట్టుగా అధికారులు తెలిపారు.
సపోర్మినాలో మణిపూర్ రిజి్రస్టేసన్ కలిగిన బస్సుల్ని స్థానికులు ఆపేసి ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరైనా ఉన్నారని తనిఖీ చేశారు. ఆ తర్వాత కొందరు ఆ బస్సుల్ని తగులబెట్టారు. మరోవైపు హింసాకాండలో ఇళ్లు కోల్పోయి సహాయ శిబిరాల్లో ఉంటున్న వారి కోసం తాత్కాలిక ఇళ్ల నిర్మాణం పూర్తి కావస్తోందని ముఖ్యమంత్రి ఎన్. బైరన్ సింగ్ చెప్పారు. ఇంఫాల్‌లోని సజీవా, తౌబల్ జిల్లాలోని యతిబి లౌకోల్‌లో ఇళ్లను నిర్మిస్తున్నారు. త్వరలోనే సహాయ శిబిరంలో ఉన్న వారందరినీ ఈ ఇళ్లకు తరలిస్తామని బైరన్ సింగ్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment