security forces firing
-
ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ మృతి
నారాయణ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్ జిల్లా భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. నెల్నార్ ఏరియా కమిటీ కార్యదర్శి అరబ్ అలియాస్ కమ్లేశ్, లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్(ఎల్వోఎస్)కమాండర్ సోందు సారథ్యంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు ఓర్ఛా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోమగల్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం గాలింపు చేపట్టారు. సాయంత్రం రెండు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో పరిశీలించగా ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు, రెండు తుపాకులు లభ్యమైనట్లు ఒక అధికారి తెలిపారు. మృతులను గుర్తించాల్సి ఉందన్నారు. -
ఎన్కౌంటర్లో లష్కరే ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యాడు. శుక్రవారం వేకువజామున దక్షిణ కశ్మీర్‌లోని చోటిగామ్ గ్రామంలో ముష్కరుల సంచారం ఉందన్న నిఘా సమాచారం మేరకు బలగాలు కార్డన్ సెర్చ్ చేపట్టాయి. దాక్కున్న ఉగ్రవాది ఒక్కసారిగా కాల్పులకు దిగాడు. ప్రతిగా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో హతమైన ఉగ్రవాదిని బిలాల్ అహ్మద్ భట్‌గా గుర్తించారు. చెక్ చొలాన్ ప్రాంతానికి చెందిన భట్ లష్కరే తోయిబాలో సభ్యుడు. ఘటనా స్థలి నుంచి ఏకే రైఫిల్‌తోపాటు మందుగుండు సామగ్రిని స్వా«దీనం చేసుకున్నారు. కుల్గామ్‌లోని సుద్సన్‌కు చెందిన ఫయాజ్(22) రాజ్‌పుటానా రైఫిల్స్ జవానుగా ఉండేవారు. బంధువు ఇంటికి పెళ్లికని వచి్చన ఫయాజ్ను ఉగ్రవాదులు నిర్బంధించి 2017 మేలో కాల్చి చంపారు. ఈ ఘటనలో భట్ ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో కేసు కూడా నమోదైనట్లు షోపియాన్ సీనియర్ ఎస్పీ తనుశ్రీ తెలిపారు. గ్రెనేడ్ విసిరి ఇద్దరు స్థానికేతర కారి్మకులను చంపిన ఘటనలో భట్ హస్తముందని చెప్పారు. -
సరిహద్దుల్లో ఉగ్రకాల్పులు
రాజౌరీ/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు కెపె్టన్లు, ఒక హవీల్దార్, ఒక జవాను వీరమరణం పొందారు. కాల్పులు జరుగుతున్న అటవీప్రాంతంలో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను తుదముట్టించేందుకు మరింతగా భద్రతా బలగాలు అక్కడకు చేరుకుంటున్నాయని సైన్యాధికారులు బుధవారం చెప్పారు. నక్కిన ఇద్దరు ఉగ్రవాదులు విదేశీయులని సైన్యం వెల్లడించింది. గులాబ్‌గఢ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంలో గాలింపు చేపట్టగా ధరమ్‌సాల్ పరిధిలోని బజిమాల్ సమీపంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుందని ఆర్మీ ట్వీట్‌చేసింది. ఈ ఘటనలో ఒక మేజర్, ఒక జవాను గాయపడ్డారు. -
కశ్మీర్లో రెండు ఎన్కౌంటర్లు..
శ్రీనగర్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల ఘటనల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లాలో రాత్రంతా భద్రతా బలగాలతో కొనసాగిన ఎన్కౌంటర్లో అయిదుగురు ముష్కరులు హతం కాగా, రాజౌరీ జిల్లాలో మరొకరు మృతి చెందారు. కుల్గాం జిల్లా నెహమా ప్రాంతంలోని సమ్నో గ్రామంలో అనుమానాస్పద కదలికలపై అందిన సమాచారం మేరకు గురువారం బలగాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి సోదాలు చేపట్టాయి. బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. బలగాల దిగ్బంధనంలో చిక్కుకున్న ఉగ్రమూకలు రాత్రంతా కాల్పులు కొనసాగించాయి. ఉదయం కూడా కొనసాగిన కాల్పులతో ఉగ్రవాదులు దాక్కున్న ఇంటికి నిప్పంటుకుంది. దీంతో, బయటకు వచ్చిన అయిదుగురూ బలగాల చేతుల్లో హతమయ్యారని కశ్మీర్ ఐజీపీ వీకే బిర్డి చెప్పారు. మొత్తం 18 గంటలపాటు ఎన్కౌంటర్ కొనసాగిందన్నారు. మృతులను లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్(పీఏఎఫ్ఎఫ్), ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)లకు చెందిన వారిగా గుర్తించినట్లు చెప్పారు. వీరందరికీ వివిధ హింసాత్మక ఘటనలతో సంబంధముందని తెలిపారు. వీరి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నాలుగు ఏకే రైఫిళ్లు, రెండు పిస్టళ్లు, నాలుగు గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటన.. రాజౌరీ జిల్లా బుధాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెహ్రోటే ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఎదురుకాల్పుల్లో గుర్తు తెలియని ఒక ముష్కరుడు హతమయ్యాడు. సంఘటనా ప్రాంతంలో ఏకే–47 రైఫిల్, మూడు గ్రెనేడ్లు లభించాయి. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో సోదాలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. -
Manipur Violence: మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ
ఇంఫాల్: మణిపూర్‌లో హింసాకాండ ఇంకా కొనసాగుతోంది. మోరె జిల్లాలో బుధవారం నాడు అల్లరిమూక దాదాపుగా 30 ఇళ్లు, దుకాణాలు తగులబెట్టింది. మయన్మార్ సరిహద్దుల్లోని మోరే బజార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అల్లరి మూకను అదుపు చేయడానికి భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఎంతమందికి గాయాలయ్యాయో వివరాలు ఇప్పటివరకు తెలియలేదు. కంగ్పోక్పి జిల్లాలో భద్రతా దళాలను తరలించడానికి ఉంచిన బస్సులకి కూడా దుండగులు నిప్పు పెట్టినట్టుగా అధికారులు తెలిపారు. సపోర్మినాలో మణిపూర్ రిజి్రస్టేసన్ కలిగిన బస్సుల్ని స్థానికులు ఆపేసి ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరైనా ఉన్నారని తనిఖీ చేశారు. ఆ తర్వాత కొందరు ఆ బస్సుల్ని తగులబెట్టారు. మరోవైపు హింసాకాండలో ఇళ్లు కోల్పోయి సహాయ శిబిరాల్లో ఉంటున్న వారి కోసం తాత్కాలిక ఇళ్ల నిర్మాణం పూర్తి కావస్తోందని ముఖ్యమంత్రి ఎన్. బైరన్ సింగ్ చెప్పారు. ఇంఫాల్‌లోని సజీవా, తౌబల్ జిల్లాలోని యతిబి లౌకోల్‌లో ఇళ్లను నిర్మిస్తున్నారు. త్వరలోనే సహాయ శిబిరంలో ఉన్న వారందరినీ ఈ ఇళ్లకు తరలిస్తామని బైరన్ సింగ్ ట్వీట్ చేశారు. -
చొరబాట్లను అడ్డుకున్న సైన్యం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సరిహద్దు దాటి భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. హాత్‌లంగా ప్రాంతంలోని ఘటనా స్థలం నుంచి భారీస్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు గురువారం సైన్యాధికారి చెప్పారు. హతమైన వారిలో ఒకరు పాకిస్తానీ అని, మిగతా వారి వివరాలు ఇంకా తెలియదని అధికారి పేర్కొన్నారు. ఉరీ సెక్టార్, గోహలన్ ప్రాంతాల్లో చొరబాట్లు జరగొచ్చనే ముందస్తు సమాచారం మేరకు సరిహద్దు వెంట గాలింపు పెంచామని, చివరకు ఇలా ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకున్నామని లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే చెప్పారు. మొత్తం ఆరుగురు చొరబాటుకు ప్రయత్నించారని, నలుగురు సరిహద్దు ఆవలే ఉండిపోయారని, ఇద్దరు సరిహద్దు దాటారని, ఎదురుకాల్పుల్లో మొత్తంగా ముగ్గురు హతమయ్యారని వివరించారు. భారత్‌లో ఉగ్రచర్యల్లో పిస్టళ్లను వాడే కొత్త పంథాను పాక్ అవలంభిస్తోందని కశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. ఈ ఏడాది 97 పిస్టళ్లను సైన్యం స్వాధీనం చేసుకుంది. ఈ ఏడాది నిరాయుధులైన పోలీసులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రదాడుల్లో 85 శాతం ఘటనల్లో పిస్టళ్లనే వాడారని ఐజీ పేర్కొన్నారు. షోపియాన్‌లో మరో ఉగ్రవాది.. షోపియాన్ జిల్లాలో కేశ్వా గ్రామంలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో అనాయత్ అష్రాఫ్ అనే ఉగ్రవాది మరణించాడు. అక్రమంగా ఆయుధాలను సమీకరిస్తూ, మాదక ద్రవ్యాల లావాదేవీలు కొనసాగిస్తున్నాడనే పక్కా సమాచారంతో సైన్యం అష్రఫ్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసింది. లొంగిపోకుండా అష్రఫ్ సైన్యం పైకి కాల్పులు జరిపాడు. దీంతో సైన్యం జరిపిన కాల్పుల్లో అతను మృతిచెందాడు. -
జైషే టాప్ కమాండర్ హతం
శ్రీనగర్: కశ్మీర్లో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. పుల్వామా జిల్లాలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో పాక్‌కు చెందిన జైషే మొహమ్మద్ కశ్మీర్ కమాండర్, ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ మేనల్లుడు, 2019 పుల్వామా దాడి సూత్రధారిగా భావిస్తున్న మొహమ్మద్ ఇస్మాయిల్ అల్వి అలియాస్ లంబూ అలియాస్ అద్నన్ సహా మరొకరు హతమయ్యారు. గురువారం కశ్మీర్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీపీ) విజయ్ కుమార్ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ఉగ్రమూకల కదలికలున్నాయన్న నిఘా వర్గాల సమాచారం మేరకు గురువారం నమిబియాన్, మర్సార్, డాచిగాం అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు కార్డన్‌సెర్చ్ చేపట్టాయి. ఈ సమయంలో చిన్నారులు, మహిళలను అడ్డుగా పెట్టుకుని ఉగ్రవాదులు తప్పించుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా వారు కాల్పులకు దిగగా దీటుగా బలగాలు స్పందించాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ‘మృతుల్లో పాకిస్తాన్‌కు చెందిన టాప్ మోస్ట్ ఉగ్రవాది, జైషే మొహమ్మద్‌కు చెందిన లంబూ ఉన్నాడు. ఇతడు జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ మేనల్లుడు. 2019లో జరిగిన పుల్వామా దాడి కుట్రకు సూత్రధారి. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జిషీటులో ఇతడి పేరు ఉంది’ అని ఐజీపీ వెల్లడించారు. ఈ ఘన విజయం సాధించిన పోలీసులు, బలగాలను ఆయన అభినందించారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో శ్రీనగర్–జమ్మూ జాతీయ రహదారిపై వెళ్తున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై అదిల్ అద్నాన్ అనే ఆత్మాహుతి దళ ఉగ్రవాది పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో దాడి చేయగా 40 మంది జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అద్నాన్కు శిక్షణ ఇచ్చింది లంబూయేనని భద్రతాధికారులు చెబుతున్నారు. ఎవరీ లంబూ? మొహమ్మద్ ఇస్మాయిల్ అల్వి అలియాస్ లంబూకు అబూ సైఫుల్లా అనీ ఫౌజీ భాయి అని కూడా పేర్లున్నాయి. ఇతడు జైషే మొహమ్మద్ కశ్మీర్ ప్రధాన కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. పాకిస్తాన్‌లోని బహావల్పూర్లోని కోసర్ కాలనీకి చెందిన వాడు. ఐఈడీ తయారీలో ఇతడు దిట్ట. 2017లో కశ్మీర్లోకి అక్రమంగా చొరబడ్డాడు. అవంతిపొరా, పుల్వామా, అనంత్‌నాగ్ జిల్లాల్లో ఇతడు ఉగ్ర కార్యకలాపాలు సాగించాడు. త్రాల్లోపాటు జాతీయరహదారిపై ఉగ్ర దాడులకు ఇతడు యత్నించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. స్థానిక ఉగ్రవాది సమీర్ అహ్మద్ దార్‌తో కలిసి పుల్వామాలో పనిచేశాడు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల తరఫున కూడా లంబూ పోరాడాడు. భారత బలగాలపై రాళ్లు రువ్వడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా కశ్మీర్ యువతను ప్రేరేపించినట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. అవంతిపొరా, కాక్‌పొరా, పుల్వామా తదితర ప్రాంతాల నుంచి యువతను ఉగ్రమార్గం పట్టించి, వారిని ఇతర ప్రాంతాలకు పంపించడంలో ఇతడు కీలకంగా వ్యవహరించినట్లు అనుమానిస్తున్నాయి. ఇతడిపై 14 కేసులు నమోదయ్యాయి. -
కశ్మీర్లో ఉగ్రదాడి : ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతా దళాలపై బుధవారం సాయంత్రం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించగా,పలువురికి గాయాలయ్యాయి. ఉగ్రదాడిని తిప్పికొట్టేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. గాయపడిన వారిలో జమ్ము కశ్మీర్‌కు చెందిన ఓ ఎస్హెచ్ఓ, సీఆర్పీఎఫ్ జవాన్, స్ధానిక మహిళ ఒకరు ఉన్నారని అధికారులు తెలిపారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ పట్టణం కేపీ రోడ్లో సీఆర్పీఎఫ్ బృందంపై ఉగ్రదాడి జరిగిందని వారు వెల్లడించారు. ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పారు. -
సూడాన్‌లో 101 మంది మృతి
ఖర్టౌమ్: సూడాన్ రాజధాని ఖర్టౌమ్‌లో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినవారిపై జరిపిన కాల్పుల్లో 101 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా గాయాలపాలయ్యారు. గాయపడిన వారికి వైద్యం చేసేందుకు ఖర్టౌమ్లోని ఆసుపత్రుల్లో తగినంత మంది వైద్య సిబ్బందిగానీ, సదుపాయాలు గానీ అందుబాటులో లేవు. సూడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్–బషీర్ నియంతృత్వ పాలనపై నెలల తరబడి ఆందోళనలు జరుగుతుండగా, ఆ దేశ మిలిటరీ ఈ ఏడాది ఏప్రిల్‌లో బషీర్‌ను పదవి నుంచి దింపేసింది. మరో మూడేళ్లలో పౌర పాలన మళ్లీ మొదలయ్యేలా ఓ ఒప్పందం కుదిరింది. అప్పటివరకు దేశ పాలనకు మిలిటరీ కౌన్సిల్ ఏర్పాటైంది. ఈ కౌన్సిల్ పాలనను వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా అనేక మంది ఆర్మీ ప్రధాన కార్యాలయం బయట నిరసనలు తెలుపుతుండగా, సోమ, మంగళ వారాల్లో ఆ నిరసనకారులను అణచివేసేందుకు ఆర్మీ కాల్పులకు దిగింది. ఆసుపత్రుల్లోనూ వైద్యులు, ఇతర సిబ్బందిపై సూడాన్ భద్రతా దళాలు దాడులు చేస్తున్నాయని వైద్యుల సంఘం ఆరోపించింది. కాల్పుల ఘటనలను ఖండించి, ఆందోళనకారులకు, మిలిటరీకి మధ్య సయోధ్య కుదర్చాలంటూ ఐక్యరాజ్యసమితికి వచ్చిన ఓ తీర్మానాన్ని చైనా, రష్యాలు అడ్డుకున్నాయి. 8 యూరప్ దేశాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేస్తూ కాల్పులను ఖండించాయి. కాల్పుల ఘటనల్లో 101 మంది చనిపోవడంతో మిలిటరీతో చర్చలు జరిపేందుకు నిరసనకారులు నిరాకరించారు. 101లో 40 మంది మృతదేహాలు నైలునదిలో లభించాయి. -
ఐదుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని బందిపొరా, షోపియాన్, బారాముల్లా జిల్లాల్లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో భద్రతాబలగాలు శుక్రవారం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. బందిపొరా జిల్లాలోని హజిన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు భద్రతాబలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన బలగాలు హజిన్‌ను చుట్టుముట్టి ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సందర్భంగా అప్రమత్తమైన ఉగ్రవాదులు కాల్పులు జరపగా, భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ విషయమై ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. బలగాల కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన అలీ, హుబైబ్ అనే ఉగ్రవాదులు చనిపోయారని తెలిపారు. వీరిద్దరూ పాకిస్తాన్ పౌరులని వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి మందుగుండు సామగ్రితో పాటు నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మరోవైపు షోపియాన్ జిల్లాలోని ఇమామ్‌సాహిబ్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు కాల్చిచంపాయి. అయితే వీరి వివరాలు ఇంకా తెలియరాలేదు. బారాముల్లా జిల్లాలో గురువారం రాత్రి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన బలగాలు శుక్రవారం మరో ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. దీంతో గత మూడ్రోజుల్లో కశ్మీర్లో చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్య ఏడుగురికి చేరుకుంది. కాగా, బారాముల్లాలో అతీఫ్ అహ్మద్(12) అనే బాలుడిని బందీగా చేసుకున్న ఉగ్రవాదులు అతడిని తుపాకీతో కిరాతకంగా కాల్చిచంపారని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఉగ్రచెరలో ఉన్న అబ్దుల్ హమీద్‌ను మాత్రమే తాము కాపాడగలిగామన్నారు. బారాముల్లాలో ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. -
హిజ్బుల్ టాప్ కమాండర్ వనీ హతం
శ్రీనగర్: నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు కశ్మీర్ లోయలో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో గురువారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఆ సంస్థ టాప్ కమాండర్ మనాన్ బషీర్ వనీతో పాటు అతని అనుచరుడు హతమయ్యారు. 27 ఏళ్ల వనీ పీహెచ్‌డీని మధ్యలో మానేసి మిలిటెన్సీ బాటపట్టాడు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన మరో ఉగ్రవాదిని ఆషిక్ హుస్సేన్‌గా గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. మృతిచెందిన ఉగ్రవాదులకు గౌరవసూచకంగా శుక్రవారం బంద్ పాటించాలని వేర్పాటువాద నాయకులు పిలుపునిచ్చారు. లొంగిపొమ్మన్నా వినలేదు.. హంద్వారాలోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం అందడంతో భద్రతా దళాలు వెళ్లి అక్కడ గురువారం వేకువజాము నుంచే సోదాలు నిర్వహించాయి. ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు తొలుత భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారని, దీనికి స్పందించిన భద్రతా దళాలు కూడా కాల్పులకు దిగినట్లు ఓ అధికారి తెలిపారు. ఇలా ఇరు పక్షాల మధ్య ఉదయం 11 గంటల వరకు కాల్పులు జరిగినట్లు వెల్లడించారు. మిలిటెంట్లు లొంగిపోవాలని పోలీసులు పలుమార్లు మైకు ద్వారా ప్రకటించినా ఎలాంటి ప్రయోజనంలేకపోయిందని అన్నారు. ఎన్కౌంటర్ ముగిశాక ఆ ఇంటి నుంచి వనీ, హుస్సేన్‌ల మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. అంత్యక్రియలకు 10వేల మంది: లోలాబ్ ప్రాంతంలోని టేకిపురా సమీపంలో ఉన్న వనీ స్వగ్రామంలో జరిగిన అతని అంత్యక్రియలకు సుమారు 10 వేల మంది హాజరయ్యారు. మరోవైపు, బషీర్ వనీ మరణవార్త తెలియగానే శ్రీనగర్‌లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. కొన్ని ప్రాంతాల్లో భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వారు. శాంతి, భద్రతల సమస్య తలెత్తకుండా ఉత్తరకశ్మీర్‌లో అన్ని పాఠశాలలు, కళాశాలలను అధికారులు మూసేశారు. పుకార్లు, విద్వేష ప్రసంగాలు వ్యాపించకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ బంద్ పాటించాలని వేర్పాటువాద నాయకులు పిలుపునిచ్చారు. స్వీయపాలన కోసం పోరాడుతున్న ఓ భావి మేధావిని కోల్పోయామని మితవాద హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ చెప్పారు. వనీ ఎన్‌కౌంటర్‌పై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా విచారం వ్యక్తం చేశారు. పీహెచ్డీ వద్దని మిలిటెన్సీలోకి 2016లో బుర్హాన్ వనీ హతమైన తరువాత మిలిటెన్సీ వైపు ఆకర్షితులైన విద్యావంతుల్లో బషీర్ వనీ ఒకడు. ముందునుంచి చదువుల్లో చురుకుగా ఉన్న బషీర్ వనీ ప్రతిష్టాత్మక సైనిక్ స్కూల్లో 11, 12వ తరగతులు పూర్తిచేశాడు. మెరిట్ విద్యార్థిగా పాఠశాల, కళాశాల రోజుల్లో ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. ఎన్సీసీ క్యాడెట్‌గా పంద్రాగస్టు, రిపబ్లిక్ డే కవాతుల్లో కూడా పాల్గొన్నాడు. 2010, 2016లో కశ్మీర్ లోయలో చెలరేగిన తీవ్ర నిరసనల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి వాడు, అలీగఢ్ యూనిర్సిటీలో పీహెచ్డీ చదువుతుండగా 2017 చివరన దక్షిణ కశ్మీర్‌కు చెందిన కొందరు విద్యార్థులతో ఏర్పడిన పరిచయంతో మిలిటెన్సీలో చేరాడు. ఈ ఏడాది జనవరి 3న అలీగఢ్ వర్సిటీని వదిలి వెళ్లాడు. అతని పేరు ఇప్పటికీ వర్సిటీ అధికారిక వెబ్సైట్లో కనిపిస్తోంది. భూగర్భశాస్త్రంలో పీహెచ్డీ చదువుతున్న వనీకి భోపాల్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ‘బెస్ట్ పేపర్ ప్రజెంటేషన్’ అవార్డు కూడా దక్కింది. -
ఫరూక్ ఇంట్లో చొరబడ్డ ఆగంతకుడు
జమ్మూ: కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా నివాసంలోకి ఓ యువకుడు కారుతో దూసుకొచ్చి కలకలం సృష్టించాడు. గేటు బద్దలుకొట్టి లోనికి ప్రవేశించిన అతను ఇంట్లోకొచ్చి విధ్వంసానికి పాల్పడ్డాడు. చివరకు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న భదత్రా దళాలు అతడిని కాల్చి చంపాయి. శనివారం జమ్మూ శివారులోని భటిందీలో ఈ ఘటన జరిగింది. శ్రీనగర్ ఎంపీ అయిన ఫరూక్ పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లి, తిరిగొస్తున్న సమయంలో ఆయన ఇంటిపై ఈ దాడి జరిగింది. ఫరూక్‌తో పాటు ఆయన కొడుకు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆ ఇంట్లోనే ఉంటున్నారు. జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ కలిగిన ప్రముఖుల ఇంట్లోకి అనామకుడు చొరబడటం తీవ్ర భద్రతా ఉల్లంఘనను తేటతెల్లం చేస్తోంది. కాగా, చొరబాటుదారుడిని పాతికేళ్ల సయీద్ మురాద్ షాగా గుర్తించారు. హెచ్చరించినా దూసుకెళ్లాడు.. భద్రతా సిబ్బంది హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతూ వేగంగా దూసుకొచ్చిన మురాద్.. ఇంటి ముందటి గేటును బద్దలుకొట్టి లోనికి చొరబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాంపౌండ్ లోపల అడ్డందిడ్డంగా వాహనం నడుపుతూ లాన్లో కారు దిగాడు. మురాద్‌ను నిలువరించే క్రమంలో ఒక పోలీస్ గాయపడ్డాడు. లోనికి వెళ్లిన మురాద్ గాజు టేబుళ్లు, గోడలకు వేలాడుతున్న చిత్రపటాలను ధ్వంసం చేశాడు. తర్వాత బెడ్రూంకు వెళ్లే మెట్లు ఎక్కేందుకు ప్రయత్నించగా సీఆర్పీఫ్ జవాన్లు అతడిని హతమార్చారు. కేసు నమోదుచేసి అతని తండ్రి జాడను కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఫరూక్ నివాసానికి పటిష్ట భద్రత ఉన్నా మురాద్లోనికి ఎలా ప్రవేశించాడన్నదానిపై విచారణకు ఆదేశించారు. కాగా, ఈ పరిణామంపై ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ..ఈ ఘటన దురదృష్టకరమని, రాష్ట్రంలో నెలకొన్న భద్రతా పరిస్థితిని ఇది తేటతెల్లం చేస్తోందని అన్నారు. ఉదయం జిమ్‌కు వెళ్లిన మురాద్.. ఫరూక్ ఇంట్లోకి ఎందుకు చొరబడ్డాడో అర్థంకావడం లేదని అతని బంధువులు చెప్పారు. మురాద్ వెంట ఎలాంటి ఆయుధాలు లేవని, అతడిని అరెస్ట్ చేయకుండా ఎందుకు కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గాజా ఆందోళనల్లో 13 మంది మృతి
గాజా సిటీ: ఇజ్రాయెల్ సరిహద్దు వైపు చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన వేలాది మంది పాలస్తీనా ఆందోళనకారులపై ఇజ్రాయెల్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హింసలో 12 వందల మందికి పైగా గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. పాలస్తీనా శరణార్థుల్ని దేశంలోకి అనుమతించాలంటూ ఆందోళనకారులు గాజా ప్రాంతంలో సరిహద్దు వెంట శుక్రవారం నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. కొద్దిమంది ఆందోళనకారులు ఫెన్సింగ్ వైపుగా దూసుకురావడంతో ఇజ్రాయెల్ బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు కాల్పులు జరిపాయి. డ్రోన్ సాయంతో సరిహద్దు వెంట టియర్ గ్యాస్‌తో ఆందోళనకారుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశాయి. ఆందోళనకారుల ముసుగులో ఉగ్రవాదులు సరిహద్దు వైపుగా చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించారని ఇజ్రాయెల్ ఆర్మీ ఆరోపించింది. -
భద్రతాబలగాల కాల్పుల్లో ఉగ్రవాది మృతి
జమ్మూకశ్మీర్: భద్రతాబలగాల కాల్పుల్లో ఆదివారం తెల్లవారుజామున ఓ ఉగ్రవాది మరణించాడు. ఈ సంఘటన బుద్గాం జిల్లాలోని అరిజాల్ గ్రామంలో చోటుచేసుకుంది. అనంత్‌నాగ్ జిల్లాలోని దూరు ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు మృతిచెందిన సంగతి తెల్సిందే. శుక్రవారం రాత్రి ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్ ఆదివారం వరకు కొనసాగింది. ఎలాంటి నష్టం జరగకుండా ఉగ్రవాదుల ఏరివేత ముగిసింది. -
ఏడుగురు పాక్ సైనికుల కాల్చివేత
జమ్మూ/శ్రీనగర్: భారత బలగాలపై తరచూ కాల్పులకు పాల్పడుతూ కవ్విస్తున్న పాక్‌కు భారత ఆర్మీ దీటైన జవాబిచ్చింది. ఓ మేజర్ సహా ఏడుగురు పాక్ జవాన్లను సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో హతమార్చింది. జమ్మూకశ్మీర్‌లోని మంధార్ సెక్టార్‌తో పాటు నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట ఉన్న భారత పోస్టులపై తెల్లవారుజాము నుంచే పాక్ బలగాలు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించినట్లు ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన భారత్ బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు పాక్ సైనికులు చనిపోగా, నలుగురు గాయపడ్డారని వెల్లడించారు. మరోవైపు కశ్మీర్‌లోని ఉడీ సెక్టార్ ద్వారా భారత్‌లోకి ప్రవేశించడానికి యత్నించిన ఐదుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని కూడా భద్రతా బలగాలు కాల్చిచంపాయి. భారత్‌లోకి ఉగ్రవాదులు ప్రవేశించేందుకు వీలుగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోందనీ.. ఇదిలాగే కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెచ్చరించిన కొద్ది గంటలకే భారత బలగాలు పాక్ సైనికుల్ని హతమార్చాయి. ఇరుపక్షాల కాల్పులతో సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జమ్మూకశ్మీర్–పాక్ ఆక్రమిత కశ్మీర్‌ల మధ్య వ్యాపారాలతో పాటు రాకపోకల్ని నిలిపివేశారు. మరోవైపు, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశంలో అలజడి సృష్టించాలనుకున్న ఉగ్రవాదుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. జీలం నది ద్వారా భారత్‌లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించాలనుకున్న ఐదుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని సోమవారం హతమార్చాయి. -
శ్రీనగర్ ఉపఎన్నిక రక్తసిక్తం
-
శ్రీనగర్ ఉపఎన్నిక రక్తసిక్తం
► పెట్రోల్ బాంబులు, రాళ్లతో ఆందోళనకారుల బీభత్సం ► భద్రతా బలగాల కాల్పులు.. ఎనిమిది మంది మృతి ► వందమందికి పైగా జవాన్లకు గాయాలు ► పోలింగ్ కేవలం 7.14 శాతం శ్రీనగర్/జైపూర్/భోపాల్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి ఆదివారం జరిగిన ఉపఎన్నిక రక్తసిక్తంగా మారింది. పరిస్థితిని అదుపుచేసేందుకు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 8 మంది ఆందోళనకారులు మృతిచెందారు. కాగా.. ఆందోళనకారుల విధ్వంసానికి బెడిసి ఓటర్లు బయటకు రాకపోవటంతో 7.14 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. శ్రీనగర్ నియోజకవర్గంలో పలుచోట్ల ఆందోళనకారులు గుంపులు గుంపులుగా వచ్చి పోలింగ్ బూత్‌లో విధ్వంసానికి పాల్పడ్డారు. పెట్రోల్ బాంబులతో బీభత్సం సృష్టించారు. దీంతో వీరిని అదుపుచేసేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో 8 మంది ఆందోళనకారులు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. చాలాచోట్ల పోలీసులు, భద్రతా బలగాలపై రాళ్లతో దాడికి పాల్పడటంతో 100 మందికి పైగా జవాన్లకు గాయాలయ్యాయని ఎన్నికల అధికారి వెల్లడించారు. భద్రతాదళాల కాల్పుల్లో బుద్గాం జిల్లా చరారే షరీఫ్, బీర్వా ప్రాంతాల్లో ఇద్దరేసి చొప్పున, చదూరాలో ఒక్కరు చనిపోగా, మాగం పట్టణంలో మరొకరు చనిపోయారు. హింసాత్మక ఆందోళనల కారణంగా 70 శాతం పోలింగ్ బూత్‌లలో పనిచేసేందుకు పోలింగ్ సిబ్బంది నిరాకరించారని అధికారులు వెల్లడించారు. కాగా, ఘర్షణలు తలెత్తిన దాదాపు వంద బూత్‌లలో ఏప్రిల్ 12న రీపోలింగ్ నిర్వహించనున్నారు. కాగా, లోయలోని మరో సున్నిత ప్రాంతం అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. లోయలో విధ్వంసం బుద్గాం జిల్లా చరారే షరీఫ్‌లో ఓ పోలింగ్ బూత్‌లోకి వందల సంఖ్యలో చొచ్చుకు వచ్చిన ఆందోళనకారులు పోలింగ్ సామాగ్రిని ధ్వంసం చేశారు. ఎన్నికల అధికారులపై దాడికి దిగారు. వీరిని అదుపు చేసేందుకు భద్రతా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపినా లాభం లేకపోయింది. దీంతో నేరుగా ఆందోళనకారులపైనే కాల్పులు జరిపారు. ఇందులో మొహ్మద్ అబ్బాస్ (20), ఫైజాన్ అహ్మద్ (15)లు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. బీర్వా ప్రాంతంలో పోలీసులపైకి రాళ్లు రువ్విన ఆందోళనకారులపై కాల్పులు జరపగా ఇద్దరు యువకులు మృతిచెందారు. శ్రీనగర్ నియోజకవర్గం పరిధిలోని శ్రీనగర్, బుద్గాం, గండేర్బాల్ జిల్లాల్లోని దాదాపు 25 చోట్ల పోలీసులు, భద్రతా బలగాలపై రాళ్లు రువ్విన కేసులు నమోదయ్యాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో ఆందోళనకర పరిస్థితులకు జడిసి జనాలు పోలింగ్‌బూత్‌లకు రాలేకపోయారన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించటంలో సీఎం మెహబూబా ముఫ్తీ విఫలమయ్యారంటూ.. ఎన్సీపీ అధ్యక్షుడు, శ్రీనగర్ స్థానం నుంచి బరిలో ఉన్న అభ్యర్థి ఫారూఖ్ అబ్దుల్లా విమర్శించారు. అనంత్‌నాగ్ ఉప ఎన్నిక వరకు శ్రీనగర్‌లోనూ ఇంటర్నెట్ సేవలను రద్దుచేయనున్నారు. కాగా, ఎన్నికల ఘర్షణలో యువకులు ప్రాణాలు కోల్పోవటాన్ని నిరసిస్తూ వేర్పాటువాదులు సోమ, బుధవారాల్లో లోయలో బంద్‌కు పిలుపునిచ్చారు. మిగిలిన చోట్ల ప్రశాంతం శ్రీనగర్, మధ్యప్రదేశ్‌లోని రెండు స్థానాలు మినహా మిగిలిన 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాజస్తాన్ రాష్ట్రంలోని ఢోల్పూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో భారీగా పోలింగ్æ నమోదైంది. ఇక్కడ పలుచోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు వచ్చినా వెంటనే వాటిని పరిష్కరించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఎన్నికలు జరిగిన ఇతర స్థానాల్లో కర్ణాటకలో గుండుల్పేట్, ననజనగుడ్, అస్సాం రాష్ట్రంలోని ధేమాజీ, బెంగాల్‌లోని కాంతి దక్షిణ్, ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ తదితరాలు ఉన్నాయి. శ్రీనగర్‌లో గరిష్టం 26 శాతమే! జమ్మూకశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి ఆదివారం జరిగిన ఉపఎన్నికలో కేవలం 7.14 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. అయితే.. ఈ నియోజకవర్గంలో గరిష్టంగా 26 శాతం పోలింగ్ నమోదైంది. అదీ 2014 సార్వత్రిక ఎన్నికల్లోనే. 1999లో జరిగిన ఎన్నికల్లో 11.93 శాతం పోలింగ్ నమోదవగా.. ఎన్సీపీ నేత ఒమర్ అబ్దుల్లా చేతిలో ప్రస్తుత సీఎం మెహబూబా ముఫ్తీ ఓటమిపాలయ్యారు. 2014 ఎన్నికల్లో మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫారూఖ్ అబ్దుల్లా.. పీడీపీ నేత తారీక్ హమీద్ కర్రా చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే గతేడాది సెప్టెంబర్‌లో కర్రా పీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయటంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ–కాంగ్రెస్ ఘర్షణ మధ్యప్రదేశ్‌లోని అటెర్, బాంధవ్‌గఢ్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలు బీజేపీ–కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీశాయి. కాంగ్రెస్ అభ్యర్థి చాలాసేపు బూత్‌లోనే ఉండటంతో బీజేపీ ఏజెంట్లు అభ్యంతరం తెలపటంతో గొడవ మొదలైంది. పలు చోట్ల గుంపులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారని రాష్ట్ర ఎన్నికల అధికారి తెలిపారు.