
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతా దళాలపై బుధవారం సాయంత్రం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించగా,పలువురికి గాయాలయ్యాయి. ఉగ్రదాడిని తిప్పికొట్టేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. గాయపడిన వారిలో జమ్ము కశ్మీర్‌కు చెందిన ఓ ఎస్‌హెచ్‌ఓ, సీఆర్‌పీఎఫ్ జవాన్, స్ధానిక మహిళ ఒకరు ఉన్నారని అధికారులు తెలిపారు.
దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ పట్టణం కేపీ రోడ్‌లో సీఆర్‌పీఎఫ్ బృందంపై ఉగ్రదాడి జరిగిందని వారు వెల్లడించారు. ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment