పోలింగ్‌ వేళ జమ్ములో కాల్పుల కలకలం | Terror Attack in Jammu Kashmir Former Sarpanch Shot Dead | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదుల కాల్పులు.. బీజేపీ మాజీ సర్పంచ్‌ మృతి

Published Sun, May 19 2024 7:02 AM | Last Updated on Sun, May 19 2024 7:13 AM

Terror Attack in Jammu Kashmir Former Sarpanch Shot Dead

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌, షోపియాన్‌లలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బీజేపీ నేత, మాజీ సర్పంచ్ అజాజ్ అహ్మద్ షేక్‌ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని వెంటనే  సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఉదంతం షోపియాన్‌లోని హీర్‌పోరాలో చోటుచేసుకుంది.
 

 

 జమ్మూకశ్మీర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అజాజ్ అహ్మద్ షేక్ ఇటీవలే బీజేపీలో చేరారు. అతనిపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. మరో ఘటన అనంత్‌నాగ్‌లో చోటుచేసుకుంది. ఇక్కడి యన్నార్ ప్రాంతంలో రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఫర్హా అనే మహిళ, ఆమె భర్త తబ్రేజ్‌లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం  ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలు జరిగిన ప్రాంతంలో పోలీసులు మోహరించారు.

 

ఈ రెండు ఉగ్రవాద దాడులపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ట్విట్టర్‌లో తన స్ప​ందనను తెలిపారు. ‘ఈరోజు పహల్గామ్‌లో ఇద్దరు పర్యాటకులు గాయపడిన ఘటనను, షోపియాన్‌లోని హీర్‌పోరాలో సర్పంచ్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. ఇది ఆందోళన కలిగించే అంశం. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఈ దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement