శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో ఇటీవల వరుసగా చోటుచేసుకున్న ఉగ్రదాడుల వెనక లష్కర్-ఇ-తోయిబా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉన్నట్లు నేషనల్ ఇన్‌వెస్టిగేషన్ ఎజేన్సీ (ఎన్‌ఐఏ) వెల్లడించింది. పాకిస్తాన్‌లోని కసూర్ జిల్లాలోని శంగమంగ గ్రామానికి చెందిన సాజిద్.. లష్కర్-ఇ-తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాది. అతని తలపై రు. 10 లక్షల రివార్డు ఉన్నట్లు ఎన్‌ఐఏ పేర్కొంది.
సైఫుల్లా సాజిద్ జట్ పాకిస్తాన్ ఇస్లామాబాద్‌లో బేస్ క్యాంపు కార్యకలాపాలను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. భారత సంతతికి చెందిన భార్య తనతోపాటు ఉంటోంది. సాజిద్ గతంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సాధారణ పనులు చేస్తూ ఉండేవాడు. అనంతరం అతను లష్కరే తొయిబాలో చేరి.. ప్రస్తుతం ఉగ్రవాదుల నియామకాలను నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా భారత దేశ వ్యాప్తంగా ఉగ్రవాదలుకు సాయం చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి.
లష్కరే తొయిబాలో సాజిద్ ఆపరేషనల్ కమాండర్. దీంతో ఉగ్రవాదులు నిధులు సమకూర్చుతాడు. సాజిత్ ఎన్‌ఐఏ జాబితాలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. సాజిత్‌కు ఖాసిమ్అనే వ్యక్తి సాయం చేస్తున్నాడని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఖాసిమ్ కోసం వెతుకుతున్నారు. కొన్నేళ్ల నుంచి కశ్మీర్ వ్యాలీలో జరుగుతున్న ఉగ్రదాడుల వెనక సాజిద్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.
గత నెలలో రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 9 మంది మృతి చెందారు. ఈ ఘటన తర్వాత జరిగిన మరో ఉగ్రదాడిలో ఇద్దరు ఉగ్రవాదులు, ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతిచెందాడు. గడిచిన రెండు రోజుల్లో కుల్గాం జిల్లాలో జరిగిన ఉగ్రదాడుల్లో ఐదుగురు టెర్రరిస్టులు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment