lashkar e taiba terrorists
-
భీకర ఎన్కౌంటర్.. మధ్యలో బిస్కెట్!
శ్రీనగర్: సుధీర్ఘ చర్చలు, మంతనాల వేళ మధ్యమధ్యలో ఛాయ్‌తోపాటు బిస్కెట్లు తినడం పరిపాటి. మిత్రదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల వేళ పనికొచ్చే బిస్కెట్లు శత్రువుతో పోరాడేవేళ అక్కరకు రావడం విశేషం. పాకిస్తాన్ విద్వేషాగి్నని ఎగదోస్తుంటే దానిని కశ్మీర్లో విస్తరింపజేస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు బలగాలు బిస్కెట్లను వాడుకుని విజయం సాధించారు. శనివారం జరిగిన లష్కరే కమాండర్ ఉస్మాన్ ఎన్కౌంటర్ వివరాలను సీఆర్పీఎఫ్ బలగాలు ఆదివారం వెల్లడించాయి. మొరిగితే అసలుకే మోసం కశ్మీర్లో కీలకమైన ఉగ్రకమాండర్ ఉస్మాన్ శ్రీనగర్ శివారులోని ఖన్యాయ్ ప్రాంతంలో దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. 2000 నుంచి లోయలో మెరుపుదాడులు చేయడంలో ఉస్మాన్ సిద్ధహస్తుడు. గత ఏడాది పోలీస్ ఇన్స్పెక్టర్ మస్రూర్ వనీని చంపేసిన ఘటనలో ఇతని ప్రమేయముంది. ఇంతటి కరడుగట్టిన ఉగ్రవాది జాడ తెలియడంతో సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు పక్కా ప్రణాళిక రచించారు. అయితే ఖన్యాయ్లో శునకాల బెడద ఎక్కువ. కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే మొరుగుతాయి. ఈ శబ్దాలకు ఉస్మాన్ అప్రమత్తమవడం ఖాయం. దీనికి పరిష్కారంగా బలగాలు తమ వెంట బిస్కెట్లు తీసుకెళ్లాయి. అంతా జల్లెడ పడుతూ కుక్కలు అరవకుండా బిస్కెట్లు వెదజల్లుతూ వాటి నోరు మూయించారు. దీంతో వీరి పని సులువైంది.ఏకే47తో సిద్ధం ఉస్మాన్ ఎల్లప్పుడూ అత్యాధునిక ఏకే47 గన్‌తో అప్రమత్తంగా ఉంటాడు. గ్రనేడ్లు, పిస్టల్ ధరిస్తాడు. వేగంగా దాడిచేస్తాడు. దీంతో తమ రాక విషయం తెలీకుండా జాగ్రత్తపడుతూ బలగాలు అతడిని సమీపించాయి. చివరి నిమిషంలో ఉస్మాన్ దీనిని కనిపెట్టి బలగాలపైకి ఎదురుకాల్పులు జరిపాడు. గ్రనేడ్లు విసిరాడు. ఈ క్రమంలో నలుగురు జవాన్లు గాయపడినా ఎట్టకేలకు ఉస్మాన్‌ను సైన్యం హతమార్చింది. గత రెండేళ్లలో కశీ్మర్ లోయలో సైన్యం సాధించిన అతిపెద్ద విజయంగా ఈ ఘటనను చెబుతారు. లష్కరే తోయిబా విభాగమైన రెసిస్టెంట్ ఫ్రంట్‌కు ఈ ఎన్కౌంటర్ కోలుకోలేని దెబ్బ. స్థానికేతర కారి్మకులు, భద్రతా బలగాలపైకి ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ సభ్యులు తరచూ కాల్పులకు తెగబడటం తెల్సిందే. వీరికి సూచనలు చేసే ఉస్మాన్‌ను సైన్యం ఎట్టకేలకు తుదముట్టించి ఉగ్రవ్యతిరేక కార్యక్రమాల్లో ఘన విజయం సాధించింది. -
జమ్ము కశ్మీర్ ఉగ్రదాడుల వెనుక లష్కరే తోయిబా టెర్రరిస్ట్ హస్తం!
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఇటీవల వరుసగా చోటుచేసుకున్న ఉగ్రదాడుల వెనక లష్కర్-ఇ-తోయిబా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉన్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఎజేన్సీ (ఎన్ఐఏ) వెల్లడించింది. పాకిస్తాన్‌లోని కసూర్ జిల్లాలోని శంగమంగ గ్రామానికి చెందిన సాజిద్.. లష్కర్-ఇ-తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాది. అతని తలపై రు. 10 లక్షల రివార్డు ఉన్నట్లు ఎన్ఐఏ పేర్కొంది.సైఫుల్లా సాజిద్ జట్ పాకిస్తాన్ ఇస్లామాబాద్‌లో బేస్ క్యాంపు కార్యకలాపాలను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. భారత సంతతికి చెందిన భార్య తనతోపాటు ఉంటోంది. సాజిద్ గతంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో సాధారణ పనులు చేస్తూ ఉండేవాడు. అనంతరం అతను లష్కరే తొయిబాలో చేరి.. ప్రస్తుతం ఉగ్రవాదుల నియామకాలను నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా భారత దేశ వ్యాప్తంగా ఉగ్రవాదలుకు సాయం చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి.లష్కరే తొయిబాలో సాజిద్ ఆపరేషనల్ కమాండర్. దీంతో ఉగ్రవాదులు నిధులు సమకూర్చుతాడు. సాజిత్ ఎన్ఐఏ జాబితాలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. సాజిత్‌కు ఖాసిమ్అనే వ్యక్తి సాయం చేస్తున్నాడని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఖాసిమ్ కోసం వెతుకుతున్నారు. కొన్నేళ్ల నుంచి కశ్మీర్ వ్యాలీలో జరుగుతున్న ఉగ్రదాడుల వెనక సాజిద్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. గత నెలలో రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 9 మంది మృతి చెందారు. ఈ ఘటన తర్వాత జరిగిన మరో ఉగ్రదాడిలో ఇద్దరు ఉగ్రవాదులు, ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మృతిచెందాడు. గడిచిన రెండు రోజుల్లో కుల్గాం జిల్లాలో జరిగిన ఉగ్రదాడుల్లో ఐదుగురు టెర్రరిస్టులు మృతి చెందారు. -
జమ్మూ కశ్మీర్లో కాల్పులు.. పట్టుబడ్డ ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల ముందస్తు సమాచారంతో భద్రతా బలగాలు, పోలీసులు పుల్వామాలోని నెహామా ప్రాంతాలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఉగ్రవాదులుపైకి ఎదురుకాల్పులు జరిపారు. కాల్పులో సమయంలో లష్కర్-ఇ-తోయిబా రెసిస్టాన్స్ ఫ్రంట్‌కు చెందిన ఇద్దరు కమాండర్లు రాయిస్ అహ్మద్, రియాజ్ అహ్మద్‌లు భద్రతా బలగాలకు పట్టుబడ్డారు.#WATCH | Pulwama encounter: The house in Nihama area where terrorists are trapped, caught on fire. Encounter underway. Further details awaited. #JammuAndKashmir pic.twitter.com/qLSpB2UbwD— ANI (@ANI) June 3, 2024 ‘పుల్వామా జిల్లాలోని నిహామా ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’ అని కశ్మీర్ జోన్ పోలీసులు ‘ఎక్స్’ తెలిపారు. అయితే కాల్పులు జరిగిన సమమంలో ఎవరూ మృతి చెందలేదని పోలీసులు తెలిపారు. ఇక.. మే 7న జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
శ్రీనగర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు మోస్ట్ వాంటెట్ టెర్రరిస్ట్‌లు హతం
న్యూఢిల్లీ: శ్రీనగర్‌లోని అలుచి బాగ్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు లస్కరే తోయిబా ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్ పోలీసులు హతమార్చారు. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు లష్కరే తోయిబాలో కమాండర్ స్థాయిలో విధులు నిర్వహించే అబ్బాస్ షేక్, షకీబ్ మన్సూర్‌లుగా గుర్తించినట్లు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఇటీవల పోలీసులు విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ల జాబితాలో చనిపోయిన ఈ ఇద్దరి పేర్లు ఉన్నట్లు సమాచారం. కశ్మీర్ జోన్ పోలీసుల సమాచారం ప్రకారం.. అలుచి బాగ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. చదవండి: పాములకు రాఖీ కట్టించబోయాడు.. ప్రాణాలు కోల్పోయాడు -
నాందేడ్ లష్కరే తొయిబా కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పు
ముంబై: నాందేడ్ లష్కరే తొయిబా కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పును వెలువరించింది.ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులకు జైలు శిక్షను ఎన్ఐఏ కోర్టు విధించింది. ముజామిల్, సాదిక్, అక్రంకు పదేళ్ల జైలు శిక్షను విధించింది. 2012లో ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. హిందూ నేతలు , జర్నలిస్ట్ లు ,రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులను హత మార్చేందుకు వ్యూహ రచన చేశారు. హైదరాబాద్, నాందేడ్, బెంగుళూర్ ప్రాంతాల్లో హింస ప్రేరేపించేలా కుట్ర పన్నారని ఎన్ఐఏ పేర్కొంది.వీరు హైదరాబాద్ కు చెందిన ఇండియన్ మోస్ట్ వాంటెడ్ సిద్ధికి బిన్ ఉస్మాన్, ఫుర్ఖాన్ భాయ్ ల తో అక్రమ్ సంబంధాలు కల్గి ఉన్నారు. చదవండి: అంబానీ కారు బాంబు కేసులో మరో పోలీస్ అరెస్టు -
‘లష్కరే ఉగ్రవాదులను పిలిచే దాకా తేకండి’
బెంగళూరు: లష్కరే ఉగ్రవాదులు భారత వాణిజ్య రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించి నిన్నటికి 12 సంవత్సరాలు పూర్తయ్యింది. నాటి మారణకాండను తల్చుకుంటూ దేశవ్యాప్తంగా ప్రజలు నివాళులర్పించగా.. కర్ణటకలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. బహిరంగ ప్రదేశాల్లోని గోడ మీద లష్కరే తోయిబా ఉగ్రవాదులకు మద్దతిచ్చే రాతలు కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రాతల వెనక ఉన్న వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. వివరాలు మంగళూరులోని బహిరంగ ప్రదేశంలోని ఓ గోడ మీద గుర్తు తెలియని వ్యక్తులు ‘సంఘీలు, మన్వేదిలను నియంత్రించడానికి లష్కరే తోయిబా ఉగ్రవాదులను, మిలిటెంట్లను రంగంలోకి దించే పరిస్థితులు తీసుకురాకండి’ అంటూ నలుపు రంగు పెయింట్‌తో గోడ మీద వివాదాస్పద రాతలు రాశారు. దీని గురించి తెలిసిన వెంటనే పోలీసుల అక్కడికి చేరుకున్నారు. పెయింటర్లను పిలిచి ఈ రాతలను కవర్ చేయించే పని ప్రారంభించారు. సమీప ప్రాంతంలోని సీసీటీవీ కెమరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక మత విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నం చేసినందుకు గాను ఈ గుర్తు తెలియని వ్యక్తుల మీద కేసు నమోదు చేశామన్నారు. ఇక గోడ మీద రాసిన సంఘీలు.. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని సూచిస్తుంది. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో గో వధను నిషేధించే చట్టంతో పాటు వివాహం కోసం మాత్రమే జరిగే మత మార్పిడిలను నిషేధించే చట్టం తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు నిర్ణయాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోడల మీద ఇలాంటి రాతలు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. అది కూడా ముంబై ఉగ్రదాడి జరిగిన నాడే చోటు చేసుకోవడంతో పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ( 26/11 ఉగ్రదాడి : రియల్ హీరోలు వీళ్లే..) ఇక 12 సంవత్సరాల క్రితం ముంబైలో ఉగ్రవాదుల మారణ కాండ కొనసాగించారు. దీనిలో ప్రధాన సూత్రధారి లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందినవాడు. నాటి ఘటనలో 166 మంది చనిపోయారు.. 300 మందికిపైగా గాయపడ్డారు. సముద్ర మార్గం ద్వారా భారత్‌లో ప్రవేశించిన ముష్కరులు తాజ్‌మహల్ హోటల్ సహా పలు చోట్ల దాడులకు తెగబడ్డారు. -
26/11 విషాదం.. ‘మీ జ్ఞాపకాలే నా బలం’
26/11 వింటేనే చాలు ఇప్పటికి అనేక మందికి వెన్నులో వణుకు పుడుతుంది. ఆవేదనతో గొంతు పూడుకుపోతుంది. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే రోజున ముష్కరులు ముంబైలోని తాజ్ హోటల్ని అడ్డగా చేసుకుని రాక్షసకాండ సాగించారు. నాటి మారణహోమంలో 166 మంది చనిపోగా వారిలో 18 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. నాడు మరణించిన వారిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆశిష్ చౌదరి సోదరి, ఆమె భర్త కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని తలుచుకుంటూ ఆశిష్ చౌదరి భావోద్వేగానికి లోనయ్యారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా చిన్ననాటి ఫోటోలను, జ్ఞాపకాలని షేర్ చేసుకున్నారు. ‘మీరు లేకుండా నా జీవితంలో ఒక్క రోజు కూడా పూర్తవ్వదు. జిజు, మోనా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను’ అన్నారు. ఫోటోలతో పాటు.. ‘ఈ రోజు నేను ఎలా ఉన్నానో చూడండి.. ఈ రోజు వరకు మీ జ్ఞాపకాలే నన్ను బలంగా నిలబడేలా చేశాయి. మీరున్నప్పుడు ప్రతి రోజు సంతోషంగా మనం ఆడుతూ పాడుతూ ఎలా గడిపామే ఇప్పుడు కూడా అలానే జీవిస్తున్నారును. ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో మీరు నా పక్కనే ఉన్నారనే ఆశతోనే నేను శ్వాసించగల్గుతున్నాను. మీ జ్ఞాపకాలే నా బలం’ అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగానికి గురయ్యారు ఆశిష్ చౌదరి. (ఇప్పటికైనా న్యాయం చేయండి: భారత్) View this post on Instagram A post shared by Ashish Chowdhry (@ashishchowdhryofficial) పాకిస్తాన్ నుంచి లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన 10 మంది ఉగ్రవాదులు సముద్రమార్గం నుంచి ముంబైకి చేరుకొని అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ మహల్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నరిమన్ హౌస్ యూదు కమ్యూనిటీ సెంటర్ వంటి 12 ప్రముఖ ప్రదేశాల్లో ముష్కరులు ఏకధాటిగా కాల్పులు జరిపారు. దాదాపు 60 గంటల పాటు సాగిన మారణకాండ సాగింది. -
నేవీలో హై అలర్ట్
కోయంబత్తూర్/కొచ్చి: భారతీయ నేవీలో హై అలర్ట్ ప్రకటించారు. లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ముష్కరులు తమిళనాడులోకి చొరబడ్డారన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు శుక్రవారం ప్రారంభించిన నిఘా రెండో రోజూ కొనసాగింది. ‘ఇంటెలిజెన్స్ నుంచి అందిన సమా చారం మేరకు నేవీ.. సముద్రాలు, తీర ప్రాంతాల్లో హై అలర్ట్‌ను విధించింది’అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ముష్కరులు శ్రీలం క నుంచి సముద్ర మార్గం ద్వారా రాష్ట్రంలోకి చొర బడి వివిధ నగరాలకు వెళ్లినట్లు సమాచారం అందడంతో తమిళనాడులో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కోయంబత్తూర్ నగరాన్ని ఇతర రాష్ట్రాలతో కలిపే రోడ్లు, రహదారుల్లో వెళ్లే వాహనాలను ఆర్మీ బలగాలు నిశితంగా తనిఖీలు చేస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్‌పోర్టుల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పా రు. గుజరాత్ తీరంలో పాక్ పడవలు గుజరాత్‌లోని కచ్ జిల్లాకు సమీపంలో గల హరామి నాలా ప్రాంతంలో పాక్‌కు చెందిన 2 మత్స్యకారుల పడవలను సరిహద్దు భద్రతాసిబ్బంది శనివారం గుర్తించారు. అవి అనుమానాస్పదంగా ఉండటంతో తనిఖీలు చేపట్టారు. -
పాకిస్తాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
వాషింగ్టన్: భారత్‌పై మళ్లీ ఉగ్రవాదులు దాడులు జరిపితే తీవ్ర చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ‘‘ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలుగా మారిన ప్రాంతాల (పాక్)పై సహనాన్ని ప్రదర్శించేదే ప్రసక్తే లేదన్నారు. భారత్‌లో ఇంకొక్క ఉగ్రదాడి జరిగినా పాక్ తీవ్ర పరిణామాలకు సిద్ధంగా ఉండాలి’ అని వైట్‌హౌజ్‌కు చెందిన ఒక అధికారి బుధవారం మీడియాతో పేర్కొన్నారు. ‘పాకిస్థాన్‌లోని టెర్రరిస్ట్ గ్రూపులపై అమెరికా కఠిన చర్యలు తీసుకోడానికి వెనుకాడదు. ఉగ్రవాద నిర్మూలనకు పాక్ సరైన చర్యలు చేపట్టాలి. ప్రధానంగా జైష్-ఏ-మహ్మద్, లష్కర్-ఏ-తయిబా లాంటి ఉగ్రవాద సంస్థలను నిర్వీర్యం చేయాలి. ఉగ్రదాడులతో తిరిగి భారత ఉపఖండంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూడాలనేదే మా అభిమతం’ అని ఆయన తెలిపారు. ‘పాకిస్థాన్ తగు చర్యలు తీసుకోకుంటే ఇండియాలో మళ్లీ దాడులు జరిగే అవకాశముంది. దీనివల్ల ఇరు దేశాల మధ్య తిరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదముంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో భారత వైమానిక దాడుల అనంతరం ఉగ్రవాదులు, వారి శిబిరాల మీద పాక్ ఎలాంటి చర్యలు తీసుకుందోనని వేచి చూస్తాం’ అని తెలిపారు. ఉగ్రవాదాన్ని అరికట్టాల్సిందే ‘ఉగ్రవాదాన్ని తుదమొట్టించడానికి అంతర్జాతీయ సమాజం ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరముందని అమెరికా భావిస్తోంది. పాక్ కూడా ఉగ్రవాద సంస్థల మీద కొన్ని చర్యలు తీసుకుంది. కొన్ని ఉగ్ర గ్రూపుల నిర్వీర్యం చేయడంతోపాటు జైషే మహ్మద్ సంస్థ పరిపాలనా కార్యకలాపాలను నియంత్రించే దిశగా నడుం బిగించింది. కానీ టెర్రరిస్ట్‌లను అరెస్ట్ చేయడం.. తర్వాత కొన్ని రోజులకు వారిని వదిలేయడం, దేశంలో ఎక్కడికైనా తిరిగే హక్కు, స్వేచ్ఛగా ర్యాలీలు చేసుకునే అనుమతులను ఉగ్ర నాయకులకు కల్పించడం పాక్‌కు పరిపాటి అయిపోయింది. అందుకే ఇంకొన్నాళ్లు పాకిస్థాన్ తీసుకునే చర్చలను నిశితంగా పరిశీలిస్తాం. పాక్‌కు ఉన్న ఆర్థిక అవసరాల దృష్ట్యా ఆ దేశం ఉగ్రవాద నిర్మూలన చర్యలను వేగవంతం చేసి, అంతర్జాతీయ సమాజం ముందు బాధ్యతాయుత దేశంగా నిలబడాలి. లేని పక్షంలో పాక్‌కు ఆర్థిక కష్టాలు తప్పవు. భారత్‌లో ఉగ్రవాదుల అటాక్, బాలాకోట్‌లో ఇండియన్ ఆర్మీ వాయు దాడులతో దాయాది దేశాల ఆర్మీలు ఇంకా హై అలర్ట్‌గానే ఉన్నాయి. ఇంకొక్క దాడి ఆ పరిస్థితులను ఇంకా క్లిష్టతరం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాంటి వాటికి తావివ్వొద్దనే తాము ముందస్తుగా పాక్‌ను హెచ్చరిస్తున్నాం. ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పుడు అటు ఇస్లామాబాద్‌తో ఇటు న్యూఢిల్లీతో మేము సంప్రదింపులు జరిపి.. ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేశాం’ అని సదరు వైట్‌హౌజ్ అధికారి తెలిపారు. -
కశ్మీర్లో 18 గంటల ఎన్కౌంటర్
శ్రీనగర్: శ్రీనగర్ శివారులో దాదాపు 18 గంటలపాటు కొనసాగిన ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు తీవ్రవాదులు చనిపోగా ఒక జవానుకు గాయాలయ్యాయి. మరో ఘటనలో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్ శివార్లలోని బందిపొరా రోడ్డు ముజ్గుంద్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు, భద్రతా బలగాలు శనివారం రాత్రి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు బలగాలపైకి కాల్పులు ప్రారంభించారు. రెండు వర్గాల మధ్య దాదాపు 18 గంటలపాటు హోరాహోరీగా కాల్పులు కొనసాగాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు బలగాలు సుమారు ఐదు ఇళ్లను పేల్చి వేశారు. ఈ కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు చనిపోగా ఒక జవానుతోపాటు ముగ్గురు పౌరులు గాయపడ్డారు. మృతులను బందిపొరా జిల్లా హజిన్ ప్రాంతానికి చెందిన ముదసిర్ రషీద్ పర్రే(16), సకీబ్బిలాల్ షేక్‌గా గుర్తించారు. అయితే, పర్రే వయస్సుతోపాటు, అతడు ఉగ్రవాదో కాదో నిర్ధారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మూడో వ్యక్తిని పాక్‌కు చెందిన అలీగా అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం ఈ ప్రాంతంలో భద్రతా బలగాలతో స్థానికులు ఘర్షణలకు దిగటంతో పెల్లెట్లు, బాష్పవాయువును ప్రయోగించి వారిని చెదరగొట్టారు. అధికారులు ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మరోఘటనలో..యువతను ఉగ్రవాద ముసుగులోకి లాగుతున్న కిష్త్వార్ జిల్లా సౌందర్ దచ్చాన్ గ్రామానికి చెందిన హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూపు ఉగ్రవాది రియాజ్ అహ్మద్‌ను బలగాలు అరెస్టు చేశాయి. ఇతడు కరడుగట్టిన ఉగ్రవాది మొహమ్మద్ అమిన్ అలియాస్ జహంగీర్‌కు సన్నిహితుడని పోలీసులు తెలిపారు. ఏకే–47 చేత పట్టుకుని ఉన్న రియాజ్ అహ్మద్ ఫొటోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. పరింపొరా ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘటనతో ఇతనికి సంబంధమున్నట్లు గుర్తించారు. యువతను ఉగ్ర ఉచ్చులోకి లాగడంలో రియాజ్ నిపుణుడని అధికారులు తెలిపారు. హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన జహంగీర్ కిష్త్వార్ ప్రాంతంలో చాలాకాలంగా తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. -
ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం
-
ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం
కుప్వార: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులకు బలగాలకు మధ్యకాల్పులు మొదలయ్యాయి. హంద్వారాలోని వరిపోరా ప్రాంతంలో బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ మొదలైంది. ఈ కాల్పుల్లో ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టినట్లు ఆర్మీ వర్గాల తెలిపాయి. చనిపోయిన ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందినవారిగా గుర్తించారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
భారత సైన్యం పుణ్యమాని..
భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్.. పాకిస్థాన్‌కు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇన్నాళ్లూ భుజాలు భుజాలు రాసుకు పూసుకుని తిరిగిన ఉగ్రవాదులు, పాక్ సైన్యం మధ్య సంబందాలు ఇప్పుడు చెడిపోయాయి. ప్రధానంగా లష్కరే తాయిబా ఉగ్రవాదులకు, పాక్ ఆర్మీలోని వాళ్ల హ్యాండ్లర్లకు మధ్య ఇప్పుడు ఏమాత్రం సత్సంబంధాలు లేవట. సర్జికల్ స్ట్రైక్స్‌లో చనిపోయిన తమ సహచరుల మృతదేహాలను తాము తీసుకెళ్లడానికి పాక్ ఆర్మీ అంగీకరించలేదని లష్కరే ఉగ్రవాదులు మండిపడుతున్నారు. ముందుగా చనిపోయిన, గాయపడిన పాక్ సైనికులనే తరలించారు. చీకటి పడిన తర్వాత మాత్రమే ఉగ్రవాదుల మృతదేహాలను తీసేందుకు అంగీకరించారు. అలాగే గాయపడిన లష్కరే ఉగ్రవాదులకు చికిత్స కూడా అంతంతమాత్రంగానే అందిందట. భారతదేశం వైపు నుంచి మరిన్ని దాడులు ఎదురవుతాయని ఆందోళనలో ఉన్న పాకిస్థాన్.. ఉగ్రవాద నాయకులైన హఫీజ్ సయీద్, సయ్యద్ సలాహుద్దీన్‌లను లాహోర్‌లోని ఒక ఆర్మీ క్యాంపునకు తరలించింది. మఫ్టీలో ఉన్న ఆర్మీ కమాండోలు వాళ్లకు భద్రత కల్పించారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన వెంటనే నియంత్రణరేఖ వెంబడి ఉన్న టెర్రర్ లాంచ్ప్యాడ్లను పీఓకే లో 7-8 కిలోమీటర్ల దూరానికి పాక్ సైన్యం తరలించింది. సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో భారత సైన్యం కేవలం 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంచ్ ప్యాడ్ల మీదే దాడులు చేసింది. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ప్రతీకారం తీర్చుకోడానికి భారతదేశంలో మళ్లీ ఉగ్రదాడులు నిర్వహిస్తారన్న కథనాలు వచ్చాయి. కానీ, గతంలో చేసినట్లుగా 26/11 నాటి ముంబై ఉగ్రదాడి తరహాలో మళ్లీ చేస్తే మాత్రం ఈసారి భారత్ కేవలం వాటిని అడ్డుకుని ఊరుకునే పరిస్థితి లేదని, మరింత తీవ్రంగా విరుచుకు పడుతుందని సమాచారం ఉండటంతో ప్రస్తుతానికి ఏమీ చేయలేక చేతులు కట్టుకుని కూర్చున్నారు. ఇక ఉగ్రవాదులు అణు దాడులు చేసే ప్రమాదం ఉందన్న వాదనలను కూడా రక్షణ శాఖ వర్గాలు ఖండిస్తున్నాయి. పొరపాటున ఆ ఆయుధాలు వాళ్ల చేతికి వెళ్లినా.. వాటి కోడ్లు, సాంకేతిక వివరాలు అన్నీ తెలుసుకుని వాటిని ఆపరేట్ చేయడం మాత్రం సాధ్యం కాని పని అని అంటున్నారు.