శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల ముందస్తు సమాచారంతో భద్రతా బలగాలు, పోలీసులు పుల్వామాలోని నెహామా ప్రాంతాలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఉగ్రవాదులుపైకి ఎదురుకాల్పులు జరిపారు. కాల్పులో సమయంలో లష్కర్-ఇ-తోయిబా రెసిస్టాన్స్ ఫ్రంట్‌కు చెందిన ఇద్దరు కమాండర్లు రాయిస్ అహ్మద్, రియాజ్ అహ్మద్‌లు భద్రతా బలగాలకు పట్టుబడ్డారు.
#WATCH | Pulwama encounter: The house in Nihama area where terrorists are trapped, caught on fire. Encounter underway. Further details awaited. #JammuAndKashmir pic.twitter.com/qLSpB2UbwD
— ANI (@ANI) June 3, 2024
‘పుల్వామా జిల్లాలోని నిహామా ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’ అని కశ్మీర్ జోన్ పోలీసులు ‘ఎక్స్’ తెలిపారు. అయితే కాల్పులు జరిగిన సమమంలో ఎవరూ మృతి చెందలేదని పోలీసులు తెలిపారు. ఇక.. మే 7న జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment