commanders
-
టాప్ హెజ్బొల్లా కమాండర్ షేక్ ముహమ్మద్ అలీ హమాదీ హతం
బీరూట్ : ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( FBI ) హిట్ లిస్ట్‌లో ఉన్న హెజ్బొల్లా సీనియర్ కమాండర్ (Hezbollah commander) షేక్ ముహమ్మద్ అలీ హమాదీ (Sheikh Muhammad Ali Hammadi) దారుణ హత్యకు గురయ్యాడు. లెబనాన్‌లోని గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటి ముందు కాల్చి చంపారు. అయితే గత కొంత కాలంగా అలీ హమాదీ కుటుంబంలో కలహాలు కొనసాగుతున్నాయి. వాటి కారణంగానే ఆయనపై దాడి జరిగిందనే అనుమానాలు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు హమాదీపై ఆరుసార్లు కాల్పులు జరిపారని, కాల్పుల్లో అక్కడికక్కడే మరణించినట్లు స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే,ఆయన మరణం వెనుక రాజకీయ కోణం, లేదంటే ప్రత్యర్థులు ఉన్నారనే అంశంపై మీడియా కథనాలు ఖండించాయి. సంవత్సరాల తరబడి హమ్మదీని కుటుంబ కలహాలు వెంటాడుతున్నాయని, వాటి కారణంగా చంపినట్లు పేర్కొన్నాయి. -
పాకిస్తాన్: నవంబర్‌లో 24 మంది కమాండర్లతో సహా 200 మంది ఉగ్రవాదులు హతం
పెషావర్: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్సుల్లో నవంబర్‌లో సైన్యం జరిపిన ఉగ్రవాద వ్యతిరేక దాడుల్లో 24 మంది కమాండర్లతో సహా 200 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఉగ్రవాదులంతా తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఇతర ఉగ్రవాద గ్రూపులతో సంబంధం కలిగినవారు.ఇటీవల తీవ్రవాద గ్రూపుల దాడులను దృష్టిలో ఉంచుకుని భద్రతా బలగాలు తీవ్రవాద గ్రూపులపై గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ల కింద నవంబర్ నెలలో 199 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, వీరిలో నిషేధిత సంస్థలకు చెందిన 24 మంది కీలక కమాండర్లు ఉన్నారన్నారు. హతమైన కమాండర్లలో సీనియర్ నేతలు కూడా ఉన్నారని, వీరి కోసం చాలా కాలంగా భద్రతా బలగాలు గాలిస్తున్నాయని అధికారులు తెలిపారు.మరోవైపు పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో మతపరమైన హింసలో మృతిచెందిన వారి సంఖ్య ఆదివారం నాటికి 130కి పెరిగింది. కుర్రం జిల్లాలో వరుసగా పదకొండో రోజు కూడా ఘర్షణలు కొనసాగుతున్నాయి. జిల్లాలో అలీజాయ్- బగన్ తెగల మధ్య ఘర్షణలు నవంబర్ 22న ప్రారంభమయ్యాయి. సున్నీ, షియా గ్రూపుల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని, హింస కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం -
జమ్మూ కశ్మీర్లో కాల్పులు.. పట్టుబడ్డ ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల ముందస్తు సమాచారంతో భద్రతా బలగాలు, పోలీసులు పుల్వామాలోని నెహామా ప్రాంతాలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఉగ్రవాదులుపైకి ఎదురుకాల్పులు జరిపారు. కాల్పులో సమయంలో లష్కర్-ఇ-తోయిబా రెసిస్టాన్స్ ఫ్రంట్‌కు చెందిన ఇద్దరు కమాండర్లు రాయిస్ అహ్మద్, రియాజ్ అహ్మద్‌లు భద్రతా బలగాలకు పట్టుబడ్డారు.#WATCH | Pulwama encounter: The house in Nihama area where terrorists are trapped, caught on fire. Encounter underway. Further details awaited. #JammuAndKashmir pic.twitter.com/qLSpB2UbwD— ANI (@ANI) June 3, 2024 ‘పుల్వామా జిల్లాలోని నిహామా ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’ అని కశ్మీర్ జోన్ పోలీసులు ‘ఎక్స్’ తెలిపారు. అయితే కాల్పులు జరిగిన సమమంలో ఎవరూ మృతి చెందలేదని పోలీసులు తెలిపారు. ఇక.. మే 7న జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
దొంగదెబ్బ తీసిన కమాండర్లకు ప్రమోషన్.. టాప్ పోస్టులతో సత్కారం!
బీజింగ్: పొరుగు దేశం చైనా మరోసారి తన కుటిల బుద్ధిని చాటుకుంది. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత సైనికులపై దొంగదెబ్బ తీయటంలో కీలకంగా వ్యవహరించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీఎల్ఏ కమాండ్ జనరల్స్‌పై ప్రశంసలు కురిపించింది. చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. భారత సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు కమాండ్ జనరల్స్‌కు ప్రమోషన్ కల్పిస్తూ.. టాప్ పోస్టులు కట్టబెట్టారు. ప్రస్తుతం భారత సరిహద్దులోని వెస్టర్న్ థియోటర్ కమాండ్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ► జనరల్ హీ వెయిడాంగ్(65)ను సెంట్రల్ మిలిటరీ కమిషన్(సీఎంసీ) కొత్త వైస్ ఛైర్మన్‌గా నియమించారు జిన్‌పింగ్. సీఎంసీకు అధ్యక్షుడి హోదాలో జిన్‌పింగ్ నేతృత్వం వహిస్తారు. మరోవైపు.. సీఎంసీలో ఎలాంటి పదవులు చేపట్టకుండానే వైస్ ఛైర్మన్ పోస్టులోకి జనరల్ హీ వెయిడాంగ్ను నియమించటం గమనార్హం. ► జనరల్ ఝాంగ్ యూక్సియా(72).. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు సంపాదించారు. పదవీ విరమణ వయసు దాటినప్పటికీ ఆయనను ఫస్ట్ ర్యాంకింగ్ వైస్ ఛైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయించారు. పీఎల్ఏలో జిన్‌పింగ్‌కు కుడిభుజంగా ఝాంగ్‌ను చెప్పుకుంటారు. ► జనరల్ జు క్విలింగ్(60)ను 205 మంది సభ్యులుగా ఉన్న పార్టీ కొత్త సెంట్రల్ కమిటీలో నియమించారు జిన్‌పింగ్. మరోవైపు.. నియంత్రణ రేఖ వద్ద సంక్షోభం తలెత్తిన క్రమంలో జనరల్ జు క్విలింగ్ ఇంఛార్జిగా ఉన్నారు. దీంతో 2021 జులైలో డబ్ల్యూటీసీ హెడ్‌గా , లెఫ్టినెంట్ జనరల్ నుంచి జనరల్‌గా పదోన్నతి పొందారు. మరోవైపు.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ(69)కి సైతం పదవీ విరమణ వయసు దాటినప్పటికీ తనతోనే అట్టిపెట్టుకున్నారు జిన్‌పింగ్. పొలిట్ బ్యూరోలోకి వాంగ్ యీని తీసుకున్నారు. పార్టీ విదేశీ వ్యవహారాల సెంట్రల్ కమిషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: చరిత్రకెక్కిన జిన్‌పింగ్.. మావో జెడాంగ్ తర్వాత తొలినాయకుడిగా.. -
జలాంతర్గాముల సమాచారం లీకేజీ కేసులో ఇద్దరు నేవీ కమాండర్లపై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: జలాంతర్గాములకు సంబంధించిన రెండు వేర్వేరు ప్రాజెక్టుల్లో కీలకమైన సమాచారం లీకైన కేసులో సీబీఐ మంగళవారం రెండు చార్జిషీటుల్ని దాఖలు చేసింది. ఒక కేసులో ఇద్దరు నేవీ కమాండర్లపై అభియోగాలు నమోదు చేయగా, రెండో చార్జిషీటులో మరో నలుగురిపై అభియోగాల్ని మోపింది. రక్షణ రంగంలో అవినీతికి సంబంధించిన కేసుల్లో వాయువేగంతో సీబీఐ చార్జిషీటు నమోదు చేయడం ఇదే మొదటిసారి. సెప్టెంబర్ 3న తొలి అరెస్ట్ చేసిన సీబీఐ 60 రోజుల్లోనే చార్జిషీటు దాఖలు చేసింది. ఒక కేసులో నేవీ కమాండర్లు రణదీప్ సింగ్, ఎస్జే సింగ్‌లు ఉంటే మరో కేసులో హైదరాబాద్‌కు చెందిన అలెన్ రీన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ లిమిటెడ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.పి. శాస్త్రి, డైరెక్టర్లు ఎన్బి రావు, కె.చంద్రశేఖర్‌లు నిందితులుగా ఉన్నారు. -
చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్-చైనాల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఆరవ రౌండ్ కార్పస్ కమాండర్-స్థాయి చర్చలు చైనా భూభాగంలోని మోల్డోలో సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మొదలై రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి. దాదాపు 12 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ చర్చల్లో భారత్ ప్రధానంగా ఘర్షణాత్మక ప్రాంతాల్లో నుంచి చైనా బలగాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. రెండు దేశాల మధ్య కుదిరిన ఐదు అంశాల ఒప్పందం అమలు లక్ష్యంగా చర్చలు జరిగాయి. చైనా మొదట తన దళాలను వెనక్కి రప్పించాలని భారత్ కోరినట్లు సమాచారం. చైనానే మొదట చొరబాటుకు ప్రయత్నించింది కనుక.. ముందు అదే వెనక్కి తగ్గాలని భారత్ ఆశిస్తున్నట్లు తెలిసింది. (చదవండి:అంతర్జాతీయ సంకేతాలే కీలకం...) ప్యాంగ్యాంగ్ త్సో, హాట్‌స్ప్రింగ్స్, డెప్సాంగ్, ఫింగర్ ఏరియాలో తక్షణమే చైనా దళాలు ఉపసంహరించుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. ఒకవేళ చైనా యథాతథ స్థితిని పునరుద్ధరించకపోతే.. భాతర దళాలు సుదీర్ఘకాలం మోహరిస్తాయని హెచ్చరించింది. ఇప్పటి వరకు జరిగిన ఐదు దఫాలుగా సుదీర్ఘ చర్చలు జరిగినా చెప్పుకోదగ్గ పురోగతి ఏమీ లేకుండానే ముగిసిన విషయం తెలిసిందే. ఇక నిన్నటి చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి లేహ్ ఆధారిత 14 కార్పస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నాయకత్వం వహించగా.. చైనా వైపు సౌత్ జిన్జియాంగ్ మిలిటరీ కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ నేతృత్వం వహించినట్లు తెలిసింది. -
భారత్, చైనా సుదీర్ఘ చర్చలు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్, చైనాల మధ్య చర్చలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. చైనా భూభాగంలోని మోల్డోలో ఉదయం 9 గంటల ప్రాంతంలో మొదలైన ఆరో విడత చర్చలు రాత్రి 9 గంటల తర్వాత కూడా ఒక కొలిక్కి రాలేదు. రెండు దేశాల మధ్య కుదిరిన ఐదు అంశాల ఒప్పందం అమలే లక్ష్యంగా జరుగుతున్న ఈ చర్చల్లో భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్‌తోపాటు మొదటిసారిగా విదేశాంగ శాఖ తరఫున జాయింట్ సెక్రటరీ నవీన్ శ్రీవాస్తవ కూడా పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన మాస్కోలో రెండు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య కుదిరిన ఒప్పందంలోని ఐదు అంశాల అమలుకు కాలపరిమితిని ఖరారు చేయడంపైనే భారత బృందం దృష్టి పెట్టిందని అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరించిన చైనా బలగాలను సాధ్యమైనంత త్వరలో, పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ఈ బృందం కోరుతోంది. ఇప్పటి వరకు జరిగిన ఐదు దఫాలుగా సుదీర్ఘ చర్చలు జరిగినా చెప్పుకోదగ్గ పురోగతి ఏమీ లేకుండానే ముగిసిన విషయం తెలిసిందే. -
నారీ.. సైన్యాధికారి
న్యూఢిల్లీ: కమాండ్ రోల్స్‌లో మహిళా సైనికాధికారుల నియమించే విషయంలో కొనసాగుతోన్న వివక్షకు చెల్లుచీటీ ఇస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. శారీరక పరిమితులు, సామాజిక కట్టుబాట్ల పేరుతో సైనిక పటాలాల కమాండింగ్ బాధ్యతల్లో మహిళా అధికారులను నియమించకపోవడం తగదని స్పష్టం చేసింది. భారత సైన్యంలో పనిచేస్తోన్న మహిళా అధికారులకు పురుషులతో సమానంగా ఉన్నత బాధ్యతలు నెరవేర్చే అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ భావనను వ్యతిరేకించడమేనని సుప్రీంకోర్టు ప్రతిష్టాత్మక తీర్పునిచ్చింది. అందులో భాగంగానే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ)లోని మహిళా సైనికాధికారులకు మూడు నెలల్లోగా శాశ్వత కమిషన్(పర్మనెంట్ కమిషన్–పీసీ) ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. గతంలో ఎందరో మహిళాఅధికారులు దేశానికి అత్యున్నత పురస్కారాలను తెచ్చిపెట్టిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తుచేస్తూ సాయుధ దళాలలో లింగపరమైన వివక్షకు ముగింపు పలికేందుకు ప్రభుత్వాలు తమ ఆలోచనావిధానాలను మార్చుకోవాల్సి ఉంటుందని హితవు పలికింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో.. కమాండ్ పోస్టింగ్స్‌తో పాటు పురుష అధికారులతో సమానంగా పదోన్నతులు, ర్యాంక్స్, పెన్షన్సు, ఇతర ప్రయోజనాలు దక్కనున్నాయి. 2010 నాటి ఢిల్లీ హైకోర్టు తీర్పుకు సమర్థన రక్షణ రంగంలో ఎన్నేళ్ళ సర్వీసు ఉన్నదనే విషయంతో సంబంధం లేకుండా పురుష సైనికుల మాదిరిగానే మహిళా సైనికులకు వృత్తిపరమైన ఎంపిక కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. మహిళా సైనికుల విషయంలో వివక్ష తగదంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. పదేళ్లుగా ఈ ఆదేశం అమలుపై కేంద్రం శ్రద్ధ చూపలేదని తప్పు పట్టింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్రం వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అజయ్ రస్తోగీల ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఆ పరిమితులు అడ్డు కాదు సైన్యంలో ఉన్నత పదవులను నిర్వర్తించడంలో మహిళలకు వారి సహజ శారీరక పరిమితులూ, సామాజిక కట్టుబాట్లు అడ్డుగా ఉన్నాయన్న కేంద్రం వివరణను కోర్టు తోసిపుచ్చింది. ‘మాతృత్వం, పిల్లల పోషణ లాంటి సవాళ్ళు’ కూడా ఉన్నాయన్న కేంద్రం వివరణను కోర్టు తప్పు పట్టింది. మహిళల శారీరక పరిమితులు వారి విధి నిర్వహణకు ఏ విధంగానూ అడ్డురావని కోర్టు స్పష్టం చేసింది. కేవలం 4 శాతమే మహిళా అధికారులకు పర్మనెంట్ కమిషన్ ఏర్పాటును, కమాండ్ పోస్టింగ్స్‌ను నిరాకరించడం ఆందోళనకరమని, ఇది సమానత్వ భావనకు వ్యతిరేకమని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఆర్మీలో ఉన్న మొత్తం కమిషన్డ్ అధికారుల్లో మహిళా అధికారుల సంఖ్య కేవలం 1,653 అని, అది 4% కన్నా తక్కువేనని గుర్తు చేసింది. ‘లింగపరమైన వివక్షతో వారి సామర్థ్యాన్ని తక్కువచేయడం మహిళలుగా వారిని మాత్రమే కాదు.. మొత్తం భారతీయ సైన్యాన్ని అవమానించడమే’ అని పేర్కొంది. ‘ఎస్ఎస్సీలో ఉన్న మహిళాఅధికారులందరికీ శాశ్వత కమిషన్‌ను అనువర్తింపచేయాలి. 14 ఏళ్ల పైబడిన సర్వీస్ ఉన్నమహిళా అధికారులు పీసీలో చేరేందుకు ఇష్టపడనట్లయితే.. పెన్షన్ అర్హతకు అవసరమైన 20 ఏళ్ల సర్వీస్ పూర్తయేంతవరకు విధుల్లో కొనసాగించాలి’ అని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. కమాండ్ పోస్టింగ్స్‌ను ఇవ్వడంలో అడ్డంకులు కల్పించరాదని స్పష్టం చేసింది. యుద్ధ విధుల్లో మహిళా అధికారుల సేవలను వినియోగించుకోవడం విధానపర నిర్ణయమని ధర్మాసనం పేర్కొంది. -
దళపతిగా తొలిమహిళ
ఈ నెల పదిహేనో తారీఖున ఢిల్లీలో జరగబోయే 71వ ఆర్మీ డే పరేడ్ ఓ చరిత్ర సృష్టించనుంది. 144 మంది జవాన్లు ఉన్న ఆర్మీ కాంటింజెట్కు ఓ మహిళా అధికారి నాయకత్వం వహించనున్నారు. అసలు ఆర్మీ సర్వీసెస్ కార్ప్స్ కాంటింజెంటే ఇరవై మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఈ పరేడ్‌లో పాల్గొననుంది. దానిని ఓ మహిళా అధికారి సారథ్యం వహించడం ఆర్మీ చరిత్రలోనే ప్రప్రథమం. ఆ ఆఫీసర్ లెఫ్టినెంట్ భావనా కస్తూరి. 2015 అక్టోబర్‌లో ట్రైనింగ్ అకాడమీలో జాయిన్ అయ్యారు భావన. ‘‘ఈ పరేడ్‌లో పాల్గొనడానికి, లీడ్ చేయడానికి మగవాళ్లు చాలా కష్టపడ్తారు. యేడాది పాటు ప్రాక్టీస్ చేస్తారు. మాది బెంగళూరు సెంటర్. నా రెజిమెంటల్ నుంచి ఇక్కడికి వచ్చా. ఓ ఆరునెలల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నాతో పాటు ఇంకో ఇద్దరు పురుష అధికారులు కాంటిజెంట్ కమాండర్స్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆర్మీ కాంటిజెంట్‌కు సారథ్యం వహించే అవకాశం మహిళా అధికారికి వచ్చింది అంటే ఆర్మీలో మహిళల పట్ల అమోదనీయత వచ్చినట్లే. ఇది శుభ పరిణామం’’ అన్నారు భావనా కస్తూరి. -
ఇద్దరు నక్సల్ కమాండర్లు హతం
మృతుల్లో ఒకరు తెలంగాణ వ్యక్తి రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో 25 మంది భద్రతా సిబ్బందిని పొట్టన పెట్టుకున్న మావోయిస్టుల దాడి సమయంలో సీఆర్పీఎఫ్ జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు నక్సల్ కమాండర్లు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకరు తెలంగాణలోని భద్రాద్రి జిల్లాకు చెందిన రవి అని, మరొకరు ఛత్తీసగఢ్ బీజాపూర్ జిల్లాకు చెందిన అనిల్ అని తెలిపారు. ఏప్రిల్ 24న జరిగిన ఎన్కౌంటర్ తరువాత సీఆర్పీపీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయం తెలిసింది. ఆ దాడి వెనక వీరిలో కొందరి పాత్ర ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు. విచారణ పూర్తయిన తరువాత వారిని అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెడతామని చెప్పారు.