ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో 25 మంది భద్రతా సిబ్బందిని పొట్టన పెట్టుకున్న మావోయిస్టుల దాడి సమయంలో సీఆర్‌పీఎఫ్ జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు నక్సల్ కమాండర్లు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
మృతుల్లో ఒకరు తెలంగాణ వ్యక్తి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో 25 మంది భద్రతా సిబ్బందిని పొట్టన పెట్టుకున్న మావోయిస్టుల దాడి సమయంలో సీఆర్‌పీఎఫ్ జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు నక్సల్ కమాండర్లు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకరు తెలంగాణలోని భద్రాద్రి జిల్లాకు చెందిన రవి అని, మరొకరు ఛత్తీసగఢ్ బీజాపూర్ జిల్లాకు చెందిన అనిల్ అని తెలిపారు. ఏప్రిల్ 24న జరిగిన ఎన్‌కౌంటర్ తరువాత సీఆర్‌పీపీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయం తెలిసింది. ఆ దాడి వెనక వీరిలో కొందరి పాత్ర ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు. విచారణ పూర్తయిన తరువాత వారిని అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెడతామని చెప్పారు.