బీరూట్ : ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( FBI ) హిట్ లిస్ట్‌లో ఉన్న హెజ్‌బొల్లా సీనియర్ కమాండర్ (Hezbollah commander) షేక్ ముహమ్మద్ అలీ హమాదీ (Sheikh Muhammad Ali Hammadi) దారుణ హత్యకు గురయ్యాడు. లెబనాన్‌లోని గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటి ముందు కాల్చి చంపారు. అయితే గత కొంత కాలంగా అలీ హమాదీ కుటుంబంలో కలహాలు కొనసాగుతున్నాయి. వాటి కారణంగానే ఆయనపై దాడి జరిగిందనే అనుమానాలు వెలుగులోకి వచ్చాయి.
మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు హమాదీపై ఆరుసార్లు కాల్పులు జరిపారని, కాల్పుల్లో అక్కడికక్కడే మరణించినట్లు స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే,ఆయన మరణం వెనుక రాజకీయ కోణం, లేదంటే ప్రత్యర్థులు ఉన్నారనే అంశంపై మీడియా కథనాలు ఖండించాయి. సంవత్సరాల తరబడి హమ్మదీని కుటుంబ కలహాలు వెంటాడుతున్నాయని, వాటి కారణంగా చంపినట్లు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment