శ్రీనగర్: జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. శనివారం రాత్రి జిల్లాలోని ద్రబ్‌గామ్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయని కశ్మీర్ పోలీసులు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం 6:55 గంటలకు ప్రారంభమైన ఎన్‌కౌంటర్ దాదాపు 12 గంటలపాటు కొనసాగినట్లు తెలిపారు.
కాల్పుల్లో మరణించిన వారిని జునైద్ షీర్గోజ్రీ, ఫాజిల్ నజీర్ భట్, ఇర్ఫాన్ మాలిక్‌గా గుర్తించినట్లు కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ముగ్గురు స్థానికులేనని, వీరు లష్కరే తోయిబా గ్రూప్‌కు చెందిన వారని పేర్కొన్నారు. వీరిలో జునైద్ అనే ఉగ్రవాది గత నెల 13న అమరుడైన జవాన్ రియాజ్ అహ్మద్‌ను చంపినవారిలో ఒకడని తెలిపారు. ఎన్‌కౌంటర్ ప్రాంతంలో మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, రెండు ఎకె47రైఫిళ్లు, ఒక పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.లో తెలిపారు.
చదవండి: స్నేహం ముసుగులో మైనర్‌పై అత్యాచారం, లైవ్ స్ట్రీమింగ్
Comments
Please login to add a commentAdd a comment