terrorist killed
-
జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
-
జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బుధవారం దోడా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఇవాళ ఉదయం దోడా జిల్లాలోని బజాద్ గ్రామంలో భద్రతా బలగాలు, పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతోందని పోలీసలు పేర్కొన్నారు.ఇక.. ఇటీవల జూన్ 11, 12 తేదీల్లో ఎన్కౌంటర్లు జరిగాయి. జూన్ 11నాడు జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనల నేపథ్యంలో ఉగ్రవాదుల సమాచారం అందించినవారి రూ.5 లక్షల క్యాష్ రివార్డు అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. -
ఎన్కౌంటర్లో లష్కరే ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యాడు. శుక్రవారం వేకువజామున దక్షిణ కశ్మీర్‌లోని చోటిగామ్ గ్రామంలో ముష్కరుల సంచారం ఉందన్న నిఘా సమాచారం మేరకు బలగాలు కార్డన్ సెర్చ్ చేపట్టాయి. దాక్కున్న ఉగ్రవాది ఒక్కసారిగా కాల్పులకు దిగాడు. ప్రతిగా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో హతమైన ఉగ్రవాదిని బిలాల్ అహ్మద్ భట్‌గా గుర్తించారు. చెక్ చొలాన్ ప్రాంతానికి చెందిన భట్ లష్కరే తోయిబాలో సభ్యుడు. ఘటనా స్థలి నుంచి ఏకే రైఫిల్‌తోపాటు మందుగుండు సామగ్రిని స్వా«దీనం చేసుకున్నారు. కుల్గామ్‌లోని సుద్సన్‌కు చెందిన ఫయాజ్(22) రాజ్‌పుటానా రైఫిల్స్ జవానుగా ఉండేవారు. బంధువు ఇంటికి పెళ్లికని వచి్చన ఫయాజ్ను ఉగ్రవాదులు నిర్బంధించి 2017 మేలో కాల్చి చంపారు. ఈ ఘటనలో భట్ ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో కేసు కూడా నమోదైనట్లు షోపియాన్ సీనియర్ ఎస్పీ తనుశ్రీ తెలిపారు. గ్రెనేడ్ విసిరి ఇద్దరు స్థానికేతర కారి్మకులను చంపిన ఘటనలో భట్ హస్తముందని చెప్పారు. -
ఖలిస్థాన్ ఉగ్రవాది హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్?
న్యూఢిల్లీ: కెనడాలో బుధవారం రాత్రి జరిగిన గ్యాంగ్‌వార్‌లో మరో ఖలిస్థాన్ ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ అలియాస్ సుఖ దునెకె ప్రత్యర్ధులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. ఈ హత్యకు పూర్తి బాధ్యత తమదేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మాదే బాధ్యత.. కెనడాలో జరిగిన ముఠా కాల్పుల్లో ఖలిస్థా ఉగ్రావది సుఖ దునెకె హత్యకు గురయ్యాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఈ హత్య తామే చేయించామని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గ్యాంగ్స్టర్లు గుర్లాల్ బ్రార్, విక్కీ ముద్దుకేరా హత్యలతో సుఖ దునెకెకు సంబంధముందని వాడు మాదకద్రవ్యాలకు బానిసాయి ఫేక్ వీసా మీద కెనడా పారిపోయాడని వాడు చేసిన తప్పులకు శిక్ష పడిందని మా శత్రువులు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా బ్రతకరని హెచ్చరించారు. లారెన్స్ పాత్రపై అనుమానాలు.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసు ఆరోపణల్లో అహ్మదాబాద్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూస్వాలా హత్య కేసులో కూడా లారెన్స్ బిష్ణోయ్ నిందితుడిగా ఉన్నాడు. సోషల్ మీడియా పోస్టును బట్టి ఈ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ హస్తంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు భారత్ కెనడా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ హత్య జరగడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని అక్కడి వారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అక్కడి వారికి ట్రావెల్ అడ్వైజరీ మార్గదర్శకాలు చేసి వీసా సేవలను నిలిపివేసింది. చిలికి చిలికి.. భారత్ కెనడా మధ్య సంబంధాలు అంతకంతకు బలహీనపడుతున్నాయి. ఖలిస్థాన్ ఉద్యమం పేరిట ఖలిస్థానీ మద్దతుదారులు ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని ర్యాలీగా నిర్వహించి వివాదానికి తెరతీశాయి. ఆనాడు భారత దేశం ఆ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేసినా తేలిగ్గా తీసుకున్న కెనడా తర్వాత జరిగిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత్ ఏజెంట్లు కారణమంటూ చేసిన వ్యాఖ్యలు తగువుకు ఆజ్యం పోశాయి. ఇంతలోనే మరో ఉగ్రవాది హత్య జరగడంతో కెనడా వీసాలను నిలిపివేసింది. BIG ⚡️Lawrence Bishnoi gang claims responsibility for K-terrorist Sukhdool Singh's killing in Canada pic.twitter.com/6ZN1T30pb4 — Megh Updates 🚨™ (@MeghUpdates) September 21, 2023 ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడి రేసులో దూసుకెళ్తున్న భారతీయుడు -
పుల్వామాలో భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. శనివారం రాత్రి జిల్లాలోని ద్రబ్గామ్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయని కశ్మీర్ పోలీసులు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం 6:55 గంటలకు ప్రారంభమైన ఎన్కౌంటర్ దాదాపు 12 గంటలపాటు కొనసాగినట్లు తెలిపారు. కాల్పుల్లో మరణించిన వారిని జునైద్ షీర్గోజ్రీ, ఫాజిల్ నజీర్ భట్, ఇర్ఫాన్ మాలిక్‌గా గుర్తించినట్లు కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ముగ్గురు స్థానికులేనని, వీరు లష్కరే తోయిబా గ్రూప్‌కు చెందిన వారని పేర్కొన్నారు. వీరిలో జునైద్ అనే ఉగ్రవాది గత నెల 13న అమరుడైన జవాన్ రియాజ్ అహ్మద్‌ను చంపినవారిలో ఒకడని తెలిపారు. ఎన్కౌంటర్ ప్రాంతంలో మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, రెండు ఎకె47రైఫిళ్లు, ఒక పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.లో తెలిపారు. చదవండి: స్నేహం ముసుగులో మైనర్‌పై అత్యాచారం, లైవ్ స్ట్రీమింగ్ -
చొరబాట్లను అడ్డుకున్న సైన్యం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సరిహద్దు దాటి భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. హాత్‌లంగా ప్రాంతంలోని ఘటనా స్థలం నుంచి భారీస్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు గురువారం సైన్యాధికారి చెప్పారు. హతమైన వారిలో ఒకరు పాకిస్తానీ అని, మిగతా వారి వివరాలు ఇంకా తెలియదని అధికారి పేర్కొన్నారు. ఉరీ సెక్టార్, గోహలన్ ప్రాంతాల్లో చొరబాట్లు జరగొచ్చనే ముందస్తు సమాచారం మేరకు సరిహద్దు వెంట గాలింపు పెంచామని, చివరకు ఇలా ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకున్నామని లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే చెప్పారు. మొత్తం ఆరుగురు చొరబాటుకు ప్రయత్నించారని, నలుగురు సరిహద్దు ఆవలే ఉండిపోయారని, ఇద్దరు సరిహద్దు దాటారని, ఎదురుకాల్పుల్లో మొత్తంగా ముగ్గురు హతమయ్యారని వివరించారు. భారత్‌లో ఉగ్రచర్యల్లో పిస్టళ్లను వాడే కొత్త పంథాను పాక్ అవలంభిస్తోందని కశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. ఈ ఏడాది 97 పిస్టళ్లను సైన్యం స్వాధీనం చేసుకుంది. ఈ ఏడాది నిరాయుధులైన పోలీసులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రదాడుల్లో 85 శాతం ఘటనల్లో పిస్టళ్లనే వాడారని ఐజీ పేర్కొన్నారు. షోపియాన్‌లో మరో ఉగ్రవాది.. షోపియాన్ జిల్లాలో కేశ్వా గ్రామంలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో అనాయత్ అష్రాఫ్ అనే ఉగ్రవాది మరణించాడు. అక్రమంగా ఆయుధాలను సమీకరిస్తూ, మాదక ద్రవ్యాల లావాదేవీలు కొనసాగిస్తున్నాడనే పక్కా సమాచారంతో సైన్యం అష్రఫ్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసింది. లొంగిపోకుండా అష్రఫ్ సైన్యం పైకి కాల్పులు జరిపాడు. దీంతో సైన్యం జరిపిన కాల్పుల్లో అతను మృతిచెందాడు. -
మరో ఎన్కౌంటర్, నలుగురు హతం
శ్రీనగర్: భారత భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ జిల్లాలోని పింజారా ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పింజారా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమచారంతో భద్రతా బలగాలు అప్రమత్తయ్యాయి. ఆ ప్రాంతంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించాయి. దీంతో ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో భారత సైనికులు నలుగురు ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేశారని రక్షణశాఖ అధికారులు తెలిపారు. కాగా, హతమైన టెర్రరిస్టుల వివరాలను అధికారులు వెల్లడించలేదు. ఉగ్రవాద గ్రూపులవైపు యువత ఆకర్షితులు కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇక షోపియాన్ జిల్లాలోని రేబన్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ కమాండర్‌తో సహా ఐదురుగు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. (చదవండి: కార్లు వదిలి.. ఎడ్ల బండ్లు ఎక్కారు!) -
పుల్వామా ఉగ్రదాడి నిందితుడి హతం
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలు చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఒక సైనికుడు మరణించారు. గాయపడిన మరో ఇద్దరు సైనికులను ఆస్పత్రికి తరలించారు. భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాదుల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో పుల్వామా ఉగ్ర దాడిలో ప్రమేయం ఉన్న సాజద్ భట్‌గా పోలీసులు గుర్తించారు. మరో ఉగ్రవాదిని ఇదే దాడితో సంబంధం ఉన్న అహ్మద్ భట్‌గా గుర్తించారు. సాజద్ బట్ 25 కిలోల పేలుడు పదార్థంతో ఉన్న మారుతి ఈకో కారును పుల్వామా దాడిలో ఉపయోగించారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. సోఫీయన్ మదర్సాలో విద్యార్థిగా ఉన్న సాజద్ పుల్వామా దాడికి ముందు కొన్ని రోజలు కనిపిచంకుండా పొయినట్లు ఎన్ఐఏ తెలిపింది. కాగా, దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది సోమవారం హతమయ్యాడు. ఈ కాల్పుల్లో ఆర్మీ మేజర్ రాహుల్ వర్మ మరణించిన విషయం తెలిసిదే. -
నలుగురు జైషే ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు పాక్ నుంచి వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. హన్జన్‌లో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో సైన్యం గాలింపు నిర్వహిస్తుండగా, అక్కడ దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులు మొదలుపెట్టారు. ప్రతిగా భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదులందరూ జైషే మహ్మద్ సంస్థకు చెందినవారని పోలీసులు తెలిపారు. ఘటన స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. -
40 మంది ముష్కరుల కాల్చివేత
గిజా: ప్రపంచ ప్రఖ్యాత గిజా పిరమిడ్ వద్ద బాంబు పేల్చి ముగ్గురు విదేశీయులను బలి తీసుకున్న ఉగ్ర మూకలపై ఈజిప్టు సైన్యం విరుచుకుపడింది. గిజాతోపాటు సినాయ్ ద్వీపకల్పంలోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపి 40 మందిని కాల్చి చంపింది. శుక్రవారం గిజాలో పర్యాటకుల బస్సుపై ఉగ్ర వాదులు జరిపిన బాంబు దాడిలో ముగ్గురు వియత్నాం దేశస్తులతోపాటు ఒక ఈజిప్టు గైడ్ చనిపోగా మరో 10 మంది పర్యాటకులు గాయపడ్డారు. ప్రభుత్వ కీలక ఆర్థిక వనరులు, విదేశీ పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు మరిన్ని దాడులకు సిద్ధమవుతున్నారన్న సమాచారంతో సైన్యం అప్రమత్తమైంది. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం వేకువజామున గిజాలోని రెండు ప్రాంతాలతోపాటు సినాయ్ ప్రావిన్స్‌లో ఉగ్ర స్థావరాలపై బలగాలు ఒక్కసారిగా దాడులు జరిపాయి. ఈ దాడుల్లో మొత్తం 40 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీర్ఘకాలంపాటు ఈజిప్టును పాలించిన హోస్నీ ముబారక్ 2011లో వైదొలిగాక దేశంలో తీవ్ర అస్థిరత నెలకొంది. దేశంలో సుస్థిర పరిస్థితులు ఇప్పుడిప్పుడే నెలకొంటున్న తరుణంలో జరిగిన తాజా ఉగ్ర దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. -
భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం
సాక్షి, శ్రీనగర్ : భద్రతా దళాలు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లా తంత్రిపోరా వద్ద శనివారం ఉదయం భద్రతదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాదిని మచివాకు చెందిన ఇష్ఫాక్ పద్దార్గా గుర్తించారు. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా పాకిస్తాన్ శుక్రవారం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. ఫూంచ్ సెక్టార్లో పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పాక్ కాల్పులను భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. -
కశ్మీర్లో మరో ఉగ్రవాది హతం
శ్రీనగర్ : సరిహద్దులు దాటి దేశంలో చొరబడి విధ్వంసం సృష్టించాలన్న ఉగ్రవాదులను ఎత్తుగడలను భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది. తాజాగా మంగళవారం ఉదయం భద్రతా బలగాల చేతిలో మరో ఉగ్రవాది హతమయ్యాడు. కాగా జమ్మకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బెహ్మనో ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు మరణించారు. అయితే వారి మృతదేహాలను తెచ్చే క్రమంలో మరో ఉగ్రవాది గ్రెనేడ్‌ను పేల్చుకోవడంతో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి. సంఘటనా స్థలం నుంచి ఒక AK-47 తుపాకీ, ఇన్సాస్ రైఫిల్‌ను సైనిక వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు కూంబింగ్ కొనసాగుతోంది. -
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కలకలం!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదుల సంచారం స్థానికంగా కలకలం రేపింది. జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. కొందరు ఉగ్రవాదులు హరితర్ తర్జు ప్రాంతంలో సంచరింస్తున్నారని సమాచారం అందుకున్న జవాన్లు ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాల్పులకు పాల్పడ్డ ఓ ఉగ్రవాదని జవాన్లు హతమార్చినట్లు సమాచారం. ఉగ్రవాది వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఉగ్రవాది అదే ప్రాంతంలో నక్కినట్లు జవాన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ రెండో ఉగ్రవాదిని పట్టుకోవడానికి ఆర్మీ కూంబింగ్ జరుపుతోంది. దాడులకు పాల్పడే ఉద్దేశంతోనే ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో బారాముల్లా జిల్లాలోకి ఉగ్రవాదులు ప్రవేశించినట్లు తెలుస్తోంది. -
కశ్మీర్లో ఉగ్రవాది హతం
శ్రీనగర్: పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత స్థావరాలపై వరుసగా దాడి చేస్తుండగా, మరోవైపు ఉగ్రవాదులు మాటువేసి భద్రత దళాలపై దాడులకు పాల్పడుతున్నారు. భారత భద్రత దళాలు దీటుగా స్పందిస్తూ దాడులను తిప్పికొడుతున్నాయి. సోమవారం ఉదయం జమ్ము కశ్మీర్‌లోని సోపియన్ జిల్లాలో భద్రత దళాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. కాగా ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. మరణించిన ఉగ్రవాదిని సదామ్ హుస్సేన్‌గా గుర్తించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి భద్రత దళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. -
పఠాన్ కోట్ లో మరో ఉగ్రవాది హతం
పఠాన్ కోట్: పంజాబ్ లోని పఠాన్ కోట్ లో చొరబడ్డ ఉగ్రవాదుల్లో మరొకరిని సైనిక బలగాలు మట్టుబెట్టాయి. రెండతస్తుల భవనంలో నక్కిన ఉగ్రవాదిని కమెండోలు హతమార్చాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆపరేషన్ లో ఇప్పటివరకు హతమార్చిన ఉగ్రవాదుల సంఖ్య ఆరుకు చేరింది. కూంబింగ్ కొనసాగుతోంది. వైమానిక దళంలోకి చొరబడిన ముష్కరులను మట్టుమెట్టేందుకు వరుసగా మూడో రోజు సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. వీరిని తుదముట్టించే క్రమంలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది గాయపడ్డారు. అయితే ఎంతమంది ఉగ్రవాదులు చొరబడ్డారనే దానిపై స్పష్టత లేదు.