శ్రీనగర్: భారత భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ జిల్లాలోని పింజారా ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పింజారా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమచారంతో భద్రతా బలగాలు అప్రమత్తయ్యాయి. ఆ ప్రాంతంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించాయి. దీంతో ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు.
ఈ క్రమంలో భారత సైనికులు నలుగురు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేశారని రక్షణశాఖ అధికారులు తెలిపారు. కాగా, హతమైన టెర్రరిస్టుల వివరాలను అధికారులు వెల్లడించలేదు. ఉగ్రవాద గ్రూపులవైపు యువత ఆకర్షితులు కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇక షోపియాన్ జిల్లాలోని రేబన్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ కమాండర్‌తో సహా ఐదురుగు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.
(చదవండి: కార్లు వదిలి.. ఎడ్ల బండ్లు ఎక్కారు!)
Comments
Please login to add a commentAdd a comment