శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యాడు. శుక్రవారం వేకువజామున దక్షిణ కశ్మీర్‌లోని చోటిగామ్ గ్రామంలో ముష్కరుల సంచారం ఉందన్న నిఘా సమాచారం మేరకు బలగాలు కార్డన్ సెర్చ్ చేపట్టాయి. దాక్కున్న ఉగ్రవాది ఒక్కసారిగా కాల్పులకు దిగాడు. ప్రతిగా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో హతమైన ఉగ్రవాదిని బిలాల్ అహ్మద్ భట్‌గా గుర్తించారు.
చెక్ చొలాన్ ప్రాంతానికి చెందిన భట్ లష్కరే తోయిబాలో సభ్యుడు. ఘటనా స్థలి నుంచి ఏకే రైఫిల్‌తోపాటు మందుగుండు సామగ్రిని స్వా«దీనం చేసుకున్నారు. కుల్గామ్‌లోని సుద్సన్‌కు చెందిన ఫయాజ్(22) రాజ్‌పుటానా రైఫిల్స్ జవానుగా ఉండేవారు. బంధువు ఇంటికి పెళ్లికని వచి్చన ఫయాజ్‌ను ఉగ్రవాదులు నిర్బంధించి 2017 మేలో కాల్చి చంపారు. ఈ ఘటనలో భట్ ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో కేసు కూడా నమోదైనట్లు షోపియాన్ సీనియర్ ఎస్‌పీ తనుశ్రీ తెలిపారు. గ్రెనేడ్ విసిరి ఇద్దరు స్థానికేతర కారి్మకులను చంపిన ఘటనలో భట్ హస్తముందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment