
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బుధవారం దోడా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఇవాళ ఉదయం దోడా జిల్లాలోని బజాద్ గ్రామంలో భద్రతా బలగాలు, పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని పోలీసలు పేర్కొన్నారు.
ఇక.. ఇటీవల జూన్ 11, 12 తేదీల్లో ఎన్‌కౌంటర్లు జరిగాయి. జూన్ 11నాడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనల నేపథ్యంలో ఉగ్రవాదుల సమాచారం అందించినవారి రూ.5 లక్షల క్యాష్ రివార్డు అందజేస్తామని పోలీసులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment