శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతంలో భద్రతా బలగాలు- ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక పోలీసు వీరమరణం పొందగా, మరొక పోలీసు గాయపడ్డారు.
వార్తా సంస్థ పీటీఐ అందించిన వివరాల ప్రకారం బిల్వార్ తహసీల్‌లోని కోగ్-మండలి గ్రామంలో శనివారం సాయంత్రం 5.30 గంటలకు ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు సంయుక్తంగా కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. అనంతరం ఎన్ కౌంటర్ మొదలైంది.
ఇరువర్గాల మధ్య భారీగా కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో కశ్మీర్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వీరమరణం పొందగా, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గాయపడ్డాడు. ఒక పోలీసు అధికారి ఈ ఎన్‌కౌంటర్ గురించి మాట్లాడుతూ ఉగ్రవాదుల ఉనికిపై నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, భద్రతా దళాలు కోగ్ గ్రామంలో ఆపరేషన్ ప్రారంభించాయన్నారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: యూపీ, బీహార్‌లలో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న నదులు
Comments
Please login to add a commentAdd a comment