encounter case
-
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఒక పోలీసు వీరమరణం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతంలో భద్రతా బలగాలు- ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఒక పోలీసు వీరమరణం పొందగా, మరొక పోలీసు గాయపడ్డారు.వార్తా సంస్థ పీటీఐ అందించిన వివరాల ప్రకారం బిల్వార్ తహసీల్‌లోని కోగ్-మండలి గ్రామంలో శనివారం సాయంత్రం 5.30 గంటలకు ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు సంయుక్తంగా కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. అనంతరం ఎన్ కౌంటర్ మొదలైంది.ఇరువర్గాల మధ్య భారీగా కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో కశ్మీర్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వీరమరణం పొందగా, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గాయపడ్డాడు. ఒక పోలీసు అధికారి ఈ ఎన్కౌంటర్ గురించి మాట్లాడుతూ ఉగ్రవాదుల ఉనికిపై నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, భద్రతా దళాలు కోగ్ గ్రామంలో ఆపరేషన్ ప్రారంభించాయన్నారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు తెలిపారు.ఇది కూడా చదవండి: యూపీ, బీహార్లలో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న నదులు -
మీ వాదనలనూ వింటాం
సాక్షి, హైదరాబాద్: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసుల వాదనలనూ వింటామంటూ.. వారు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. తుది విచారణలో భాగంగా అందరి వాదనలు వింటామంది. నిందితులు జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులు, మహమ్మద్ ఆరీఫ్ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలయ్యాయి. అయితే ఈ పిటిషన్లలో తమను కూడా ప్రతివాదులుగా చేర్చుకోవాలని, తమ వాదనలు వినాలని కోరుతూ పోలీసులు, దిశ తండ్రితోపాటు మరికొందరు మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. పోలీసులపై ఐపీసీ సెక్షన్ 302కు బదులు 307 కింద కేసు నమోదు చేయడం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. పోలీసుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై సిట్ నివేదిక ఇచ్చిందన్నారు. మళ్లీ ఇప్పుడు కోర్టు జోక్యం చేసుకోవడం సరికాదని, అది వారి వృత్తితోపాటు వ్యక్తిగత జీవితంపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. ‘ఒకసారి దర్యాప్తు పూర్తయి నివేదిక సమర్పించాక మళ్లీ ఎఫ్ఐఆర్ నమోదు చేయమనే పరిధి, అధికారం మేజి్రస్టేట్‌కు ఉండదు. అయితే సీఆర్పీసీ సెక్షన్ 482, రాజ్యాంగంలోని అర్టికల్ 226 కింద విచక్షణాధికారం మేరకు కేసును కొట్టివేయడానికి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే పరిధి ఈ కోర్టుకు ఉంటుంది. పిటిషనర్లు సీబీఐ దర్యాప్తును కోరుతున్నారు. నిబంధనల మేరకు కోర్టు ముందుకొచ్చి న పిటిషన్‌ను వినాలి. అలాగే పారదర్శక విచారణ కోసం పోలీసుల వాదనలనూ వింటాం’అని చెప్పింది. -
దిశ ఎన్కౌంటర్ కేసు: లారీ ఓనర్ ఆ విషయం చెప్పనేలేదు!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో.. తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో దిశ ఎన్‌కౌంటర్‌పై సిర్పూర్కర్ కమిషన్ సమర్పించిన నివేదికపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం ఎన్‌కౌంటర్‌కు గురైన బాధితుల తరపున సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ వృందా గ్రోవర్.. తన వాదనలు వినిపించారు. ఎన్కౌంటర్ జరిగిన తీరును కోర్టు దృష్టికి తీసుకొచ్చిన వృందా.. పోలీసులు వెల్లడించిన తీరుపైనా పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. పోలీస్ కస్టడీ లో ఉన్న నలుగురు నిందితులను సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో ఎన్ కౌంటర్ చేశారని ఆమె వాదించారు. సీసీ టివీలో లారీను చూసి మొదట గుర్తు పట్టింది ఓనర్ శ్రీనివాస్ రెడ్డి అని పోలీసులు తెలిపారు. కానీ.. కమిషన్ ముందు శ్రీనివాస్ రెడ్డి ఆ విషయం చెప్పనే లేదు అని ఆమె పలు అంశాలపైనా అభ్యంతరం వ్యక్తం చేశారామె. ఈ క్రమంలో.. ఇవాళ్టితో ఆమె వాదనలు ముగిశాయి. ఇక.. మిగిలింది ప్రభుత్వం తరపున వాదనలే. దీంతో తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. -
చటాన్ పల్లి మిస్టరీ..!
-
అది ఫేక్ ఎన్ కౌంటరే
-
పోలీసులది కట్టుకథ ప్లాన్ ప్రకారమే అంతా చేశారు..!!
-
సిర్పూర్కర్ కమీషన్ నివేదికలో షాకింగ్ నిజాలు..!!
-
దిశ ఎన్ కౌంటర్ తర్వాత హత్యచారాలు ఆగాయా ?? పోలీసులకు గుణపాఠం
-
దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసుపై సుప్రీం కోర్ట్ కీలక నిర్ణయం
-
విచారణకు సజ్జనార్
-
గ్యాంగ్‌స్టర్ దూబే ఎన్కౌంటర్: పోలీసులకు క్లీన్చిట్
లక్నో: గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌కు సంబంధించి యూపీ పోలీసులకు క్లీన్చిట్ లభించింది. ఎలాంటి ఆధారాలు లేనందున క్లీన్చిట్ ఇచ్చినట్లు బీఎస్ చౌహాన్ కమిషన్ చెప్పింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి బీఎస్ చౌహాన్ నేతృత్వంలో అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి, యూపీ మాజీ డీజీపీల కమిషన్ ఈ కేసును విచారించింది. గ్యాంగ్‌స్టర్ దూబే పోలీసులపై దాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించాడు. అయితే పోలీసులకు వ్యతిరేక సాక్ష్యాలు ఉంటే చూపించాల్సిందిగా మీడియాలో కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పోలీసులకు క్లీన్చిట్ ఇచ్చింది. దూబే మరణానికి ముందు ఆయన్ను అరెస్టుచేసేందుకు 2020 జూలై 3న కాన్పూర్ వెళ్లిన 8 మంది పోలీసులు హత్యకు గురవ్వడంతో ఈ కేసు సంచలనంగా మారింది. కమిషన్ నివేదికను రాష్ట్రప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు అందించనుంది. చదవండి: ఆక్సిజన్ కొరత సంక్షోభం: కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం -
20 లక్షల కోసం ఆర్మీ కెప్టెన్ దురాగతం
శ్రీనగర్: గత ఏడాది జూలై 18న కశ్మీర్‌లోని అంషిపొరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సిట్ దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. నగదు రివార్డు రూ.20 లక్షల కోసం ఆశపడిన 62–రాష్ట్రీయ రైఫిల్స్ రెజిమెంట్ కెప్టెన్ భూపేందర్ సింగ్ ముగ్గురు అమాయకులను బూటకపు ఎన్కౌంటర్లో చంపేసినట్లు తేలింది. ఈ ఘటనలో అతడికి ఇద్దరు స్థానికులు సాయపడినట్లు కూడా సిట్ గుర్తించింది. ఈ మేరకు 300 పేజీల చార్జిషీటును షోపియాన్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సికందర్ అజామ్‌కు గత డిసెంబర్ 26న సమర్పించింది. ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్న షోపియాన్‌కు చెందిన తబిష్ నాజిర్, పుల్వామా వాసి బిలాల్ అహ్మద్‌లతో కలిసి కెప్టెన్ భూపేందర్ సింగ్ పథకం వేశాడు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారంటూ మరో నలుగురు జవాన్లను తీసుకుని అంషిపొరా వెళ్లారు. నలుగురు జవాన్లు కార్డాన్ సెర్చ్ చేపడుతున్న సమయంలో తుపాకీ కాల్పుల శబ్దం వారికి వినిపించింది. ఆ ఉగ్రవాదులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా కాల్చినట్లు అనంతరం సింగ్ వారితో నమ్మబలికాడు. ముగ్గురినీ కాల్చి చంపిన అనంతరం వారిని గుర్తు పట్టకుండా చేసి, ఆయుధాలు ఉంచాడు. మృతులు అబ్రార్ అహ్మద్(25), ఇంతియాజ్ అహ్మద్(20), మొహమ్మద్ ఇబ్రార్(16)ల ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. ఆపిల్ తోటల్లో పనిచేసేందుకు వచ్చిన కూలీలుగా వారిని గుర్తించారు. ఖననం చేసిన మృతదేహాలను అక్టోబర్ 3వ తేదీన కుటుంబసభ్యులకు అందజేశారు. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఆర్మీ కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ చేపట్టింది. దీనిపై ఏర్పాటైన సిట్ 75 మందిని ప్రశ్నించింది. అనుమానితుల కాల్ రికార్డును పరిశీలించింది. నగదు రివార్డు కోసమే భూపేందర్ సింగ్, స్థానిక ఇన్ఫార్మర్లు కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకు గాను వారికి కొన్ని వేల రూపాయలు ముట్టినట్లు కూడా తేలింది. రూ.20 లక్షల రివార్డు కోసం తమ అధికారి బూటకపు ఎన్‌కౌంటర్‌కు పాల్పడినట్లు వస్తున్న వార్తలపై సైన్యం స్పందించింది. అవి సైనిక వ్యవస్థలోని వాస్తవాల ఆధారంగా వస్తున్న వార్తలు కావని పేర్కొంది. ‘యుద్ధ క్షేత్రంలో గానీ, ఇతర విధుల్లో గానీ పాల్గొన్న అధికారులు, సిబ్బందికి ఎటువంటి నగదు రివార్డులు అందజేసే విధానం లేదని శ్రీనగర్‌లోని రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. -
11 మంది పోలీసులకు జీవిత ఖైదు
మధుర: రాజస్తాన్‌లోని డీగ్ ప్రాంతంలో భరత్పూర్ రాజవంశానికి చెందిన రాజామాన్ సింగ్, అతని ఇద్దరు అనుచరులను 35 ఏళ్ళక్రితం హతమార్చిన 11 మంది మాజీ పోలీసు అధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మధుర జిల్లా జడ్జి సాధనారాణి ఠాకూర్ తీర్పునిచ్చారు. శిక్ష పడిన వారిలో డీగ్ డీఎస్పీ కాన్‌సింగ్(82), స్థానిక పోలీసు స్టేషన్ ఇన్చార్జ్, ఎస్ఐ వీరేంద్ర సింగ్ (78) ఉన్నారు. వీరేంద్ర సింగ్ నాయకత్వంలోని పోలీసు బృందం ఫిబ్రవరి 21, 1985న రాజామాన్ సింగ్, అతని ఇద్దరు అనుచరులు సుమేర్ సింగ్, హరిసింగ్‌లను హతమార్చారు. ఇతర పోలీసు అధికారులైన ఏఎస్ఐ రవిశంకర్, కానిస్టేబుల్స్ సుక్రామ్, జీవన్‌రామ్, జగ్మోహన్, భన్వర్‌సింగ్, హరిసింగ్, ఛత్తార్ సింగ్, షేర్ సింగ్, దయారాం, రవిశేఖర్‌లకు ఈ కేసులో యావజ్జీవ శిక్ష పడింది. వీరంతా 70 ఏళ్ళు పైబడిన వృద్ధులే. ఆనాటి రాజస్థాన్ ముఖ్యమంత్రి శివచరణ్ మాథుర్ ఎన్నికల ప్రచారం కోసం వచ్చినప్పుడు, అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజామాన్ సింగ్ ముఖ్యమంత్రి హెలికాప్టర్ వైపు జీపులో దూసుకెళ్లాడు. ఈ ఎన్నికల ఘటన జరిగిన మరునాడే రాజామాన్ సింగ్, అతని అనుచరులను పోలీసులు డీగ్ వ్యవసాయ మార్కెట్ వద్ద ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. -
దిశ నిందితుల ఎన్కౌంటర్లో నేరం జరిగిందా?
సాక్షి, న్యూఢిల్లీ: దిశ ఘటనలో నిందితులు ఎన్కౌంటర్లో చనిపోయిన ఉదంతంలో ఏదైనా నేరం జరిగిందా.. అదే జరిగితే అందుకు బాధ్యులెవరో తేల్చాలని జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్‌కు నిర్దేశించిన విధివిధానాల్లో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. నిందితులను ఎన్కౌంటర్లో కాల్చి చంపిన ఘటనపై సుప్రీంకోర్టు డిసెంబర్ 12న న్యాయవిచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. నిందితులను బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపారని, బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ జీఎస్ మణి, ప్రదీప్‌కుమార్‌యాదవ్, ఎంకే శర్మ, మనోహర్ లాల్ శర్మలు దాఖలు చేసిన మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్.ఎ.బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూర్కర్ చైర్మన్‌గా, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖా ప్రకాశ్ బాల్డోట, సీబీఐ మాజీ డైరెక్టర్ డీఆర్ కార్తికేయన్ సభ్యులుగా గల ఈ కమిషన్ 6 నెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పిస్తుందని ఆదేశించింది. తాజాగా జనవరి 10న తదుపరి విచారణకు రాగా జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని త్రిస భ్య ధర్మాసనం కమిషన్ విధివిధానాలు ఖరారు చేసింది. ‘దిశ నిందితులు అరెస్టై పోలీసుల కస్టడీలో మృతి చెందిన ఘట నపై, ఆ మృతికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరపాలి’అని నిర్దేశించింది. -
యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది
సాక్షి, హైదరాబాద్: దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ కేసు పోలీసులు, తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా తమకూ ప్రతిష్టాత్మకమైనదేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై ఏమౌతుందోనని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందని పేర్కొంది. ఎన్‌కౌంటర్‌పై అనేక సందేహాలున్నందునే రీపోస్టుమార్టం నిర్వహించాలని ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయని, దీనిపై ప్రభుత్వం కూడా ముందుకొచ్చి పారదర్శకతను చాటుకోవాల్సిన అవసరం ఉందంది. ఎన్కౌంటర్లో మరణించిన మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు మృతదేహాల వ్యవహారంపై హైకోర్టు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల్ని కచ్చితంగా అమలు చేసి తీరుతామని తేల్చిచెప్పింది. తొలుత ధర్మాసనం ఢిల్లీ వైద్యుల బృందంతో మృతదేహాలకు రీపోస్టుమార్టం చేయాలని ఉత్తర్వులు జారీ చేయబోతుంటే ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ అభ్యంతరం చెప్పారు. ప్రభుత్వ వైఖరిని తెలియజేసేందుకు సోమవారం వరకూ గడువు ఇవ్వాలని ఏజీ కోరగా.. శనివారం ప్రత్యేకంగా ఈ కేసును మాత్రమే విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం ప్రకటించింది. రీ పోస్టుమార్టం చేయాల్సిందే.. ఎన్కౌంటర్లో మరణించిన నలుగురి మృతదేహాలకు తిరిగి పోస్టుమార్టం నిర్వహించాలని, ఈ వ్యవహారాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందనే పిల్‌ను ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది. కె.సజన ఇతరుల కేసులో ఈనెల 17న సుప్రీంకోర్టు.. సాక్ష్యాధారాల సేకరణ–మృతదేహాల అప్పగింత వ్యవహారాలపై హైకోర్టు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశాలిచ్చింది. ఇందుకు అనుగుణంగా మృతదేహాలకు వేరే రాష్ట్రాలకు చెందిన ఫోరెన్సిక్ వైద్య నిపుణులతో రీపోస్టుమార్టం చేయించాలని పిల్లో కోర్టుకు సహాయకారిగా (ఎమికస్‌క్యూరీ) నియమితులైన సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి కోరారు. వెంటనే అందుకు అనుగుణంగా ధర్మాసనం స్పందించబోతుంటే ఏజీ కల్పించుకుని.. తెలంగాణలో నిష్ణాతులైన ఫోరెన్సిక్ వైద్య నిపుణులున్నారని, వేరే రాష్ట్రాల వైద్యులతో తిరిగి పోస్టుమార్టం నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. మృతదేహాలు పాడైపోతున్నాయని గాంధీ ఆస్పత్రి వైద్యులు కూడా చెబుతున్నారని, ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయని, ఎన్కౌంటర్ పేరుతో నలుగురిని కాల్చి చంపారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే రీపోస్టుమార్టం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. పిల్లో రీపోస్టుమార్టం కావాలని పిటిషనర్ కోరలేదని ఏజీ చెప్పగా, ఒక పిల్లో లేకపోతే మరో పిల్లో ఆ అభ్యర్థన ఉందని, అయినా సుప్రీంకోర్టు తమను నిర్ణయించాలని చెప్పాక ఆకాశమే హద్దుగా చేసుకుని ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎన్కౌంటర్ విశ్వవ్యాప్తమైంది పోలీసుల ప్రతిష్ట, రాష్ట్ర ప్రతిష్టలే కాకుండా తెలంగాణ హైకోర్టు ప్రతిష్ట కూడా ఇందులో ముడిపడి ఉందని, దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ విశ్వవ్యాప్తమైందని, ఏం జరగబోతోందోనని దేశమే కాకుండా యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బూటకపు ఎన్కౌంటర్ అనే విమర్శలు వచ్చినప్పుడు నిజాలు నిగ్గుతేల్చాలని రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు రావాలని, అయితే ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతోందో అర్థం కావడం లేదని సందేహాన్ని వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు దిశ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్టే ఉత్తర్వులు ఇచ్చిందని ఏజీ చెప్పగానే ధర్మాసనం తిరిగి స్పందిస్తూ ఆ తర్వాత మృతదేహాల వ్యవహారాన్ని హైకోర్టే తేల్చాలని తమకు ఆదేశాలిచ్చిందని గుర్తు చేసింది. బంతి మా కోర్టులో ఉందని వ్యాఖ్యానించింది. ఒక ఘటన (ఎన్కౌంటర్) జరిగాక పోస్టుమార్టం జరిగిందని, మళ్లీ పోస్టుమార్టం చేయాలంటే కాజ్ ఆఫ్ యాక్షన్ (చర్యకు కారణం) ఉండాలి కదా అని ఏజీ సందేహాన్ని లేవనెత్తారు. తాము ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆదేమీ అడ్డంకి కాబోదని హైకోర్టు స్పష్టం చేసింది. మృతదేహాలకు కుటుంబసభ్యులు దహన సంస్కారాలు చేయాలని, ఎంతకాలం వాటిని భద్రపర్చుతారని, ఈ ఘటనపై ఆధారాల సేకరణకు వీలుగా మరోసారి వాటికి పోస్టుమార్టం చేయించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తాము జారీ చేయబోయే ఉత్తర్వులను ప్రభుత్వం విభేదిస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చునని సూచించింది. అయితే రీపోస్టుమార్టం చేయాలనే పిల్‌పై ప్రభుత్వ వాదనలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు సోమవారం వరకూ సమయం ఇవ్వాలని ఏజీ కోరారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరమేముందని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ వైఖరిని తెలుసుకునేందుకు సమయం కావాలని ఏజీ కోరడంతో సెలవు దినమైనా శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేకంగా విచారిస్తామని ధర్మాసనం వెల్లడించింది. విచారణకు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. -
అహ్మద్ వనీకి ‘అశోక చక్ర’
న్యూఢిల్లీ: ఉగ్రవాదం బాటవీడి సైన్యంలో చేరి అమరుడైన లాన్స్‌నాయక్ నజీర్ అహ్మద్ వనీ(38)కి కేంద్రం అశోకచక్ర పురస్కారాన్ని ప్రకటించింది. 2018, నవంబర్ 25న షోపియాన్ జిల్లాలోని హీరాపూర్ గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడ్డ అహ్మద్ వనీ ప్రాణాలు కోల్పోయారు. శరీరంలోకి బుల్లెట్లు దిగి రక్తం కారుతున్నప్పటికీ ఓ లష్కరే కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన తర్వాతే ఆయన నేలకొరిగారు. ఈ నేపథ్యంలో వనీ చూపిన ధైర్యసాహసాలకు గానూ శాంతి సమయంలో అందించే అత్యున్నత సైనిక పురస్కారం అశోకచక్రను ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వనీ భార్య మహజబీన్‌కు ఈ పురస్కారాన్ని అందించనున్నారు. 2004లో వనీ ఆర్మీలోని ‘జమ్మూకశ్మీర్ 162 ఇన్ఫాంట్రీ బెటాలియన్’లో చేరారు. ఉగ్రవాదులపై పోరాటంలో చూపిన తెగువకు గానూ 2007, 2018లో సేనామెడల్‌ను అందుకున్నారు. కుల్గామ్ జిల్లాలోని ఛెకీ అష్ముజీ గ్రామానికి చెందిన వనీకి భార్య మహజబీన్తో పాటు కుమారులు అథర్, షహీద్ ఉన్నారు. ఆయనకు డ్యూటీనే అత్యుత్తమం నజీర్ వనీ కుటుంబాన్ని అమితంగా ప్రేమించేవారని ఆయన భార్య, ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మహజబీన్ తెలిపారు. వనీ ధైర్యవంతుడైన సైనికుడనీ, తన రాష్ట్రంలో శాంతి కోసం పరితపించేవాడని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. జీవితాంతం వనీ పలు ప్రమాదాలను ఎదుర్కొన్నాడనీ, చాలామందికి స్ఫూర్తిగా నిలిచాడని జవాన్లు అన్నారు. -
ఎన్‌కౌంటర్‌పై ఎన్హెచ్ఆర్సీ విచారణ
-
పోలీసులు అప్రమత్తం
నల్లగొండ సంఘటనల నేపథ్యంలో సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన ఎస్పీ నిజామాబాద్ క్రైం : నల్లగొండ జిల్లాలో జరిగిన కాల్పుల సంఘటన, ఎన్కౌంటర్ నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యూరు. ఒకప్పుడు పోలీసులకు నక్సలైట్లకు మధ్య కాల్పులు జరిగేవి. ఇప్పు డు పోలీసులకు దుండగులకు మధ్య కాల్పులు జరుగటం సంచలనం రేపుతోంది. గతంలో తీవ్రవాదుల వద్ద మారణాయుధాలు ఉండటంతో పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించేవారు. ఇప్పుడు దుండగులు, చిల్లర ముఠాలు సైతం తుపాకులు వాడుతుండటంతో పోలీసుశాఖ విస్తుపోతోంది. నల్లగొండ జిల్లాలో దుండగులు దేశవాళీ తుపాకులతో కాల్పులు జరపటంతో పోలీసుశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనిని దృష్టిలో పె ట్టుకుని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. అనుమానిత ప్రాంతాలలో నిఘా ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల క్రితం సూర్యాపేట్ బస్టాండ్‌లో జరిగిన కాల్పులలో గాయపడిన సీఐ మొగులయ్యది మన జిల్లానే. జుక్కల్ మండలం ఖండేబల్లేర్ గ్రామానికి చెందిన మొగులయ్య, హోంగార్డు కిషోర్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. జిల్లాకు పొరుగు రాష్ట్రాల సరిహద్దులు సమీపంలో ఉండడంతో పోలీసు అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల రాకపోకలపై దృష్టి సారిస్తున్నారు. నల్ల గొండ జిల్లాలో జరిగిన రెండు సంఘటనల క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా పోలీసులకు తగు సూచనలు జారీ చేసింది. దీంతో జిల్లాలోని అన్ని ఠాణాలకు సమా చారం పంపించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. -
ఆజాద్ ఎన్కౌంటర్ కేసును తిరస్కరించిన కోర్టు
ఆదిలాబాద్ క్రైం: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అజాద్, జర్నలిస్టు హేమచంద్ర పాండేల ఎన్కౌంటర్ కేసులో పోలీసులను విచారించాలని ఆజాద్ భార్య పద్మ వేసిన ప్రొటెక్టు పిటిషన్‌ను ఆదిలాబాద్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు (ప్రథమ శ్రేణి న్యాయమస్థానం) తిరస్కరించింది. మంగళవారం పద్మ, ఆమె తరపు న్యాయవాది సురేష్‌కుమార్‌లు ఆజాద్ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరయ్యారు. ఆజాద్‌ది బూటకపు ఎన్కౌంటర్ అని, ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న 29 మంది పోలీసులపై విచారణ చేపట్టాలని పద్మ 2013 జూలై 2న కోర్టులో ప్రొటెక్ట్ పిటిషన్‌ను వేశారు. రెండేళ్ల అనంతరం పోలీసులను విచారించడం వీలుకాదంటూ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. -
ఆ ఎన్‌కౌంటర్‌పై అమికస్ క్యూరీ: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లాలో 2008లో ఇద్దరు యువతులపై యాసిడ్ దాడికి పాల్పడిన యువకులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన కేసులో కోర్టు సహాయకారి (అమికస్ క్యూరీ)గా ఓ న్యాయవాదిని నియమించాలని హైకోర్టు సోమవారం నిర్ణయించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 2008, డిసెంబర్ 13న వరంగల్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇంటికి వెళుతున్న ఇద్దరు యువతులపై యాసిడ్ దాడి చేశారంటూ ఎస్.శ్రీనివాసరావు, మరో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత వారిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ పౌర హక్కుల నేత చైతన్య 2008లో హైకోర్టును ఆశ్రయించారు. -
అమిత్ షాకు సీబీఐ క్లీన్చిట్
ఇషత్ ్రజహాన్ ఎన్కౌంటర్ కేసులో ఊరట అహ్మదాబాద్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సన్నిహితుడు, గుజరాత్ మాజీ హోం మంత్రి అమిత్ షాకు ఊరట. 2004లో సంచలనం సృష్టించిన ఇషత్ ్రజహాన్ ఎన్కౌంటర్ కేసులో షాకు సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. ‘‘ఆ ఉదంతంలో షా పాత్రను నిరూపించేందుకు తగినన్ని సాక్ష్యాధారాల్లేవు. అందుకే ఆయనపై చార్జిషీట్ దాఖలు చేయలేదు. ఎఫ్ఐఆర్లో కూడా ఆయన పేరు చేర్చలేదు’’ అని సీబీఐ ఇన్స్పెక్టర్ విశ్వాస్‌కుమార్ మీనా బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ కేసులో షాతో పాటు అప్పటి అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్ కౌశిక్‌లపై నేరాభియోగాలు మోపాలంటూ ఆ ఎన్కౌంటర్లో ఇషత్‌త్రో పాటు మరణించిన జావెద్ షేక్ అలియాస్ ప్రాణేశ్ పిళ్లై తండ్రి గోపీనాథ్ పిళ్లై పెట్టుకున్న అర్జీని కూడా కొట్టేయాల్సిందిగా కోరారు. 2004 జూన్ 15న జరిగిన ముంబైకి చెందిన కాలేజీ విద్యార్థిని ఇషత్ ్రజహాన్ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. ఆమెతో పాటు ప్రాణేశ్ పిళ్లై, అమ్జదలీ అక్బరలీ రాణా, జీషన్ జోహర్లను కూడా గుజరాత్ పోలీసులు కాల్చి చంపారు. వారంతా లష్కరే తోయిబా ఉగ్రవాదులని, మోడీని చంపేందుకు కుట్ర పన్నారని వాదించారు. కానీ అది నిజం కాదని, వారిది బూటకపు ఎన్కౌంటరని 2013లో సీబీఐ తేల్చడమే గాక ఏడుగురు గుజరాత్ పోలీసు అధికారులపై అభియోగాలు నమోదు చేసింది. -
అమిత్ షాకు సీబీఐ క్లీన్ చిట్!
ఆహ్మాదాబాద్: ఇష్రాంత్ జాహన్, మరో ముగ్గురి ఎన్ కౌంటర్ కేసులో గుజరాత్ మాజీ హోంమంత్రి అమిత్ షాకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. అమిత్ షాపై చార్జీషీట్ దాఖలు చేయడానికి సరైన ఆధారాలు లభించలేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ కేసులో అమిత్ షాకు ప్రమేయం ఉన్నట్టు సాక్ష్యాలు లభించలేదని.. అందుకే చార్జిషీట్ దాఖలు చేయలేదని సీబీఐ కోర్టుకు సీబీఐ అధికారి విశ్వాస్ కుమార్ మీనా తెలిపారు. అమిత్ షా పై వచ్చిన ఆరోపణలకు సాక్ష్యాలు లభించకపోవడంతో ఎఫ్ఐఆర్ లో ఆయన పేరును పేర్కొనలేదని, అందుకే సీబీఐ చార్జిషీట్ లో ఆయన పేరును పెట్టలేదని సీబీఐ తెలిపింది. ఎన్ కౌంటర్ లో మరణించిన జావేద్ షేక్ అలియాస్ ప్రణేశ్ పిళ్లై తండ్రి గోపినాథ్ పిళ్లై సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న షా, మాజీ కమిషనర్ కేఆర్ కౌశిక్ లను విచారించాలని పిటిషన్ దాఖలు చేశారు. -
సీబీఐ చీఫ్ వ్యాఖ్యలపై దుమారం
ఇషత్ర్ కేసులో అమిత్ షాను ఇరికిస్తే యూపీఏ సంతోషించేదని రంజిత్ అన్నట్లు ఆంగ్లపత్రిక కథనం ఖండించిన సీబీఐ న్యూఢిల్లీ: ఇషత్ ్రజహాన్ ఎన్కౌంటర్ కేసు చార్జిషీటులో బీజేపీ నేత అమిత్ షా పేరును నిందితునిగా చేర్చినట్లయితే యూపీఏ ప్రభుత్వం సంతోషించేదని సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా వ్యాఖ్యానించిట్టుగా ఢిల్లీకి చెందిన ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనం వివాదానికి దారితీసింది. అయితే దీనిని సీబీఐ ప్రతినిధి ఖండించారు. సిన్హా అలాంటి వ్యాఖ్యలేమీ చేయలేదని స్పష్టం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి అమిత్ షా సన్నిహితుడనే విషయం తెలిసిందే. ఇషత్ ్రఎన్‌కౌంటర్ వ్యవహారంలో మాజీ హోంమంత్రి అమిత్‌షా(ఎన్కౌంటర్ జరిగిన సమయంలో హోంమంత్రిగా ఉన్నారు)ను ప్రశ్నించినప్పటికీ ఆయన పేరును సీబీఐ చార్జిషీటులో పేర్కొనలేదు. అయితే ఆయన పేరును నిందితునిగా చేర్చినట్లయితే యూపీఏ ప్రభుత్వం సంతోషించేదని, కానీ తాము సాక్ష్యాధారాలకు అనుగుణంగా వ్యవహరించామని, అమిత్ షాను ప్రాసిక్యూట్ చేయతగిన సాక్ష్యాలేవీ లేవని కనుగొన్నట్టు సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా పేర్కొన్నట్టు ఢిల్లీకి చెందిన ఓ ఆంగ్ల బిజినెస్ దినపత్రిక తన కథనంలో పేర్కొంది. దీనిపై సీబీఐ అధికార ప్రతినిధి ఒకరు శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సీబీఐ డెరైక్టర్ అటువంటి వ్యాఖ్యలేమీ చేయలేదని, ఆయన వ్యాఖ్యలను తప్పుగా పేర్కొన్నారని స్పష్టం చేశారు. సీబీఐ నిష్పాక్షికమైన, రాజకీయాలతో సంబంధం లేని సంస్థ అని తెలిపారు. ఇషత్ ్రజహాన్ కేసులో సీబీఐ నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపిందని వివరించారు. ఇదిలా ఉండగా అమిత్ షాను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిని దెబ్బతీయడానికి సీబీఐపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ప్రయత్నించిందనేందుకు సీబీఐ డెరైక్టర్ చేసిన వ్యాఖ్యలు నిదర్శనమని బీజేపీ ప్రతినిధి నిర్మలా సీతారామన్ విమర్శించారు. దీనిపై జనతాదళ్(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ స్పందిస్తూ.. రాజకీయపార్టీల గురించి ఇంతవరకు ఏ సీబీఐ డెరైక్టర్ కూడా ఇటువంటి ప్రకటనలు చేయలేదని మండిపడ్డారు. ఆయన తనకున్న అధికార పరిధుల మేరకు వ్యవహరించాలని హితవు పలికారు.