
వికాస్ దూబేను అరెస్టు చేసిన నాటి దృశ్యం
లక్నో: గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌కు సంబంధించి యూపీ పోలీసులకు క్లీన్‌చిట్ లభించింది. ఎలాంటి ఆధారాలు లేనందున క్లీన్‌చిట్ ఇచ్చినట్లు బీఎస్ చౌహాన్ కమిషన్ చెప్పింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి బీఎస్ చౌహాన్ నేతృత్వంలో అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి, యూపీ మాజీ డీజీపీల కమిషన్ ఈ కేసును విచారించింది. గ్యాంగ్‌స్టర్ దూబే పోలీసులపై దాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించాడు.
అయితే పోలీసులకు వ్యతిరేక సాక్ష్యాలు ఉంటే చూపించాల్సిందిగా మీడియాలో కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పోలీసులకు క్లీన్‌చిట్ ఇచ్చింది. దూబే మరణానికి ముందు ఆయన్ను అరెస్టుచేసేందుకు 2020 జూలై 3న కాన్పూర్ వెళ్లిన 8 మంది పోలీసులు హత్యకు గురవ్వడంతో ఈ కేసు సంచలనంగా మారింది. కమిషన్ నివేదికను రాష్ట్రప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు అందించనుంది.
చదవండి: ఆక్సిజన్ కొరత సంక్షోభం: కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment