నేనే చంపేద్దామనుకున్నా.. | I would have killed Vikas Dubey His Wife Richa Shocking Comments | Sakshi
Sakshi News home page

నేనే చంపేసేదాన్ని: దుబే భార్య సంచలన వ్యాఖ్యలు

Published Fri, Jul 24 2020 1:31 PM | Last Updated on Fri, Jul 24 2020 8:09 PM

I would have killed Vikas Dubey His Wife Richa Shocking Comments - Sakshi

లక్నో : ఉత్తర ప్రదేశ్‌ పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురైన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే భార్య రిచా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది మంది పోలీసులను చంపి వారి కుటుంబాల్లో విషాదం నింపిన తన భర్తపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తానే తన భర్తను చంపేద్దాం అనుకున్నానని, దుబే ఆకృత్యాలన్నీ తనకు తెలుసని తెలిపారు. దుబే ఎన్‌కౌంటర్‌ అనంతరం.. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘ఎనిమిది మంది పోలీసులను చంపి దుబే వారి కుటుంబాలను నాశనం చేశాడు. మేం సమాజంలో మా ముఖం చూపించుకోలేకపోతున్నాం. నేనే అతనిని షూట్‌ చేసి చంపేసే దాన్ని. జూలై 3 తేదీ అర్థరాత్రి  రెండింటి సమయంలో దుబే తనని పిల్లల్ని తీసుకొని ఊరి నుంచి వెళ్లి పోవాలని చెప్పాడు. పోలీసులు పట్టుకోవడానికి వస్తున్నారని చెప్పి.. తప్పించుకోవాలని ప్రయత్నించాడు. అయితే దుబేను తిట్టి ఇక్కడి నుంచి వెళ్లిపోమని పంపించాను. ఆ తరవాత పిల్లలతో కలిసి లక్నోలోని బంగ్లాలో తలదాచుకున్నాను’ అని పేర్కొన్నారు. (ఆయన మంచి భర్త, తండ్రి:‌ దుబే భార్య)

చనిపోవడానికి కొన్ని రోజుల ముందు దుబేకు యాక్సిడెంట్‌ అయ్యిందని, దాంతో మెదడులో ఒక బబూల్‌ వచ్చిందని రీచా చెప్పింది. దీంతో అతనికి కోపం బాగా పెరిగిందని, చనిపోవడానికి కొన్ని రోజుల ముందు దుబే వైద్యం ఆపేశాడని రీచా వివరించారు. దుబే ఏం పనిచేస్తాడు, ఎవరితో అతనికి  సంబంధాలు ఉన్నాయో అన్నీ తనకు తెలిసిందని వెల్లడించింది. తన బాధ అంతా పిల్లల గురించే అని అత్తింటి వారు, పుట్టింటి వారు కానీ ఎవరు తమ పిల్లల్ని చూసుకోరని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా దుబేను జూలై 9 వ తేదీన పోలీసులు అరెస్ట్‌ చేసి, తప్పించుకోబోయాడు అనే కారణంతో జూలై 10వ తేదీన ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే.  ( తీవ్ర రక్తస్రావం, షాక్‌తో దుబే మృతి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement