అమిత్ షాకు సీబీఐ క్లీన్ చిట్!
అమిత్ షాకు సీబీఐ క్లీన్ చిట్!
Published Wed, May 7 2014 5:18 PM | Last Updated on Mon, May 28 2018 3:58 PM
ఆహ్మాదాబాద్: ఇష్రాంత్ జాహన్, మరో ముగ్గురి ఎన్ కౌంటర్ కేసులో గుజరాత్ మాజీ హోంమంత్రి అమిత్ షాకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. అమిత్ షాపై చార్జీషీట్ దాఖలు చేయడానికి సరైన ఆధారాలు లభించలేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ కేసులో అమిత్ షాకు ప్రమేయం ఉన్నట్టు సాక్ష్యాలు లభించలేదని.. అందుకే చార్జిషీట్ దాఖలు చేయలేదని సీబీఐ కోర్టుకు సీబీఐ అధికారి విశ్వాస్ కుమార్ మీనా తెలిపారు.
అమిత్ షా పై వచ్చిన ఆరోపణలకు సాక్ష్యాలు లభించకపోవడంతో ఎఫ్ఐఆర్ లో ఆయన పేరును పేర్కొనలేదని, అందుకే సీబీఐ చార్జిషీట్ లో ఆయన పేరును పెట్టలేదని సీబీఐ తెలిపింది. ఎన్ కౌంటర్ లో మరణించిన జావేద్ షేక్ అలియాస్ ప్రణేశ్ పిళ్లై తండ్రి గోపినాథ్ పిళ్లై సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న షా, మాజీ కమిషనర్ కేఆర్ కౌశిక్ లను విచారించాలని పిటిషన్ దాఖలు చేశారు.
Advertisement