Ishrat Jahan
-
హిజాబ్ ధరించి హిందూ కార్యక్రమానికి వెళతావా?
కోల్‌కతా : హనుమాన్ చాలీసా పఠనానికి హాజరైన బీజేపీ నేత, ట్రిపుల్ తలాఖ్ పిటిషనర్ ఇష్రత్ జహాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. హనుమాన్ చాలీసా పఠనానికి హిజాబ్ ధరించి వెళ్లినందుకు చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. కోల్‌కతాలో నివసిస్తున్న ఇష్రత్ జహాన్ మంగళవారం ఇంటి దగ్గర్లోని సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమానికి హిజాబ్ ధరించి హాజరయింది. దీంతో ఆగ్రహించిన కొందరు వ్యక్తులు బుధవారం ఇష్రత్ జహాన్ ఇంటికి వస్తున్న సమయంలో ఆమెను చుట్టుముట్టారు. ఆమెపై దూషణల పర్వానికి దిగారు. నువ్వు చేసిన పని వల్ల ముస్లిం సమాజాన్ని కించపరిచావని ఆరోపించారు. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టమంటూ భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో ఇష్రత్ జహాన్ తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. తనపై బెదిరింపులకు దిగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయం గురించి ఇష్రత్ జహాన్ మాట్లాడుతూ.. ‘మా బావ, ఇంటి యజమాని సైతం అసభ్యంగా దూషించారు. ఇల్లు ఖాళీ చేయాలని వేధిస్తున్నారు. నన్ను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఏ క్షణమైనా నాకు హాని తలపెట్టవచ్చు ’ అని వాపోయారు. దీనిపై గొలాబరి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. ‘తనకు నచ్చినట్టుగా ఉండటంలో తప్పేంటి?’ అని ప్రశ్నించారు. అయినా మమతా బెనర్జీ, టీఎంసీ నాయకులు నమాజ్ ఇచ్చినపుడు ప్రశ్నించని నోళ్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయో అర్థం కావట్లేదని మండిపడ్డారు. కాగా ట్రిపుల్ తలాక్ కేసు వేసిన ఐదుగురు పిటిషనర్లలో ఇష్రత్ జహాన్ ఒకరు. ఆమెకు ఒక కొడుకుతో పాటు 14 సంవత్సరాల కూతురు కూడా ఉంది. ఆమె భర్త 2014లో దుబాయ్‌లో ఫోన్ నుంచి ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు తీసుకోగా ఆమె అపెక్స్ కోర్టును ఆశ్రయించింది. 2017 ఆగస్టు 22న సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్‌ను కొట్టివేసిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం జనవరి 1న జహాన్ బీజేపీలో చేరారు. -
ధీరవనితలు
న్యూఢిల్లీ: ‘ట్రిపుల్ తలాక్’ రూపంలో తాము ఎదుర్కొంటున్న కష్టాలు, వివక్షకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వారంతా ముస్లిం మహిళలే. ఈ అంశానికే సంబంధించిన మొత్తం ఏడు పిటిషన్లను ఒకచోట చేర్చి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. షయారా బానో (36)తోపాటు నలుగురు మహిళలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లు, ఆరెస్సెస్ అనుబంధ రాష్ట్రీయవాదీ ముస్లిం మహిళా సంఘం, భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ వేసిన పిటిషన్లను కలిసి సుప్రీంకోర్టు విచారించింది. ► షయారా బానో 2015 అక్టోబర్‌లో ఒక లేఖ ద్వారా షయారా బానో భర్త రిజ్వాన్ అహ్మాద్ ట్రిపుల్ తలాక్ చెప్పడంతో పాటు పిల్లలను తన వెంట తీసుకెళ్లిపోయాడు. దీనిపై బానో బహిరంగంగానే మండిపడింది. 3 నెలల విరామాన్ని (ఇద్దత్) పాటించకుండా విడాకులు ఇవ్వడం అక్రమం, రాజ్యాంగ విరుద్ధమని వాదించింది. అత్తమామలు తనకు బలవంతంగా మాత్రలు ఇవ్వడం వల్ల ఆరుసార్లు గర్భస్రావమై, తన ఆరోగ్యంపై దు ష్ప్రభావం చూపిందని బానో సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఆమె వేసిన పిటీషన్‌పై కేంద్ర ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. ► ఇష్రత్ జహాన్ పశ్చిమ బెంగాల్ హౌరాకు చెందిన ఇష్రత్ జహాన్‌కు 2015 ఏప్రిల్‌లో భర్త ముర్తజా దుబాయ్ నుంచి ఫోన్లో మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులిచ్చారు. దీనిని ఆమె తమ పిటిషన్లో ప్రశ్నించారు. మరో యువతిని పెళ్లాడిన ముర్తజా.. తన నలుగురు పిల్లలనూ తీసుకెళ్లినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ద్వారా తలాక్ తనకు సమ్మతం కాదని, పిల్లలను తనకు అప్పగించాలని, వారిని పెంచి పెద్ద చేసేందుకు అవసరమైన భరణాన్ని ఇప్పించాలని కోర్టును ఆశ్రయించారు. ► ఆఫ్రీన్ రెహ్మాన్ 2014లో వివాహ సంబంధాల పోర్టల్ (మెట్రిమోనియల్ సైట్) ద్వారా జైపూర్‌కు చెందిన సయ్యద్ అషార్ అలీ వార్సీతో ఆఫ్రీన్ రెహ్మాన్ వివాహమైంది. పెళ్లి అయిన రెండు, మూడునెలలకే కట్నం కోసం అత్తమామల వేధింపులు అధికమయ్యాయి. అదనపు కట్నం కూడా వారు తనను శారీరకంగా కూడా హింసించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 2015 సెప్టెంబర్‌లో తనను ఇంటి నుంచి వెళ్లగొట్టారన్నారు. 2016 జనవరి 27న పుట్టింట్లో ఉన్న ఆమెకు స్పీడ్‌పోస్ట్ ద్వారా విడాకులు అందాయి. ఈ పద్ధతిలో విడాకులు పంపించడం తనకు ఆమోదయోగ్యం కాదంటూ ఆమె పిటిషన్ వేశారు. ► ఫరా ఫైజ్ ట్రిపుల్ తలాక్ కేసు పిటిషనర్లలో సుప్రీంకోర్టు న్యాయవాది ఫరా ఫైజ్ ఒకరు. ముమ్మారు తలాక్ పద్ధతి ఖురాన్లో విడాకులను గుర్తించేందుకు ఉద్దేశించినది కాదనేది ఆమె వాదన. ఆరెస్సెస్ అనుబంధ రాష్ట్రీయవాదీ ముస్లిం మహిళా సంఘానికి జాతీయ గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. షరియా చట్టం కింద ముస్లిం మహిళలకు భద్రత ఉన్నా ఖురాన్లో ప్రస్తావన లేని ట్రిపుల్ తలాక్, నిఖా హలాలాలకు పర్సనల్‌లా బోర్డు ప్రాధాన్యతనిస్తోందని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ► అతియా సాబ్రీ 2012లో వివాహమైన అతియా సాబ్రీకి ఒక కాగితంపై ‘తలాక్’ అంటూ మూడుసార్లు రాసి ఆమె భర్త విడాకులిచ్చారు. ఇలాంటి విడాకులు న్యాయబద్ధం కాదంటూ ఆమె పిటిషన్ వేశారు. తనకు చిన్నవయసున్న ఇద్దరు ఆడ పిల్లలున్నారని, వారిని పెంచి పెద్దచేయాల్సిన బాధ్యత తనపై ఉన్నందున న్యాయం చేయాలని కోర్టుకు విజ్ఞప్తిచేశారు. ► గుల్షన్ పర్వీన్ 2015లో తల్లిదండ్రులను కలిసేందుకు పుట్టింటికి వచ్చిన తనకు పది రూపాయల స్టాంప్ పేపర్‌పై విడాకుల పత్రం (తలాక్ నామా) పంపించి భర్త విడాకులు ఇవ్వడాన్ని యూపీలోని రాంపూర్‌కు చెందిన గుల్షన్ పర్వీన్ కోర్టులో సవాల్ చేశారు. ఈ విడాకులకు అంగీకరించకపోవడంతోపాటు భర్త నోటీసునూ ఆమె తిరస్కరించారు. -
ఇష్రత్ జహాన్ కేసు.. పిటిషనర్ మృతి
తిరువనంతపురం : ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ కేసు పిటిషనర్ గోపినాథ్ పిళ్లై మృతి చెందారు. కేరళలో అలపుజ్జా వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఘటనలో 76 ఏళ్ల పిళ్లై తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. కాగా, గోపినాథ్ పిళ్లై... 2004 గుజరాత్ ఎన్కౌంటర్ మృతుల్లో ఒకరైన జావెద్ షేక్ అలియాస్ ప్రణేశ్ పిళ్లై తండ్రి. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన హత్యకు కుట్రపన్నారంటూ ముంబైకి చెందిన19 ఏళ్ల విద్యార్థిని ఇష్రాత్ జహాన్, మరో ముగ్గురిని 2004, జూన్ 15న ఎన్కౌంటర్ చేశారు. మృతులను జావెద్ గులాం షేక్(ప్రణేశ్ పిళ్లై), అంజాద్ అలీ రానా, జీషన్ జోహార్ గా గుర్తించారు. అయితే తన కొడుకు అమాయకుడని.. ఇది పక్కా ఫేక్ ఎన్కౌంటర్ అంటూ వాదిస్తూ గోపినాథ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత మిగతా బాధిత కుటుంబాలు కూడా ఆయను తోడయ్యాయి. మోదీ ప్రభుత్వం సానుభూతి పొందటం కోసమే అమాయకులైన వారిని చంపేశారని పిటిషనర్లు అప్పుడు వాదనలు వినిపించారు. (ఇష్రత్‌పై లాలూ కొడుకు ఆసక్తికర వ్యాఖ్యలు) ఇదిలా ఉంటే ఈ కేసును దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఇదో ఫేక్ ఎన్కౌంటర్ అని తేల్చి ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గుజరాత్ పోలీసులు, సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) సంయుక్తంగా ఈ ఎన్కౌంటర్ లో పాల్గొన్నాయని చార్జిషీటులో సీబీఐ పేర్కొంది. పలువురు ఉన్నతాధికారుల పేర్లను ఇందులో చేర్చి దర్యాప్తు కొనసాగించింది. -
ఆమె బీజేపీలో చేరారు!
-
ఆమె బీజేపీలో చేరారు!
కోల్‌కతా: ట్రిపుల్ తలాక్ కేసులో ఒక పిటిషనర్ అయిన ఇష్రత్ జహాన్ తాజాగా బీజేపీలో చేరారు. ఆదివారం హౌరాలోని బీజేపీ కార్యాలయంలో ఆమె లాంఛనంగా పార్టీలో చేరారని బీజేపీ బెంగాల్ జనరల్ సెక్రటరీ సాయంతన్ బసు మీడియాకు తెలిపారు. ఆమెను సత్కరించేందుకు త్వరలోనే రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. ట్రిపుల్ తలాక్ వ్యతిరేకంగా పోరాడిన ఐదుగురు పిటిషనర్లలో ఇష్రత్ ఒకరు. దుబాయ్ నుంచి ఆమె భర్త ఫోన్లో మూడుసార్లు ’తలాక్’ అని చెప్పడం ద్వారా విడాకులు ఇచ్చాడు. దీనికి వ్యతిరేకంగా ఆమె న్యాయపోరాటం చేశారు. గత ఏడాది ఆగస్టు 22న సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమంటూ తేల్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా బిల్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాను బీజేపీలో చేరడంపై ఇష్రత్ మీడియాతో ఇంకా స్పందించలేదు. -
ఇష్రాత్ జహాన్ ఫైలు మాయంపై కేసు
న్యూఢిల్లీ: ఇష్రాత్ జహాన్ కేసులో ఫైలు మిస్సయిన ఘటనలో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక్కడి సంసద్ మార్గ్ లో ఉన్న పోలీసు స్టేషన్ అధికారులపై ఉన్నతాధికారులు కేసును నమోదు చేసినట్టు ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ జితిన్ నార్వల్ తెలిపారు. 2004లో ఇష్రాత్ జహాన్, జావేద్ షేక్, జీషన్ జోహార్, అమజద్ అలీ రానాను అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఎన్కౌంటర్ చేశారు. ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని ఇష్రాత్ తల్లి షామియా కౌశర్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై 2013లో సీబీఐ తొలి ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. -
చిదంబరం తప్పించుకోలేరు
ఇష్రాత్ కేసుపై బీజేపీ న్యూఢిల్లీ: ఇషత్ జహాన్ ఎన్కౌంటర్ కేసు పత్రాల అదృశ్యానికి సంబంధించి మీడియా బయటపెట్టిన ‘సాక్షికి శిక్షణ’ ఆధారాలతో నాటి హోంమంత్రి చిదంబరం తప్పించుకోలేరని బీజేపీ స్పష్టం చేసింది. ఇషత్ ఉగ్రవాదన్న నిజాన్ని దాయడానికే ఆయన కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో మార్పులు చేశారని ఆరోపించింది. కేసు ‘డాక్యుమెంట్ల మిస్సింగ్’పై విచారణ జరుపుతున్న అదనపు కార్యదర్శి బీకే ప్రసాద్ గురువారం తన నివేదికను సమర్పించారు. అయితే ప్రసాద్... ‘పత్రాల అదృశ్యం’పై విచారణలో ఏం అడుగుతారు... ఏం సమాధానం చెప్పాలన్నది 2011లో హోం శాఖ డెరైక్టర్ అశోక్‌కుమార్‌కు బోధిస్తున్నట్టు ఆంగ్ల పత్రిక ఒకటి ఆధారాలతో బయటపెట్టింది. వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియోను తన వెబ్సైట్లో ఉంచింది. కాగా, ఈ కేసులో బీజేపీ ప్రభుత్వం తప్పుడు వివాదాలను రేపుతోందని చిదంబరం ఆరోపించారు. -
మోదీని ఇబ్బంది పెట్టేందుకే!
న్యూఢిల్లీ: ఇషత్ర జహాన్ ఎన్కౌంటర్ విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం వాస్తవాలను మాయం చేసి.. అప్పటి గుజరాత్ సీఎం నరేంద్రమోదీని ఇబ్బందులు పెట్టేందుకే ప్రయత్నించిందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం పార్లమెంటులో తెలిపారు. ఇషత్ లష్కరే తోయిబా ఉగ్రవాది అనివిచారణలో వెల్లడైనా.. మోదీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే వాస్తవాలను పక్కన పెట్టారని ఆరోపించారు. ఇషత్ర కేసుపై సావధాన తీర్మానంపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా యూపీఏ ప్రభుత్వం వాస్తవాలను మరుగున పడేసిందని రాజ్‌నాథ్ వెల్లడించారు. ఓ పక్క విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నా.. చిదంబరంపై దాడిని కొనసాగించారు. ‘ఉగ్రవాదానికి రంగు, మతం, జాతి ఉండవు. కానీ సెక్యులర్ అని చెప్పుకునే వాళ్లు ఉగ్రవాదానికి రంగు పూస్తారు.’ అని రాజ్‌నాథ్ తెలిపారు. ముంబై కోర్టు ముందు డేవిడ్ హెడ్లీ ఇచ్చిన వాంగ్మూలం, యూపీఏ సర్కారు ఆగస్టు6, 2009న గుజరాత్ హైకోర్టు ముందు దాఖలు చేసిన తొలి అఫిడవిట్ వంటి వాటిని రాజ్‌నాథ్ ప్రస్తావించారు. ‘హెడ్లీ వెల్లడించింది.. ఇషత్ర లష్కరే ఉగ్రవాదని తేల్చి చెప్పిన రెండో ఆధారం. మొదటిది.. యూపీఏ తొలి అఫిడవిట్లోనే స్పష్టమైంది’ అని అన్నారు. అప్పటి అటార్నీ జనరల్ జీఈ వాహనవతికి.. మాజీ హోం సెక్రటరీ జీకే పిళ్లై రాసిన లేఖ, ఈ కేసుకు సంబంధించిన ఇతర కీలక డాక్యుమెంట్లను కాంగ్రెస్ మాయం చేసిందన్నారు. దీనిపై తమ శాఖలో అంతర్గత విచారణకు ఆదేశించామని.. బాధ్యులపై సరైన చర్యలు తప్పవని హోం మంత్రి హెచ్చరించారు. -
పాత కేసు-కొత్త మలుపు
రాజకీయ ప్రయోజనాలు, వ్యూహాలు, ఎత్తుగడలు వచ్చి చేరితే ఎలాంటి విషయమైనా ఎంత జటిలంగా మారుతుందో చెప్పడానికి ఇష్రాత్ జహాన్ ఎన్కౌంటర్ కేసు ప్రబలమైన ఉదాహరణ. 2004లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల బాలిక ఇష్రాత్ జహాన్ మరో ముగ్గురితోపాటు ఎన్కౌంటర్లో మరణించిన ఉదంతం ఇన్నేళ్ల తర్వాత కూడా మిస్టరీగా మిగిలిపోవడమేకాక దాని చుట్టూ కొత్త వివాదాలు ముసురుకుంటున్నాయి. తన కుమార్తెను అన్యాయంగా చంపి, ఆమెపై ఉగ్రవాది ముద్ర వేశారని...ఇందుకు కారకులైనవారిని శిక్షించాలని ఇష్రాత్ తల్లి దాఖలు చేసిన పిటిషన్ మాత్రం దారీతెన్నూ లేకుండా మిగిలిపోయింది. ఈ కేసులో హైకోర్టు ఎదుట 2009లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దాఖలు చేసిన రెండు రకాల అఫిడవిట్లు ఈ కొత్త వివాదాలకు మూలం. ఇష్రాత్ జహాన్ లష్కరే తొయిబా సంస్థకు చెందిన ఉగ్రవాది అని మొదటి అఫిడవిట్ చెప్పగా...రెండో అఫిడవిట్ ఆ సంగతిని అసలు ప్రస్తావించలేదు. ఆనాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం జోక్యం కారణంగానే ఈ మార్పు చోటు చేసుకున్నదని, ఈ విషయంలో తనను సంప్రదించలేదని ఆనాటి కేంద్ర హోంశాఖ కార్యదర్శి జీకే పిళ్లై అంటుంటే...నరేంద్ర మోదీ, అమిత్ షాలను రాజకీయంగా దెబ్బతీసేందుకే చిదంబరం ఈ పని చేశారని బీజేపీ ఆరోపిస్తున్నది. ఇదే అదునుగా ఈ కేసుకు సంబంధించి పోలీసు అధికారులపై సాగుతున్న ప్రాసిక్యూషన్ చర్యలన్నిటినీ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు తీసుకుంటున్న మలుపులు, కొత్తగా వచ్చి చేరుతున్న వివాదాలు సాధారణ పౌరులను ఆశ్చర్యపరుస్తాయి. తన కుమార్తెను బూటకపు ఎన్కౌంటర్లో చంపారని ఒక తల్లి చేసిన ఆరోపణకు సంబంధించిన కేసు ఇన్నేళ్లయినా తేలకపోగా... ఆమె ఉగ్రవాది అవునా, కాదా అనే అంశం చుట్టూ చర్చ నడుస్తోంది. బీజేపీ ఆరోపిస్తున్నట్టు ఈ కేసులో చిదంబరం వ్యవహార శైలి అనుమానించదగిందే కావొచ్చు. ఆయన లక్ష్యం నరేంద్రమోదీ, అమిత్ షాలే అయి ఉండొచ్చు. పిళ్లై అంటున్నట్టు ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అఫిడవిట్‌ను మార్చి ఉండొచ్చు. ఆ అంశంలో ఎవరి దోషమెంతో తేల్చి దర్యాప్తు సంస్థలను, నిఘా సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకున్న వైనాన్ని, అందుకోసం అడ్డగోలుగా వ్యవహరించిన తీరునూ బయటపెడితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అందువల్ల దర్యాప్తు సంస్థల, నిఘా సంస్థల పని విధానం మెరుగుపడి, అందులో రాజకీయ జోక్యం తగ్గితే అది ఆహ్వానించదగ్గ పరిణామమే. మరోపక్క చిదంబరంపై కోర్టు ధిక్కార నేరం కింద విచారణ జరపాలన్న పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ఇష్రాత్ మరణం మాటేమిటి? ఆమె నిజమైన ఎన్కౌంటర్లో మరణించిందో లేక నకిలీ ఎన్కౌంటర్లో చనిపోయిందో తేలవలసిన అవసరం లేదా? గుజరాత్ పోలీసుల కథనం ప్రకారం ఇష్రాత్తోపాటు మరో ముగ్గురు యువకులు అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీని హతమార్చడానికి బయల్దేరారు. ముందుగానే ఈ సమాచారం అందుకున్న తాము వారిని అడ్డగించడానికి ప్రయత్నించినప్పుడు ఎన్కౌంటర్ చోటు చేసుకున్నదని పోలీసులు చెబుతున్నారు. అయితే 2009లో అహ్మదాబాద్ మెట్రొపాలిటన్ మేజిస్ట్రేట్ ఇచ్చిన దర్యాప్తు నివేదికగానీ, 2011లో పోలీసుల ఆధ్వర్యంలోని సిట్ ఇచ్చిన నివేదికగానీ ఈ కథనంతో విభేదించాయి. ఆ నలుగురినీ పోలీసులు ఎలాంటి ప్రతిఘటనా లేకుండానే కాల్చి చంపారని తేల్చాయి. పర్యవసానంగా పలువురు పోలీసు ఉన్నతాధికారులతో సహా 21మందిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. మరో అయిదేళ్లు గడిచినా ఆ కేసులో విచారణ ఇంతవరకూ ఒక కొలిక్కి రాలేదు. ఇష్రాత్ జహాన్ ఉగ్రవాది అని చెప్పడానికి పోలీసులు ప్రస్తుతం అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ వెల్లడించిన విషయాలను ఆధారంగా చూపుతున్నారు. 2005లో లష్కరే అధినేత జాకీవుర్ రెహ్మాన్ లఖ్వీ వద్ద ఇష్రాత్ పేరు ప్రస్తావనకొచ్చిందని 2010లో హెడ్లీ జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులకు వాంగ్మూలం ఇచ్చాడు. ఈమధ్యే ముంబై కోర్టుకు ఇచ్చిన సాక్ష్యంలో మరోసారి ఆమెకు లష్కరే సంస్థతో సంబంధాలున్నాయని అన్నాడు. ఈ సంగతిని చర్చలోకి తీసుకురావడంద్వారా ఇష్రాత్‌ను కాల్చిచంపడం సబబేనన్న అభిప్రాయాన్ని కలగజేయడానికి పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆమె తల్లి అంటున్నది. మగదిక్కులేని తమ కుటుంబాన్ని పోషించడం కోసం ఇష్రాత్ చదువుకుంటూనే పిల్లలకు ట్యూషన్లు చెప్పేదని, ఆ ఆదాయం సరిపోక తమ కుటుంబానికి తెలిసిన జావేద్ అనే వ్యక్తి ద్వారా వేరే పనిలో చేరిందని ఆమె చెబుతున్నారు, అలా చేరిన నెలన్నర లోపే ఈ ఘటన చోటు చేసుకున్నదంటున్నారు. ఇష్రాత్పై అంతకు ముందెన్నడూ ఎలాంటి క్రిమినల్ ఆరోపణలు లేవని ఆమె గుర్తుచేస్తున్నారు. అటు మెట్రొపాలిటన్ మేజిస్ట్రేట్ నివేదిక, ఇటు సిట్ నివేదిక కూడా ఆ సంగతినే ధ్రువీకరించాయి. ఇప్పుడు అఫిడవిట్లపై జరుగుతున్న రగడ వింత గొలుపుతుంది. తన ప్రమేయం లేకుండానే, తనకు తెలియకుండానే అఫిడవిట్లను మార్చినప్పుడే జీకే పిళ్లై అభ్యంతరం చెప్పి ఉండాలి. ఎందుకంటే ఆయన సాధారణ గుమాస్తా కాదు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి. ఆ స్థాయి ఉన్నతాధికారి కేంద్ర హోంమంత్రి వ్యవహరించిన తీరును ప్రశ్నించి ఉంటే వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నందుకు అందరూ అభినందించేవారు. ఆ క్రమంలో పదవిని కోల్పోయినా ఆయనకంటూ గౌరవం దక్కేది. అప్పుడు మౌనంగా ఉండిపోవడంవల్ల ఇప్పుడు చెప్పే మాటలకు విలువ లేకుండా పోతుందని ఆయన గ్రహించలేకపోతున్నారు. ఇంతకూ తొలి అఫిడవిట్లోనైనా ఇష్రాత్ లష్కరే ఉగ్రవాది అని తేల్చడానికి తగిన సమాచారమేమీ పొందుపరచ లేదు. 2004 జూలై 15న కొన్ని పత్రికల్లో ఆమె లష్కరే సంబంధాల గురించి వెలువడిన వార్తలు మినహా అందులో మరేమీ లేదు. ఇంత బలహీనమైన అంశంపై ఈ స్థాయిలో రాద్ధాంతం చోటు చేసుకోవడం చిత్రమే. పార్లమెంటు సమావేశాలు సాగుతున్నాయి గనుక తమదే పైచేయి అని చాటుకోవడానికి అధికార, విపక్షాలు ప్రయత్నిస్తాయి. అది సహజమే. కానీ ఆ క్రమంలో ఒక అనుమానాస్పద మరణంపై సాగుతున్న విచారణ అతీగతీ లేకుండా మిగిలిపోకూడదు. తన కుమార్తెది హత్యే అయిన పక్షంలో కారకులను దండించాలన్న ఒక తల్లి డిమాండ్‌ను ఉపేక్షించకూడదు. -
టార్చర్ పెట్టి సంతకం చేయించుకున్నారు!
న్యూఢిల్లీ: ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ వ్యవహారంలో గత యూపీఏ ప్రభుత్వం మళ్లీ ఇరకాటంలో పడింది. అత్యున్నతస్థాయిలో వచ్చిన రాజకీయ ఒత్తిడుల కారణంగానే ఇష్రత్ జహాన్ కేసు రెండో అఫిడవిట్లో మార్పులు చేసినట్టు మాజీ బ్యూరోక్రాట్ ఒకరు వెల్లడించారు. ఇష్రత్ జహన్ ఎన్కౌంటర్ కేసులో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రెండు అఫిడవిట్లను కోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో మృతిచెందిన ఇష్రత్ జహాన్, జావేద్ షైక్ అలియాస్ ప్రాణేశ్ పిళ్లై, జీషాన్ జోహర్, అంజద్ అలి రాణాలు ఉగ్రవాదులేనని మొదటి అఫిడవిట్లో పేర్కొన్న యూపీఏ సర్కారు సరిగ్గా రెండు నెలల్లోనే యూ టర్న్ తీసుకొంది. ఆ నలుగురు ఉగ్రవాదులు అని చెప్పడానికి సరైన ఆధారాలు లేవంటూ రెండో అఫిడవిట్ ను కోర్టుకు సమర్పించింది. అయితే తనను భౌతికంగా హింసించడంతోనే ఆ రెండో అఫిడవిట్ తాను సంతకం చేశానని ఆర్వీఎస్ మణి సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర హోంశాఖ పరిధిలోని అంతర్గత భద్రత విభాగం అండర్ సెక్రటరీగా పనిచేసి రిటైరైన ఆయన.. రాజకీయ ఒత్తిడుల కారణంగానే తాను రెండో అఫిడవిట్‌పై సంతకం చేసినట్టు చెప్పారు. ఇష్రత్ కేసులో ఆధారాలను కల్పితంగా సృష్టించారని, అంతేకాకుండా గుజరాత్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల పేర్లను కూడా ఈ కేసులో ఇరికించాలని సిట్ తనపై ఒత్తిడి చేసిందని ఆయన వెల్లడించారు. ఇష్రత్ జహాన్ కేసులో పత్రాల ఆధారంగా స్పష్టమైన అఫిడవిట్ రూపొదిస్తుంటే అప్పటి సీబీఐ అధికారి సతీశ్ శర్మ జోక్యం చేసుకొని తనను భౌతికంగా వేధించాడని, తన తొడలపై సిగరెట్ పీకలతో కాల్చేవాడని ఆయన వెల్లడించారు. తొలి అఫిడవిట్ ను తాను ఆమోదించలేదని చెప్తున్న అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుబట్టారు. మాజీ బ్యూరోక్రాట్ ఆరోపణలపై స్పందించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.. ఇష్రత్ జహాన్ కేసు ద్వారా అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోదీని టార్గెట్‌గా చేసేందుకు యూపీఏ ప్రభుత్వం ప్రయత్నించిందని విమర్శించారు. -
అఫిడవిట్ ఎందుకు మార్చారు: వెంకయ్య
న్యూఢిల్లీ : ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ కేసులో అఫిడవిట్ మార్చాల్సిన అవసరం ఏంటని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సూటిగా ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా దిగజారుతుందని ఆయన బుధవారమిక్కడ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగా ఇష్రత్ జహాన్ కేసులో తనను పక్కన పెట్టి, చిదంబరమే రెండో అఫిడవిట్‌ను తిరిగిరాశారని అప్పటి హోంశాఖ కార్యదర్శి జి.కె.పిళ్లై పేర్కొన్నారు. అంతేకాకుండా ఐబీ అధికారులపై ఒత్తిడి తేవాలని తనను ఇబ్బంది పెట్టారంటూ నాటి హోంశాఖ కార్యాలయ అధికారి ఆర్వీఎస్ మణి చిదంబరంపై ఆరోపణలు చేశారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి ఇరకాటంలో పడినట్లు అయింది. మరోవైపు హెచ్‌సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనకు సంబంధించి సభకు తప్పుడుసమాచారం అందించారంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై విపక్షాలు హక్కుల ఉల్లంఘన తీర్మానమిచ్చి, చర్చకు పట్టుబట్టగా... దీనికి ప్రతిగా కాంగ్రెస్ చీఫ్ విప్ జ్యోతిరాదిత్య సింధియా గత నెల 24న సభకు అవాస్తవాలు వెల్లడించారంటూ బీజేపీ హక్కుల నోటీసు ఇచ్చిన విషయం విదితమే. -
‘స్వయంగా చిదంబరమే మార్చారు’
న్యూఢిల్లీ: ఇష్రత్ జహాన్ కేసులో తనను పక్కన పెట్టి, చిదంబరమే రెండో అఫిడవిట్‌ను తిరిగిరాశారని అప్పటి హోంశాఖ కార్యదర్శి జి.కె.పిళ్లై మంగళవారం తెలిపారు. ఐబీకి చెందిన కింది స్థాయి సిబ్బందిని పిలిపించి మార్పులు చేశారని, మంత్రే స్వయంగా చెప్పడంతో ఎవరూ మాట్లాడలేకపోయారని ఒక జాతీయ న్యూస్ చానల్‌తో చెప్పారు. ఐబీ అధికారులపై ఒత్తిడి తేవాలని తనను ఇబ్బంది పెట్టారంటూ నాటి హోంశాఖ కార్యాలయ అధికారి ఆర్వీఎస్ మణి చిదంబరంపై ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం సూచనమేరకు చిదంబరం ఈ పనిచేశారని కేంద్ర టెలికంమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఢిల్లీలో విమర్శించారు. ఇషత్‌ప్రై డేవిడ్ హెడ్లీ స్టేట్మెంట్పై బీజేపీ అసత్యాల్ని ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ తప్పుపట్టింది. అఫిడవిట్ మార్పువెనుక రాజకీయ కారణాలు రాజకీయ కారణాలతోనే ఇష్రత్ అఫిడవిట్ మారిందని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, బీజేపీ ఎంపీ ఆర్.కె.సింగ్ అన్నారు. తన సహాచరుడు జావేద్ షేక్‌కు తీవ్ర వాదులతో సంబంధాలున్నాయని ఇషత్‌క్రు తెలుసని, అతనితో కలిసి రెండు చోట్లకు వెళ్లిందంటూ సింగ్ ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ చెప్పారు. -
మీడియాపై చర్యలు తీసుకుంటా: సీఎం
గుజరాత్లో ఎన్‌కౌంటర్‌కు గురై మరణించిన ఇష్రత్ జహాన్‌ను తాను ఎప్పుడూ 'బిహార్ పుత్రిక'గా అభివర్ణించలేదని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఖండించారు. ఆ మాటలను తాను అన్నట్లుగా చెప్పిన మీడియా సంస్థలపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇష్రత్ జహాన్‌ను తాను అలా అన్నట్లు ఒక్క ఆధారమైనా చూపించాలని అన్నారు. 'జనతా కే దర్బార్ మే ముఖ్యమంత్రి' కార్యక్రమం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఇప్పటివరకు ఎప్పుడైనా గతంలో అలా అన్నానేమోనని రికార్డులు, న్యూస్ క్లిప్పింగులను పరిశీలిస్తున్నానని, తగినంత గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తాను పదాలు వాడేటప్పుడు, వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటానని, తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు తాను అనని మాటలు అన్నట్లుగా చెబితే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. గతంలో సీఎం నితీష్ కుమార్.. ఇష్రత్ జహాన్‌ను బిహార్ పుత్రిక అంటూ చెప్పినట్లు వచ్చిన పత్రికా కథనాలను బీజేపీ నేతలు వెలికి తీశారు. పాక్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ ఆమెను ఉగ్రవాదిగా చెప్పడంతో నితీష్ పాత వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీనిపైనే ఇప్పుడు నితీష్ మండిపడుతున్నారు. -
ఇష్రత్ జహాన్‌పై లాలు కొడుకు తీవ్ర వ్యాఖ్యలు
పట్నా: గుజరాత్ పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన ఇష్రత్ జహాన్ గురించి ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తనయుడు, బిహార్ ఆరోగ్యశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె 'బిహార్ ఆడబిడ్డ' అని పేర్కొన్నారు. ఇష్రత్ జహాన్ లష్కరే తోయిబా సూసైడ్ బాంబర్ అని తాజాగా ముంబై దాడుల సూత్రధారుల్లో ఒకడైన డేవిడ్ హెడ్లీ తాజాగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ దేశానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. 2004లో ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ సమయంలో ఆమెను 'బిహార్ ఆడబిడ్డ'గా నితీశ్ అభివర్ణించారని బీజేపీ ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే తేజ్‌ప్రతాప్ ఇష్రత్ జహన్ గురించి వ్యాఖ్యలు చేయడం వివాదం రేపుతున్నది. ఇష్రత్ మృతి వ్యవహారంలో ఓటుబ్యాంకు రాజకీయాల కోసమే అప్పట్లో నితీశ్‌కుమార్ దేశభద్రతపై రాజీపడి.. వ్యాఖ్యలు చేశారని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శించారు. ఇష్రత్‌ను బిహార్ బిడ్డగా అభివర్ణించినవాళ్లు హెడ్లీ వాంగ్మూలం నేపథ్యంలో ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించాలని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ పేర్కొన్నారు. మరోవైపు ఇష్రత్ జహాన్ కుటుంబం మాత్రం తమ బిడ్డ అమాయకురాలని, బూటకపు ఎన్కౌంటర్లో ఆమెను పోలీసులు హతమార్చారని ఆరోపిస్తున్నది. -
ఇష్రత్ జహాన్ లష్కరే ఉగ్రవాది
వీడియో కాన్ఫరెన్స్ వాంగ్మూలంలో హెడ్లీ వెల్లడి * ఈ విషయాన్ని లఖ్వీయే చెప్పాడన్న డేవిడ్ * ‘బాబ్రీ’కి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలోనే ఎన్కౌంటర్ ముంబై: 2008 ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన పాకిస్తానీ అమెరికన్, లష్కరే ఉగ్రవాది డేవిడ్ కోలెమన్ హెడ్లీని విచారిస్తున్న కొద్దీ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2004లో గుజరాత్లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మృతిచెందిన 19 ఏళ్ల ఇష్రత్ జహాన్.. లష్కరే తోయిబా ఉగ్రవాదని గురువారం జరిగిన వీడియో లింక్ వాంగ్మూలంలో హెడ్లీ వెల్లడించాడు. ‘భారత్‌లో పోలీసులపై కాల్పులు జరిపే వ్యూహంతో.. లష్కరే ఉగ్రవాది ముజమ్మిల్ భట్ ప్రయత్నాలు చేస్తుండగానే ఓ మహిళా ఉగ్రవాది ఎన్కౌంటర్ అయిందని లష్కరే కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ చెప్పారు’ అని హెడ్లీ పేర్కొన్నారు. ఆమె భారతీయురాలే అయినా.. లష్కరేలో క్రియాశీలకంగా పనిచేసినట్లు లఖ్వీ మాటలతో తెలిసిందన్నారు. బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా అక్షర్ధామ్ మందిరంపై దాడికి లష్కరే ఉగ్రవాది అబూ కఫా ప్రయత్నించాడన్నారు. భారత్‌లో దాడులకు లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఆర్థికంగా ఏవిధంగా తోడ్పడ్డాయనే విషయాన్ని హెడ్లీ కోర్టుకు వెల్లడించారు. కోర్టు బయట ఉజ్వల్ నికమ్ మీడియాతో మాట్లాడుతూ.. లష్కరేతోయిబాలో.. మిలటరీ, నేవీ, మహిళ, ఆర్థిక విభాగాలున్నాయని పేర్కొన్నారు. 2004లో ఏం జరిగింది? గుజరాత్‌లోని అహ్మదాబాద్ శివార్లలో 2004 జూన్ 15న ఇష్రత్ జహాన్‌తోపాటు నలుగురిని గుజరాత్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ కేసును విచారించిన సీబీఐ.. బూటకపు ఎన్కౌంటర్ అని, క్రైమ్ బ్రాంచ్, ఎస్ఐబీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయని 2013లో విడుదల చేసిన చార్జిషీటులో పేర్కొంది. అప్పటి గుజరాత్ అదనపు డీజీపీ, డీఐజీ డీజీ వంజారాతో పాటు ఏడుగురు గుజరాత్ పోలీసు అధికారుల పేర్లను చార్జిషీటులో చేర్చింది. ఐబీ స్పెషల్ డెరైక్టర్ రాజిందర్ కుమార్‌తోపాటు మరో ముగ్గురు ఐబీ అధికారులను విచారించింది. అయితే ఈ కేసులో తనను ఇరికించాలని చూశారని.. అయినా వారి రాజకీయానికి పావుగా మారలేదని రాజిందర్ కుమార్ గురువారం తెలిపారు. ఎన్కౌంటర్లన్నీ రాజకీయ జోక్యం కారణంగానే బూటకంగా మారిపోతాయని డీజీ వంజారా అన్నారు. ఇది సాక్ష్యం కాదు: ఇష్రత్ లాయర్ అయితే.. హెడ్లీ వెల్లడించిన అంశాలను సాక్ష్యాలుగా పరిగణించలేమని ఇష్రత్ కుటుంబం తరపు న్యాయవాది వృందా గ్రోవర్ అన్నారు. నలుగురు పేర్లు చెబితే.. అందులోనుంచి ఒకరి పేరును హెడ్లీ వెల్లడించటం సాక్ష్యం కాదన్నారు. ఇష్రత్ కుటుంబ సభ్యులు కూడా హెడ్లీ ఆరోపణలను ఖండించారు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన ప్రణేశ్ కుమార్ అలియాస్ జావెద్ షేక్ తండ్రి పిళ్లై కూడా.. హెడ్లీ వ్యాఖ్యలపై అనుమానం వ్యక్తం చేశారు. కాగా, ముంబై దాడుల కేసులో ముగ్గురు కీలక సాక్షులు కోర్టుకు హాజరు కాకపోవటంతో.. తదుపరి విచారణను పాక్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఫిబ్రవరి 17కు వాయిదా వేసింది. సోనియా క్షమాపణలు చెప్పాలి: బీజేపీ ప్రధాన మంత్రి మోదీపై కోపంతో.. ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్‌ను బూటకంగా చూపించేందుకు కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నించిందని.. తాజాగా హెడ్లీ వాంగ్మూలంతో.. సోనియా, రాహుల్ వ్యాఖ్యలు తప్పని తేలిందని బీజేపీ విమర్శించింది. మోదీపై తప్పుడు ప్రచారం చేసినందుకు సోనియా, రాహుల్ గాంధీ జాతికి క్షమాపణలు చెప్పాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ డిమాండ్ చేశారు. హెడ్లీ వ్యాఖ్యలు నమ్మలేం: కాంగ్రెస్ ఇష్రత్ ఎన్‌కౌంటర్‌పై హెడ్లీ వాంగ్మూలంతో.. సోనియా, రాహుల్ క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ డిమాండ్‌ను కాంగ్రెస్ ఖండించింది. హెడ్లీ సాక్షం ఆధారంగా ఇది బూటకపు ఎన్కౌంటర్ కాదని నిర్ధారించలేమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ తెలిపారు. -
'ఇప్పుడేమంటారు.. సోనియా క్షమాపణ చెప్పి తీరాలి'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికైనా తమకు క్షమాపణ చెప్పితీరాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇష్ర్రాత్ జహాన్ కూడా ఓ ఉగ్రవాదేనని లష్కరే ఈ తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ చెప్పిన నేపథ్యంలో గతంలో తమపై అనవసరంగా ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాల్సిందనన్నారు. 'ఉగ్రవాది ఇష్రాత్ జహాన్‌ను హతమార్చిన నాటి పోలీసు హీరోలకు, దేశానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి' అని బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ అన్నారు. 2014లో జూన్ 15న గుజరాత్ లోని అహ్మదాబాద్ శివారుల్లో పోలీసులకు కొందరు అనుమానితులపై జరిపిన కాల్పుల్లో ఇష్రత్ జహాన్ ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఓ ఉగ్రవాదిని మట్టుపెట్టిన ఇలాంటి సంఘటనపట్ల హర్షం వ్యక్తం చేయకుండా నాటి పోలీసులను అభినందించకుడా అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పలు ప్రశ్నలు లేవనెత్తిందని, కొందరిని జైలులో పెట్టిందని శ్రీకాంత్ శర్మ మండిపడ్డారు. -
అమిత్ షాకు సీబీఐ క్లీన్ చిట్!
ఆహ్మాదాబాద్: ఇష్రాంత్ జాహన్, మరో ముగ్గురి ఎన్ కౌంటర్ కేసులో గుజరాత్ మాజీ హోంమంత్రి అమిత్ షాకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. అమిత్ షాపై చార్జీషీట్ దాఖలు చేయడానికి సరైన ఆధారాలు లభించలేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ కేసులో అమిత్ షాకు ప్రమేయం ఉన్నట్టు సాక్ష్యాలు లభించలేదని.. అందుకే చార్జిషీట్ దాఖలు చేయలేదని సీబీఐ కోర్టుకు సీబీఐ అధికారి విశ్వాస్ కుమార్ మీనా తెలిపారు. అమిత్ షా పై వచ్చిన ఆరోపణలకు సాక్ష్యాలు లభించకపోవడంతో ఎఫ్ఐఆర్ లో ఆయన పేరును పేర్కొనలేదని, అందుకే సీబీఐ చార్జిషీట్ లో ఆయన పేరును పెట్టలేదని సీబీఐ తెలిపింది. ఎన్ కౌంటర్ లో మరణించిన జావేద్ షేక్ అలియాస్ ప్రణేశ్ పిళ్లై తండ్రి గోపినాథ్ పిళ్లై సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న షా, మాజీ కమిషనర్ కేఆర్ కౌశిక్ లను విచారించాలని పిటిషన్ దాఖలు చేశారు.