ట్రిపుల్ తలాక్ కేసులో ఒక పిటిషనర్ అయిన ఇష్రత్ జహాన్ తాజాగా బీజేపీలో చేరారు. ఆదివారం హౌరాలోని బీజేపీ కార్యాలయంలో ఆమె లాంఛనంగా పార్టీలో చేరారని బీజేపీ బెంగాల్ జనరల్ సెక్రటరీ సాయంతన్ బసు మీడియాకు తెలిపారు. ఆమెను సత్కరించేందుకు త్వరలోనే రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.