కోల్‌కతా: ట్రిపుల్ తలాక్ కేసులో ఒక పిటిషనర్ అయిన ఇష్రత్ జహాన్ తాజాగా బీజేపీలో చేరారు. ఆదివారం హౌరాలోని బీజేపీ కార్యాలయంలో ఆమె లాంఛనంగా పార్టీలో చేరారని బీజేపీ బెంగాల్ జనరల్ సెక్రటరీ సాయంతన్ బసు మీడియాకు తెలిపారు. ఆమెను సత్కరించేందుకు త్వరలోనే రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.
ట్రిపుల్ తలాక్ వ్యతిరేకంగా పోరాడిన ఐదుగురు పిటిషనర్లలో ఇష్రత్ ఒకరు. దుబాయ్ నుంచి ఆమె భర్త ఫోన్‌లో మూడుసార్లు ’తలాక్’ అని చెప్పడం ద్వారా విడాకులు ఇచ్చాడు. దీనికి వ్యతిరేకంగా ఆమె న్యాయపోరాటం చేశారు. గత ఏడాది ఆగస్టు 22న సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమంటూ తేల్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా బిల్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాను బీజేపీలో చేరడంపై ఇష్రత్ మీడియాతో ఇంకా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment