సాక్షి, లక్నో: కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ముందుకు తీసుకున్న రానున్న ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముస్లిం మహిళలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకువస్తోందని ముప్లిం లా బోర్డు అభిప్రాయపడింది. ఈ చట్టం వల్ల ముస్లిం కుటుంబాలు సర్వనాశనమవుతాయని ముస్లిం లా బోర్డు తెలిపింది. దీనిపై ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు లాబోర్డు సెక్రెటరీ మౌలానా ఖాలీద్ సైఫుల్లా రహమానీ తెలిపారు.
కేంద్రం ప్రభుత్వం రూపొందించిన ఈ బిల్లును ముస్లిం పర్సనల్ లా బోర్డు తీవ్రంగా వ్యతిరేకించినట్లు ఆయన చెప్పారు. ప్రధానంగా.. మూడేళ్ల జైలు శిక్ష మరీ దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ముందుకు ట్రిపుల్ తలాక్ బిల్లు రానున్న నేపథ్యంలో ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు ఆదివారం అత్యవసరంగా సమావేశమైంది.
ట్రిపుల్ తలాక్ పేరుతో ఇచ్చే ఇన్‌స్టంట్ విడాకులు అక్రమం, రాజ్యాంగా విరుద్ధమంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. మోదీ ప్రభుత్వంపై దీనిపై ప్రత్యేక బిల్లును రూపొందించింది. ట్రిపుల్ తలాక్‌ను చట్టపరంగా నిరోధించే ఈ బిల్లును మోదీ ప్రభుత్వం డిసెంబర్ 15న ఆమోదించింది. కేంద్రమంత్రివర్గం ఆమోదించిన ఈ ట్రిపుల్ తలాక్ బిల్లు.. ఈ వారంలోనే లోక్‌సభ ముందుకు రానుంది. ఇన్‌స్టంట్ విడాకులను నిరోధించడంతో పాటు, అలా చెప్పిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధించేలా ఈ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. ఈ బిల్లులోనే మహిళలకు భరణం తప్పనిసరి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment