AIMPLB
-
‘సూర్య నమస్కారాల’ సర్క్యులర్.. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖండన
న్యూఢిల్లీ: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 30 వేల విద్యా సంస్థల్లోని 3 లక్షల మంది విద్యార్థులు సూర్య నమస్కారాలు చేయాలంటూ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) జారీ చేసిన సర్క్యులర్‌పై అలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి కార్యక్రమాల్లో ముస్లిం విద్యార్థులు పాల్గొనరాదని పిలుపునిచ్చారు. యూజీసీ డిసెంబర్ 29వ తేదీన జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో.. ‘దేశ 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని 75 కోట్ల సూర్యనమస్కారాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం జనవరి ఒకటి నుంచి 7వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా 3 లక్షల విద్యార్థులు సూర్యనమస్కారాల్లో పాల్గొంటారు’ అని పేర్కొంది. ఈ సర్క్యులర్‌ను వ్యతిరేకిస్తూ ముస్లిం బోర్డు కార్యదర్శి మౌలానా ఖాలేద్ రహమానీ మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. మెజారిటీ సంప్రదాయాలు, సంస్కృతిని ఇతరులపై రుద్దాలని ప్రభుత్వం చూస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. -
‘వాటిని షరియత్ అనుమతించింది’
సాక్షి, న్యూఢిల్లీ : నిఖా హలాల, బహుభార్యత్వాలు రాజ్యాంగ విరుద్ధమైనవని ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌ను సవాల్ చేస్తూ అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) సోమవారం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. పవిత్ర ఖురాన్ ఆధారంగా ఇవి ఏర్పడ్డాయని, వీటి చట్టబద్ధతను ప్రాథమిక హక్కుల పేరిట ఎవరూ ప్రశ్నించజాలరని ఏఐఎంపీఎల్బీ పేర్కొంది. తమ విశ్వాసాలను ప్రశ్నించేందుకు ఏ ఒక్క ముస్లిమేతరులనూ అనుమతించరాదని కోర్టులో దాఖలు చేసిన అప్లికేషన్లో తెలిపింది. బహుభార్యత్వం, నిఖా హలాలను రాజ్యాంగ విరుద్ధమైనవి, చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరుతూ బీజేపీ నేత, అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాథ్యాయ్ 2018 మార్చిలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బహుభార్యత్వం దేశంలో చట్టవిరుద్ధమైనదే అయినా ముస్లిం పర్సనల్ లాబోర్డు (షరియత్) అప్లికేషన్ యాక్ట్, 1937 ప్రకారం ముస్లిం వర్గానికి మినహాయింపు లభించిందని, నిఖా హలాలకూ ఇదే తరహాలో అనుమతిస్తున్నారని ముస్లిం లాబోర్డు పేర్కొంది. బహుభార్యత్వం కింద ముస్లిం వ్యక్తి నలుగురు భార్యలను వివాహం చేసుకోవచ్చు. ఇక 2017 ఆగస్ట్‌లో ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ చారిత్రక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు నిఖా హలాల, బహుభార్యత్వంపై దాఖలైన పిటిషన్ల విచారణను వేరొక బెంచ్‌కు బదలాయించింది. -
అయోధ్య తీర్పుపై 6 రివ్యూ పిటిషన్లు
న్యూఢిల్లీ/అయోధ్య: అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రక తీర్పుపై సమీక్ష కోరుతూ శుక్రవారం 6 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) తరఫున ఆరుగురు వేర్వేరుగా తమ లాయర్ ఎంఆర్ శంషాద్ ద్వారా శుక్రవారం ఈ ఆరు పిటిషన్లు వేశారు. కాగా, అయోధ్యలో శుక్రవారం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు యథావిధిగా పనిచేశాయి. మసీదుల్లో ప్రార్థనలు, ఆలయాల్లో పూజలు ప్రశాంతంగా జరిగాయి. బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పురస్కరించుకుని ముస్లిం సంస్థలు ఏటా డిసెంబర్ 6వ తేదీని బ్లాక్ డేగా వ్యవహరిస్తూండగా, హిందువులు శౌర్యదినంగా పాటిస్తున్న విషయం తెలిసిందే. -
9లోగా ‘అయోధ్య’ రివ్యూ పిటిషన్
లక్నో: అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు– రామ జన్మభూమి కేసులో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై డిసెంబర్ 9లోపు రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) బుధవారం ప్రకటించింది. సుప్రీంతీర్పును సమీక్షించబోమని సున్నీ వక్ఫ్ బోర్డు మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో బుధవారం ఏఐఎంపీఎల్బీ తాజాగా ఈ ప్రకటన చేయడం గమనార్హం. నవంబరు 17న జరిగిన బోర్డు సమావేశంలోనే రివ్యూ పిటిషన్‌పై తీర్మానించామని, సమీక్ష కోరేందుకు తమకు డిసెంబరు 9వరకు సమయం ఉందని ఏఐఎంపీఎల్బీ కార్యదర్శి జఫర్యాబ్ జిలానీ తెలిపారు. రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశమున్న ముస్లిం వర్గాలను అయోధ్య పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని, కేసుల్లో ఇరికించి జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని జలానీ ఆరోపించారు. అయోధ్య పోలీసుల తీరును పిటిషన్లో తాము సుప్రీంకోర్టుకు నివేదిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా.. మసీదు నిర్మాణానికి ప్రభుత్వమిచ్చే ఐదెకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డు నిరాకరిస్తే దాన్ని తమకు ఇవ్వాల్సిందిగా కోరతామని ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్‌బోర్డు బుధవారం తెలిపింది. అయితే ఆ స్థలాన్ని తాము మసీదు నిర్మాణానికి కాకుండా ఆసుపత్రిని నిర్మించేందుకు వినియోగిస్తామని ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ వసీమ్ రిజ్వీ తెలిపారు. అయోధ్య తీర్పుకు సంబంధించి రివ్యూ పిటిషన్ ముసాయిదా తయారైందని ప్రముఖ ముస్లిం సంస్థలు తెలిపాయి. డిసెంబరు 3 లేదా 4 తేదీల్లో జమాయత్ ఉలేమా ఏ హింద్ సంస్థ సుప్రీంకోర్టులో దాఖలు చేసే అవకాశం ఉంది. -
అయోధ్య’పై రివ్యూ పిటిషన్ వేస్తాం
అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూపిటిషన్ దాఖలు చేస్తామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, జమీయత్ ఉలేమా ఎ హింద్ ప్రకటించాయి. లక్నో/న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి– బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ), జమీయత్ ఉలేమా ఎ హింద్ ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ మాత్రం సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయబోమన్నారు. వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించాలని, మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో వేరే చోట సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్‌కు 5 ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ ఐదు ఎకరాల స్థలాన్ని స్వీకరించాలా? వద్దా? అనేది నవంబర్ 26న జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయిస్తామని వక్ఫ్ బోర్డు చైర్మన్ జుఫర్ ఫారూఖీ తెలిపారు. మసీదు స్థలాన్ని వదులుకోవడం షరియా ప్రకారం సరికాదని ఏఐఎంపీఎల్బీ పేర్కొంది. ఏఐఎంపీఎల్బీ సమావేశం ఆదివారం లక్నోలో జరిగింది. మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాలు ఇస్తామన్న ప్రతిపాదనను అంగీకరించబోమని సమావేశం అనంతరం ఏఐఎంపీఎల్బీ స్పష్టం చేసింది. ‘అది సరైన న్యాయం కాదు.. అలాగే, మాకు జరిగిన నష్టానికి పరిహారం కాబోదు’ అని స్పష్టం చేసింది. ‘ఈ కేసులో ఏఐఎంపీఎల్బీ పిటిషన్‌దారు కాదు. కానీ పిటిషన్‌దారులకు దిశానిర్దేశం చేస్తుంది. ముస్లింల తరఫు పిటిషన్‌దారుల్లో ఐదుగురు రివ్యూ వేసేందుకే మొగ్గు చూపారు’ అని ఏఐఎంపీఎల్బీ సభ్యుడు కమల్ ఫారూఖీ తెలిపారు. ‘మసీదు స్థలం అల్లాకు చెందుతుంది. షరియా ప్రకారం ఆ స్థలాన్ని ఎవరికీ ఇవ్వకూడదు’ అని ఏఐఎంపీఎల్బీ కార్యదర్శి జఫర్యాబ్ జిలానీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పలు పరస్పర విరుద్ధ అంశాలున్నాయన్నారు. ఈ కేసులో తొలుత కేసు వేసినవారిలో ఒకరైన జమీయత్ సంస్థ ఉత్తరప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం సిద్దిఖీ కూడా సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు. సాక్ష్యాలపైనో లేక హేతుబద్ధతపైననో ఆధారపడి తీర్పు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. అయోధ్య కేసులో ముఖ్య పిటిషనర్ అయిన ఇక్బాల్ అన్సారీ మాత్రం రివ్యూ పిటిషన్ వేసే ఆలోచన లేదన్నారు. ముస్లిం వర్గాల వాదనలను, అందించిన సాక్ష్యాధారాలను అంగీకరించిన సుప్రీంకోర్టు.. తీర్పు మాత్రం హిందువులకు అనుకూలంగా ఇచ్చిందని జమీయత్ సంస్థ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ అన్నారు. సమావేశానికి ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా హాజరయ్యారు. ఏఐఎంపీఎల్బీ కార్యదర్శి జఫర్యాబ్ జిలానీ -
‘ఇది ఇస్లామిక్ దేశం కాదు’
సాక్షి, న్యూఢిల్లీ : షరియత్ కోర్టులు ఏర్పాటు చేసుకోవడానికి భారత్ ఇస్లామిక్ దేశం కాదని బీజేపీ అధికార ప్రతినిధి మీనాకాశీ లేఖీ అన్నారు. ఇస్లాం చట్టాలకు అనుగుణంగా దేశంలో ప్రతి జిల్లాలో షరియత్ కోర్టులు (దారుల్ ఖ్వాజా) ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం స్పందించిన లేఖీ... షరియత్ కోర్టులు ఏర్పాటు చేయడానికి దేశంలో చోటులేదని, ఇదేవి ఇస్లాం దేశం కాదని వ్యాఖ్యానించారు. షరియత్ కోర్టులు ఏర్పాటు చేసే హక్కు ఆలిండియా ముస్లిం లా బోర్డుకు లేదని కేంద్ర సహాయ మంత్రి పీపీ చౌదరి అన్నారు. అవి రాజ్యాంగ విరుద్ధమైనవని, వీటి వెనుకు రాజకీయ నాయకుల హస్తం ఉందని తెలిపారు. షరియత్ కోర్టులు చట్ట విరుద్ధమని, వాటి ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు యూపీ వక్ఫ్ బోర్టు చైర్మన్ సయ్యద్ వాసిం రిజ్వీ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. యూపీలో ప్రస్తుతం 40 షరియత్ కోర్టులు ఉన్నాయని, అవన్ని చట్టబద్దమైనవేనని ముస్లిం లా బోర్డు సభ్యుడు, సీనియర్ న్యాయవాది జాఫర్యాబ్ జిలానీ పేర్కొన్నారు. ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు ఈ కోర్టులు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. -
‘షరియత్ కోర్టులు చట్ట వ్యతిరేకం’
లక్నో : షరియత్ కోర్టులు (దారుల్ కాజా) ఏర్పాటు చట్ట వ్యతిరేకమని యూపీ షియా వక్ఫ్‌బోర్డు చైర్మన్ సయ్యద్ వాసిం రిజ్వీ పేర్కొన్నారు. ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు దేశంలోని అన్ని జిల్లాలో షరియత్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు భావిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వాసిం రిజ్వీ సమస్యలను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం ఉండొచ్చని, షరియత్ కోర్టులు మాత్రం ఏర్పాటు చేయాడానికి వీళ్లేదని వ్యాఖ్యానించారు. కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పి ఖ్వాసి (జడ్జి)లను నియమించడం సరికాదని అన్నారు. ముస్లింల సమస్యలను పరిష్కరించడానికి సొంతంగా కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీనియర్ న్యాయవాది, ముస్లిం లా బోర్డు సభ్యుడు జాఫర్యాబ్ జిలానీ.. ప్రస్తుతం యూపీలో 40 కోర్టులు ఉన్నాయని అవి పూర్తిగా చట్టబద్దమైనవని స్పష్టం చేశారు. షరియత్ కోర్టులు చట్టవ్యతిరేకమైనవని ప్రజలు భావిస్తే సుప్రీంకోర్టు వాటిని తిరస్కరిస్తుందని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం కోర్టులు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ నెల 15 బోర్డు సభ్యులందరూ సమావేశమై తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని జిలానీ పేర్కొన్నారు. -
త్వరలో దేశవ్యాప్తంగా షరియత్ కోర్టులు
లక్నో: ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు దేశంలోని అన్ని జిల్లాల్లో షరియత్ కోర్టు (దారుల్ కాజా)లు ఏర్పాటు చేయాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) భావిస్తోంది. న్యూఢిల్లీలో జరగనున్న బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించనుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో 40 షరియత్ కోర్టులు ఉన్నాయని, దేశంలోని అన్ని జిల్లాల్లో ఈ కోర్టులు ఏర్పాటుచేస్తే ముస్లింలు తమ సమస్యల పరిష్కారానికి ఇతర కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరముండదని బోర్డు సభ్యుడు జఫర్యాబ్ జిలానీ తెలిపారు. జడ్జీలు, లాయర్లు, సామాన్యులకు షరియత్ చట్టాలపై అవగాహన కల్పించేందుకు గాను తఫీమ్–ఈ–షరియత్ కమిటీని పునఃప్రారంభించనున్నామన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చినా బోర్డు ఆహ్వానిస్తుందన్నారు. -
‘బాబ్రీపై వెనక్కితగ్గం’
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య అంశంపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) స్పష్టం చేసింది. బాబ్రీ మసీదు ఇస్లాం విశ్వాసంలో కీలక భాగమని, ముస్లింలు మసీదును ఎన్నటికీ వదులుకోరని ఓ ప్రకటనలో పేర్కొంది. మసీదు భూమిని బదలాయించడం లేదా మసీదు భూమి మార్పిడికి అంగీకరించబోమని తేల్చిచెప్పింది. బాబ్రీ మసీదు పునర్నిర్మాణ పోరాటం కొనసాగుతుందని పేర్కొంది. మరోవైపు అయోధ్య వివాదంపై రాజీ ఫార్ములాను ప్రతిపాదించిన మౌలానా సల్మాన్ నద్వీని బోర్డు నుంచి బహిష్కరిస్తున్నట్టు ఏఐఎంపీఎల్బీ తెలిపింది. బాబ్రీ మసీదు వ్యవహరంపై బోర్డు రాజీలేని వైఖరిని కొనసాగిస్తుందని తేల్చిచెప్పినా సభ్యుడు సల్మాన్ నద్వీ బోర్డు వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడటంతో విధిలేని పరిస్థితుల్లో ఆయనపై వేటు వేసినట్టు వెల్లడించింది. నద్వీని తొలగించాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఏఐఎంపీఎల్బీ సభ్యుడు సయ్యద్ ఖాసిం రసూల్ ఇల్యాస్ చెప్పారు. -
‘హజ్ సబ్సిడీ పేరుతో మోసం చేశారు’
సాక్షి, లక్నో : హజ్ సబ్సిడీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ముస్లింలను మోసం చేసిందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మండిపడింది. తాజాగా హజ్ సబ్సిడీని ఉసంహరిస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం చేసిన ప్రకటన అర్థం లేనిదని ముస్లిం పర్సనల్ లా బోర్డు జనరల్ సెక్రెటరీ మౌలానా వాలీ రెహమాని పేర్కొన్నారు. సౌదీ అరేబియాకు సాధారణ రోజుల్లో ఇక్కడ నుంచి సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా విమాన టిక్కెట్ ధర.. రూ. 32 వేలు మాత్రమే. అదే హజ్ యాత్ర రోజుల్లో ఈ టిక్కెట్‌ధర రూ. 65 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఉంటుందని ఆయన చెప్పారు. సబ్సిడీకన్నా అసలు టిక్కెట్ ధరే తక్కువని ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని ఆయన అన్నారు. సబ్సిడీ పేరుతో ప్రభుత్వాలు ముస్లింలను మోసగించాయని చెప్పడానికి ఇదే నిదర్శనం అని ఆయన అన్నారు. హజ్ యాత్రికులు రాయితీలు, సబ్సిడీలు ఇవ్వకపోయినా.. ఎయిర్ ఇండియా మాత్రం నష్టాల్లో నడుస్తోందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానిచారు. ఇదిలావుండగా.. హజ్ సబ్సిడీని ఎత్తివేయడంపై ఆల్ ఇండియా షియా పర్సనల్ లా బోర్డు హర్షం వ్యక్తం చేసింది. అలాగే సబ్సిడీ మొత్తాన్ని ముస్లిం పేద విద్యార్థినులకోసం ఖర్చు చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని షియా బోర్డు ఛైర్మన్ యాసూబ్ అబ్బాస్ స్వాగతించారు. -
ఆ బిల్లు.. కుటుంబాలను నాశనం చేస్తుంది’
సాక్షి, లక్నో: కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ముందుకు తీసుకున్న రానున్న ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముస్లిం మహిళలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకువస్తోందని ముప్లిం లా బోర్డు అభిప్రాయపడింది. ఈ చట్టం వల్ల ముస్లిం కుటుంబాలు సర్వనాశనమవుతాయని ముస్లిం లా బోర్డు తెలిపింది. దీనిపై ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు లాబోర్డు సెక్రెటరీ మౌలానా ఖాలీద్ సైఫుల్లా రహమానీ తెలిపారు. కేంద్రం ప్రభుత్వం రూపొందించిన ఈ బిల్లును ముస్లిం పర్సనల్ లా బోర్డు తీవ్రంగా వ్యతిరేకించినట్లు ఆయన చెప్పారు. ప్రధానంగా.. మూడేళ్ల జైలు శిక్ష మరీ దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ముందుకు ట్రిపుల్ తలాక్ బిల్లు రానున్న నేపథ్యంలో ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు ఆదివారం అత్యవసరంగా సమావేశమైంది. ట్రిపుల్ తలాక్ పేరుతో ఇచ్చే ఇన్స్టంట్ విడాకులు అక్రమం, రాజ్యాంగా విరుద్ధమంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. మోదీ ప్రభుత్వంపై దీనిపై ప్రత్యేక బిల్లును రూపొందించింది. ట్రిపుల్ తలాక్‌ను చట్టపరంగా నిరోధించే ఈ బిల్లును మోదీ ప్రభుత్వం డిసెంబర్ 15న ఆమోదించింది. కేంద్రమంత్రివర్గం ఆమోదించిన ఈ ట్రిపుల్ తలాక్ బిల్లు.. ఈ వారంలోనే లోక్‌సభ ముందుకు రానుంది. ఇన్స్టంట్ విడాకులను నిరోధించడంతో పాటు, అలా చెప్పిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధించేలా ఈ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. ఈ బిల్లులోనే మహిళలకు భరణం తప్పనిసరి చేశారు. -
ట్రిపుల్ తలాక్ అంతరించిన విధానం
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతుండటంతో దీనికి పునరుజ్జీవం వచ్చిందని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) పేర్కొంది. మూడు సార్లు తలాఖ్ చెప్పే విధానం దాదాపు కనుమరుగైందని, సుప్రీంకోర్టుల లాంటి సెక్యులర్ వేదికలపై చర్చించడం లేదా సవాలు చేయడంతో మళ్లీ దీనికి మళ్లీ ప్రాణం పోసినట్టైందని వ్యాఖ్యానించింది. ట్రిపుల్ తలాక్, ముఖిక విడాకుల రాజ్యాంగ బద్ధతను సవాల్ చేయడం ముస్లిం సమాజానికి ఎదురుదెబ్బగా ఏఐఎంపీఎల్బీ తరపు న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ట్రిపుల్ తలాక్ అంశంపై వాదోపవాదనలతో వ్యతిరేక ప్రభావం చూపే అవకాశముందని కోర్టుకు తెలిపారు. బహుభార్యత్వం, మౌఖిక విడాకులు విధానాలకు ఊతం లభించనుందని అభిప్రాయపడ్డారు. ముస్లిం సమాజంలో ట్రిపుల్ తలాక్ విధానాన్ని పాటించే వారు చాలా స్వల్పమని చెప్పారు. నిఖానామా, వివాహ ఒప్పందం సందర్భంలో సమయం నమోదు చేయాలని మతపెద్దలను ఏఐఎంపీఎల్బీ ఆదేశిస్తుందా.. ట్రిపుల్ తలాక్ ఆమోదయోగ్యమా, కాదా అని మహిళలను అడుతారా అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ ప్రశ్నించారు. సభ్యులందరితో మట్లాడిన తర్వాతఏఐఎంపీఎల్బీ దీనిపై స్పందిస్తుందని కపిల్ సిబల్ సమాధామిచ్చారు. -
ట్రిపుల్ తలాఖ్‌పై ఆత్మపరిశీలన చేసుకోవాలి
వివాదాస్పద ట్రిపుల్ తలాక్ అంశంపై అలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) వైఖరిపై సీపీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రిపుల్ తలాఖ్ యథాతథంగా కొనసాగుతుందని, కానీ, దీనిని దుర్వినియోగపరిచేవారిని సమాజం నుంచి బహిష్కరిస్తామన్న ఏఐఎంపీఎల్బీ వైఖరిపై తాజాగా సీపీఐ స్పందించింది. ట్రిపుల్ తలాఖ్ అనేది ఎంతమాత్రం న్యాయబద్ధమైనది కాదని, దీనిని ఖురాన్గానీ, సహజ ధర్మాలుగానీ విధించలేదని సీపీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో ముస్లిం వర్గంలోనే సంస్కరణలు రావాల్సిన అవసరముందని తాను భావిస్తున్నట్టు పేర్కొంది. ట్రిపుల్ తలాఖ్‌ను చాలా ఇస్లామిక్ దేశాలు అంగీకరించడం లేదని, భారత్‌లోని పలు ముస్లిం గ్రూపులు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయని తెలిపింది. ఈ విషయంలోని అన్ని అంశాలను పరిశీలించకుండానే ఏఐఎంపీఎల్బీ తనను తాను సమర్థించుకుంటున్నదని, ఈ విషయంలో ముస్లిం లా బోర్డు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరముందని సూచించింది. -
ట్రిపుల్ తలాఖ్‌కు 3.5కోట్ల ముస్లిం మహిళల మద్దతు
ముస్లిం పర్సనల్ లా బోర్డు జైపూర్: షరియత్, ట్రిపుల్ తలాఖ్‌కు అను కూలంగా దేశవ్యాప్తంగా 3.5 కోట్ల మంది ముస్లిం మహిళల నుంచి విజ్ఞాపన పత్రాలు అందాయని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) మహిళా విభాగం ముఖ్య నిర్వాహకురాలు అస్మా జోహ్ర చెప్పారు. జైపూర్‌లోని ఈద్గా మైదానంలో ముస్లిం మహిళల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ముస్లిం జనాభాలో విడాకుల రేటు అధికమన్న వాతావరణం సృష్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. ట్రిపుల్ తలాఖ్, షరియత్‌ను వ్యతిరేకిస్తున్న ముస్లిం మహి ళలు చాలా తక్కువగా ఉన్నారని జోహ్ర చెప్పారు. షరియత్, ఇస్లాంలో తమకున్న హక్కుల్ని తెలుసుకునేందుకు ముస్లిం మహిళలకు ఇదే సరైన సమయమని ఆమె పేర్కొన్నారు. -
తలాక్ రద్దుకు వ్యతిరేకం: ఏఐఎంపీఎల్బీ
కోల్‌కతా: ట్రిపుల్ తలాక్, ఉమ్మడి పౌర స్మృతిపై కేంద్రం ప్రతిపాదించిన చర్యలను వ్యతిరేకించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు(ఏఐఎంపీఎల్బీ) నిర్ణయించింది. ఇక్కడ జరుగుతున్న ఏఐఎంపీఎల్బీ మూడు రోజుల సమావేశాల్లో రెండో రోజైన శనివారం ఈ మేరకు తీర్మానించారు. త్రిపుల్ తలాక్, ఉమ్మడి పౌరస్మృతి, ఇతర మత సంబంధ విషయాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తున్నారు. ‘త్రిపుల్ తలాక్ కొనసాగింపుపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. తరతరాలుగా ఉన్న ఈ సంప్రదాయం ముస్లిం మతహక్కుల్లో భాగమైంది. ఉమ్మడి పౌర స్మృతి అమలును కూడా వ్యతిరేకిస్తున్నాం’ అని ఏఐఎంపీఎల్బీ రిసెప్షన్ కమిటీ చైర్మన్, టీఎంసీ ఎంపీ సుల్తాన్ అహ్మద్ చెప్పారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఏఐఎంపీఎల్బీ ప్రారంభించిన సంతకాల సేకరణ కార్యక్రమానికి సుమారు 10 కోట్ల మంది ముస్లిం మహిళలు మద్దతు పలికారు. ముస్లిం యువతను అనవసరంగా వేధించే అజెండాను కేంద్రం చేపట్టిందని సమావేశంలో ముక్తకంఠంతో దుయ్యబట్టారు. ముస్లింలను ప్రభుత్వం జాతి వ్యతిరేకులుగా చిత్రీకరిస్తోందని ఓ సభ్యుడు ఆరోపించారు. ముస్లింల మతహక్కుల్లోకి చొరబడేందుకు బీజీపీ యత్నిస్తోందని దీన్ని ఎంతమాత్రం సహించబోమని హెచ్చరించారు. -
‘ట్రిపుల్ తలాక్’ సమీక్షను ఒప్పుకోం
సుప్రీంలో ఏఐఎంపీఎల్బీ పిటిషన్ న్యూఢిల్లీ: మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకునే అంశంపై విచారణ చేపట్టడాన్ని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారన్న నెపంతో వ్యక్తిగత చట్టాలను సవాల్ చేయలేరని సుప్రీం కోర్టుకు తెలిపింది. ముస్లిం వ్యక్తిగత చట్టాలను సమీక్షించి, వివాహం, విడాకులపై ముస్లిం మహిళల కోసం ప్రత్యేక నిబంధనలు చేయడాన్ని తాము ఒప్పుకోమని, ఇలా చేస్తే శాసన వ్యవస్థలో కోర్టులు జోక్యం చేసుకున్నట్లు అవుతుందని పేర్కొంది. ఈమేరకు ఏఐఎంపీఎల్బీ కోర్టుకు సమర్పించిన తాజా పిటిషన్లో పేర్కొంది. లింగ సమానత్వం కింద ట్రిపుల్ తలాక్, నిఖా హలాల్ అంశాలపై సర్వోన్నత న్యాయస్థానం సమీక్ష చేయలంటూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. ‘తలాక్’కు కేంద్రం వ్యతిరేకం: వెంకయ్య కొచ్చి: ట్రిపుల్ తలాక్ ముస్లిం మహిళలకు హాని అని, కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని వ్యతిరేకిస్తోందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారం కొచ్చిలో అన్నారు. -
‘ముస్లిం పర్సనల్ లా బోర్డును రద్దు చేయాలి’
న్యూఢిల్లీ: అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ)ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును మహిళా న్యాయవాది ఫర్హా ఫయిజ్ అభ్యర్థించారు. ఏఐఎంపీఎల్బీ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆమె ఆరోపించారు. మహిళల హక్కులను కాలరాస్తోందని, ఇస్లోమోఫోబియాను వ్యాపింప చేస్తోందని పేర్కొన్నారు. ఛాందవాదుల నుంచి భారత ముస్లింలను కాపాడాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. లింగ సమానత్వం కోసం పోరాడుతున్న ఫర్హా ఫయిజ్.. ట్రిఫుల్ తలాఖ్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ‘రాజ్యాంగం అందరికీ గౌరవప్రదమైన స్థానం కల్పించింది. కానీ ముస్లిం మహిళలు హింస ఎదుర్కొంటూ అభద్రతా జీవితం గడుపుతున్నారు. మతం పేరుతో షరియా కోర్టులు సమాంతర న్యాయవ్యవస్థను నడుపుతున్నాయి. షరియా కోర్టులను రద్దు చేయాల్సిన అవసరముంద’ని ఫర్హా ఫయిజ్ వాదించారు. -
ఆ పద్ధతి మార్చే స్కోపే లేదు
లక్నో: ముస్లిం మహిళలకు విడాకులు ఇచ్చే సంప్రదాయంలో మార్పులు చేసే సమస్యే లేదని ఉత్తరప్రదేశ్‌లోని ముస్లింపెద్దలు స్పష్టం చేశారు. దీనిపై ఎవరి అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. సాధారణంగా మూడు సార్లు తలాఖ్ అని అంటే ముస్లిం జంటలకు విడాకులు మంజూరైనట్లే. అయితే, ఈ విధానంలో కొంత మార్పు తీసుకురావాలని కొంత అభిప్రాయ సేకరణ చేసేందుకు ఓ మూడు నెలల సమయం ఇస్తే బాగుంటుందని ఇతర ముస్లిం సంస్థలు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ)కి తెలియజేసినట్లు తెలిసింది. అయితే, ఖురాన్, హదిత్ ప్రకారం మూడుసార్లు తలాక్ అనగా నేరం అని, కానీ ఒక్కసారి అలా అన్నారంటే మాత్రం ఇక విడాకుల కార్యక్రమం మొదలై పూర్తయినట్లేనని ఏఐఎంపీఎల్బీ అధికారిక ప్రతినిధి మౌలానా అబ్దుల్ రహీం ఖురేషి తెలిపారు. అయితే, తమకు ఎలాంటి ప్రత్యేక విన్నపం రాలేదని, వచ్చినా అంగీకరించబోమని స్పష్టం చేశారు.